Jump to content

ఆ భా 7 1 181 to 7 1 210

వికీసోర్స్ నుండి


7_1_181 ఉ. అంతకు భీమసేనుఁడు రయం బెసఁగం గద నెయ్దిపట్టి య త్యంత బలంబు మైఁ బిఱిఁది కాతనిఁ ద్రోచి కనద్గదా పరి భ్రాంతి వెలుంగ నిల్చినఁ దిరం బయి శల్యుఁ డుదాత్త రేఖఁ గా లాంతక దీప్త మూర్తి యగునాతనిఁ దాఁకె బలంబు లార్వఁగన్.

7_1_182 వ. అట్టియెడ.

7_1_183 క. ఇతనికి నితండ యితనికి నితఁడ యెదురుఁ గాక యొరుల కియిరువురయు ద్ధతి కెదుల వశమే యను వా క్తతియును దూర్యస్వనములు గడుఁ బెల్లెసఁగెన్.

7_1_184 వ. ఇట్లు దలపడి శల్యసమీర నందనులు మండల ప్రచారంబులను విచిత్ర గదా ప్రసారణంబులను మెఱయుచు.

7_1_185 మ. గద లన్యోన్య సమాగతిన్ మిడుఁగుఱుల్ సారించుచుం గదియం బాయఁగ వ్రేటు దప్ప నుసులంగా నేర్చు లంగంబులం దొదవన్ ఘోర పరస్పర ప్రహతు లత్యుగ్రంబుగా నెత్తురుల్ సెదరింపం బదశబ్దహుంకృతులు దిక్సీమంబులన్ దాఁటఁగన్.

7_1_186 క. పోరెడునప్పుడు లావును వీరోద్రేకంబుఁ జలము వెరవును సరియై మారుతియు మద్రపతియు ను దారగతుల మెఱసి రమరతతి వినుతింపగన్.

7_1_187 వ. ఇట్లు పెద్దయుం బ్రొద్దు పెసంగి.

7_1_188 క. అఱిముఱి నొండొరు వ్రేసిన నెఱఁకులు దాఁకుటయు నొచ్చి నేల కొఱగె బి ట్టఱి యాసుభటద్వితయము వెఱచఱచి బలద్వయంబు వెగ డందంగన్.

7_1_189 వ. అయ్యవసరంబున.

7_1_190 క. కృత వర్ముఁడు మద్ర మహీ పతి గ్రక్కున గ్రుచ్చి యెత్తి పాయంగొని యు ద్ధతి వాయఁ జనియె మారుత సుతుఁ డాలోఁ దెలిసి లేచి శోభిల్లెఁ గడున్.

7_1_191 క. గద సారించుచు జయమునఁ బొదలు నతనిఁ జూచి నీదుపుత్త్రులు గోపం బొదవ నడరి రుద్భట గతి మదవత్కరిచటుల రథ సమాజంబులతోన్.

7_1_192 వ. ఇట్లడరి వివిధాస్త్ర శస్త్రంబు లేయుచుం బొదివిన.

7_1_193 మ. కవలుం దానును నేచి యద్ధురగతిం గౌంతేయ ముఖ్యుండు వీ రవరానీకము వీఁగఁ గూడికొని సంరంభంబు శోభిల్లఁ గౌ రవ సంఘంబుఁ గలంచినన్ విఱిగె దర్పం బేది నీ సేన య బ్దవితానంబు మహా సమీరణ విరస్తం బైన చందంబునన్.

7_1_194 వ. అంత నపరాహ్ణం బయ్యె నప్పుడు శంఖ భేరీ మృదంగాది తూర్య స్వనంబులు సెలంగ సింహనాదంబులం బేర్చిన పాండవసేనం జూచి వృషసేనుండు రోషావేశ భీషణుండై మార్కొని మార్గణ నికరంబులు నిగిడించిన.

7_1_195 మ. కరిగాత్రంబుల ఘోయ కాంగకములం గప్పెన్ నమి ద్భూమి య చ్చెరు వై యుండఁగ రథ్యసూతరథిక శ్రేణీవపుః ఖండముల్ దొరఁగెం దుత్తుము రయ్యెఁ గాల్బలము లస్తోక ప్రవాహంబు లై పరగెన్ రక్త నదుల్ పిశాచకుల మంభః కేలిలోలంబుగన్.

7_1_196 తే. కర్ణనందనుఁ డిట్లత్యుదీర్ణ భంగిఁ బాండురాజు తనూజుల బలము నెల్లఁ గనుపు గొట్టంగఁ జొచ్చినఁ గినిసి నకులు నాత్మజుండు శతానీకు డతనిఁ దాఁకి.

7_1_197 క. వాలమ్ములు పది మేనం గీలించిన నాతఁ డతని కేతనము ధరం గూలిచి చాపముఁ ద్రుంచిన నాలోనన ద్రౌపదేయు లందఱుఁ బెలుచన్.

7_1_198 వ. తోడం బుట్టువునకుం దలకడచి వివిధ శిఖంబుల వృషసేనుం గప్పిన నశ్వత్థామ ప్రముఖం బై కదిసి కౌరవానీకంబు శతానీకునిం దత్సోదరుల ననేక క్రూరాస్త్రనిచ యావృతులం జేసినం గని కౌంతేయాగ్రజుండు గడంగి కేకయ మాత్స్య పాంచాల ప్రభృతి బలంబులతో నురవడించిన సురాసుర సంగ్రామ సర్పశసమరం బయ్యె నందు భీమ కర్ణ కృప ద్రోణ ద్రౌణి ధృష్టద్ముమ్న విరాటులు ప్రతాప దీపితు లై మార్తాండుండు సప్తమూర్తులు దాల్చి ధరణి విహరించినట్లు వెలింగిరి కొండొక సేపునకుఁ బాండవ సేనా సాగర సంరంభంబు సహింపఁ జాలక మనమొన దెరలి మరలినం జూచి యాచార్యుండు గోపాటోపంబును బటు విక్రమంబును నావేశింప నీ సైనికుల నిలునిలు మని యదల్చి తూణీరంబు బిగియించి గుణంబు సారించి సారథితో నిట్లనియె.

7_1_199 సీ. చలమేది కౌరవ సైన్యముల్ వాఱెడు ధర్మనందనుని యుద్దండ వృత్తిఁ గంటె యీతనిఁ దాఁకి గర్వంబు మాన్పక నిలిచిన నిమ్మూఁక నిలుచునెట్లు ధర్మజ భీమ సాత్యకి మాత్స్య పాంచాల తనూజులు నాకుఁ దరమె క్రీడి చాపంబు వెరపు నా చూపిన యది గాదె విను మట్లు గాకయుఁ దనువు దాఁచు


తే. సమయమే యిది సంభృతోత్సాహ లీల జయముఁ గీర్తియుఁ గోరి యస్ఖలిత భంగిఁ దేరు నడుపుము చేతులతీఁట వోవ నడరి రథిక జనంబు వేఁటాడ వలయు.

- ద్రోణాచార్యులు ధర్మరాజుతో యుద్ధంబు సేయుట - సం. 7-15-19

7_1_200 చ. అన విని మేను వెంచి రయ మారఁగ సూతుఁడు దేరు వోవ ని చ్చినఁ గని వారి సైన్యములు చెచ్చెర ధర్మజు మించి త్రోవఁ బే ర్చిన భుజ సంపదం గడఁగి సింధరు లీలఁ దెరల్చి తాఁకె న మ్మనుజ విభున్ గురుండు పటు మార్గణ సంవిహితాంబరంబుగన్.

7_1_201 క. తాఁకినఁ బొగడం దగియెడు వీఁకం బతి ద్రోణు బాణవృతుఁ జేయ నతం డాఁక గొనక యతని ధనువు వ్రేఁక నిభల్లమునఁ ద్రుంచి వెస డగ్గఱియెన్.

7_1_202 వ. ఇట్లుద్ధతుం డై యగ్గురుండు పొంగిన జలనిధియుం బోలెం గవిసిన ధర్మ నందను చక్ర రక్షకుం డగు సుకుమారుండు చెలియకట్ట తెఱంగున నిలువరించి నిశిత శరం బతని యురంబున నాఁటించిన నప్పాంచాల వరుం బ్రశంసించు నెలుంగులు సెలంగఏ బాండవ బలంబులు పేర్చి యార్చిన.

7_1_203 క. పెనుగానిఁ బెఱకు కార్చి చ్చును బోలెం బొదలి గురుఁడు సుకుమారునిఁ గాం చన పుఖ శర జ్వాలా విని పాతితుఁ జేసి తఱిమి విభునిం గదిసెన్.

7_1_204 వ. అప్పుడు పాండవయోధు లొండొరులు మీఱి యుధిష్ఠిరు ముందఱికి వచ్చి యాచార్యుం బొదివిన నతండు నలిరేఁగి.

7_1_205 సీ. నకులుని నైదుసాయకముల స్రుక్కించి సహదేవు నేడింట సాధుఁ జేసి నవ విశిఖముల మాత్స్యవరేణ్యు నడఁగించి యేనింట సాత్యకియేవు మాపి ద్రౌపదేయుల శరత్రయములఁ గలఁచి వింశతి నుత్తమౌజుని చలము మాన్చి పండ్రెండు పండ్రెండు పటు మార్గణంబులఁ బాండవాగ్రజుని శిఖండి నొంచి

తే. మఱియు మార్కొన్న రథికుల మదము సెఱచి మెఱుగుఁదూపు లా ధర్మజు మీఁద నిగుడ నడర నఱిమి యుగంధరుఁ డడ్డపడిన నవ్వి యవ్విభుఁ దెగటార్చె నారసమున.

7_1_206 వ. అట్టియెడఁ గేకయ పతులును బాంచాల నాథుండును దదీయ జ్ఞాతు లగు సింహసేన వ్యాఘ్రదత్తులు లోనైన నయోథు లనేకు లాచార్యుం బొదివి శౌర్య బాహు వీర్యంబులు నెఱపి రందు సింహసేనుఁడును వ్యాఘ్రదత్తుండును నెట్టన నానాస్త్రంబుల నొప్పించిన నా ధనుర్ధర గురుండు.

7_1_207 తే. కన్నుఁగవఁ గెంపు గదురంగఁ గౌరవులకు జిత్త మలరంగ నా వ్యాఘ్రదత్త సింహ సేన మస్తకములు రెండు శిత శరములఁ గుండలంబులతో నేలఁ గూల నేసి.

7_1_208 క. తక్కటి రథికుల నెల్లను జిక్కువడం జేసి పురుష సింహుండు మదం బెక్కి యుధిష్టిరుఁ బొదివెడు నెక్కుడు తమకమున గదిసె నేడ్తెఱ మెఱయన్.

7_1_209 వ. అయ్యవసరంబున నా సైన్యంబుల జనంబులు.

7_1_210 క. అదె పట్టు వడియె ధర్మజుఁ డదయుం డగు ద్రోణుచేత నక్కట నేఁ డు న్మదుఁ డై సుయోధనుండు దం డ్రి దలిర్పఁగ నేఁగు గంపురికిఁ గొని యోలమిన్.


http://www.volamsite.com