ఇంతనెనరు గలిగిన దైవము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
ఇంతనెనరు గలిగిన దైవము లిక నెవ్వరు ఓరామా
వింతగదా బహువేడుకతో నా
చెంత నిలిచి భయ మంత బాపితివి

చరణము(లు):
పగలు రాత్రులును బదిలముగా నీ భక్తజనులవెంట
తగిలి యుందువని ధరలోపల మును
మిగుల వింటి నే డిదె మిముఁ గంటిని

దీనదయాళుఁడని విన్నందుకుఁ దెలిసెగదా నేడు
మానసమున నీమహిమ యెఱుంగని
మత్తుఁడ నను బహుమానించితివి

వరభద్రాచలనిలయా భవభయహరణ సదయహృదయా
పరమ దయాకర పంకజాక్ష తూము
నరసింహావన నారదాదివినుత