ఆ భా 3 5 391 to 3 5 420

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_5_391 ఉ. ఆయతకుంత కార్ముక గదాసిపరశ్వథ శూలపట్టి సా ద్యాయుధ ఘోరహస్తులు గులాచల తుంగనుల్ ప్రచండ తే జోయుతు లావియచ్చరులు శూరతమై నడతెంచి బల్విడిం గో యని తాఁగి రుగ్ర రణ కోవిదులై కురు రాజు సైన్యమున్.

3_5_392 వ. ఇవ్విధంబున గంధర్వులు బెట్టిదంబుగాఁ గిట్టి నొప్పింపం దొడంగినం గలంగి దుశ్శాసనాది కౌరవులు ససైన్యంబుగాఁ దెరలి దుర్యోధను చేరువకుం బఱచినఁ గర్ణుం డొక్కరుండ సుస్థిరుం డయి నిలిచి గంధర్వుల నిలువరించి భల్లార్ధ చంద్ర ప్రముఖ బహుల బాణ పాతంబులం దదీయ దేహంబులు ఖండించుచు నిమిష మాత్రంబునఁ జిత్రసేను సైనిక శతంబుల రూపుమాపుటయు మఱియుం బైపై గంధర్వులు శత సహస్ర సంఖ్యులు తోఁతెంచినం బృథివి యెల్లను గంధర్వమయం బైనట్లుండె నప్పుడు.

3_5_393 చ. శకునియుఁ దమ్ములుం బ్రబల సైన్యముతో నడతేర నాహవో త్సుకమతి యై సుయోధనుఁడు సూత తనూభవుఁ డున్న చోటికిం బ్రకట భుజోగ్రతం గడఁగి బల్విడిఁ దద్రిపుకోటి దాఁకినన్ సకల జగద్భయంకర సత్సమరోత్సవ మయ్యె నయ్యెడన్.

3_5_394 కొండొక సేపునకు మహో ద్దండ నృపానేక ఘోరతర విశిఖ వ్యా ఖండిత శరీరులై ధృతి ఖండితముగఁ బల్లటిలిరి గంధర్వు లనిన్.

- చిత్రసేనుం డను గంధర్వరాజు దుర్యోధనునితో యుద్ధము సేయుట – సం. 3-230-21

3_5_395 క. గంధర్వులు దెరలుట విని గంధర్వ విభుండు క్రోధ కలుషిత మతియై గంధగజము చందమున మ దాంధ గతిం గవిసెఁ గౌరవానీకము పై.

3_5_396 వ. ఇట్లు గవిసి చిత్రసేనుండు.

3_5_397 శా. మాయా సంగర కోవిదుండు వికసన్మాయాస్త్ర జాలంబులన్ వాయువ్యాప్తి యడంగ నర్క కిరణ వ్రాతంబు రుద్ధతంబుగాఁ జేయం జొచ్చినఁ ద్రెళ్ళెఁ దేరలు కరుల్ శీర్ణంబు లయ్యెన్ దళ త్కాయం బయ్యె హయాలి గూలిరి భటుల్ గౌరవ్య సైన్యంబునన్.

3_5_398 క. పొదలి యొకని కొక్కనికిని బదుగురు పదుగురుగఁ గవిసి పౌరవ సేనం బొదివి సమయింపఁ దొడఁగిరి వదలక గంధర్వు లని నవార్యోద్ధతులై.

3_5_399 వ. అవ్వియచ్చరుల విక్రమంబునకు నోర్వక బెదరి చెదరి కురురాజ సైన్యంబు ధర్మనందనుం డున్న కందువకుఁ బాఱం దొడంగె నప్పుడు రాధేయుం డజేయుండై కుల శైలంబునుం బోలెఁ దలరక నిలిచి గంధర్వులు గురియు శర వర్షంబున మునుఁగుచుఁ దనయోపినంత పెనంగు చుండె సోదర సౌబల సహాయుండై దుర్యోధనుండు గర్ణ సాహాయ్యంబు వదలక నిలిచె నంత ననంత సత్త్వులైన గంధర్వు లనేకులు సుట్టు ముట్టి.

3_5_400 ఉ. కొందఱు సూతు లశ్వములఁ గొందఱు కొందఱు చాపదండ ముం గొందఱు చక్రయుగ్మకముఁ గొందఱు విస్ఫురితా తపత్రముం గొందళు కూబరంబు మఱికొందఱు కేతువుఁ గొంద ఱక్షమున్ దందడిఁ దున్మవైచి విరథత్వ మొనర్చిరి సూత సూతికిన్.

3_5_401 వ. ఇట్లు విరథుం డయు కర్ణుండు వికర్ణు రథం బెక్కి రణభూమికిం దొలంగి చనియె దుర్యోధనుండు విముఖుండు గాక పరబలంబు మార్కొని పెనంగం దొడంగిన గినిసి చిత్రసేనుండు వానిం దలపడి తదీయమ్యందనంబు రాధేయు రథంబు నట్లు భగ్నంబుగాఁ జేయించి విరథుం డగు నమ్మహీ విభుం గేశాకర్షణంబున నేలు బడవైచి పెడకేలుగట్టి సింహనాదంబు సేసినం దక్కిన గంధర్వులుం గనుకనిం బేర్చి యతని వనితా జనంబులను దత్సోదరు లగు దుశ్శాసన దుర్విషహ దుర్ముఖ వివింశతి చిత్రసేన విందానువిందు నలు దత్తనూభవులను దదీయ మంత్రులను బట్టి బంధించి చిత్రసేనున కొప్పించి రంతఁ బెఱ కౌరవులును బౌరులు నమాత్యులుం జెదరి యాక్రోశించుచుం బఱచి ధర్మపుత్త్రు శరణు సొచ్చి యిట్లనిరి.

3_5_402 మ. ఘనబాబా బలదుర్నివార మహిమన్ గంధర్వ వీరుల్ సుయో ధనుఁ దత్కాంతలఁ దత్సహోదరుల బంధప్రాప్తులం జేసి కై కొని వేపోవుచు నున్న వా రదె రిపు క్షెభంబు గావించి నీ యనుజ వ్రాతముఁ గానవే కరుణ నిండారంగ రాజోత్తమా.

3_5_403 వ. అని కృతాంజలులై పలుకుచున్న వారి జూచి భీమసేనుండు ప్రహసితాసనుం డగుచు ధర్మపుత్త్రున కిట్లనియె.

3_5_404 ఆ. మనకుఁ జులక నయ్యె మనచేయు పనియ గం ధర్వ వరులు గూడి తగనొనర్చి రింత లెస్స యగునె యే భారమును లేక యూరకుండ మనల నొందె జయము.

3_5_405 తే. పుట్టుఁ గల్లరియై పాపములకు నెల్ల దిట్టయై లోకముల చేతఁ దిట్టువడిన కట్టిఁడికి నిట్టి కష్టంబుగా నొనర్చి తగ విధాతృఁడు చతురుఁడై నెగడె నేఁడు.

3_5_406 మ. విపరీత స్థితి నొంది ఘోరవిపినోర్వీవాసులై నిత్య దుః ఖ పరాధీనతఁ దూలి రంచు మనలన్ గర్వోద్ధత స్వాంతుఁడై యపలాపింపఁగ వచ్చి దుర్ణయపరుం డా ధార్తరాష్ట్రుండు దో ష పరీతాత్ముఁడు దత్ఫలంబు గుడియెన్ సత్యంబు సామాత్యుఁడై.

3_5_407 వ. వాని దెసం గృపసేయ వల దనిన ననుజునకు నగ్రజుం డిట్లనియె.,

3_5_408 క. అకట యిది పరుష వాక్యము నకు సమయమె శరణు సొచ్చి లఘు భావముతో వికల గతి నున్న కౌరవ నికరమునకుఁ గరుణ సేయ నీకు దగదే.

3_5_409 వ. ఏకాన్వయ జాతులైన వారికి నర్థనిమిత్తంబైన భేదం బొక్కొక్కమాటు ప్రవర్తిల్లు నంతనచేసి సహజ స్నేహంబు దప్ప నేరదు జ్ఞాతిజనంబులు దమలో నెట్టవారైన నొప్పుం గాని యన్యుల వలనం బరిభవంబు దొడరినప్పుడు దా రొండొరులఁ జేకొన కునికి లోక నింద్యంబు దుర్యోధనుండు దుర్వినీతుండైనను సభార్యుం డయు పరులచేత బట్టువడియె దీని నుపేక్షించిన మనకుం గులహాని యగు నదియునుం గాక శరణాగత రక్షణంబు రాజ మాత్రుండగు వాని కెల్ల ధర్మంబు నీ యట్టి బాహబల సంపన్నునకు నిట్టి సుకర్మంబు గర్తవ్యంబని వేఱు చెప్పనేల లెమ్ము నీవును నీ తమ్ములు నిమ్ముల రథంబు లెక్కి సర్వాయుధ సన్నద్ధులై చని సుయోధను చెఱ దలుగుం డనినఁ బవన నందనుండు ధర్మనందనున కిట్లనియె.

3_5_410 సీ. అనుమాన మొక్కింతయును లేక యలిగి జలంబులు ద్రోచె విశంబు పెట్టె గృహదాహ మొనరంచె విహిత దురో దరక పటుఁడై రాజ్యంబు నపహరించె జను లెల్లఁ జూడంగ వనజాక్షిఁ బాంచాలిఁ దలపట్టి యూడ్పంచె వలువ లొలువ బనిచెఁ బుట్టనకొలె మనకు నక్కట సుయోధనుఁ డెగ్గు సేయని దినముఁ గలదె

ఆ. వాని చేఁత లొకటి యేనియుఁ దలఁపవు నీవు మనుజలాథ కేవలంపుఁ గరుణ పూని యుండు దరయ నెప్పుడు నిష్టు లైన మనకుఁ గార్యహాని గాడె

3_5_411 వ. అని పూర్వ వైర స్మరణ కలుషితుం డై పలికిన నతినికి నజాత శత్రుండు సాంత్వన పూర్వకంబుగా నిట్లనియె.

3_5_412 ఆ. కావరయ్య యనినఁ గరము దుర్బలుఁ డైనఁ జెనసి యోపినంత సేయు ననిన నూరకుండు నయ్య యుత్తమ శూరుండు దీన జనుల యున్న తెఱఁగు సూచి.

3_5_413 క. శరణం బని వచ్చిన భీ కర శత్రువు నయిన బ్రీతిఁ గావఁగ వలయుం గరుణాపరుల తెఱం గిది యిరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్.

3_5_414 వ. ధృతరాష్ట్ర సూనుండు భవదీయ బల శౌర్యంబుల పేర్మి యెఱుంగుం గావునఁ దన్ను నవశ్యంబును విడిపింతు రని మన దెస బద్ధాశుండై యుండు నిది మనకుఁ బుణ్యంబును గీర్తియుం జేకొను సమయంబు నిన్నింత నిర్బంధింప వలవ దేన యరుగుదు నిప్పుడు యజ్ఞ దీక్షితుండ నై యున్నవాఁడ గావున నాకుం జనరాదు మీరు వేగచని గంధర్వులం బ్రియపూర్వకంబుగా ననునయించి సుయోధను విడిపించునది సామ వచనంబులం దీరకున్నఁ బరాక్రమంబున నైనం బ్రతివీరుల నోర్చి కార్యబు దీర్చునది నా చేయు జన్నంబు సఫలంబు సేయుం డనిన భీముం డెట్ట కేనియు నియ్యకొనియె నర్జునుండును ధర్మరాజు పనుపు గైకొని కురురాజు చెఱ దలుగఁ బ్రతిజ్ఞ సేసె నకుల సహదేవులు నుత్సాహసమేతు లయి రన్నలువురు నాముక్త కవచులు నాబద్ధ తూణీరులు వాకలిక కార్ముకులు నారూఢ రథులు నయి యగ్రజు వీడ్కొని యతి త్వరితగతి నడచినం గౌరవ సైన్యం బంతయు వారిం గూడుకొని సింహనాదంబులు సెలంగం జనియె నిట్లరిగి వారలు గంధమాదనంబునకయి చనుచన్న యవ్వియచ్చరానీకంబుం గూడ ముట్టిన.

- భీమార్జున నకుల సహదేవులు గంధర్వులతో యుద్ధంబు సేయుట – సం. 3-2330-5

3_5_415 క. కని గంధర్వులు గ్రమ్మఱి ఘనులం బాండవుల నగ్నికల్పులఁ దేజో ధనుల నమరేంద్ర సదృశుల ననఘుల మార్కొనిరి ప్రకటితాటోపమునన్.

3_5_416 ఉ. అగ్రజు వాక్యముల్ దలఁచి యర్జునుఁ డప్పుడు వారితోడ న త్యుగ్రత దక్కి యెంతయుఁ బ్రయోక్తుల నిట్లను మీకు మాయెడన్ విగ్రహ మేల నెయ్యమున విడ్వుఁడు కౌరవ రాజుఁ బార్థివ ప్రాగ్రసరుండు ధర్మసుతు పన్పిది మీకు నలంఘ్య మిత్తఱిన్.

3_5_417 వ. అనిన నతనికి గంధర్వు లిట్లనిరి.

3_5_418 తే. ధర్మజుఁడు మాకుఁ బ్రభుఁడె యా ధర్మతనయు నాజ్ఞ నేమేల యొనరింతు మనిమిషేంద్రుఁ డొక్కరుఁడ మమ్ము శాసింప నొడయఁ డన్యు లెందు నెవ్వరైనను భయ మేమి మాకు.

3_5_419 వ. అనిన విన్వచ్చుం డన్వియచ్చరుల నుపలక్షించి ముసుమున్న తెగునకుం జారనేల యని ప్రియంబును ధర్మంబును గాఁ బలికితి నెట్లును మీరు సామ సాధ్యులరు గాకునికి దోచుచున్న యది గావున నుగ్రంబయిన విగ్రహంబున దుర్యోధను విడిపింతునని వారల మీద నిశితవిశిఖ ప్రకరంబులు ప్రయోగించె నా గంధర్వులు నతనిపైఁ బటు బాణ వర్షంబులు గురిపి రిట్లా నలువురకు ననె గంధర్వ శత సహస్రంబులతే నతి ఘోర సమరం బయ్యె నందు.

3_5_420 తరలము. కదిసి యర్జును తేరు భగ్నముగా నొనర్ప దలంచి పె ల్లొదవి ఖేచరకోటి గ్రమ్ముటయుం బురందర నందనుం డదయుఁడై పదిలక్షలం బ్రళయాగ్ని కల్పుల దివ్యులం గదన శూరుల నిర్దహించెఁ బ్రకాండ దివ్శ శరార్చులన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com