ఇంచుకైన నభిమానము లేదా

వికీసోర్స్ నుండి


పల్లవి:
ఇంచుకైన నభిమానము లేదా యిది సమయము గాదా
కొంచెపు జనులిటు వంచనసేయ సహించియుండుట వాదా, రామ ||ఇంచుకైన||

చరణం1:
పంచశరుని గన్న పరమపురుష నీదు ప్రాపు నమ్మినజనుల
వంచనఁ జేసినఁ గొంచె మెవ్వారిదో
యెంచి చూడగరాదా, మర్యాద ||ఇంచుకైన||

చరణం2:
ఉదరపోషణకు నీవిధముల జనుల నే నొదిగి వేడవలెనా
సదయమతివి నన్ను సాకిప్రోవ నీ
హృదయమునను దోచలేదా తరిగాదా ||ఇంచుకైన||

చరణం3:
సొగసుగ శ్రీభద్రగిరియందుఁ నెలకొన్న బిగువా లేకను నగవా
తగవా శ్రీనరసింహ దాసునిఁ బ్రోవఁ
దగవా యోహో రాఘవా, యిట లేవా ||ఇంచుకైన||