ఇంకా చీకట్లో వున్నట్లే!!
Jump to navigation
Jump to search
ఇంకా చీకట్లో వున్నట్లే!!
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
చీకటిపోయి వెలుతురు వచ్చిందని ఎల్లా చెప్ప్గలరు మీరు అని గురువు శిష్యులను అడిగారు
దీపం అక్కరలేకుండా బయట ప్రపంచాన్ని చూడగలిగితే వెలుతురు వచ్చినట్లే అన్నాడో శిష్యుడు
కాదని తల అడ్డంగా తిప్పారు గురువు
ఆ! దోమనైనా స్పష్టంగా చూడగలిగితే వెలుతురు వచ్చినట్లేగా అన్నాడు మరో శిష్యుడు
ఉహు! కాదని మళ్ళి తల అడ్డంగా తిప్పారు గురువు
అయోమయంగా చూసారు శిష్యులు మరైతే మీరే చెప్పండి అని ప్రాధేయపడ్డారు
ఎప్పుడైతే పక్కవాని ముఖం చూసి అతనిని నీ సోదరునిగా గుర్తిస్తావో అప్పుడే చీకటి పోయి వెలుతురు వచ్చినట్టు
అల్లాంటి సౌబ్రాతృత్వ భావం నీలో కలగనప్పుడు నువ్వు ఇంకా చీకట్లో వున్నట్లే!!