Jump to content

ఇంత తెలిసియుండి యీ గుణమేలరా

వికీసోర్స్ నుండి


ఇంత తెలిసియుండి యీ (రాగం: ) (తాళం : )

ఇంత తెలిసియుండి యీ గుణమేలరా!
పంతమా మువ్వగోపాలా! నాసామీ!
ఇంత తెలిసియుండీ...........

అలుకచేసి యింటికి రావైతివి
చెలికత్తెలున్నారా! పిలువ వచ్చేరా!
చెలికత్తెలైన నీవే! చెలువుడవైన నీవే!
తలచిచూడ నాపాలి దైవము నీవే!

ఇంత తెలిసియుండీ.............

వింతదానివలె నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగు లున్నారా! నన్నాదరించేరా!
అంతరంగులైన నీవే! ఆదరించిన నీవే!
చింతించిచూడ నా జీవనమూ నీవే!

ఇంత తెలిసియుండీ.............

...... మువ్వగోపాలా! నన్నేలరా!
నా నేర్పు లెవరైన ఆనందించేరా!
నా నేర్పులైన నీవే! నమ్మికలిచ్చిన నీవే!
ఆనగ పలికెద నా ఆనందమైన నీవే!

ఇంత తెలిసియుండి యీ గుణమేలరా!
పంతమా మువ్వగోపాలా! నన్నేలరా!
ఇంత తెలిసియుండీ.............

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.