ఆ భా 3 4 061 to 3 4 090

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_4_061 క. దనుజులు మదీయ రథ మా ర్గ నిరోధముగాఁ బ్రచండకాండ ప్రకరం బునఁ గప్పిరి రోదోంతర మని మిషులును ఋషులుఁ జూచి యద్భుతమందన్.

3_4_062 క. కడు భయమున మాతలి చే డ్పడి రథ చోదనమునం దపాటవుఁ డైనన్ వడి నేన రథము గడపుచుఁ దడయక యేసితిఁ గడంగి దానవులపయిన్.

3_4_063 వ. మాతలి నన్నుం జూచి సంతసిల్లెనంత.

3_4_064 చ. అతుల రణాంతరంబున నిరంతర మత్పటు బాణ దారితో చ్ఛ్రితదనుజామగ నిర్గళ దసృగ్జల ధారలు సూడ నొప్పె నా తతగిరి శృంగసంగదళిత ప్రచలజ్జలవాహజాలనం తతగళదంబుధారల విధంబున నంబర మెల్లఁ గప్పుచున్.

3_4_065 వ. అంత నయ్యసురులు మాయా యుద్ధంబు సేయ సమకట్టి నా మీఁద వర్షాస్త్రంబు లేసిన.

3_4_066 క. బలరివుఁడు నాకు నిచ్చిన యలఘునిశాతముఖ శోషణాస్త్రంబు ని ర్గళదవిరళ జలధారా వలి నెల్లను దత్క్షణంబు వట్టఁగఁ జేసెన్.

3_4_067 సీ. అద్దానవులు దారుణాశ్మ వర్షంబులుఁ గురిసిన నవి నన్నుఁ దెరలఁ గప్పె నేనును గులిశాస్త్ర మేసి పాషాణముల్ నుఱుము గావించితి నుఱక వెండి యసురులు నా మీఁద ననలాస్త్ర జాలంబు లేసిన గాడ్పుతో మ్రోసి యగ్ని కణములు నా పయిం గవిసిన నేనును సలలితాస్త్రముల వాని బల మడంచి

ఆ. యున్నఁ దిమిరబాణ ముగ్రంబుగా వార లేసి రంత దిక్కు లెల్లఁ గప్పె నంధకారమగ్నుఁడై చలియించి మా తలి ప్రతోద మెడలి ధరణిఁ బడియె.

3_4_068 క. తురగములు పఱవ నేరక వరవథ వహనంబునందు వంధ్యము లయ్యెన్ సురసారథి ననుఁ గానకు హరినందన యెందుఁ బోయి తనెఁ గడు భీతిన్.

3_4_069 క. ఆమృత నిమిత్తంబున ము న్నమరాసుర యుద్ధ మయ్యె నది యితం భయ భ్రమజనకము గా దిది యు గ్రము దనుజు లవార్య వీర్య గర్వితు లగుటన్.

3_4_070 తే. బ్రహ్మచేత నిర్మింపఁగఁ బడిన భువన సంస్లవం బిది నావుడు సంగరమున సంచలింపక నా భుజ శక్తిఁ జూచు చుండు మనవుడు మాతలి చోద్యమందె.

3_4_071 ఉ. వాసర నాయకుం దలఁచి వజ్రివరంబున సూర్యబాణ మే నేసితి నింద్రుఁ దొట్టి సుర లెంతయు సంతస మందఁగా జగ త్త్రాసి తమిస్రరాశి నిహతంబుగ దిక్కులు ద్రెళ్ళఁగా మహో గ్రాసురు లాహవంబున భయంపడ మాతలి మెచ్చి యార్వఁగన్.

3_4_072 క. గాండీవ ముక్తదారుణ కాండవిఖంఢీకృతాపఘనులై దనుజుల్ భండన ముఖమునఁ జేడ్వడి గొండలు వడినట్టు వడిరి కుతలం బద్రువన్.

3_4_073 వ. ఇట్లు నివాకకవచులు మదీయ దివ్యాస్త్ర నిహతులై మహీతలంబునం బడిన నట యసుర కాంతల యాక్రందన ధ్వను లాకసం బద్రువ నొక్కటఁ బురంబున నెగసె నంత నద్దానవపురంబుఁ బురందరపురంబుకంటె నతి సుందరం బైన దానిం జూచి మాతలి కిట్లంటి.

3_4_074 క. నిరుపమరత్న నిరంతర వరగృహముల నొప్పి సుఖనివాసం బగు ని ప్పురినుండ నొల్ల కొండొక పురి నుండఁగ నేల వలసెఁ బురుహూతునకున్.

3_4_075 వ. అనిన మాతలి యిట్లనియె.

3_4_076 సీ. అసురుల వలన భయంబైన యపుడు వేల్పులకు సేమంబుగా బలవిరోధి యీప్రోలు జలధిలో నిమ్ముగ నిర్మించె దనుజులు పదపడి వనజగర్భు వలనఁ దపోవీర్యవంతులై యిందుండ నమరులచేతఁ గయ్యమున నజితు లైయుండఁ బడసిన నమరేంద్రుఁ డెరిఁగి తద్విజయార్థముగఁ బంచె వజయ నిన్ను.

ఆ. నమరులకు నసాధ్యు లైనట్టి వీరల నీవ యోర్చి తనుచు నెమ్మితోడ నన్ను సంస్తుతించి నరనాధ మాతలి గడఁగి యపుడు రథముఁ గ్రమ్మఱించె.

3_4_077 వ. ఇట్లు నివాతకవచుల జంపి క్రమ్మఱి వచ్చునెడ నా ముందట నొక్క తపోవనంబును నతి విచిత్రంబైన పురంబునుం గని యిది యెవ్వరిపురం బని యడిగిన నాకు మాతలి యిట్లనియె.

3_4_078 క. వినవె పులోమయుఁ గాలక యును ననఁగా నిరువు రసుర యువతులు గమలా సను నారాధించిరి తప మున దివ్యసహస్ర వర్షములు గడు నిష్ఠన్.

3_4_079 క. కనకమయ మైన యీ ప్రో లున దమసుతు లాహవంబులో నమరులచే తను వధ్యులుఁ గాకుండను వనజుచేఁ బడసి రసురవితలు వరముల్.

3_4_080 వ. ఇది హిరణ్యపురం బిందుఁ బౌలోమకాలకేయు ను నసురు లరువది వేలుండుదురు వారమరుల చేత నవధ్యు లనిన నట్లేని దాని పయిం బోదము రథంబు వఱపు మని యేను మాతలిం బంచిన.

3_4_081 చ. ఆతఁడును సప్తమారుత రయంబున దివ్యరథంబుఁ దత్సురా హితపురి భూరి వప్రము పయిం బఱపెన్ సురవైరు లంత ను ద్ధతు లయి ప్రోలు వెల్వడి రథంబులు షష్టిసహస్రకంబుతో శతమఖబుద్ధిఁ జేసి కడు సైఁపక తాఁకిరి నన్ను నల్కతోన్.

3_4_082 వ. ఏనును వారల యఱువదివేల రథంబులకు గతినిరోధంబుగా నితత వృక్ష వికట శిలా ప్రభవంబు లయిన దివ్యబాణంబు లేసిన నసురులు మాయా యుద్ధ నిబద్ధ బుద్ధులై తమ పురంబుతోడన దివంబున కెగసి మదీయ మార్గణార్గళ నిరుద్ధ మార్గులై నేలంబడిన వీరల నొండు విధంబున నోర్వరా దనితలంచి.

3_4_083 చ. ఉగర ఫణాగ్రరత్న కిరణోల్లసదుగ్ర భుజున్ వృషాంకు శం కరు శశిఖండ మండిత శిఖుండు శివున్ హృదయాంబుజంబునం దిరముగ నిల్పి పాశుపత దివ్యశరం బరినోపి యేసితిన్ సురరిపుకోటిమీఁద సురసూతుఁడు మాతలి చూచి మెచ్చఁగన్.

3_4_084 వ. ఆ దివ్యాస్త్ర ప్రభావంబున సింహ శరభ శార్దూల శుండాల మహిష మహోక్ష యక్ష రాక్షస పిశాచ పన్నగ గంధర్వ రుపంబు లుద్భవిల్లి యసురుల నెల్ల విగతాసులం జేసిన.

3_4_085 క. పంచనయను మాయయు మా యించి పరాక్రాంతి నయ్యుమేశాస్త్రమునం గ్రంచఱ నంతకపురికేఁ గించితిఁ బౌలోమ కాలకయాసురులన్.

3_4_086 వ. ఇట్లు హిరణ్యపుర నివాసులం గృతాంత పుర నివాసుతం జేసి వచ్చి వాసవునకు మ్రొక్కిన వాసవుండును నివాత కవచ పౌలోమ కాలకేయ వధ ప్రకారం బంతయు మాతలి వలన విని సంతసిల్లి నా కిట్లనియె.

3_4_087 చ. సురలకుఁ బ్రీతి సేసితి వసుంధరకేఁగుము నిన్ను నీ సహో దరులు నిరంతరంబును ముదంబునఁ జూడఁగఁ గోరుచున్న వా రరిమదభేది నీకు విషమాజిముఖంబుల మార్కొనంగ నో పరు నరు లెవ్వరున్ హరి కిభంబులు మార్కొనునయ్య యెయ్యెడన్.

3_4_088 క. ద్రోణ ద్రోణజ కృప గీ ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ ద్బాణహతిఁ జేసి సమర క్షోణిఁ బరిక్షీణబలు లగుదు రవజితులై.

3_4_089 క. అనిన నమరేంద్రు వీడ్కొని చనుదెంచితి నని కిరీటి శతమఖలోకం బునఁ దనచేసిన విధ మ త్యలఘుం డేర్పడఁగఁ జెప్పె నందఱు వినఁగన్.

3_4_090 వ. ధర్మరాజును దమ్ముఁడు సేసిన మహాపరాక్రమంబునకుఁ జతురంబోధి పర్యంత మహీరాజ్యం బప్పుడు తనకు సంప్రాప్తంబై నంతియ సంతసిల్లి.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com