ఇట్టుండవలదా యిరవైన మోహము

వికీసోర్స్ నుండి

ఇట్టుండవలదా యిరవైన మోహము
వొట్టుకొనీఁ జెమటలు ఉవ్విళ్ళూరను
తలపోసి తలపోసి తనువెల్లాఁ బులకించి
వలపులఁ బొద్దుపుచ్చీ వనిత
నెలకొని పానుపుపై నిద్దిరించి నిద్దిరించి
కలలోన నిన్నుఁ గూడీఁ గామిని
నీపదాలు పాడీపాడీ నెయ్యమునఁ గరఁగుచు
 రావుగాననందించీ రమణి
చూపులనెదురు చూచిచూచి యంతలోనె తరి
 తీపులనే తనిసీని తెఱవ
వచ్చివచ్చి నీతోడ వన్నెగా సరసమాడి
మెచ్చీనిదివో యలమేలుమంగ
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నిన్నిపుడు గూడి
నిచ్చలు నిన్నుభోగించీ నీపట్టపుదేవి