ఆ భా 8 2 001 to 8 2 030

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

- వోలం సురేష్ కుమార్

శ్రీ గణేశ శారణా గురుభ్యో నమః శ్రీ మదాంధ్ర మహా భారతము కర్ణ పర్వము, ద్వితీయాశ్వాసము

8_2_001 శ్రీ నిష్పాదన నిపుణ కృ పా నిరతి శయార్ద్ర భావ భావాతీతా భాను సహస్ర ప్రభర మ్యానంతవపుః ప్రకాశ హరిహర నాథా.

- శల్యుఁడు గర్ణునుత్సాహంబునకు విఘ్నకరంబు లగు వాక్యంబులు సెప్పుట -

8_2_002 వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు దన సుతుండు సూతసుతు కోర్కి దీర్పంబూని యతి ప్రయత్నంబు సేయుట యాకర్ణించి యాంబికేయుండు.

8_2_003 ఆ. ఎట్లు ప్రియ మొనర్చె నట్లు సంప్రార్థితుం డైన మద్ర నాథుఁ డంతఁ గోరి తేరు గడప నతని తెచ్చికొన్నట్టి య వ్వీరుఁ డేమి భంగి విక్రమించె.

8_2_004 వ. అని యడిగిన సంజయుం డిట్లనియె నట్లు రథిక సారథులు విలసిల్లి వందిమాగధ ప్రస్తూయమాను లగుచుఁ దన వలనను గౌరవంబునం గనుంగొనుటయుఁ గురు రాజ య్యంగరాజు నుద్దేశించి.

8_2_005 చ. గురుఁడును భీష్ముఁడున్ నరునకున్ బకవైరికి నగ్గలంబు వీ రిరువురు వారి నిద్దఱ నహీన పరాక్రమ లీల గీటడం తురు ధ్రువ మంచు నాత్మఁ బరితోషముఁ బొందుదు నట్లు గాక ని ర్భప బల శౌర్యముల్ మెఱయ గ్రక్కున నా పని నిర్వహింపుమీ.

8_2_006 తే. బాడుదల నొండెఁ బట్టుము పాండు తనయ ముఖ్యు వీరు వా రన నేల మునుము వట్టి వైరి వర్గంబు నెల్లను బారి సమరి సైన్య యుతముగ నద్భుత జయము గొనుము.

8_2_007 వ. నడవు మనుటయు నమ్మాటఁ గైకొని కర్ణుండు శల్యునిం దేరు నడపు మనిన నతం డట్ల చేసె నప్పుడు శంఖ భేరీ ప్రముఖ తూర్య నాదంబులు రోదసీ గహ్వరంబు విహ్వలంబు గావించె నివ్విధంబునం జని చని గర్వ ాగ్రహ విధేయుం డగు రాధేయుం డమ్మద్రపతి కిట్లనియె.

8_2_008 శా. నారాచాది మహోగ్ర బాణ పటలీ నానా విధోల్లాసములన్ సైరింపన్ ధృతి లేక పాండు తనయున్ సంభ్రాంతి నొందంగ వి స్మేరం బై ఖచరవ్రజంబు వొగడన్ మెచ్చంగ నీ చూడ్కి దు ర్వారోదగ్రత నేఁడు సూపెద భుజావష్టంభ సంరంభి నై.

8_2_009 సీ. అన విని మద్రరా జాతని కిట్లను సత్య పరాక్రమున్ శౌర్యఘనులు భుజ వీర్య మహితులు భూరితేజోధను లఖిలాస్త్ర విత్తము లార్యు లమర పతి కైన రణమున భయము పుట్టింపంగ నోపుదు రప్పాండు భూపతనయు లేల వారల నింత దూలపోఁ బలికెద విప్పుడు వల్క రాదెట్లు నీకు.

తే. గాండీవజ్యా నినాదమ్ము గ్రమ్మి కర్ణ విదళనము సేసినను భీము గద మెఱుంగు లొలసి చూడ్కులు మిఱుమిట్లు గొలిపినను భ యంబు పెల్లున నపుడు వా యడఁగుఁ గాక.

8_2_010 వ. అని వెండియు.

8_2_011 చ. నరుని శరంబులన్ రథ గణంబులు గూలఁగ భీమునుల్ల స త్పరిఘమునన్ గజవ్రజము భగ్నము గాఁ బెళ తమ్ములున్ యుధి ష్ఠిరుఁడును దాఁకినం జలము డించి దొరల గలఁగంగఁ జూచియు దిర మయి నీవు నాలుకకుఁ దెచ్చిన మాట గధా వినం దగున్.

8_2_012 క. అను పలుకులు వినియుం దా వినని చెవులు సేసి మద్రవిభు తో రాథా తనయుఁడు నా చేతి బరువు గనుఁగొనియెద విపుడ యనియెం గం డమరంగన్.

8_2_013 వ. ఇట్లు సంగరోత్సాహ దీప్తుం డై నడతెంచు నతని నుపలక్షించి.

8_2_014 చ. కురు బల ముబ్బి యార్చెఁ బటు ఘోటక హేషిత నిస్వనంబులుం గరివర బృంహిత ధ్వనులు గాఢము లై విలసిల్లె నెత్తురుల్ గురిసె నభంబు మ్రోయఁ బిడుగున్ మొరసెం బొరి నుల్క లెల్లెడం దొరఁగెఁ బ్రదీప్త మారుతము ధూళిఁ గడున్ వడిఁ జల్లె భూవరా.

8_2_015 వ. మఱియు బహువిధోత్పాతంబులు గౌరవులకు నాశంబగుటం దెలుపుచుం దోఁచెఁ దోఁచిన నవి యెల్ల సరగుకొనక వారు దైవ మోహితులు గావున శల్య సహితుం డైన కర్ణుం గనుంగొని కుంతీ నందను లతనిచె నిర్జింపఁ బడుదుర కాఁ దలంచి సంతోషించి రతండు భీష్మ ద్రోణుల దోర్వీర్యంబులు పాండు తనయుల చేతం గోలుపోయెనని మనంబున వారల మెచ్చక ముంగలి యై మెఱసి నడచు చుండి పార్థ పరాక్రమ స్మరణంబునం గ్రోధంబు జనియించి యార్పులు సందడింప మాన దర్పోన్మాదంబున మద్రపతి కిట్లనియె.

8_2_016 మ. అరదం బెక్కి శరాసనంబు గొని తెం పారంగ నే నేచి సం గర సంక్రీడకుఁ జొచ్చినం దృణసముం గాఁ గొందు నద్దేవతా వరు నైనన్ గురు నాపగాతనయుఁ జావం జూచుటన్ వైరు లే తురు చెండాడెద నుగ్రతం దలలు నాదోర్దర్పముం జూడుమీ.

8_2_017 వ. అని పలికి యనంతరంబ గాంగేయ కుంభ సంభవులంతటి మానిసులు నిట్లు రిత్త సావు సత్తురే యని యుగ్గడించి మఱియు నిట్లనియె.

8_2_018 ఉ. వారల లోక వీరుల నవధ్యుల గీటడఁగించి పల్వురన్ వారల యట్ల యెందు ననివార్యు లనం జను మేదినీశులం బోర వధించి రౌద్రమునఁ బొంగి క్రమాగత మృత్యువొక్కొ నాఁ గా రణకేళికిం గడఁగు గాండీవి నేన యెదిర్చి యోర్చెదన్.

8_2_019 ఉ. పాండు నృపాగ్ర నందనుఁడుఁ బావనియుం గవలుం జలంబు మై నొండొరు మూదలించుకొని యొక్కటఁ దాఁకినఁ దీవ్ర విస్ఫుర త్కాండ విదారితాంగకులఁగా నొనరించి యలంచి లీలమై గం డడఁగింతుఁ బోక పెనఁగం గలచంద మెఱింగి చెండుదున్.

8_2_020 వ. అని వెండియు నిట్లను భీష్ముఁడు దెగినను ద్రోణు దోర్విలాసంబునాస గలిగి యుండె.

8_2_021 సీ. ద్రోణుండు బహు దివ్యబాణ దీప్తుఁడు భుజా బలశాలి శౌర్య సంపన్న హృదయుఁ డక్షీణ విక్రముఁ డతిరథ శ్రేష్ఠుఁ డవ్వీరుండు పార్థుచేఁ బోరఁ బడిన థార్తరాష్ట్రుల యేవు దఱిఁగెఁ దదాప్త సైనికులు గం డడఁగిరి నీ వెఱుంగ నైనను రాము కృపాతిశయంబునఁ గనిన యీ రథమును గార్ముకాది

ఆ. దారుణాస్త్ర శస్త్రతతులును గలిమి నే నతనిఁ దొడరి దివిజు లడ్డపడినఁ గూల్తు నెల్ల భంగిఁ గురురాజు మన్నన యప్పుఁ దీర్తుఁ బ్రాణ మాసపడక.

- శల్యుఁ డర్జును పరాక్రమం బుగ్గడించి కర్ణునిఁ దూలం బలుకుట -

8_2_022 వ. అనిన విని శల్యుండు గర్ణున కిట్లనియె.

8_2_023 చ. వినిన జనంబు లీతఁ డవివేకి యనన్ వల దింతరజ్జు ల ర్జును బల శౌర్య సంపదలు సూచి యెఱుంగమె మున్ను నిన్ను నా తనిఁ గలనన్ జగం బెఱుఁగదా యతఁ డద్భుత విక్రమోజ్జ్వలుం డెనయుదె నీవు పౌరుష విహీనుఁడ నద్దవిజేంద్ర నందనున్.

8_2_024 సీ. రాత్రి మైఁ దాఁకి క్రూరతఁ బోరి మగఁటిమి వాసిన యంగార పర్ణుకంటె ఘోష యాత్రావిధిఁ గురురాజుఁ జెఱపట్టి మాన మేదిన చిత్రసేను కంటె ఖాండవోద్యానంబుఁ గావ నేఱక సిగ్గు వడి చన్న నిర్జర ప్రభుని కంటెఁ గ్రీడా కిరీతుఁ డై క్రోడంబునకుఁ గాఁగఁ బెనఁగి చిక్కిన త్రిలోచనుని కంటె

ఆ. నెక్కు డైన వీరుఁ డే నర్జునుని తోడఁ బొడుతు నొడుతు ననినఁ బోలుఁ గాక వినుము సూత తనయ మనబోఁటు లాతనిఁ జెఱుతు మనుట నోరిచేటు గా.

8_2_025 చ. నృపుఁడును భీష్ముఁడుం గృపుఁడు నీవు గురుండును దత్సుతుండు ను గ్ర వుబల మేచి తో నడవఁగా బెనుదాడిగఁ బోయి మత్స్య నా థు పసులఁ బట్టి యద్దొరతోఁ జెడి పాఱితి కర్ణ యప్డు క య్యపు బలు పాడె దిప్డు మన యర్జును నమ్ములు దుప్పు వట్టెనే.

8_2_026 ఉ. ముందరియట్లు గాదు జనముల్ దెగడన్ వెఱఁ బాఱ నేఁడు సం క్రందన సూతి మార్కొని తిరం బయి పోరెద దాఁపఁ బ్రాణమున్ నిందకుఁ జాల నింకనను నిక్కపుఁ బల్కులు పల్కు టొప్పు దా నం దుదిఁ జచ్చినం జను మొనన్ నరుఁ దాఁకుట రిత్త వోవునే.

8_2_027 వ. అనవుడు నలుక వొడమిన నడంచికొని రాధేయుండు మద్రపతి కిట్లనియె.

8_2_028 చ. నరునకుఁ బూని పల్కితి వినం జవి మాలిన దొడ్డ పల్కు లే నరగలి లేక బెట్టడరి నప్పుడు సూడుము నన్ను నాతనిం దిర మయి బాహు శక్తియును ధీరతయున్ వెరవుం జలంబు నె వ్వరిదెసఁ గాంచి తెక్కుడుగ వారి నుతింపుము మాను మంతకున్.

8_2_029 వ. అనుటయు నట్ల చేసెద నని పలికి శల్యుం డూర కుండెఁ దేరు వోని రాధేయుండు దఱిమి పలికిన నమ్మద్రేశ్వరుండును దురంగంబుల సత్వరంబు నడసె నివ్విధంబునం జని మనమొన సొచ్చి సైనికులు సంతసిల్ల వార గలయం గనుంగొని కర్ణుం డిట్లనియె.

8_2_030 సీ. వలను శోభిల్ల నెవ్వాఁ డైన వీఁడె యర్జునుఁ డని నాకిప్డు సూపెనేనిఁ బసదనం బే నిచ్చు భంగి యందఱకును వివరించి చెప్పెద వినుఁడు మీరు వొగడంగఁ దగు రథ్యముల తోడి సౌవర్ణ రథములు వలసిన రయము లావుఁ బొలుపును గలుగు కాంభోజ హయంబుల వలసిన బేర్చు సత్త్వంబు నందుఁ

తే. బరిణతము లగు సుందర కరివరముల వలసినను జారు లావణ్య వతుల వలసి నను మహా గ్రామములు వలసినను గోర్కి కెక్కుడమ్మేటి మగని కే నిచ్చు వా.