ఆ భా 3 6 121 to 3 6 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_6_121 క. నీయట్టి దానశీలుని నీ యఖిలమునందు గాన నెన్నండును స త్త్యాయత్తమతివి సాధు వి ధేయుండవు నీవు పుణ్యతేజుఁడ వనఘా.

3_6_122 చ. మనమున నేవగింప కవమానము సేయక యించుకంతయుం గినియక యోల మందక యకృత్రిమ భక్తి నొనర్తి తీవు స జ్జననుత యన్నదానము ప్రసాద్ సత్యము ధైర్యమున్ దమం బును నపరిగ్రహత్వమును బొల్పుగ నీ ధన మయ్యె నియ్యెడన్.

3_6_123 చ. చవులకుఁ బ్రేముడించు ననిశంబును నాలుక దాల్మి పెంపు ధ ర్మువును శమంబుఁ ద్రెక్కొను సముద్ధతి నాఁకలి వీని రెంటనుం దవులకు జీవిత స్థితి విధాయక మన్నము నీవు జీవితే చ్ఛ విడిచి తిప్పు డేమని ప్రశంస యొనర్తు నినుం దపో నిధీ.

3_6_124 క. మనము నింద్రియముల వ ర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు దపం బని చెప్పుదు రట్టి తపం బనఘా నీయంద కలిగె నభినవ భంగిన్.

3_6_125 ఉ. ప్రీతుఁడ నైతి నీ వలనఁ బేర్చిన పుణ్య ఫలంబు లెల్ల నీ చేతివ యయ్యె నీదగు ప్రసిద్ధ తపో విభవంబు నిర్జర వ్రాతము లిప్డు సాటె త్రిదివంబున కీవును మేని తోడ వి ఖ్యాతిగ దేవయానమున గ్రక్కున నేఁగెదు సంయమీశ్వరా.

3_6_126 వ. అని పలికి దుర్వాసుం డరిగెఁ దదనంతరంబ హంస సారస యుక్తంబను గింకిణీ మాలికా మనోహరంబును గామ గమనంబును నయిన విమానంబు గొనుచు దేవదూత ముద్గలు కడకుం జనుదెంచి యిట్లనియె.

3_6_127 క. అనఘ భవత్సుకృతంబున ననిమిష లోకాభిగమ మవాప్తం బయ్యెం జనుదెమ్ము విమానము చ య్యన నెక్కుము చిత్తమునఁ బ్రహర్షం బెసఁగన్.

3_6_128 వ. అనిన దేవదూతం జూచి ముద్గలుండు మహాత్మా దివిజలోకం బెట్టిది విన వలతు నందుల గుణదోషంబు లెఱింగింప వలయు సత్పురుషులతోడి మైత్త్రి సాప్తపదీనం బని చెప్పుదురు గావున మైత్త్రిం బురస్కరించి ని న్నడిగెద ననిన నతం డమ్మునీంద్రున కిట్లనియె.

- ముద్గలునకు దేవదూత పుణ్యలోకంబు తెఱంగు సెప్పుట – సం. 3-247-2

3_6_129 క. ఈ లోకమునకు మీఁదై చాలఁగ వెలు గొందు చుండు స్వర్లోకము నా నాలంకారయుతము ది వ్యాలోకము దేవయాన మది మునినాథా.

3_6_130 చ. అమల తపో నివాసులు మహాధ్వర శీలురు సత్యసంధు లు త్తములు జితేంద్రియముల్ సములు దానపరుల్ రణశూరు లందు హ ర్షమున వసింతు రచ్చరలు సాధ్యులు దేవమునుల్ మరుద్వసు ప్రముఖులు వేఱువేఱ తగు పట్టుల నుండుదు రంద యిమ్ములన్.

3_6_131 వ. మఱియు ముప్పది మూఁడు వేల యోజనంబులు విస్తృతం బైన మేరు శిఖరంబు నందు నందన ప్కముఖంబు లైన దేవోద్యానంబులు పుణ్య పరులకుం గ్రీడా స్థానంబులై విలసిల్లు నయ్యెడల నాఁకలియు నీరువట్టును శీతోష్ణ భయంబులును జరారాగ వికృతులును బుట్ట వెయ్యెడలం జూచిన నతి మనోహరం బై సకలేంద్రియ తర్పణం బై యుండు నిట్టి పుణ్యలోకంబునకు నర్హులయిన పుణ్య పురుషులు విధి నియోగ పక్వంబు లయిన మానుష శరీరంబులు విడిచి తేజోమయంబు లగు దివ్య దేహంబులు ధరియించి వివిధాంబరాభరణ భూషితులును నమ్లాన కుసుమ మాలికా మనోహరులును నై కనక విమానంబులందు దేవదూతల చేతం గొనిపోవం బడి యందు శోక భ్రమ శ్రమాయాస విరహితులై వివిధ సుఖంబు లనుభవించు చుండుదురు.

3_6_132 ఆ. అనఘ యింద్రలాకమున కంటె మీఁద ని శ్శోక మగుచు బ్రహ్మలోక మమరు నది యనన్య దీప్త సదన మై తనదైన వెలుఁగునను జగంబు వెలుఁగఁ జేయు.

3_6_133 చ. మనువులు ధాతలున్ మునులు మానుగ నుండుదు రందు లోభముం గినుకయుఁ గిల్బిషంబు నపకీర్తియు దుఃఖము జన్మవైకృతం బును జనియింప వీభువనముల్ దెగునప్పుడు నాశమొంద ద వ్వినుత పదంబు దానియెడ వేడుక సేయుదు రింద్ర ముఖ్యులున్.

3_6_134 వ. స్వర్గంబునం గల గుణంబు లెఱింగించితిఁ దదీయ దోషంబులు సెప్పెద వినుము.

3_6_135 తే. ఇందు జేసిన పుణ్యంబు లెల్ల నందుఁ గుడుచుఁగాని మర్త్యున కందు గడఁగి పుణ్య మాచరింపంగఁ గాదు పుణ్యావసాన మగుడు భూమికత్రోతురు మగుడ నతని.

3_6_136 క. కడు మరగిన సౌఖ్యంబులు విడుచుటఁ జిత్తంబు దుఃఖ వివశముగ మహిం బడుఁ జూవె పుణ్యలోకం బెడలిన మనుజుండు దేజ మేది యబలుఁడై.

3_6_137 క. తన తక్కువ యునికియు న న్యుని యున్నత శీలతయుఁ గనుంగొని చిత్తం బున నెరియుచునికి గలుగును జననుత సురలోక వాస జనులకు నెల్లన్.

3_6_138 వ. బ్రహ్మలోకంబునం దక్కఁ దక్కిన పుణ్యలోకంబులం దెల్ల నిదియ మేరయై చెల్లు మఱియుఁ బుణ్యలోక పరిభ్రష్టుండ మర్త్యలోకంబున సుఖశీలుండయి పుట్టు నీ లోకంబు గర్మభూమియు నా లోకంబు ఫలభూమియు నని యెఱుంగుము నీ వలని యాదరంబునం జేసి యింతయుం జెప్పితి నీవింకఁ దడయ నేల చనుదెమ్మనిన ముద్గలుండు గొండొక విచారించి దేవదూతం జూచి యిట్లనియె.

3_6_139 ఆ. ఇట్టి దివ్యసుఖము లే నొల్లఁ బదివేలు వచ్చె నాకు నమర వర్గమునక యుండ నిమ్ము వాని నో యన్న విచ్చేయు మిష్టమైన యెడకు నిపుడ నీవు.

3_6_140 క. ఎయ్యెడకుఁ జనినఁ బురుషుం డియ్యెడకును మగుడ కుండు నెక్కాలము నం నయ్యుత్తమ పదవికి నై యెయ్యనువున నైన నుత్సహించెద బుద్ధిన్.

3_6_141 వ. అని దేవదూత వీడ్కొలిపి ముద్గలుండు శిలోంఛ వృత్తి విడిచి పరమ శాంతిం గైకొని విర్వికల్పం బైన జ్ఞాన యోగంబునం జేసి తుల్య నిందా స్తుతియును సమ లోష్టాశ్మకాంచనుండును నై పరమ సిద్ధిం బొందెఁ బాండవోత్తమా నీవును రాజ్య రహితుండ నైతి నని వగవక తపంబు సేయుము తపంబునం జేసి శుభంబులు సేకుఱు బదు మూడవు నేఁటి కడపటఁ బితృ పైతామహం బైన రాజ్యంబు నిన్ను బ్రాపించు నని యిట్లు సాత్యవతేయుండు గౌంతేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం జనియె నంత.

3_6_142 మ. వితతానేక మృగాకులంబును సదా విర్భూత నానా తరు ప్రతతీ పుష్ప సుగంధ బంధుల శుభావాసంబు బ్రహ్మర్షి సం శ్రిత పుణ్యాశ్రమ మండలంబు నగుచుం జెల్వొందు నక్కానలో ధృతపుణ్యుల్ విహరించి రేవురును గుంతైపుత్రు లిచ్ఛా గతిన్.

3_6_143 వ. ఒక్కనాఁ డమ్మహారథులు దృణబిందు నాశ్రమంబున ధౌమ్య సహితంబుగాఁ బాంచాలి నునిచి యేవును నొక్కట మృగయార్థంబు నలుదిక్కులకుం జనిన యనంతరంబ.

- సైంధవుఁడు ద్రౌపదిం జూచి మోహించుట – సం. 3-243-6

3_6_144 ఉ. వీరుఁడు సైంధవుండు జన విశ్రుత శౌర్యుఁజు సాల్వకన్య నిం పారఁగఁ బెండ్లియాడుటకునై నిజ వైభవ ముల్లసిల్ల వి స్ఫార చతుర్విధోరు బల సంగతుఁడై చనుచుండి యాశ్రమ ద్వారమునందుఁ గాంచె ద్రుపద క్షితి పాల తనూజ నచ్చటన్.

3_6_145 ఉ. నీల పయోద మండలము నిశ్చల లీల వెలుంగఁ జేయుచుం గ్రాలెడు వాలుఁ గ్రొమ్మెఱుఁగుకై వడిఁ దద్వన భూమి నెంతయున్ లాలిత దేహ కాంతి పటలంబునఁ జేసి వెలుంగఁ జేయు న బ్బాల వినీల కుంతల విభాసినిఁ జూచి సవిస్మయాత్ముఁడై,

3_6_146 తే. మగువఁ దగిలిన చూడ్కుల మగుడఁ దిగువ నేర్పు సాలక యతఁడు కందర్ప దర్ప గోచరాత్ముఁడై నిజసఖుఁ గోటి కాస్యుఁ డను నృపాత్మజుఁ జూచి యిట్లనియె బ్రీతి.

3_6_147 ఉ. ఇన్నలినాక్షి యెవ్వతియొ యివ్విపినంబున నేకతంబ యి ట్లున్న నిమిత్తమేమియొ సురోత్తమ కన్యయొ యక్షకాంతయో పన్నగ భామయో మనుజ భామిని గామి నిజంబ యిట్టి చె ల్వున్నదియే మహీతలము నుగ్మలు లెవ్వరి యందు నారయన్.

3_6_148 ఉ. లీల యెలర్పఁగా నబల లేఁజిగురాకును బోలె నొప్పు కెం గేలు కదంబ శాక తుదిఁ గీల్కొనఁ జేసి వసంత విభ్రమో న్మీలిత బాల వల్లి క్రియ మేలగు చూడ్కుల మించి పావక జ్వాలయ పోలెఁ జిత్తము నిజం బెరియింపఁ దొడంగెఁ జూచితే.

3_6_149 ఉ. ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి యైనఁ ద్రిలోక రాజ్యముం జేకుఱ నేలినట్లు విలసిల్లనె దర్పక వీరు బంటుఁ గాఁ గైకొని సర్వ భోగములుఁ గాంతు నొడంబడఁ బల్కి దీనికిన్ నాకును బొందొనర్చి కరుణం జరితార్థునిఁ జేయవే ననున్.

3_6_150 వ. అని పనిచినం గోటికాస్యుండు గ్రక్కునం బాంచాలి పాలికిం జని ప్రణయ సుభగంబుగా నమ్మగువ కిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com