ఆ భా 3 6 061 to 3 6 090

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


3_6_061
మ. హితులై పెద్దలు సెప్పఁగఁ గ్రియా హీనుండవై త్రోచి పో
యితి దుష్టాత్ములఁ గూడి దానికి ఫలం బెట్లయ్యెనో చూచితే
గద విద్వేషుఁడు ధర్మ నందనుఁడు గల్గం బట్టి యప్పాట దు
ర్గతికిం దప్పితి గాక చిక్కితి గదా గంధర్వుచే నాజిలోన్.

3_6_062
ఉ. నీవును దమ్ములున్ సతులు నెయ్యురు వైరులచే గృతహీతులై
పోవఁగఁ బాఱిపోయెఁ గడు బొల్లఁదనంబున సూత పూత్త్రుఁ డీ
కావరుఁ గష్ట చిత్తు నధికంబుగ నమ్ముదు నీవు వీని బా
బా విభవంబు గయ్యమున నక్కడఁ జూచితె కన్నులారఁగన్.

3_6_063
ఉ. ఆయత బాహు లుగ్రబలు లార్యులు పార్థులు వారి భూరి శౌ
ర్యాయుధ నైపుణ్య క్రియన యందుఁ బదాఱవపాలుఁ బోలఁ డీ
వాయపురజ్జులాఁ డధిప వారల చందము వీని చందమున్
నీ యెడ నిక్కమై తెలిసెనే ఖచరేంద్రుల పోరి లోపలన్.

3_6_064
క. కులమును సిరియును జెఱుపక
యలఘు స్థతి నింకనైన నప్పాండవులం
గలసి మనవయ్య నాదగు
పలుకు వినగదయ్య హితము పథ్యము సుమ్మీ.

3_6_065
వ. అనిన భీష్ము వచనంబుల ననాదరంబు సేసి దుర్యోధనుండు గర్ణ సౌబలులం జూచి నవ్వుచు వారలుం దమ్ములుం దోడన చన నక్కడ వాసి చనియె భీష్ముండును లజ్జితుండై నిజ గృహంబున కరిగె నంతఁ గౌరవేశ్వరుండు గ్రమ్మఱి యెప్పటి చోటికిం జనుదెంచి మంత్రులతోడ మంతనం బుండి మన కెయ్యది కర్తవ్యం బెయ్యది సేసినఁ దేజోలాభంబు లగు నని యడిగినఁ గర్ణుండు దేవా నీకింక నే విచారమ్ములు నేల నిష్కంటకంబైన యీ పృథివి సకరంబును బాలించుచు మహేంద్ర మహిమ తోడ నఖిల సుఖంబులు ననభవింతు గా కనినం బ్రీతుండై యతండు వాని కిట్లనియె.

3_6_066
క. నీ యట్టి వీరవరుఁడు స
హాయుం డటె పడయరాని యదియుం గలదే
ధీయుత నాకెయ్యదియును
బాయక విను మింక నొక్క పని దెల్లముగన్.

3_6_067
తే. ధర్మజుఁడు రాజసూయంబుఁ బేర్మిఁ జేసి
నంతనుండియు నమ్మహితా ధ్వరమున
యందభిప్రాయమై యుండు నొంద నాకు
నమ్మఖంబు సేయింపవే యనఘ నన్నుం.

3_6_068
వ. అనినం గర్ణుండు గౌరవపతి కిట్లనియె.

3_6_069
క. అగుఁ గాక యేమి యిప్పుడు
జగతిం గల నృపతు లెల్ల జనవర నీ కి
మ్ముగ వశవర్తుల కావునఁ
దగ నుద్యోగింపు మిపుడు తత్క్రతు విధికిన్.

3_6_070
ఉ. రాజులఁ బిల్వఁ బంపుము ధరాసుర సంఘము నామనింపు పే
రోజ నుదాత్త యజ్ఞ గృహ యూపతతుల్ సమకట్టఁ బంపు వి
భ్రాజిత భక్ష్య భోజ్య విధి భవ్య పదార్థము లానయింపు మ
వ్యాజ విభూతిమై నమర వల్లభు చాడ్పునఁ జేయు జన్నమున్.

3_6_071
వ. అనిన సంతోసిల్లి కురుపతి యప్పుడ పురోహితునిం బిలిపించి రాజసూయ యజ్ఞంబు సంపూర్ణ దక్షిణంబుగాఁ జేయవలయుఁ దత్ప్రయోగ విశేషంబులకు మీరు సాలి యుండునది యనినం బురోహితుండు దగిన విద్వజ్జనంబలుల తోడ విచారించి దుర్యోధనున కిట్లనియె.

3_6_072
చ. జనవర నీకుఁ బాండవులు శత్రులు గావున వారి నాజి నో
ర్చిన మఱి కాక మున్న యిటు సేయఁగ శక్యమె రాజసూయమున్
వినుము దగంగ నిప్పటికి వేఱొక యజ్ఞము సేయు మిమ్ములం
బనుపుము తత్క్రియా వివిధ భంగులకుం దగు వారి వేగమై.

3_6_073
తే. రాజ సూయంబు నట్టిద రాజవర్య
వైష్ణవం బను యాగంబు వాసుదేవుఁ
డిమ్మఖము సేసెఁ దొల్లి యభీష్ట మిదియ
చేయు నిర్విఘ్నముగ నిది సెల్లు నీకు.

3_6_074
క. ఆనిన నిది వోలు నని య
జ్జన నాథుఁడు సూత తనయ సౌబలులు ప్రియం
బున ననుమతింప నభిమత
వినుతాధ్వర సంప్రయాగ విహితోద్యముఁడై.

3_6_075
క. తన యుద్యోగము జననీ
జనకులకును ద్రోణ విదుర శాంతనవ కృపా
ది నిఖిల మాన్య జనమ్ముల
కును దగ నెఱిఁగించి భరత కుంజరుఁ డెలమిన్.

- దుర్యోధనుఁడు వైష్ణవం బను యజ్ఞంబు సేయుట –
సం. 3-242-1

3_6_076
వ. వారిచేత ననుజ్ఞాతుం డయి నగర సమీపంబున నొక్క పుణ్య స్థలంబునం దఖిల యజ్ఞ గృహంబులు నతి రమణీయంబులుగాఁ జేయించి యజ్ఞోపరకణంబులును సమస్త వస్తు విశేషంబులును సమకట్ట నియోగించి శుభ దినంబునం బరమ బ్రాహ్మణ సహాయుండై నియత దీభా శోభనంబు వహించె నంత.

3_6_077
ఆ. అఖిల దేశ వాసు లైన రాజులను బ
విత్ర చరితు లైన విప్రవరుల
నర్థిఁ బిలువ దూత లరిగిరి కౌరవే
శ్వరుని యాజ్ఞఁ జేసి సమ్మదమున.

3_6_078
వ. అందొక్క దూతం బిలిచి దుశ్శాసనుండు నీవు ద్వైత వనంబునకుం జని పాండవులను దదాశ్రమ వాసులయిన భూసురులను గౌరవేశ్వరు నధ్వరంబునకుఁ బిలువు మని పనిచిన వాఁడునుం జని ధర్మరాజుం గని యిట్లనియె.

3_6_079
ఉ. వీరుఁడు గౌరవుండు నిజ విక్రమ లబ్ధ సమున్నతార్థ సం
భారములన్ మహాధ్వర మపారబలుం డొనరించుచుండి పెం
పారఁగ నిన్ను దమ్ముల మహాద్విజులం బిలువంగఁ బంచె ధా
త్రీ రమణేశ నెమ్మిఁ జనుదెమ్ము తదధ్వరముం గనుంగొనన్.

3_6_080
వ. అనిన ధర్మజుండు వాని కిట్లనియె.

3_6_081

3_6_082

3_6_083

3_6_084

3_6_085
క. అపభృథ శోభితుఁ డై కౌ
రవ ముఖ్యుఁడు భూరి కనక రత్న తతుల భూ
దివిజులఁ బూజించి నృపుల
వివిధ విధుల సత్కరించి వీడ్కొలిపెఁ దగన్.

3_6_086
వ. అట్టియెడ నధ్వరోత్సవాగతు లైన జను లనేకులు ధృతరాష్ట్ర నందను సమ్ముఖంబున నిట్లనిరి.

3_6_087
క. జనపతు లెవ్వరు నివ్విధ
మున నిర్విఘ్నముగ నఖిల భూ జన సమ్మో
దనముగఁ జేసిరె సత్క్రతు
వనఘ భవత్పుణ్య మహిమ లాశర్చర్య మిలన్.

3_6_088
శా. సారోదార విభూతియై మును హరిశ్చంద్రుం డొనర్చెం గ్రియా
పారీణుం డయి రాజసూయ మది సెప్పన్ వింటి మయ్యజ్ఞముం
గౌరవ్యోత్తముఁ డైన ధర్మసుతుఁడుం గావింపఁగాఁ గంటి మే
మా రెండున్ సరిగావు నీ మఖముతో నత్యున్నతిన్ భూవరా.

3_6_089
క. జన్న మొనర్చియ కా
దే జగదావర్త కీర్తి దీపితులై య
వ్యాజ సురలోక సుఖముల
భ్రాజిల్లిరి రఘు యయాతి భరతాది నృపుల్.

3_6_090
తే. అని నుతింపంగ మఱియును నందకొంద
ఱయ్యుధిష్ఠిరు రాజసూయంబు చిదుర
పాలుఁ బోల దీ మఖము వైభవ సమృద్ధి
నని తలంచిరి నిజ హృదయంబులందు