ఆ భా 3 2 081 to 3 2 110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


వ. అంత దమయంతి మేలు కని పతిం గానక తన వస్త్రార్ధని కృంతనంబును జూచి లేచి నలుగడం బరికించి భయశోకవ్యాకులచిత్త యయి. 081

సీ. హా మహారాజ మహా మహీరక్షణ దక్ష దక్షిణ బాహుదండదండి తారాతి నిషధరాజాగ్రణి న న్నిట్లు వీతదయుండవై విడిచి చనఁగఁ దగునె నీ వెన్నఁడు ధర్మువు దప్పనివాఁడవు సూనృతవ్రతర తుండ వోడకు మని నన్ను నూఱడఁ బలికిన పలు కిట్లు మఱవంగఁ బాడి యగునె.

ఆ. పొదలలోన డాఁగి పొడసూప కి ట్లేల యున్నవాఁడ విట్టి యుగ్రభావ మేల నీకు వలసె నెట వోదు నిం కెట్లు గాంతు నిన్ను నుగ్రకాననమున. 082

క. వగవఁగ సాంగోపాంగము లగు నాలుగు వేదములయు వధ్యయనము పొ ల్పుగ నొకసత్యముతో నెన యగునే యెవ్వియును బోలవయె సత్యంబున్. 083

వ. ప్రాణ సమానవయున నిన్ను వశ్యంబును విడువ నని పలికితి సత్యప్రతిపాలనంబు సేయు మని ప్రలాపించుచుం దనయ్యేకాకిత్వంబునకు నబలాభావంబునకుఁ బ్రతిపదన్యాస జాయమాన కంటకమృగ పన్నగ భయంబునకు వగవక నిజనాథు నసహాయత్వంబునకు దుస్సహక్షుత్పిపాసాశ్రమాకులత్వంబునకు వగచుచు. 084

క. అలయుచుఁ బులుఁగులు యెలుఁగుల కులుకుచు నుగ్రాతపమున కోపక వృక్షం బునీడల నిలుచుచు నెలుఁ గులఁ బులులం జూచి భయముగొని వగ వగచున్. 085

క. ఏచిన పొదలఁ బొరల్పడఁ ద్రోచుచు ముండ్లకు నల్లఁ దొలఁగుచు దిక్కుల్ సూచుచుఁ దొడరుచుఁ ద్రెళ్లుచు లేచుచు లలితాంగి సంచలించుచు నరిగెన్. 086

వ. ఇట్లరుగుచున్న దమయంతి నంతికన్యస్తచరణ యైనదాని నాహారార్థియయు యొక్కయజగరంబు వట్టికొనిన నక్కోమలి మెదల నేరక. 087

ఆ. ఇంక నైన నన్ను నేల యాలింపవు నాకు శరణ మగుము నాథ యనుచు నఱచుచున్న దాని యాక్రందన ధ్వని వినుచు నొక్క యెఱుకు వేగ వచ్చి. 088

వ. తన పట్టిన సురియ న ప్పెనుఁ బాము వదనంబు వ్రయ్యం దఱిగిన రాహు ముఖవిముక్తయైన చంద్రరేఖయుబోలె నజగరముఖంబువలన వెలువడిన యా దమయంతి నాశ్వాసించి తత్సమీప సరోవర స్నాతను వన్యస్వాదుఫలాహార నుంగాఁ జేసి విగతశ్రమం గావించి నీవెవ్వరిదాన విట్లేల యేకతంబ యివ్వనంబునకు వచ్చి తనియడిగి మధురభాషిణి యైనయమ్మగువ వలన నంత వృత్తాంతంబు నెఱింగి. 089

కవిరాజవిరాజితము.

రజనికరాననఁ బీనపయోధర రజితరాజగుతన్ విలస ద్గజ పతిగామినిఁ జందమగంధిఁ బ్రకాశిత కాంతి సమన్వితఁ బం కజదళలోచనఁ జూచి కిరాతుఁడు కామనిశాతశరాహతుఁ డై నిజహృదయం బెఱిగించె లతాంగి కనింద్యచరిత్రకు వేడుకతోన్. 090

ఆ. అగ్ని శిఖయుఁబోలె నంటను డాయను జూడ రానియట్టి శుభచరిత్ర నెఱుక లేనికఱకు టెఱు కపేక్షించెఁ గా దనక తనకు నాయు వల్పమైన. 091

- దమయంతి శాపంబునం గిరాతుండు చచ్చుట - సం. 3-61-34

వ. దమయంతి వాని నలిగి చూచి యేను పతివ్రత నైతినేని యిద్దురాత్ముండైన కిరాతుం డిప్పుడ మృతుం డయ్యెడ మని శాపం బిచ్చిన వాఁ డప్పుడ యగ్నిదగ్ధం బైన వృక్షంబునుంబోలె విగతజీవుండై పడియె నట్లు పరమ పతివ్రతా గుణ ప్రభావంబున. 092

క. బాల హృదయమున నృప శా ర్దూలు నిజాధీశు నిలిపి దుష్టోరగశా ర్దూలాభీలమృగావలి కోలిన భయ మంద కరిగె నుగ్రాటవిలోన్. 093

వ. మఱియును. 094

సీ. సహకార మత్ప్రియ సహకారుఁ బున్నాగ పున్నాగుఁ దిలక భూభువనతిలకుఁ జందన బుధహరిచందనుఁ బుష్పి తాశోక సుహృజ్జనశోక దమను వకుళ కులైకదీపకు విభీతక భయోపేతార్తి హరు నలుఁ బ్రీతితోడఁ గానరే కానలలోన లోకోత్తరు నని మ్రానిమ్రానికి నుగి యరిగి

ఆ. యడుగునడుగు లెండ బొడవొడఁబొక్కిన నిర్ఘరాంతరము నిలుచుఁ బిలుచు గిరుల దరుల యెడల నురు గుహాగృహములఁ దొంగితొంగి చూచుఁ దోయజాక్షి. 095

వ. ఇట్లు దమయంతి నిజనాథునన్వేషించుచు భీషణారణ్యంబునం ద్రిమ్మరునది ముందట. 096

మత్తకోకిలము. వారిభక్షులు పర్ణభక్షులు వాయుభక్షులు శాకనీ వారభక్షులు వృక్షములనివాస యుక్తులు నై తపం బారఁ జేయుమహామునీంద్రుల యాశ్రమం బెడఁ గాంచె నం భోరుహాక్షి పురా సమార్జిత పుణ్యకర్మ ఫలంబునన్. 097

వ. ఇట్లు మృగవ్యాళతస్కర కిరాత నిరంతరం బయిన కాంతారంబునం బుణ్యనదీ తీరంబున నొక్క మునిపల్లియం గని యందు వసిష్ఠ వామదేవ వాలఖిల్య భృగునారద సదృశు లైన మహామునులం గని నమస్కరించి యున్న నమ్మునులు దమయంతిజూచి యచ్చెరువడి యవ్వా నీవెవ్వరిదాన వివ్వన దేవతవో దేవభామినివో దివ్యంబైన తేజంబుతో నేకతంబ యేల క్రుమ్మరి యెద వనిన వారలకు దమయంతి యిట్లనియె. 098

క. వినుఁ డేఁ బుణ్యశ్లోకుం డనఁగ ధరిత్రిం సదాయజ్ఞనిరతుఁ డనఁగఁ ధరిత్రిం దనరిన నలుభార్యను స జ్జననుత దమయంతి యన నెసంగిన దానన్. 099

వ. విధివశంబున నన్నుం బాసి నా హృదయేశ్వరుం డెట యేనియుంబోయినఁ దదన్వేషణాసక్తచిత్తనై విపిన పరిభ్రమణంబు సేసెద మీ తపోవనంబునకు వచ్చి నలుండు భవత్పాదాభివందన కృతార్థుం డయి యెక్కడికిం బోయె నతని పోయినవల నెఱుంగుదు రేని నానతిండు కొన్ని దినంబులలోనఁ దద్దర్శనంబు సంభవింపనినాఁడు దేహంబు విడుతు నని యేడ్చుచున్న దాని జూచి కరుణించి మును లిట్లనిరి. 100

క. వనజాయతాక్షి కతిపయ దినములఁ జూడంగఁగాంతు దివిరి నలుని భూ జన సుతు నెప్పటియట్టుల తనపురమున రాజ్యలీలఁ దనరెడివానిన్. 101

వ. ఏము తపోదృష్టిం జూచితిమి దుఃఖింప కుండు మని తాపసులు దమ యగ్ని హోత్రంబులయు నపారఫలపుష్పతరు నదీ రమ్య తపోవనంబులయుఁదోడ నదృశ్యులైనం జూచి దమయంతి యిది కలయో నిక్కువంబో యని విస్మయం బందుచుం జని ముందట నొక్క చనుపంగని దానింజొచ్చునపు డందలిజనంబులు. 102

సీ. పాంసుజాలములు పైఁ బ్రాకిన గరము రూక్షము లగు నూర్థ్వాలకముల దాని నతిమలినం బైన యర్థ వస్త్రంబుచే నావృతం బగు దేహ యష్టి దాని నాఁకని తృష నిద్ర యను వీని నెఱుఁగక యున్మాదినియుఁ బోలె నున్నదాని దమయంతిఁ జూచి కొందఱు పిశాచం బని పఱచిరి కొందఱు భయము వొంది.

ఆ. రందుఁ గొంద ఱధిక హాస్యంబు సేసిరి యడవి నేమి రోసె దనిరి కొంద ఱవ్వ నీవు వేల్ప వగు దని కొందఱు మొగినకేలు మొగిచి మ్రొక్కిరంత. 103

వ. దమయంతియు సార్థవాహుం జూచి యిమ్మహామహనంబున నిట్టి జనసంకులం బైన సార్థంబు గానంబడియెడు నెట్టిపుణ్యంబో యని పల్కి మఱియు నిట్లనియె. 104

క. ఏను నలు భర్యఁ బుణ్యవి హీనతఁ బతిఁ బాసి నవసి యేకాంతమ యీ కానలఁ బరిభ్రమించెదఁ గానరె మీ రమృతసదృఖుఁ గరుణాత్ము నలున్. 105

వ. అనిన దానికి సార్థవాహుండు శుచి యనువాఁ డిట్లనియె. 106

క. నలుఁ గాన మివ్వనంబునఁ గల వెప్పుడుఁ గాంతు ముగ్రకరులను సింహం బుల ఋక్షంబుల నిది మ ర్త్యుల కవిషయ మాతపంబు దూఱదు దీనన్. 107

వ. అనిన నిచ్చనుప యెట వోయెడు నని యడిగినఁ జేదిపతి యైన బాహుపురంబునకుం బోయెడు నని చెప్పిన నట్లేని మీతోడ వచ్చెద నని యప్పరమ పతివ్రత పతి దర్శన లాలసయై మునుల పలుకులు తలఁచుచు సార్థంబుతో నరిగిన. 108

క. నెండ యెక్కునంతకు నుడుగక యచ్చనుప నడచి యుగ్రాటవిలో విడిసే బహుశేతజలముల బెడఁగగు నొక చెఱువు నొద్దఁ బెద్దయు డస్సిన్. 109

వ. అంత. 110


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com