ఇట్టే సంసారికేదియు లేదాఁయ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇట్టే సంసారికేదియు లేదాఁయ
తట్టిపడుటే కాని దరి చేరలేదు

ములిగి భారపుమోపు మోఁచేటివాఁడు
అలసి దించుకొను నాడాడను
అలరు సంసారికి నదియు లేదాయ
తొలఁగని భారమెందును దించలేదు

తడవి వేఁపచేఁదు త్రావెడివాఁడు
ఎడయెడఁ దిను దీపేమైనను
అడరు సంసారికి నదియు లేదాయ
కడుఁ జేఁదెకాని యెక్కడాఁ దీపులేదు

దొరకొని హేయమే తోఁడేటివాఁడు
పరిఠవించును మేఁన బరిమళము
అరిది సంసారికి నదియు లేదాయ
ఇరవు వేంకటపతి నెఱుఁగలేఁడు