ఇతడే యతఁడు గాఁబోలేలిక బంటును నైరి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇతడే యతఁడు గాఁబోలేలిక బంటును నైరి
మితిలేని రాఘవుఁడు మేటి హనుమంతుఁడు

జలధి బంధించి దాఁటె చలపట్టి రాఘవుఁడు
అలరి వూరకే దాంటె హనుమంతుఁడు
అలుకతో రావణుని యదటణఁచెనతఁడు
తలఁచి మైరావణుని దండించె నితఁడు

కొండ వెల్లగించెఁ దొల్లి గోవర్ధునుఁడతఁడు
కొండతో సంజీవి నెత్తె గోరి యితఁడు
గుండు గరఁచె నహల్యకొరకు సీతాపతి
గుండు గరగఁగఁ పాడె కోరి యితఁడు

అంజనాచలము మీఁద నతఁడు శ్రీవేంకటేశుఁశు
డంజనీ తనయుఁడాయ ననిలజుడు
కంజాప్తకుల రామ ఘనుఁడు దానును దయా
పుంజమాయ మంగాంబుధి హనుమంతుఁడు 4-443