ఇంకా సంసారముతోఁ బొందేలా

వికీసోర్స్ నుండి


పల్లవి:
ఇంకా సంసారముతోఁ బొందేలా - శ్రీరాముని దలచక ||ఇంకా||

అనుపల్లవి:
ఇంకా సంసృతి పంకములో యమ
కింకరులకు బహుకొంకుల దలచితి ||ఇంకా||

చరణం1:
దారపుత్రులు తల్లిదండ్రులును
రారు నీకు మఱి దారి చూపుటకు ||ఇంకా||

చరణం2:
ధనముకై తన తను వమ్మియు మది
ఘనదుఃఖములను గాంచి యలసితిమి ||ఇంకా||

చరణం3:
నేటివఱకు బహుకోటి జన్మములు
సూటి దప్పి పరిపాటి గాంచితిమి ||ఇంకా||

చరణం4:
బంధుజనమ్ముల బంధకములఁ బడి
దంధనమున మదిఁ దలపక చెడితిమి ||ఇంకా||

చరణం5:
లోకవార్తలకు లోనై తిరిగి వి
వేకము మరచితి వీకతనమ్మున ||ఇంకా||

చరణం6:
దొరలకు దొరయై ధరణిజపతియై
మెఱసిన శ్రీరఘువరునిఁ గొల్వకను ||ఇంకా||

చరణం7:
వాసిగ భద్రగిరీశుఁడు నరసింహ
దాసుని బ్రోవను దయ గలిగున్నా ||ఇంకా||