ఆ భా 1 8 241 to 1 8 270

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 241

ఆ. ఏమి కారణమున నింద్రుఖాండవ మగ్ని దేవుఁ డట్లు గాల్పఁ దివిరె దీని విప్రముఖ్య నాకు వినఁగ వేడుక యయ్యె నెఱుఁగఁ జెప్పుమయ్య యిదియు ననిన. 242

- శ్వేతకి యను రాజర్షి వృత్తాంతము - సం. 1-125-11 (అను 1-18)

వ. జనమేజయునకు వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి శ్వేతకి యను రాజర్షి ఘృత సంపూర్ణ దక్షిణానేకాధ్వరుం డయి శత వార్షిక సత్త్రయాగంబు సేయ సమకట్టి ఋత్విజులం బ్రార్థించిన ఋత్విజులు నేము నిరంతర క్లేశంబున కోపము నీ వనవరత యజనశీలుడవు నీకు నీశ్వరుండ యాజకత్వంబు సేయ నోపుంగాని యొరు లోపరని విసివి పలికిన నాతండును గైలాసంబున కరిగి కైలాస వాసు నిఖిలలోకవంద్యు నిందుశేఖరు నీశ్వరు నుద్దేశించి యుగ్రతపంబు సేసినఁ బరమేశ్వరుండు ప్రత్యక్షం బయు వానికిట్లనియె. 243

క. శ్వేతకి నీతపమున కేఁ బ్రీతాత్ముఁడ నయితి నీకుఁ బ్రియ మెయ్యది వి ఖ్యాతముగ నిత్తు దానిన యాతతమతి వేఁడు మనిన నన్నరపతియున్. 244 వ. దేవా నీ ప్రసాదంబున శతవార్షిక యాగంబు చేసెద నాకు నీవు ఋత్విజుండవు గావలయు నని ప్రార్థించినం గరుణించి యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిదృష్టం బగుటం జేసి దాని నొరులకుఁ జేయుం గాదు గావున నింక నీవి బ్రహ్మచర్యంబునఁ బండ్రెండేండ్లు నిరంతరఘృతధారం జేసి హుతాశనుఁ దృప్తుం జేయు మనిన వాఁడును బరమేశ్వరు పంచినవిధంబున నగ్నితర్పణంబు సేసిన సంతుష్టుం డై యీశ్వరుండు వాని పాలికి వచ్చి యిప్పుడ దుర్వాసు రావించి. 245

క. ఈతఁ డనవరతయజన ప్రీతుం డీతనికి దురితభీతునకు మనః ప్రీతిగ నార్త్విజ్యమ్ము మ హాతేజోధికుఁడ చేయు మని దయఁ బంచెన్. 246

వ. శ్వేతకియుఁ దనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా నభిమతం బయిన సత్త్రయాగంబు సేసె నట్లా శ్వేతకి చేసిన నిరంతర ఘృతధారాకారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయి దప్పియునైనఁ బితామహు పాలికిం జని తన శరీర స్థితి చెప్పినఁ బితామహుండును దాని నపరిమితఘృతోప యోగంబున నయిన మహావ్యాధిఁగా నెఱింగి యగ్నిదేవున కిట్లనియె. 247

క. ఈ వ్యాధి యొంటఁ దీఱదు దివ్యౌషధయుక్త మైన దివిజవనంబున్ హవ్యాశన భక్షింపు మ హావ్యాధిశమంబు దాన నగు నీ కనినన్. 248

క. చని ఖాండవంబుఁ గాల్పఁగ మొనసి మహాహస్తియూధములఁ బోని ఘనా ఘనములచే బాధితుఁ డయి వనజజుకడ కరిగి హవ్యవాహనుఁ డనియెన్. 249

వ. ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి తద్రక్షకులు గావించు విఘాతంబులు వారింపనేరక యేడుమాఱులు విఫల ప్రయత్నుండ నైతి నింక నెద్ది యుపాయంబు నాకు నెవ్విధంబున ఖాండవ భక్షణంబు దొరకొను నని దుఃఖించిన యతనిం జూచి కమలభవుండు కరుణించి భావికార్యం బప్పుడు దలంచియుఁ గొంతకాలమునకు నరనారాయణు లను నాదిమునులు నరలోకంబున దేవహితార్థం బర్జునవాసుదేవు లయి జన్మించి యాఖాండవ సమీపంబున విహరింతురు వారు భవత్ప్రార్థితులై తమ యస్త్ర బలంబున నఖిల విఘ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు రనిన నగ్ని దేవుండు గరంబు సంతసిల్లి కమలజు వచనం బవలంబంబుగాఁ బెద్దకాలం బుండి తద్వచనమార్గంబున నప్పుడు కృష్ణార్జునులం గని ఖాండవ దహనార్థంబు ప్రార్థించిన నగ్ని దేవున కర్జునుం డిట్లనియె. 250

- అగ్నిదేవుండు కృష్ణార్జునులకుఁ జక్రకార్ముకాదు లొసంగుట - సం. 1-215-12

సీ. వారణహస్తానుకారంబు లగు వారి ధారలు గురియు దుర్వారఘోర తరవారివాహప్రకరములు వారింప సురనివహంబుతో సురగణేశు నైన నోర్వనుశక్తమైన మహాదివ్య శరసంచయము నాకపరిమితంబు గల దట్టిసాయకావలికి నాదగుభుజ బలశీఘ్రసంధానములకుఁ దగిన

ఆ. ధనువు సర్వవహనఘనరథాశ్వములుఁ గృ ష్ణునకు నాయుధములు ననఘ యిపుడు లేమిఁ జేసి చూవె యీమహకార్యంబు గడఁగకున్నవార మెడయుఁజేసి. 251

వ. అనిన నగ్నిదేవుండును నప్పుడ వరుణుం దలంచి వానిం దనకు సన్నిహితుం జేసికొని తొల్లి నీకు సోముం డిచ్చిన బ్రహ్మనిర్మితకార్ముకంబు నక్షయతూణీర యుగళంబును యర్జునున కిమ్ము మఱి చక్రంబును గదయును వాసుదేవున కిమ్మని పంచిన. 252

మ. అమరాహీంద్రవియచ్చరాదుల కజేయం బప్రధృష్యం బభే ద్యము వజ్రస్థిరమన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో కమనోజ్ఞం బయి దివ్య మై వెలుఁగు నగ్గాండీవ మన్ చాపర త్నము నిచ్చెన్ వరుణుండు పార్థునకు నుద్యద్విక్రమోద్భాసికిన్. 253

వ. మఱియు బ్రతిపక్షసంక్షయకరంబు లయిన యక్షయబాణంబులు గల తూణీరంబులును వివిధాయుధభరితం బై సింహలాంగూలకచిధ్వజ విరాజమానం బై మహాంబుధకద్వానూంధురం బై మనోవాయువేగసిత వాహవాహ్యమానం బై రణితరమణీయ మణికింకిణీ కలాపాలంకృతం బై సకల దిగ్విజయాధిష్ఠానం బై యొప్పుచున్న దివ్యరథంబు నర్జునున కిచ్చి సహస్రకర సహస్ర దుస్సహ మహఃపటలభాసురం బగు దేవ దైత్య దానవ యక్ష రాక్షస పిశాచ చోరగప్రశమనం బయి వెలుంగుచున్న సుదర్శనం బను చక్రంబును గౌమోదకి యను గదయును నారాయణున కిచ్చె నట్లు సంప్రాప్తదివ్యచాపరథాయుధు లయి యున్న నర నారాయణులం జూచి యగ్ని దేవుం డిట్లనియె. 251

క. ఘనభుజ యిది గాండీవం బనఁ బరగిన ధనువు దీని వస్త్రావలి పె ల్చన తాఁకి భగ్న మగు న త్యనుపమవజ్రాభిహతశిలావలి వోలెన్. 255

క. ఈ రథ మప్రతిహతము స మీరజవోపేతహయసమేతము దీనిన్ భూరిబలుఁ డెక్కి సోముఁడు ధీరుం డయి తొల్లి యెల్ల దిక్కుల నొడిచెన్. 256

క. ఈ చక్రము మధుసూదన నీచేత విముక్త మగుచు నీరిపులఁ ద్రియా మాచరులఁ జంపి క్రమ్మఱ నీ చేతికి వచ్చు దేవనిర్మిత శక్తిన్. 257

- కృష్ణార్జును లగ్నిహోత్రునిచే ఖాండవంబు దహింపఁ జేయుట - సం. 1-216-28

వ. అని తత్ప్రభావ ప్రకారంబు చెప్పినఁ గృష్ణార్జునులు సంతసిల్లి సన్నద్ధు లయి రథం బెక్కి యగ్ని దేవుం జూచి సురాసుర పరివృతుండయి సురపతి వచ్చినను జయింతు మింక శంకింపక ఖాండవ దహనార్థం బుపక్రమింపు మనిన నగ్ని దేవుండు హర్షించి తైజసం బయిన రూపంబు ధరియించి. 258

చ. పెడిలి సువర్ణ పర్వతము పెక్కుదెఱంగుల వ్రయ్యునట్టు ల ప్పుడు వివిధ ప్రకారముల భూరిశిఖావలి ఖాండవంబు న ల్గడఁ గడుఁ బర్వఁగాఁ బెఱిగి కాల్పఁ దొడఁగె హుతాశనుండు సే డ్పడఁగ వనంబులోని మృగపక్షిభుజంగ మభూత సంఘముల్. 259

వ. అంత, 260

సీ. చక్రధరుం డయ్యు జనరుహనాభుండు గాండీవధరుఁ డయ్యుఁ బాండవుండు నుండి రవ్వనమువ కుభయపార్శ్వంబులఁ దొల్లింటియట్టులు పెల్లురే గి యనలంబు నార్పంగ నార్చుచుఁ బఱతెంచి వనరక్షకులు పార్థుసునిశితాస్త్ర ధారల నవగతదర్పు లై యరిగిరి యమసదనంబున కమిత బలులు

ఆ. శిఖియు నుగ్రదీర్ఘ జిహ్వలు సాచి యు ద్ధర సమీరణంబు తోడు సేసి కొని యుగాంతకాలకుపితానలాకారుఁ డయ్యె ఖాండవమున కద్భుతముగ. 261

మ. ఘనధూమధ్వజదహ్యమాన లవలీ కర్పూర తక్కోలచం దన కాలాగరు సల్లకీతరుల యుద్దద్ధూమధూపానువా సన నొప్పెన్ సురభీకృతంబు లగుచున్ సంక్రీడమానామృతా శనవిద్యాధర సద్విమానవితతుల్ సావిత్ర వర్త్మంబునన్. 262

చ. జ్వలనశిఖాలియున్ విజయు సద్విశిఖాలియుఁ జూట్టుముట్టినం దలరి భయాకులంబు లగు తద్వనజీవుల యార్తనాదమం దులియుచు నొక్కచెట్ట దివి నుద్గత మయ్యె నమందమందరా చల పరివర్తన ప్రసభసంక్షుభితార్ణవ ఘోషఘోర మై. 263

క. నెగయుడు నెగసి పిఱుందం దగిలెడు మిడుఁ గుఱులచేత దగ్ధచ్ఛదమై గగనమునఁ బఱవనోపక ఖగనివహము వహ్నియంద కడువడిఁ బడియెన్. 264

క. తనతేజోజాలము ప ర్విన దగ్ధము లగు ననేకవిధ దేహుల దే హనికాయంబుల బహువిద తనువులు గలవాఁడపోలె దహనుం డొప్పెన్. 265

చ. అమితకృశానుదగ్ధ మగు నయ్యమరేంద్రు వనంబులోని యు త్తమసలిలాశయానళుల త ప్తజలంబులయం దపేత జీ వము లయి తేలుచుండె పరివారచరంబులు వారిపక్షులుం గమరె నశేషకోకనదకై రవపంక్తులు శైవలంబులున్. 266

క. అలుగులపడి ఖాండవమునఁ గలయాశీవిషమహోరగము లెల్ల విషా గ్నులు గ్రక్కుచు నత్యుగ్రా నలబహులజ్వాలలందు నాశము నొందెన్. 267

వ. అంత దేవత లెల్ల మహావహ్నిశిఖాహతికిఁ వెఱచి దేవేంద్రుపాలికిం బోయి ఖాండవంబున కైన యకాండ ప్రళయంబు సెప్పిన విని యదరిపడి యింద్రుండు తక్షకరక్షణాపేక్ష ననేకధారాధారనివహంబుతో నతి త్వరితగతి ఖాండవంబునకు వచ్చి హుతాశనుమీఁద మహావారిధారలు గురియించిన. 268

క. ఆ వారిధార లెల్ల మ హావహ్ని శిఖాహతంబు లయి శుష్కము లై లావఱి నడుమన యడఁగుటఁ బావకుపయి నొక్కచినుకుఁ బడదయ్యె వడిన్. 269

క. ఉఱుముచు మెఱుముచుఁ బిడుగులు వఱలఁగ నలుగడలఁ బడ నవారితనవృష్టుల్ గుఱుకొని కురియఁగఁ బంచెను మఱియును నయ్యనలుమీఁద మఘవుం డలుకన్. 270


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com