ఆ భా 3 3 031 to 3 3 060
వోలం సురేష్ కుమార్
3_3_031 క. నా మగడివచ్చునంతకు భూమీధర యీ ప్రకారమున నుండుము నా తో మైత్రిఁ జేయుమని లో పాముద్రాధీశ్వరుండు పలికి ముదమునన్.
3_3_032 వ. దాని నొడంబఱిచి దక్షిణ దిశకుం జని లోకంబులకు హితంబుగా నందయుండె విధ్యంబు నగస్త్యుండు మగుడి వచ్చునంతకుఁ బెరుఁగ నోడియున్నదని యగస్త్యు మహాత్మ్యంబు ధర్మజునకుం జెప్పి వెండియు రోమశుం డిట్లనియె.
3_3_033 ఆ. అమరులెల్లం దన్ను నట్లు కీర్తించుచు నున్నఁ జూచి ముని గణోత్తముండు వారి నడిగె నేమి వచ్చితి రెఱింగింపుఁ డని దయాళుఁడై ప్రియంబుతోడ.
3_3_034 వ. అనిన.
3_3_035 చ. అమరులు గలకేయకృత మైన జగద్భయ మెల్లఁ జెప్పి యు త్తమ ముని నాథ తత్ప్రతివిధానము సేసి జగంబు గావఁ జి త్తము గలదేని విభ్రమమదభ్రతరంగ మహార్ణవంబుఁ బా నము దగఁ జేసి చేయుము ఘనంబుగ మాకు మనః ప్రమోదమున్.
3_3_036 క. ఆతోయధి నీ చేతం బీతం బగుడుం గడంగి భూమాసురసం ఘాతంబు దత్క్షణంబ ని పాతింతుము దివ్యశస్త్రపటుఘాతములన్.
- అగస్త్యుండు సముద్రోదకంబు పానంబు సేయుట - సం. 3-103-1
3_3_037 వ. అనిన నగస్త్యుం డట్ల చేయుదు నని యమరవరుల కెల్ల సంతోషంబుగా నప్పుడు.
3_3_038 సీ. రంగదుత్తుంగతరంగ హస్తంబుల నాడెడు నదివోలె నతుల వేగ వాతావధూతమై వఱలెడు నదివోలెఁ బర్వతకందరోపాంతతతులఁ దొడరెడు నది వోలె ధ్రువఫేనవితతుల నగియెడు నదివోలె నాగనక్ర మకురుల క్షుభ్యమాణమై తద్బాధ కోపనియదివోలె నుచ్చభీమ
అ. నినద మగుచు నున్న నీరధియొద్దకు నమరగణముతో మహామునీంద్ర గరుడ ఖచర సిద్ధ గంధర్వ పన్నగ యక్ష గణముతోడ నరుగుదెంచి.
3_3_039 ఉ. అందఱుఁ జూచుచుండఁగ మహాబ్ధి జలంబులఁ ద్రావె విష్ట పా నందరకుం డగస్త్యుఁడఘనాశనుఁ డట్లు పయోధి రిక్తమై నం దిమి కూర్మ కర్కటక నక్ర భుజంగ చయంబుతో భయం బందుచుఁ గాలకేయులు బయల్పడి తోఁచిరి దానిలోపలన్.
3_3_040 వ. అంత.
3_3_041 క. గీర్వాణ ప్రభుఁ డాదిగ గీర్వాణగణంబు గాలకేయులతోడన్ గర్వించి రణము సేసి ర ఖర్వ పరాక్రములు గడిమిఁ గడు నుద్ధతులై.
3_3_042 క. అనిమిష దివ్యాయుధ హతి నని గొందఱు వడిరి గొందఱధిక విభీతిం జని పాతాళముఁ జొచ్చిరి దనుజులు దైత్యులును వీర్యదర్పచ్యుతులై.
3_3_043 వ. ఇట్లు కాలకేయులం దొట్టి యసురుల నెల్ల నిశ్శేషంబుఁ జేసి జగంబుల యుపద్రవం బుడిపిన దేవత లగస్త్యునిం గీర్తించి యిట్లనిరి.
3_3_044 క. మునినాథ నీ యనుగ్రహ మున నుడిగెను బాధ నిఖిల భువనంబుల కి వ్వవధిఁ బయఃపూర్ణముఁగా నొనరింపుము నీవకాని యొరులోప రిలన్.
3_3_045 వ. ఇది యనేక సత్త్వాశ్రయంబు గావున రిక్తంబై యుండఁ దగ దనిన నగస్త్యుం డిట్లనియె.
3_3_046 సీ. మున్న జీర్ణం బయ్యె మున్నీటి నీరు నా కడుపున నేనింకఁ బడయనేర జలరాశి నిండంగ జలమొండు నావుడు నమరులు మునులును గమలగర్భుఁ గానంగఁ జని జని దేవ మీనారకం బేమి తెఱఁగున నిండు మా కెఱుఁగఁ జెపుమ యని విన్నపంబు సేసినఁ బెద్దప్రొద్దు చింతించి వారలకు విరించి యనియె.
ఆ. వనధిఁ బెద్దకాలమున భగీరథుఁడను వాఁడునించుఁగాని వసుధనొరులు పూని దీని నింపఁగా నోప రనవుడు నమర వరులు మునులు నరిగి రనిన.
3_3_047 క. వనరాశి యేమి కారణ మున నెట్లు భగీరథుండు భూరిజలౌఘం బున నించె దీనిఁ జెప్పుమ యని యడిగిన ధర్మజునకు నమ్ముని సెప్పెన్.
- భగీరథుండు జలముచే సముద్రము నించుట - సం. 3-104-6
3_3_048 వ. తొల్లి యిక్ష్వాకు వంశంబున సగరుండను రాజు హైహయుల నిర్జించి నిఖిల మహీరాజ్యంబు సేయుచు నపుత్త్రకుండై వైదర్భియు శైబ్యయు నను నిద్దఱు భార్యలతోడం గైలాసంబున కరిగి యందు.
3_3_049 క. దక్షమఖక్షయకరు నిట లాక్షజహూతభక్ష్యభక్షితానంగు విరూ పాక్షు మహోక్షధ్వజూఁ బ్ర త్యక్షము గావించె నుగ్రతపమున పేర్మిన్.
3_3_050 తే. హరుఁడు వానికిఁ బ్రత్యక్షమయి వరంబు వేఁడు మనవుడుఁ ద్రైలోక్య విభుఁడ నాకు దయ యొనర్పుము సంతానదానమనుచు వేఁడెఁ బుత్త్రార్థియై కడు వేడ్కతోడ.
3_3_051 వ. ఈశ్వరుండు వానికి వైదర్భియం దఱువది వేవురు గొడుకులును శైబ్యయం దొక్క కొడుకుం గా వరం బిచ్చి యయ్యఱువది వేవురు నతి దర్పితులై యేక కాలంబునఁ గాలగోచరు లగుదు రనియు నయ్యొక్క కొడుకు వంశ కర్త యగు ననియుం జెప్పి యదృశ్యుం డైన.
3_3_052 క. కొడుకులఁ బలువురఁ బడసియుఁ బడయని యట్టిదయి ధర్మపత్నులుఁ దానుం గడు సంతసపడ కరిగెను దడయక సగరుండు మగుడి తనపురమునకున్.
3_3_053 వ. అంతఁ గొంత కాలంబునకు నయ్యిద్దఱు గర్భిణులై నందు వైదర్భికి నొక్క యాలాబూ ఫలంబును శైబ్యకు నసమంజసుం డను కొడుకునుం బుట్టిన.
3_3_054 ఆ. వరదుఁడైన యీశు వరమున నిదియొక్క వదరు పుట్టె నెట్టి వరమొ యనుచు దానిఁ బాఱవైవఁ దారున్న నాకాశ వాణి యిట్టులనియె వసుమతీశ.
3_3_055 తే. సాహసం బిట్టు సేయంగ జనునె దీని బీజములు ఘృతఘటములఁ బెట్టి రక్ష సేయు మఱువది వేవు రూర్జితులు సుతు లు మేశు వరమునఁ బుట్టుదురిందు నీకు.
3_3_056 వ. అనినం దద్వచనానురూపంబు సేసి రక్షించుచున్న రెన్నెలలకు.
3_3_057 క. సుతషష్టి సహస్రకము ద్గతమై వర్ధిల్లి గగనగతిఁ బఱచి శత క్రతులోకముఁ దొట్టి మదో ద్ధతిఁ జేసె సమస్తలోక తతులకు బాధల్.
3_3_058 క. సగరసుతు లట్లు జగముల కొగి బాధలు సేయుచున్న నోడి మరుత్ప న్నగవరు లరిగిరి నాలుగు మొగములు గల వేల్పు కడకు ముని సంఘముతోన్.
3_3_059 ఆ. వారియాననుండు వారల వచ్చిన విధమెఱింగి మీకు వెఱవనేల సగరసుతులు దగ్ధులగుదురు దర్పితు లైన వారి పేర్మ యధ్రువంబు.
3_3_060 వ. అని కమలసంభవుం డానతిచ్చిన నరిగి యమరవరు లాదిగా నఖిల లోక నివాసులెల్ల సగరసుత పరిక్షయం బపేక్షించి యుండు నంత.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com