ఇట్టి ముద్దులాఁడి బాలుడేడవాఁడు వానిఁ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇట్టి ముద్దులాఁడి బాలుడేడవాఁడు వానిఁ
పట్టితెచ్చి పొట్టనిండ బాలుపోయరే

గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమపూవు కడియాల చేయివెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిటఁ కన్నీరు జార
వేమరువాపోవయెవాని వెడ్డు వెట్టరే

ముచ్చువలె వచ్చి తన ముంగైమురువుల చేయి
తచ్చేటి పెరుగులోనఁ దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్లఁ జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే

యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి పెట్టెలోన
చెప్పరాని వుంగరాల చేయివెట్టీ
అప్పఁడైన వేంకటేశుఁడా సపాలకుఁడు గాన
తప్పకుండ పెట్టె వాని తలకెత్తరే