ఆ భా 7 1 241 to 7 1 270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


7_1_241 క. శరము లొకఁ డొకఁడు పదిపది పరగింపఁగ మూఁట మూఁటఁ బార్థుఁడు నొంచెన్ సరి నైదై దేయఁగ న న్నరుఁ డందఱ రెంటరెంట నలి నొప్పించెన్.

7_1_242 వ. అట్టియెడ సుబాహుండు గ్రీడి కిరీటంబు దశ విశిఖంబుల నేయ నతం డతనిపై ననేక శరంబులు పరగించిన సుశర్ముండును సురథుండును సుధన్యుండును బాసట యై యప్పార్థుం దాఁకిన.

7_1_243 ఆ. వారికేతనములు వడిఁ ద్రుంచి యవ్వీరుఁ డా సుధన్వు హయ శరాసనముల తునియ లవనిమీఁదఁ దొరగించి తన్మస్త కంబుఁ దునిమె తేరుగముల కుఱికి.

7_1_244 ఇరువే యుద్భట రథములఁ బొరిగొనుటయుఁ బెఱబలంబు పురికొనక వెఱం దెరలుచు గుంపులు గట్టుచుఁ గురుపతి సైన్యంబు పొంతకుం జనుచుండెన్.

7_1_245 వ. ఇట్లు భయభ్రాంతు లైన సైనికులం గనుంగొని సుశర్మ యెలుంగెత్తి.

7_1_246 క. వెఱవకుఁ డిట మరలుఁడు ము న్నెఱుఁగరె యర్జునునిఁ గురు మహీపతి కడ నే డైఱ ఒలికిన పంతంబులు మఱతురె నో రెద్ది రిత్త మరలిన మనకున్.

7_1_247 వ. అని బరవసంబు సేసిన నా సైనికులు గోల్తల సేసి రప్పుడు నారాయణ గోపాలు రెక్కడెక్కడ యని వారిం గూడి కడంగిన నిస్సాణాదితూర్య రావంబులు సెలంగుటయు వాసవి వాసుదేవు నాలోకించి.

7_1_248 చ. ఒడలను బ్రాణముల్ గలుగ నూరక యుండుదురే త్రిగర్తు లి ప్పుడ నుఱుమాడి పోద మటు వోవఁగ నిమ్ము రథమ్ము నావుడుం గడు వెస నా ధనంజయుని కాంక్షిత మెక్కడ నక్క డెల్ల నె క్కుడు ముద మొప్పఁ దేరు రథికోటులపై బఱపెన్ ముకుందుడున్.

7_1_249 విమలాంబుదములు పూనిన విమానమో నాఁగ మెఱసె వెలిమావుల వే గము సొంపున నయ్యరదం బమరేంద్రుని లీలఁ బొలిచె నతని సుతుండున్.

7_1_250 వ. ఇట్లు మండల ప్రచార గత ప్రత్యాగతాది వివిధ గతులం దేరు సంచరింపం జేయుచు నిలింప కోటికిం గన్నుల పండువు సేయం బుండరీకాక్షుం గనుంగొని నారాయణ గోపాలురు గుపితాత్ము లై యర్జున దుర్యోధనులు ద్వారకా నగరంబునకుం బోయినఁ నాడు కృష్ణుతోడి సరిగా దుర్యోధనుఁడు దమ్ముఁ గోరికొనన వాఁడగుటం జేసి యీసునం బేర్చి యన్నర నారాయణుల మేనుల నానాస్త్రంబులు నినిచిన నరుండు దేవదత్తంబు పూరించి యవష్టంభంబునం ద్వష్ట యిచ్చిన మహాస్త్రంబు ప్రయోగించినం దత్ప్రభావంబున.

7_1_251 క. గాండీవిచంద మయి వా రొండొరులకుఁ దోఁచి యొకళు లోకళుల నానా చండాస్త్ర శస్త్ర సముదయ ఖండితులుగఁ జేసి పడిరి కలనం గలయన్.

7_1_252 వ. ఇమ్మెయిఁ గృతార్థం బయిన దివ్యాస్త్రంబు పదంపడి శాంతం బగుటయు హతశేషులు వోక పొదివి రథ రథ్య కేతు సహితంబుగా సవ్యసాచి నాభీల శరజాల సంవృతుం జేసిన.

7_1_253 ఆ పార్థుఁడు కోపానల దీపితుఁ డై విశిఖ శిఖల తీవ్ర నిహతి న త్తూపులగమి నేర్చి జముని ప్రోవు గుడువఁ బుచ్చె వారిఁ బురువంశ నిధీ.

7_1_254 వ. ఇవ్విధంబున విజృంభించి యట్టహాసంబు సేయుటయుం దుండి మగధ కేరళ మచ్ఛిల్లి కాదు లడరి సాయక నికాయంబులం గప్పిన.

7_1_255 క. నానాస్త్రంబుల నాతఁడు పీనుఁగు పెంటలుగఁ జేయఁ బిఱుసనక మహా సేనలు దోత్తో డగ్గఱి యా నరు పైఁ బెల్లు గురిసె నమ్ముల వానల్.

7_1_256 క. కరి తురగ రథ పదాతులు బెరసి కదిసి చుట్టుముట్టి భీషణ హేతి స్ఫురణ మెఱయఁ జేరిన న చ్చెరువుగ విజయుండు సించి చెండాడె వడిన్.

7_1_257 వ. సంశప్తకులు మఱియును.

7_1_258 క. పెరయీఁగల గతిఁ గవియుచుఁ బొరిఁ బొరిఁ గడుఁదురులపగిదిఁ బొదువుచు నెరకై వెరవునఁ గాకులుఁ గ్రోఁతులుఁ బరువడి జీకాకు పఱుచు భంగి నలఁచుచున్.

7_1_259 వ. పెనంగి రందుఁ గొందఱు వీరావేశంబున.

- సంశప్తకు లందఱు నొక్కపెట్ట యర్జును రథంబు పైఁ బడుట - సం. 7-18-20

7_1_260 క. అరదంబులు మొదలగు ను ద్ధుర వాహనకోటి డిగ్గి దుర్దాంత గతిం దురగంబుల పై హరి పై నరుపై నూడుకొనఁ బడిరి నలి నార్పులతోన్.

7_1_261 వ. ఇత్తెఱంగునం జేయగా లార్పనుం జూడ్కి వఱపను కారుండునట్లుగా గుంపులు గొనం బైపయిఁ దొరంగినం గృష్ణులగపడిరి తెగిరి మడిసిరి మ్రగ్గిరను మాటలతోఁ దత్సైన్యంబుల సింహనాదంబులుఁ దూర్యనినదంబులుఁ జెలంగె నప్పుడు సెమర్చి చేడ్పడి నసుదేవ నందనుండు.

7_1_262 ఆ. ఎచట నున్నవాఁడ వే మైతి ప్రాణానఁ గలవె యేను నిన్నుఁ గాన కునికిఁ దలఁకుచున్న వాఁడ ధైర్యధౌరేయ నీ యెలుఁగు సూపవే సురేంద్ర తనయ.

7_1_263 వ. అనిన విని యతండు ముకుంద నిమానుష భావం బూహించుచు నుత్సాహంబు వాటించి.

7_1_264 క. అనిలాస్త్రంబు ప్రయాగిం చిన సంశప్తకులు దెసలఁ జెదరి చొరువు చా డ్పునఁ దూలఁగ బహు విధ శర వినిహతి బడలువడఁ జేసె వెన్నుఁడు మెచ్చన్.

7_1_265 క. శిరము లురంబులు గరములు చరణంబులు రూపు మాయ శకలము లై సం గరధరఁ దొరఁగిరి యోధులు గరితురగ రథాస్త్రశస్త్ర ఖండంబులతోన్.

7_1_266 వ. అట్లు గసిమసంగి కిరీటి కల్పాత పురాంతకుండునుం బోలె బారి సమరుచుండు వెండియు వెఱచఱవక తఱిమి పెనంగు నబ్బలంబు లతని బాణ పరంపరల బలితంపుఁ బరపునం జేసి.

7_1_267 ఆ. కూలురూపుఁ దన్నికొనియెడు రూపును నొఱలు రూపు నేల కొఱగు రూపుఁ బొరలు రూపు నయ్యె నర వాజి గజములు ప్రథన భూమి ఘోర భంగి గాఁగ.

7_1_268 వ. ఇవ్విధంబున నసమ సనర తత్పరు లై తన వలన నేమఱి యామఱందియు బావయు నట్లుండఁ నిక్కడ ధర్మజుండు పురికొల్ప నుదగ్ర సైన్యంబులు ఘనమొనలు దలంకం దఱిమె నాచార్యుండును ధర్మసూను సైన్యంబులు దలంకఁ దఱిమె నాచార్యుండును ధర్మసూను సైన్యంబులు దలంకఁ దఱిమె నప్పుడు నీ కొడుకు దుర్ముఖుం డతనికిఁ బ్రియంబుగా ధృష్టద్యుమ్నుం దలపడినం గురు పాంచాల కుమార వర్గంబు లగ్గలికం గవిసి పోరె నట్టియెడ.

7_1_269 చ. గురుఁ డనుతీవ్ర మారుతము కోల్తల కోర్వక ధర్మ పుత్ర బం ధుర బల వారిదోత్కరము దూలుడు నాతఁ డదల్చి వీర సుం దరముగఁ జేయి వీచిన నుదగ్ర గతిం బురికొన్నఁ గౌరవ స్ఫురణము నుద్భటం బగుడు సూర్యుని మ్రింగె ధరా పరాగముల్.

7_1_270 వ. ఇబ్భంగి నుభయ సైనికులును గలయన్ బెరసిన మణి భూషణ కిరణ జాలంబుల కతంబున ధూళికృతంబు లగు తిమిరంబుల గెలిచి పోరుచుండ ధారాళ రక్తసిక్తం బై యారజఃపటలం బడంగుటయు.


http://www.volamsite.com