ఇందువదన కంటివే యీసభతీరు

వికీసోర్స్ నుండి


పల్లవి:
ఇందువదన కంటివే యీసభతీరు - యెందైన మును వింటిమే
ఇందుశేఖరు డాదిగాగ పు - రందరాదులు గొల్వ ఖగరా
ట్స్యందనుం డిదె నారసింహుని మందిరంబున గొల్వుతీరెను ||ఇందువదన||

చరణం1:
వరుణపురముకన్న వాసవుసభకన్న వైభవమున నెక్కువై
సరసిజాక్షుని చర్య లెల్లను మెఱుపు జాంబునదపు గోడల
తరుచుగా లిఖియించిరి గురుతుగా మృదుపదములందున ||ఇందువదన||

చరణం2:
శ్రీకరముగ రత్నసింహాసనమున చెలియ జానకితోడుత
ప్రాకటంబుగ దీనజనులకు బ్రాపు దాపై దివ్యవిగ్రహ
రూపు గన్పడఁ జేయుచుండెడి పాకశాసనవందితుని సభ ||ఇందువదన||

చరణం3:
గానమునకుఁ జొక్క గంధర్వనాథులె ఘనత హెచ్చరికసేయ
దీనజన పెన్నిధానమనగను దేవరాయని హృదయమందున
మానుగ వేంచేసియుండెడు మాసమేతుని కొల్వుకూటము ||ఇందువదన||