ఇటువంటిసేవ మన, కెందైనఁ గలుగునా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పల్లవి:
ఇటువంటిసేవ మన, కెందైనఁ గలుగునా
పటుతరమైన రాఘవ ప్రభుసన్నిధినే గాక ||ఇటువంటిసేవ||

చరణం1:
తేటకస్తురి నుదుట - నీటు గులుకుచుండ
హాటకాంబరుడైన శ్రీ - హరి సభయందునెగాక ||ఇటువంటిసేవ||

చరణం2:
ఆడుచు నాదమున - బాడుచు నెదుటను
వేడుచు నామది - గూడియుండుటె చాలు ||ఇటువంటిసేవ||

చరణం3:
వాసిగ భద్రశైల - వాసుని దాసాను
దాసుడౌ నరసింహ - దాసావనుని గనకున్న ||ఇటువంటిసేవ||