ఆ భా 3 7 61 to 3 7 90

వికీసోర్స్ నుండి

--రానారె 15:52, 7 సెప్టెంబర్ 2006 (UTC)

3_7_61 సీ.

అనపరాధుల గాననాంతరమ్ముననున్న పేదతాపసులఁ జంపితి పలువుర

నమరుల యీలువుటా డ్రను జెఱవట్టి యఖిలలోకములకు నలఁతసేసి

తిది యెల్ల నొకతల యేపు మీఱఁగ నన్నుఁ జెనకుట యొక తల సెప్పనేల

బలిమియొప్పఁగ మంచి బంటవై లెడలుము కయ్యంబునకు నట్లుగాకయున్న


ఆ.

శరణుఁ జొచ్చి నాకుజానకి నొప్పింపు

మొండువెంట బ్రతికి యుండఁ దీఱ

దస్మదీయశితశరాశీవిషంబుల

కెరయ నీదుప్రాణ మింతనిజము.


3_7_62 క.

మనుజుండ నైన నాతెఱఁ

గనుమానము వాయఁ జూడు మాహవభూమిన్

విను రాక్షసులను నామం

బును నడఁపక యేను రిత్తవోనిచ్చెదనే.


3_7_63 వ.

అని పలుకుచున్న యంగదు పరుషభాషణంబులకు రోషించిన యసురపతి

కన్నెఱింగి నలువురు రక్కసులు గ్రక్కున నవ్వాలినందనుం బొదివి పట్టిన

బిట్టెగసి హర్మ్యశిఖరంబుపైకి దాఁటుటయుఁ దదాక్షేపవేగంబున నన్ని శా

చరులు ధరణీతలంబున జర్జరితశరీరు లై పడిరి హరివీరుం డచ్చటనుండి శిబిర

మధ్యంబునకు లంఘించి భూనాథునకుఁ దనపోయివచ్చిన తెఱంగు విన్న

వించెం దదనంతరంబ రాఘవు ననుమతంబున.


3_7_64 మత్తకోకిలము.

తాలసాలశిలాగ్రహస్తు లుదగ్రగోత్రమహీధరో

త్తాలదేహు లనేకవర్ణులు దార్తాఖిలదిఙ్ముఖా

భీలవాలశిఖాగ్రు లుగ్రగభీరసత్త్వులు వానరుల్

గాలకల్పులు పేర్చి సంతనకట్టి రాహవకేళికిన్.


3_7_65 క.

పరువడి మొత్తము లై బం

ధురఘోషం బెసఁగఁ బొంగి తోఁతెంచు హరీ

శ్వరబలమునందు ఘనసా

గరవీచివికాసరేఖ గానఁగ నయ్యెన్.


3_7_66 మత్తకోకిలము.


కోటఁ బన్నినఘోరదానవకోటిఁ జుల్కనఁ దోలి య

క్కోట నల్గడలన్ మహోగ్రతఁ గూలఁద్రోచి సమున్న మ

త్కూటతోరణయంత్రకేతనగోపురాట్టకనంహతుల్

వీటతాటము సేసి రక్క పివీరు లొక్కట మాత్రలోన్.


3_7_67 వ.

మఱియుఁ బ్రాకారంబుపై నున్న గదాపరిఘడుంతప్రముఖంబులు

గైకొని లంకామధ్యంబునవై వం దొడంగిన నాబాలవృద్ధంబగు పౌరలోకంబు

హాహాకారవ్యాకులంబై కలంగంబడియె నంత రావణచోదితులైన దానవులు

నానాకోటిసహస్రసంఖ్య తరిగి యెక్క డెక్కడ యని తలపడి కపిసముద

యంబులందోలి యెప్పటియట్ల ప్రాకారంబులు గై కొని నిల్చి రప్పుడు.


3_7_68 క.

మును మర్కటబలములచే

ననయంబును గపిలవర్ణమైనది మగుడన్

దనుజబలసంవృతం బై

ఘనపటలచ్ఛాయఁ గోట కర మొప్పారెన్.


3_7_69 క.

వనచరసేనలు దెరలిన

నినవంశో త్తములు నృపతు లిద్దఱుఁ గయ్య

మ్మునకుఁ గడంగుటఁ గ్రమ్మఱ

గొనకొని కపిసేన యెల్లఁ గోటకుఁ గవిసెన్.


3_7_70 క.

ఇట్లు గవిసినం బ్రాకారరక్షకు లైన రాక్షసవీరులు వారలం జేరనీక శిలా

శూలపరశుతోమరాలాతశరకుంతప్రముఖంబులు ప్రయోగించినం గయి

కొనక వనచరులు వృక్షశిలాప్రకరంబులు వఱగించుచుం గడంగి ప్రాకా

రంబుఁ బ్రాఁకుటయు నయ్యిరుదెఱంగుల వారికిం గేశాకేశి యగుసమరం

బయ్యెఁ బదంపడి రావణుండు వనుపఁ బర్వతుండును బ్రఘనుండును

ఖరుండును గ్రోధవశుండును బ్రరుజుండును నను రాక్షసు లేవు రనేక రాక్షస

పిశాచసేనాపరివృతు లయి పురంబు వెలువడి మాయ గావించి యదృశ్యా

కారు లై కపిసైన్యంబు నొప్పింపం దొడంగినం గని.


3_7_71 ఉ.

దారుణవిక్రముండు రిపుదర్పవిభేది మహాస్త్రవేది మా

యారణకోవిదుండు గడు నల్గి విభీషుణుఁ డేణగుదెంచి య

వ్వీరుల మాయయుం జలము వ్రేల్మిడిలోఁ గుదియించి వీరకే

ళీరసికుండు వారి నవలీలమెయిం దునుమాడె నందఱన్.


3_7_72 క.

అతని శరపాతంబుల

చేతం గడు నొచ్చి దైత్యసేన నగము ధా

త్రీతలపతితంబయ్యె వి

భీతిఁ బఱచి పురము సొచ్చెఁ బెఱపగము వెసన్.


3_7_73 క.

అది యెల్ల విని దశాననుఁ

డుదితక్రోధుఁ డయి మంత్రియుతముగ వెడలెన్

మదగజఘోటకసైనిక

పదభరభగ్నావనీవిభాగుం డగుచున్.


3_7_74 వ.

ఇట్లు వెడలి యభేద్యం బగు నౌశనసవ్యూహంబు సంఘటించి వనచరబలంబు

పయి నడచినం గని రాఘవుండును బార్హస్పత్యవ్యూహంబు దీర్చి పేర్చి

యెదురుకొనియె నా సేనలు రెండు నకాండక్షుభితసాగరయుగళంబు

తెఱంగు దోఁప నొండొంటిం గవిసె నప్పుడు రాముండు రావణుం దల

పడియె లక్ష్మణుం డింద్రజిత్తును సుగ్రీవుండు విరూపాక్షునిఁ దారుండు

నిఖర్వటుం దాఁకి రిట్లిరువాఁగునకును దేవాసురులకుంబోలె నాభీల సమరం

బయ్యెనందు.


3_7_75 క.

సౌమిత్రి నిశితవిశిఖ

స్తోమంబుల నసురపతిసుతుం బొదివిన సం

గ్రామమునకుఁ దొలఁగక యతఁ

డామనుజోత్తముని ముంచె నాశుగవృష్టిన్.


3_7_76 ఉత్సాహము.

అమరవైరివిభుఁడు దశరధాగ్రసుతుఁడు నేపునన్

సమరసత్ప్రతాపకోపజాజ్వలచ్ఛరీరు లై

తుములబాణపటలవృష్టిఁ దొప్పదోఁగి యిర్వురుం

దమక మేది తమక తమక తనిసి రాహవంబునన్.


3_7_77 వ.

తదనంతరంబ.


3_7_78 క.

ఆరావణుండు నిజదో

స్సారమునకు రాముబాహుసారం బతిదు

ర్వారం బగు టేర్పడఁ గని

వీరారంభంబు కడఁక విడిచి రయమునన్.


3_7_79 క.

మగిడి నగరంబు సొచ్చిన

బెగడి నిశాచరబలంబు పెల్లగిలుటయున్

విగతభయుండు ప్రహస్తుఁడు

దగఁ గో ల్తలసేసె నత్యుదగ్రస్ఫురణన్.


3_7_80 ఉ.

ఆతనిఁగాంచి తద్బలము లన్నియుఁ గ్రమ్మఱ నాహవోత్సవ

స్ఫీతములై కడంగుటయుఁ బేర్చి విభీషణుఁ డుగ్రవానర

వ్రాతసమన్వితంబుగ నవారణ మార్కొనినన్ మహారణం

బాతత మయ్యె సైన్యనివహంబులు రెంటికి నద్భుతంబుగన్.


3_7_81 వ.

అంత.


-: ష్రహస్త ధూమ్రాక్షుల యుద్ధము :-


3_7_82 మ.

కృతహస్తుండు ప్రహస్తుఁ డాహవకళాకేళీ విదగ్ధుండు ద

ర్పితుఁడై తాఁకె విభీషణుం గడఁకమై బెంపారి వారిద్దఱున్

శితశల్యోగ్రమయూరపత్త్రవిశిఖశ్రేణీ శతచ్ఛన్ను లై

ధృతి నొప్పారిరి చిత్రవారిధరపంక్తిచ్ఛన్నశైలాకృతిన్.


3_7_83 చ.

కదిసి ప్రహస్తుఁ డార్చి పరిఘంబు రయంబున నెత్తి భీకరో

స్మదకర్హస్త తాడనము మాడ్కి దలిర్పఁగ వ్రేసె నీసుమై

నదయత రావణానుజుని నాతఁడు వ్రేటున కించుకంతయుం

గదలక హేమకూటగిరి కైవడి నిల్చి యుదీర్ణకోపుఁ డై.


3_7_84 మ.

శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోర్నలో

త్థితకీలాసదృశంబు నై మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు

ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాత పా

టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్.


3_7_85 వ.

ఇట్లు ప్రహస్తుండు వడినం దత్సైన్యంబులు విముఖంబు లగుటయు

ధూమ్రాక్షుండు రోషతామ్రాక్షుం డగుచు నతినిబిడలాహకానీక భీకరం బై

కాఱుకొను చున్న నిశాచరచక్రంబుతో నురులం బఱతెంచినం జలించి

బలీముఖబలంబులు దుర్బలంబులై తొలంగినం జూచి యాంజనేయుం

డజయ్యుం డై నిల్చినం బెల్చన యెప్పటియట్ల యూథపతులుం గూడుకొని

రప్పుడు.


3_7_86 సీ.

అనిలతనూజ ధూమ్రాక్షరక్షితసై న్యయుగ్మంబునకు నయ్యె నుగ్రసమర

మందు నిష్ఠురచరణాఘాతముల డొల్లు నరదంబులును శిలాహతులఁ దూలి

యొఱలు నేనుంగులు నుత్తాలతరుహతిఁ ద్రెళ్లు ఘోటకములు దీవ్రనఖర

దంతక్షతంబుల దళితాంగులై నేలఁ బడి తన్నికొను వీరభటులు నగుచు


ఆ.

నధికశౌర్యసారు లగు కపివీరుల

చేత నొచ్చి దైత్యసేన భీతిఁ

బఱచెఁ గొంత బెండువడి యుండెఁ గొంత ధూ

మ్రాక్షువెనుక కొదిఁగె నంతఁ గొంత.


3_7_87 మహాస్రగ్ధర.

కని ధూమ్రాక్షుండు విశ్వగ్రసనరయలసత్కాలమేఘంబ పోలెన్

ఘనగర్జాఘోష మొప్పం గడఁగి శరశ తాకల్పితాసారదర్ద

ర్శనవీర్రంభుఁ డైనన్ సకలహరిచమూసంఘమున్ విహ్వలం బై

చనెఁ దూలెం గూలె లావుం జలమును జెదరన్ సంగడిన్ విచ్చె నొచ్చెన్.


3_7_88 తే.

అతనియుద్ధతి సైఁ పక యనిలసూనుఁ

డనిల వేగుఁ డై పఱతెంచి యార్చి తాఁకెఁ

బ్రథన మయ్యిద్దఱకు నుగ్రభంగి నమర

పతికి ప్రహ్లాదునకుఁబోలెఁ బ్రకట మయ్యె.


3_7_89 క.

పరిఘంబులు గదలును బె

క్కరుదుగ రక్కసుడు వైచె నమ్మారుతిపై

నురుగండశైలములు ఘన

తరువులు హరివిరుఁడు గురిసె దానవుమీఁదన్.


3_7_90 వ.

ఇబ్భంగిం బెనంకువ సెల్లు చుండ గొండొక సేపునకు.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_3_7_61_to_3_7_90&oldid=3180" నుండి వెలికితీశారు