ఆ భా 3 6 001 to 3 6 030

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


శ్రీ మదాంధ్ర మహా భారతము ఆరణ్య పర్వము - షష్ఠాశ్వాసము -0-

3_6_001 క. శ్రీ లలిత మూర్తి సుమహ చ్చాళుక్యవరేణ్య పుణ్యచారిత్ర విచి త్రాలం గారోజ్జ్వల కని తాలాప కలాప సంతతానంద మదీ.

- దుర్యోధనుని విషాదము – సం. 3-236-1

3_6_002 వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లతిమానుషం బైన యర్జును పరాక్రమంబును నత్యంత దైన్యాస్పదం బగు దుర్యోధను పరాభవంబును ధర్మజు దయయు నాకర్ణించి విస్మయ జుగుస్సాకలిత మానసుం డగుచు జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

3_6_003 చ. అనిమిశము బాండు పుత్త్రులకు నప్రియకార్యము రోయునట్టి దు ర్జనుఁడు సుయోధనుం డటులు శత్రులచే నవమానితుండుఁ బే ర్చిన కృప నొప్పుచున్న కురుసింహుల చేత విమోక్షితుండు నై మనమున లజ్జ లేక మునిమండన యెమ్మెయి నేఁగె వీటికిన్.

3_6_004 మత్తకోకిలము. మేనఁ బ్రాణము దాల్చి భంగము మ్రింగి యెప్పటి చాడ్పు నన్ మానవేంద్రుఁడ నేను దద్దయు మానినన్ దలఁ పాత్మలోఁ బూను టాతని కెట్లు గల్గఁగఁబోలు నారయ నద్భుతం బైన తచ్చరితంబు సెప్పుమ యంతయుం బరిపాటితోన్.

3_6_005 అని యడిగిన నమ్మహాముని యిట్లను నట్లు కౌంతేయుల చేత బంధ మోక్షితుం డై దుర్యోధనుండు లజ్జా లజ్జలిత హృదయుం డగుచుఁ బెదిరిన సేనలం గూర్చుకొని కొంత దవ్వరిగి యొక్క సమతలంబునం బటమందిర విరచనంబు నిర్వర్తించి యభ్యంతర మందిరమ్మున నొక్కరుండును దల్పంబుపయిం బడి చింతా పరవశత్వంబు నొంది రాహకబళన కలుషితుండైన రోహిణీ పతియునుం బోలె విషాద వివర్ణుం డయి యున్న యెడఁ గర్ణుండు వచ్చి సముచితంబుగాఁ గని యన్నరేంద్రున కిట్లనియె.

3_6_006 చ. మనుజ వరేణ్య చూడ నతిమానుష మమ్మెయు గయ్య మెందుఁ గ ల్గునె పటు విక్రమాన్వితులఁ గ్రోధనిబద్ధులఁ గామరూపులం జెనయఁగ వచ్చునే ఖచరసింహుల నేరికి నట్టివారి నే పునఁ దునుమాడి గెల్చితి విభూతి యెలర్పఁగ నీవుఁ దమ్ములున్.

3_6_007 ఉ. అప్పుడు నీవు సూడఁగ ననంతము లై ఖచరేంద్ర సైన్యముల్ గప్పె ననేక సాయక నికాయములన్ వడి నన్ను నేనునుం గుప్పలు గూలనేసి రిపుకోటి వధించితి నంతలోన న న్నొప్పరికించె సైన్యతతి యొక్కఁడనై రణభూమి నొచ్చితిన్.

3_6_008 వ. ఆలోనన విరథుండనై వికర్ణు రథం బెక్కన నది నమర ప్రదేశంబునకుఁ దోలంగఁ బఱచె దేవా నీవు బర విక్రమాతిశయంబులం బ్రతివీరుల నోర్చి యక్షతుండవై యుండుట గనుంగొని కృతారథుండనైతి నిట్టి పరాక్రమంబు సేసిన వారిజ్జగంబున నెవ్వరు గల రిది యత్యద్భుతంబనినం గౌరవేశ్వరుండాత్మ గతంబున నీతండు మత్ప్రకారం బెఱుంగక యిట్లు పలికెం గాకేమి యని లజ్జితుం డగుచు రాధేయున కిట్లనియె.

3_6_009

3_6_010

3_6_011

3_6_012

3_6_013

3_6_014

3_6_015

3_6_016

3_6_017 ఉ. అక్కట యమ్మహారణమునందు విచ్చరకోటితోడఁ బే రుక్కునఁ బోరి యేను మృతి నొందఁగ నేరన యట్టులైన నీ తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్ మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై.

- దుర్యోధనుండు ప్రాయోపవేశంబు సేయఁ బూనుట – సం. 3-238-10

3_6_018 వ. కావున నిట్టి దురవస్థ పాలైతి నేను బ్రాయోపవేశంబునఁ బ్రాణ పరిత్యాగంబు జేసెద మీరందఱు దుశ్శాసనుం బురస్కరించుకొని పురంబున కగురునది మిత్త్రులకుఁ బ్రమోదంబును శత్త్రులకు నిర్వేదంబునుం జేయుచు మనునట్టి యేను నేఁడు బోఁడిమి సెడి పగతుర చేత శిరస్తాడనంబు సేయంబడి సిగ్గువడక బంధు జనంబులలోని కేమని యరుగుదు నాంబికేయుం గని యేమని పలుకుదుఁ గురువృద్ధు లయిన భీష్మబాహ్లికులయు నాచార్యులయిన కృప ద్రోణులయు సమ్ముఖంబున నెట్లు నిలుతుఁ బరిజనులుం బౌరులుం బురోహితులు నన్నుం గనిన నేమని సంభాషింతు నిది యాత్మ రోషంబున నైన యుపాయంబు నాకవశ్య భోక్తవ్యంబు.

3_6_019 క. విను దుర్వినయాత్మకుఁ డగు జనుఁ డుజ్జ్వల మైన సిరియు సద్విద్యయుఁ గ ల్గిన నందు మెలఁగ నేరక చెనఁటి తెఱంగునకుఁ జొచ్చి చెడిపోవుఁ దుదిన్.

3_6_020 క. అకటకట యిట్టి కష్టము నకు వచ్చితి నయ్య యేను నన్నటె వైరి ప్రకరము లనిఁ బట్టినఁ గృప నొకరుఁడు విడిపించె దైవ మోపదె యెట్లన్.

3_6_021 క. మానము సెడియును నిమ్మై మేనం బ్రాణంబు లెట్లు మేకొని తాల్తుం గాన యిది నిశ్చయముగాఁ బూనితి నా తెగువ మాన్పఁ బోల దొరులకున్.

3_6_022 వ. అని పలికి సమీపగతుం డైన దుశ్శాసను నాలోకించి యమ్మహీపాలుం డిట్లనియె.

3_6_023 సీ. అన్న దుశ్శాసన నిన్ను రాజ్యమునకుఁ బట్టంబు గట్టెదఁ బతివి గమ్ము శకుని కర్ణులు దీర్పఁ బ్రకట వసుంధరా వలయ మంతయు మహోజ్జ్వలత నేలు భ్రాతృవర్గమునకుఁ బ్రీతి సేయుము బంధుజనుల బోషింపుము సద్ద్విజులకు నుత్తమం బుగఁ దగు వృత్తులు సెల్లింపు గురు జనంబుల భక్తిఁ గొలువు మెపుడు

తే. నింద్రుఁ డమర గణంబుల నేలునట్లు ధరణి పతుల నేలుము బాహుదర్ప మొప్పఁ బగఱ నుక్కడఁగింపుము పరమ మిత్త్రు లైన శూరులఁ గొనియాడు మర్హ భంగి.

3_6_024 వ. అనిన నమ్మాట దన హృదయంబునకు నిశిత శూలం బయిన నతండు నిలువ నోపక యగ్రజు పాదంబుల పయిం బడి దేవా యి ట్లానతీఁ దగతు నాకుం బ్రసన్నుండ వగు మని నిజనేత్ర జలంబులం దదీయ చరణ యుగళం బభిషేకించుచు నిట్లనియె.

3_6_025 చ. అవని విధీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహా ర్ణవమది యింకినన్ దివస నాథుఁడుఁ జంద్రుఁడు దేయ మేదినం గువలయనాథ నీకు నొక కుత్సిత భావముఁ గల్గ నేర్చునే భవదుపయోగ్య మైన నృప భారము నాకు వహింప శక్యమే.

3_6_026 క. హితులైన వారిఁ బ్రోచుచు సతతంబును రిపుల నెల్ల జమరుచు నిఖిల క్షితి తలము నీవ యేలుము శత సంవత్సరము లధిప జయశీలుఁడ వై.

3_6_027 వ. అనుచు నయ్యువరాజు దుఃఖాతి భార విహ్వలుండై యెలుంగెత్తి యేడ్చిన నయ్యన్న యుం గన్నీరొలుక నూరకుండె నప్పుడు కర్ణుండు వారల జూచి యిట్లేల బాలిశులుం బోలె నేడ్చెదరు ధైర్యంబులు ధరియించి శోక వ్యసనంబులు విడువుండు శోక శీలురం జూచి పగతురు సంతసిల్లుదురు శోక శీలురకుఁ బైపై శోకంబులు వొందు ననది దుర్యోధనుం బేర్కొని యిట్లనియె.

3_6_028 క. ఒక యల్ప మనుజు క్రియ సో మ కులోత్తము నీకు నిట్లు మహనీయ సుఖ ప్రకృతి యగు నిజ శరీరం బకట విడువఁ దలఁప నగునె యవిహిత బుద్ధిన్.

3_6_029 తే. శోక మగ్నుండ వగు నిన్నుఁ జూచి బెగడి యధిప నీ తమ్ములును నేను నధిక దుఃఖ వహ్ని పాల్పడమయ్య మా వలనఁ గరుణ గలిగి తీర్పవె యిందఱఁ గౌరవేంద్ర.

3_6_030 వ. పాండవుల చేత విముక్తుండ నైతి నని వగచె దంతియ కాని నీకుం గార్యగతియందు వివేకంబు సాల దది యెట్లనిన నే రాజు రాజ్యంబున నిశ్చింతు లయిన జనులు తమతమ జీవనంబుల వర్తింతు రా రాజునకు నట్టిజనులు బంట్లు గావునఁ దా రమ్మహీ పతికిం దీఱమి గల్గినచోట్ల నెల్లనుం దమ పౌరుషంబులు నెఱప వలయుఁ గౌంతేయులు నీ దేశంబున నుండి నీ యాజ్ఞవలనం గృతారంభులై యున్న వారగుటం జేసి వారు నీ కింకరులు నీకు నైన యక్కఱ దీర్చుట వారి కర్హ కృత్యంబు దీని కింత వనర నేల యదియునుం గాక పాండవులు జూదంబు నాఁడ నీకు దాసులైరి తదీయంబు లైన మణి కనకాది వస్తువులును భవదధీనంబులై యున్న యవి వారు నిన్నుం గొలిచి యుండుట లేకుండెనేనియు నింతటి కెలసంబు దీర్ప నేనియు వలదే యిది యంతయు నూహించి వలవని వగలం బొగలక లెమ్ము పురంబునకు నడువుము నా మాట వినక నిర్బంధ పరుండ వైతేనియు నిన్నే మన వచ్చు నిందఱము నీ పోయిన గతిన పోవంగల వారము నీవు లోకంబు చేత నగుఁ బాటును బొందెద వింతియ యను కర్ణుండు సెప్పిన విని దుర్యోధనుండు వెండియుం బ్రాయోపవేశంబు నందు నిశ్చయంబు వదల కున్ను గనుంగొని శకుని యిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com