ఆ భా 3 3 121 to 3 3 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3_3_121 క. దక్షుఁడయి యజ్ఞదక్షిణ దక్షిణ భూభాగమెల్లఁ దా నిచ్చె నశే షక్షితిధరవనములతో నక్షయమతిఁ గశ్యపునకు నార్త్విజమునన్.

3_3_122 వ. దాని కలిగి భూదేని గశ్యపునకుం బట్టీక రసాతలంబునకుం బోయినఁ దత్ప్రసాదార్థియై కశ్యపు డుగ్రతపంబు సేసినం బ్రసన్నయై భూదేవి నీరిలోనుండి వెలువడి వేదిరూపంబునం గశ్యపునకు నిజరూపంబు సూపె నవ్వేది యిదిసమ్ము దీనినెక్కినవారు వీర్యవంతు లగుదు రీ మంత్రంబున దీని నెక్కుండు పెఱనాఁ డిది దావీక సముద్రంబు సొచ్చనని యగ్నిర్మిత్రోయోని యనునివి యాదిగాఁ గల మంత్రంబు లుపదేశించిన.

3_3_123 క. అనుజులుఁ దానును ముని శా సనమున నవ్వేది యెక్కి సమధిక వీర్యం బున నొప్పె బ్రాహ్మణుల దీవన లెసఁగఁగ ధర్మసుతుఁజు వాసవలీలన్.

3_3_124 క. ధరణీసురవు మునిగణ పరివృతులై యరిగి కనిరి పాండవులు వియ చ్చర నిర్జర సేవిత సుం దర కందర మగు మహేంద్ర ధరణీ ధరమున్.

3_3_125 వ. అందుల మహాతపోధనులకు నమస్కార సత్కారంబుల మనఃప్రియంబుసేసి ధర్మరా జిట్లనియె.

3_3_126 తే. పరమ మునులార యిగ్గిరిఁ బరశురాము శుభ చరిత్రుని మీరెప్డు సూతు రట్టె యమ్మహాభాగు మీ చూచునవసరంబు నందు మాకును జూడంగ నమరునొక్కొ.

3_3_127 వ. ఆనిన నమ్మునిసంఘంబులోన రామానుచరుం డయిన యకృత వ్రణుండను ముని ధర్మరాజున కిట్లనియె.

3_3_128 తే. ధర్మతనయ మీరాక ముందఱ యెఱుంగు జామదగ్న్యుండు నిర్మలజ్ఞాన దృష్టి ననఘ యెల్లి చతుర్దశి నమ్మహాత్ముఁ జూతు రిమ్మును లీవును జూడు మిచట.

3_3_129 వ. అనిన ధర్మతనయుండు మహేంద్రంబున నా రాత్రి వసియించి యకృతవ్రణు నిట్లని యడిగె.

3_3_130 క. భువన జన స్తుతుఁడగు భా ర్గవు చరితము వినఁగ నాకుఁ గడుఁ గౌతుక గౌ రవమైనది దాని ముని ప్రవర యెఱింగింపు కర్ణ పథ రమ్యముగన్.

- అకృతవ్రణుఁడు ధర్మరాజునకుఁ బరశురాముని మహిమ సెప్పుట - సం. 3-115-9

3_3_131 వ. అని యడిగిన ధర్మరాజునకు నకృతవ్రణు డిట్లని చెప్పెఁ దొల్లి కన్యాకుబ్జంబున గాధియను రాజు కూఁతు సత్యవతి యను దాని భృగుపుత్త్రుండగు ఋచీకుం డను మహాముని వివాహార్థియై గాధి నడిగిన నమ్ముని వరునకు వాఁ డిట్లనియె.

3_3_132 సీ. ఒక్క కర్ణంబు నీలోత్చలశ్యామమై తనువెల్ల శశిహంసధవళమైన యిట్టి గుఱ్ఱములు వేయిక్కన్య కుంకు వి ట్లీనోపుదైని మునీంద్ర దీని నమరంగఁ బెండిలియగు మిది మా కులధర్మంబు నావుడుఁ దరుణిఁ బెండ్లి యగువేడ్క భర్గవుఁ డప్పుడ వరుణేంద్రుపాలికిఁ జని వానిఁ బడసి తెచ్చె

ఆ. నవని నాథ గంగయందుఁ గన్యాకుబ్జ పురవరంబు నందుఁ బుట్టె నట్టి హయసహస్ర మమలమై నాఁటఁగోలెను నశ్వతీర్థమనఁగ నయ్యె నదియు.

3_3_133 వ. ఋచీకుండును గాధికి నిచ్ఛాసమంబులైన హయంబుల నిచ్చి వానికూఁతు సత్యవతిం బాణిగ్రహణవిధిం బరిగ్రహించి సుఖంబున్నఁ గన్యాకుబ్జంబునకు భృగుండు వచ్చి వారలచేతం బూజితుండై కొడుకునుం గోడలిం జూచి సంతసిల్లి యొక్కనాఁడు కోడలి కిట్లనియె.

3_3_134 క. లలితాంగి యేను నీ గుణ ముల కతి హృష్టుండ నైతి ముద మొనరఁగ ని మ్ముల నిచ్చెద వేడుము నీ వలచువరం బనిన సత్యవతి యిట్లనియెన్.

3_3_135 వ. దేవా నా ప్రసాదంబున నాకొక్క కొడుకును మజ్జనని కొక్క కొడుకు మదయింప వలయునని మ్రొక్కినం గరుణించి భృగుండు నీ కోరినయట్ల యగు శుచిస్నాతయలి నీవు మేడి మ్రానిం గౌఁగిలింపుము నీ జనని నశ్వత్థంబుఁ గౌఁగిలింపు మనిన నయ్యిద్దఱుఁ దదాలింగన విపర్యాసంబు సేసిన నెఱింగి భృగుండు గోడలి కిట్లనియె.

3_3_136 ఉ. పుత్త్రుడు నీకు బ్రహ్మకుల పూజ్యుఁజు పుట్టియు వాఁజు దారుణ క్షత్త్ర చరిత్రుఁడై పరగు గర్వమునన్ మఱి నీ సవిత్రికిన్ క్షత్త్రియుఁ డుద్భవిల్లి యు నఘక్షయ కారణుఁడున్ మహా తపః పాత్త్రుఁడునై ధృతింత బడయు బ్రాహ్మణ భావము భూరితేజమున్.

3_3_137 వ. అనిన సత్యవతి గృతాంజలియై క్షత్రియభారంబు దనపుత్త్రునకుం గాక పౌత్రున కగునట్లుగా శ్వశురువలన వరంబు వడసి కతిపచ కాలంబునకు గర్భిణియై.

3_3_138 క. ఆదిముని చరితుఁ బడసె బ్ర సాదసమన్వితు సుపుత్త్రు జమదగ్నిఁ జతు ర్వేదంబులయందు ధను ర్వేదమునందును నతి ప్రవీణు మహాత్మున్.

3_3_139 వ. జమదగ్ని ప్రసేన జితుం డను రాజ కూఁతు రేణుక యనుదాని వివాహంబయు దానియందు రమణ్వ త్సుషేణ వసు విశ్వావసు రాము లను వారి నైదుగురు గొడుకులం బడసి వనంబున నుగ్రతపంబు సేయుచు నొక్కనాఁడు వన్యఫలంబులు దేరంగొడుకులు వోయిన రేణుక వారిపిఱుందన పోయి యొక్క సరోవరంబునందు సభార్యుండయి జలక్రీడ లాడుచున్న వాని మార్తికావతపతి యగు చిత్రరథుం డను రాజుం జూచి కామమోహితయై వ్యభిచరించిన దాని దుశ్చరితం బెఱింగి జమదగ్ని కోపోన్మాద పరవశుండై.

3_3_140 క. తనయుల నలువురఁ గ్రమమున బనిచెన్ జమదగ్ని దనదు భార్య వధింపన్ జననీ ఘాతము పాతక మని వారలు పలుకకుండి రవ్యవసితులై.

3_3_141 క. కడు నలిగి యమ్మునీంద్రుఁడు గొడుకులకును శాపమిచ్చె ఘోరాటవిలో జడమతి మృగపక్షులయ ట్లుడుకు యజ్ఞానవృత్తి నుండుం డనుచున్.

3_3_142 వ. మఱియు నిశిత పరశుహస్తు రాము జూచి దీని వధియింపు మని జమదగ్ని పంచిన వాఁడు గురువచనంబునం దల్లిం దత్క్షణంబున వధియించిన.

3_3_143 క. శమిత నిజ క్రోధుండై జమదగ్ని తనూజు సాహసమునకుఁ దనవా క్యము లంఘింపమికిఁ బ్రస న్న మనస్కుండై తనూజునకు నిట్లనియెన్.

3_3_144 వ. నా వచనంబున నతి దుష్కరంబైన కార్యంబు సేసితి నీకిష్టంబైన వాని నెల్లను వేఁడు మిచ్చెద ననిన రాముండు సంతుష్ట హృదయుండై మదీయ జనని జీవించి యుండను దద్వధదోష నిష్కృతియు సహోదరులు శాప విముక్తులయి యెప్పటియట్ల యుండను సమరంబుల నాక ప్రతిహత శక్తియు దీర్ఘాయువుంగాఁ బ్రసాదింపుడని తండ్రివలనం దనయభిమతంబులు వడసి యుండునంతఁ గొండొక కాలంబున.

3_3_145 చ. అమిత బలుండు హైహయుఁ డహర్పతి తేజుఁ డజేయబాహు వి క్రముఁడు సహస్రబాహుఁ డనఁగా విదితుం డగువాఁడు తద్వనాం తమున మృగవ్యఖిన్నుఁడయి తా జమదగ్ని మహామునీంద్రు నా శ్రమమున కేఁగుదెంచె బహుసైన్యముతో నధిక శ్రమార్తుఁడై.

3_3_146 వ. అందు మునివరు చేతం బూజితుండయ్యును వాఁడు దనరాజ్య మదంబున మెచ్చక యయ్యాశ్రమ వాసుల కవమానంబు సేసి యందుల వృక్షంబులెల్ల విఱిచి జమదగ్ని హోమధేనువును దరుణ వత్సంబుతోఁ గట్టికొని పోయిన నప్పుడవ్వనంబున నుండి సమిత్కుశ ఫలంబులు గొని వచ్చిన రామునకు జమదగ్ని యిట్లనియె.

3_3_147 క. వినవయ్య కార్తవీర్యుఁడు మన ధేనువుఁ బట్టుకొని సమర్థుండయి పె ల్చన పోయె నేమి సేయుద మనవుడు రాముండు విని మహా క్రోధమునన్.

3_3_148 క. గురువచన బోధితుండై సరభస గతి వాని పిఱుఁదఁ జని తద్బలమున్ శరవృష్టిముంచి చంపె న పరిమిత లయకాల మేఘ పటలమ పోలెన్.

3_3_149 వ. మఱియును.

- పరశురాముఁడు కార్తవీర్యునిఁ జంపుట - సం. 3-116-24

3_3_150 చ. బలిమి నశేషలోక పరిభావి మహాద్భుత శౌర్యసంపదం బొలుచు సహస్రబాహకరముల్ గునిశాతిని శాత బాణధా రల నతివీరుఁడై తునిమి రాముఁ డరాతులకున్ భయంబుగాఁ గలహములోన వాని నతి గర్వితుఁజంపె బరాక్రమోన్నతిన్.