ఆ భా 3 3 331 to 3 3 360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_3_331 మధ్యాక్కర. నరసురస్తుత్యమై యెంతకాలంబు నా కీర్తి నిలుచు నిరతంబుగా నంత కాలమునా నీవు నిత్యుండ వగుచుఁ బరగు మని వరముఁ దగ దయంజేసి ప్రభుఁ డుర్వియెల్ల సరి పదునొక్కడు వేల యేండ్లేలి చనియెఁ దా దివికి.

3_3_332 వ. అనిన విని భీముండు వాని నప్పుడు హనుమంతుంగా నెఱింగి సంతసిల్లి వెండియు నమస్కరించి భవద్దర్శనంబునం గృతార్థుండ నయితి నని యిట్లనియె.

3_3_333 ఆ. బలిముఖుండు దయయుఁ గలవేని దొల్లి య ర్ణవము గడచి చనిన నాఁటి నీదు రూపుఁ జూడవలతుఁ జూపు నా కనవుడు వాని కిట్టు లనియె వానరుండు.

3_3_334 క. అక్కాలంబున రూపం బిక్కాలంబునందుఁ జూప నెట్లగుఁ గాలం బొక్క విధంబున నుండక పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థన్.

3_3_335 వ. దానంజేసి కృత త్రేతాద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేఱు వేఱయై యందుల చరాచర భుతంబులు భిన్న ప్రకారంబులై వర్తిల్లు ననిన నయ్యై యుగంబుల యాచార ప్రవర్తనంబులు నాకేర్పడం జెప్పు మనిన భీమునకు హనుమంతుం డిట్లనియె.

- భీమునకు హనుమంతుఁడు చతుర్యుగాచార వర్తనంబులను దెలుపుట - సంత 3-148-10


3_3_336 తే. కృతమకానికర్తవ్యంబు గృతయుగంబు నందు లేది చతుష్పాద మగుచు ధర్మ మనఘ వర్తిల్లు నచ్యుతుం డయ్యుగమున శుక్లవర్ణుఁడై ప్రజలఁ గాచుచు వెలుంగు.

3_3_337 వ. అది సనాతన ధర్మసరాథం బందుల బ్రహ్మ క్షత్త్రియ వైశ్య శూద్రులేక వేద క్రియా యోగ్యులై యకామ ఫలసంయోగంబునఁ బుణ్యలోకంబులు వడయుదు రందు నసూయాభిచార దర్ప పైశున విగ్రహ క్రోధ మద మత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియ క్షయంబులు లేవు మఱియుఁ ద్రేతాయుగంబునందుఁ ద్రిపాదం బై ధర్మువు వర్తిల్లు నందు జనులు నిత్యసత్య వ్రతశీలురై యజ్ఞ తపోదానాది క్రియల వర్తింతు రందు రక్తవర్ణుం డయి విష్ణు భట్టారకుండు ప్రజా రక్షణంబుఁ జేయి.

3_3_338 తే. ద్వాపరంబున రెండు పాదములఁ జేసి నడచు ధర్మువు వేదముల్ నాల్గు దెఱఁగు లై ప్రవర్తిల్లు వేద శాస్త్రార్థచోతి తంబు లై ధర్మకామముల్ ధరణిఁ బరగు.

3_3_339 తే. సత్య శమ హీను లగుదురు జనులు గామ కాములై చేయుదురు బహుక్రతువు లోలి నందుఁ ద్రైలోక్యవందితుం డచ్యుతుండు కృష్టవర్ణుఁడై జగము రక్షించు మఱియు.

3_3_340 క. కలియుగమునందు ధర్మము బల మఱి వర్తిల్లు నేక పాదంబున నం దలఘూఁడు కృష్ణుఁడు జగతీ వలయము రక్షించుఁ బీతవర్ణుం డగుచున్.

3_3_341 వ. అందలజనులు తమోగుణయుక్తులై కామక్రోధాధి దోషవశంబునం దమ్మెఱుంగక యధర్మవర్తు లగుదు రందుఁ జేసిన తపో దానాది కర్మంబులు స్వల్పంబులయ్యును బహఫలంబు లగు నని యుగవర్తన ప్రకారంబులఁ జెప్పి నీకిష్టావాప్తి యయ్యెడు నరుగు మనిన భీముం డిట్లనియె.

- హనుమంతుఁడు భీమునకుఁ దన పూర్వరూపంబుఁ జూపుట - సం. 3-149-1

3_3_342 క. నీనాఁటి తనువుఁ జూచియ కాని యవశ్యంబు పోవఁ గావునఁ గపినా థా నాకుఁ జూపు మనవుడు వానికిఁ దన రూపుఁ జూపె వానరుఁ డంతన్.

3_3_343 చ. అతులితమై ద్వితీయకలకాద్రియొకో యిది నా నిజాంగ మూ ర్జితముగఁ బెంచి పుచ్ఛమునఁ జేసి దిగంతము లందుచున్న యు న్నతుఁ గపినాథుఁ జూచి కురునందనుఁ డప్డు నిమీలితాక్షుఁడై మతి నతి విస్మితుం డగుచు మారుతి కిట్లనియెన్ భయంబునన్.

3_3_344 క. అతి భీషణ మిది యత్య ద్భుత మోహో చాలు భూనభోమధ్యవ్యా పిత మయ్యె భవద్ధేహా యతత్వ ముపసంహరింపు మనవుడుఁ గపియున్.

3_3_345 క. తన యెప్పటి రూపముఁ జే కొని దీనికి నినుమడుం గగుం బ్రతిబలముం గని నప్పుడు నా రూపం బనుపముగ ననిన హనుమ కనిలజుఁ డనియెన్.

3_3_346 ఉ. ఉన్నతిఁ బూని నీవు బలియుం డగు రావణు నశ్రమంబునం బన్నుగఁ జంపనోపు పటుబాహు బలాఢ్యుఁడ విట్టి యున్నతున్ నిన్ను సహాయుఁగాఁ బడసి నిర్మల నీతిపరుండు రాఘవుం డన్నరభాజనా న్వయుల నాజి వధించుట యేమి చోద్యమే.

3_3_347 వ. అనిన వాని కతి ప్రీతిమంతుండై హనుమంతుం డిట్లనియె నయ్యా నీవు సౌగంధిక సరోవరంబునకుం బోయెద వే నందు సాహసంబు సేయ వలవదది యక్ష రాక్షస రక్షితంబై దేవతోప భోగ యోగ్యంబై యుండు దేవతలు బలిహోమ నమస్కారంబులఁ జేసి భక్తిసాధ్యులు గాని సాహసక్రియా సాధ్యులు గారు నీవు నిజధర్మ నిష్ఠితుండవై పరమధర్మంబు లెఱుంగునది యెందేని హీనబుద్ధులు విమోహింతు రట్టి ధర్మాధర్మ విభాగంబు లెఱుంగు విద్వాంసుల నుపాసించి శుభాచారుండవు గావలయు నాచరంబున ధర్మంబు వుట్టు ధర్మంబువలన వేద ప్రతిష్ట యగు వేదంబులజేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు నట్టి యజ్ఞంబు వలన దేవతలు తృప్తులగుదురు.

3_3_348 ఆ. కార్యసిద్ధి పొంటె కాలంబు దేశంబు నెఱిఁగి బుద్ధిమంతు లెల్ల ప్రొద్దు సాహసంబు విడిచి సామాద్యుపాయ ప్ర యుక్తి చేయుదురు యథోచితముగ.

3_3_349 వ. మఱియు సర్వకార్యంబులు మంత్రమూలంబులు గావున విద్వాంసులై ప్రబుద్ధు లైన వారలతో మంత్రంబుఁ జేయునది బాలకులయు నధిక శ్రీదర్పితులయు లుబ్ధులయు లఘుజనంబులయుఁదోడ మంత్రంబు సేయవలదు.

3_3_350 తే. జనులు నిగ్రహానుగ్రహ శక్తుఁడైన రాజు శాసనమునఁ జేసి రమణతోడ నోలిఁ దమతమ మర్యాద లొక్కనాఁడు దప్పినోడుదు రిమ్మహీ తలమునందు.

3_3_351 వ. నీవు నిగ్రహానుగ్రహ సమర్థుండవు గావున నీ కెల్లవారును వశ్యు లగుదురు నిన్నుఁ జూచుటంజేసి నానయనంబు సఫలం బయ్యె నీకెద్ది యిష్టంబు దానిం జేసెద.

3_3_352 మత్తకోకిలము. మీకు నెగ్గొనరించి యున్న యమిత్రులనా హతబుద్ధులం జీకురాజు తనూజులం గురుసింహ నీకుఁ బ్రియంబుగా నేకమాత్రన పోరిలో వధియించి నాగపురంబు నా నాకులా ద్రి శిలావలీ గహనంబు సేయుదు నావుడున్.

3_3_353 మత్తకోకిలము. ఇంతయుం గపినాథ నీ కిది యేమి పెద్ద మహాహవా భ్యంతరంబున నుద్ధత ప్రతిపక్ష వీరుల నేమ ని ర్జింతు మెవ్వరు మాకు మీ దయఁ జేసి మార్కొనునంత య త్యంతవీరులు లేరు భూవిదిత ప్రతాప బలోన్నతిన్.

3_3_354 వ. అనిన విని భీమసేనునకు హనుమంతుం డిట్లనియె నన్ను రణాంతరంబునం దలంచునది నీ యందు సౌహృదంబున నాహవంబులో నతిరథుం డైన యర్జును రథధ్వజంబునం దుండి మీ బలపరాక్రమంబులం జూతు నని భీముం గౌఁగిలించుకొని వానికి సౌగంధిక సరోవర మార్గంబుఁ జూపి హనుమంతుం డంతర్హితుం డైనఁ దదాలింగన విగత శ్రముండును విపుల జవశక్తియుక్తుండును నై భీమసేనుండు.

3_3_355 సీ. వారిధారల ననివారిత నిర్గళ ద్దాన ధారలఁ దటిద్ధామములను దశనధామంబుల నశనిఘోషంబుల ఘోరబృంహిత బృహద్ఘోషణముల నివి ఘనబృందంబు లివి గజయూధంబు లని విచారింపంగ నక్కజంబు లై లలితోత్తుంగ శైల శృంగంబులఁ ద్రిమ్మరు జలధర ద్విరదతతుల

ఆ. విస్మయంబుతోడ వీక్షించుచుం జని రజతగిరి సమీప రమ్యభూమి నక్కుబేరు వనమునందు సౌగంధిక కమలవనముఁ గనియె ఘనభుజుండు.

3_3_356 క. అందుల హేమాంబుజమక రందరసామోద మృదుతర శ్వసనుం డా నందంబుఁ జేసెఁ దనప్రియ నందనునకు భీమసేనునకు నభిముఖుఁడై.

3_3_357 వ. అంత.

3_3_358 క. వీరుండై సౌగంధిక వారిజములు గొనఁగ నిట్లు వచ్చినవానిన్ భూరి పరాక్రము భీము ను దారగదాహస్తుఁ జూచి తా రుద్ధతులై.

3_3_359 వ. దాని రక్షించియున్న పదివేవురు రాక్షసు లాక్షణంబ విచిత్రాయుధ పరిచ్ఛదులై పఱతెంచి వీఁ డొక్క దివ్యపురుషుం డాయుధంబులు ధరియించి నవాఁ డజినంబులు గట్టినవాఁ డధిక తేజస్వి తపస్వి వేషధరుం డిందులకు వచ్చినవాఁ డని యచ్చెరు వందుచు భీమసేనుం డాయవచ్చి యి ట్లనిరి.

3_3_360 తరలము. ఇది కుబేరువనంబు దీనికి నెవ్వరుం జనుదేర నో డుదురు నీవిట వచ్చి యెల కడుం బ్రమాదముఁ జేసి తిం దుదిత తేజుఁడు గ్రీడ లాడుచు నుండు నింతులుఁ దాను స మ్మదముతోడఁ గుబేరుఁ డీరుచిమత్సరోజ వనంబునన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com