ఆ భా 1 8 151 to 1 8 180

వికీసోర్స్ నుండి


1_8_151 ఆ. దాని నశ్రమమునఁ దజ్జలాశయము వె ల్వడఁగ వైచె నరుఁడు బాహు శక్తి నదియుఁ దత్క్షణంబ యఖినవ యౌవనో ద్భాసమాన దివ్య భామ యయ్యె.

1_8_152 ఉ. ఆ లలితాంగిఁ జూచి నరుఁ డద్భుత మంది మృగయతాక్షి యి ట్లేల జలేచరత్వమున నిజ్జలధిన్ వసియించి తిప్పు డి ట్లేల సురూప భామ వయి తెందుల దానవు నీవు నావుడున్ బాలిక పాండు పుత్త్రునకుఁ బార్థున కిట్లనియెం బ్రియంబునన్.

1_8_153 వ. ఏను వంద యను నప్సరసఁ గుబేరుననుంగ నా సఖులు సౌరభేయియు సమీచియు బుద్భుదయు లతయు ననువారలు నలువురు నా యట్ల యత్తీర్ధంబులందున్న వారలు వారిని శాప విముక్తలం జేసి రక్షింపు మనిన దానికి నర్జునుం డిట్లనియె.

1_8_154 క. వనజాక్షి యేమి కారణ మున నుగ్ర గ్రాహ రూపములు దాల్చితి రీ రని యడిగిన వేడుక నా తని కది యిట్లనుచుఁ జెప్పె దద్విధ మెల్లన్.

1_8_155 వ. వినవయ్య యే మేవురఘు నఖిల లోక పాలక పురంబులు చూచుచు భూ లోకంబునకు వచ్చి యొక్క వనంబునం దుగ్ర తపంబు సేయుచున్న వాని నత్యంత శాంతు నేకాంతచారి నగ్నికల్పు నొక్క బ్రాహ్మణుం గని వాని తపంబునకు విఘ్నంబు సేయ సమకట్టి.

1_8_156 క. వేడుక నమ్ముని ముందటఁ బాడితి మాడితిమి పెక్కు పరిహాసంబుల్ రూఢిగఁ బలికితి మెట్లుం జూడఁడు మా వలను నీరసుం డన నుండెన్.

1_8_157 క. ధృతి హీనుల చిత్తముల ట్లతి వలయం దేల తగులు నత్యంత దృఢ వ్రతుల మనంబులు వారల మతులఁ దృణ స్త్రైణములు సమంబుల కావే.

1_8_158 వ. ఏము రాగ కారణ వికారంబులు గావించిన నవి దనకు గోప కారణంబు లయిన నతి కుపితుం డయి బ్రాహ్మణుండు మమ్మేవురను మహా గ్రాహంబులుగా శపియించిన నమ్ముని వరునకు ముకుళిత హస్తల మై యిట్లంటిమి.

1_8_159 చ. అలుగుదురయ్య విప్రులు మహా పురుషుల్ పురుషాధముల్ దలిఁగెడు వారు ధర్మువులు దప్పక సల్పెడు వారు సత్యముల్ పలికెడు వారు వారల కపాయము డెందములం దలంచు మూ ర్ఖులకు విధాతృచెయ్వున నగున్ దురితంబులు దుర్యశంబులున్.

1_8_160 వ. కావున మా చేసిన యజ్ఞానంబు సహించి మాకు శాప మోక్షంబుఁ బ్రసాదింపు మనిన నవ్విప్రుండును గరుణించి యెవ్వండేని మీ చేత గృహీతుండయు మీ యున్న జలాశయంబు మిమ్ము వెలువరుంచు నాతండ మీకు శాప మోక్ష కారణుం డగు ననిన.

1_8_161 సీ. అట్టి మహా బాహుఁ డత్యంత బలుఁ డెవ్వఁడగు నొక్కొ యనుచు నే మరుగుదెంచు వారము త్రైలోక్యవర్తి నంబుజ భవ ప్రభవు నారదుఁ గని భక్తి తోడ మ్రొక్కిన మమ్ము నమ్ముని చూచి యిట్లేల వగఁ బొంది కందిన వార లనియు నడిగి మా వృత్తాంత మంతయు మా చేత విని విప్రునలుకయు విధి కృతంబుఁ

ఆ. గ్రమ్మఱింప లావె కావున దక్షిణ జలధి తీరమునఁ బ్రశస్త పంచ తీర్థములకు నేఁగి ధృతి నందు నూఱేఁడు లుండుఁ డట్లు మీర లుండునంత.

1_8_162 క. జన నుతుఁడు పాండు తనయుఁడు ధనంజయుఁ డశేష తీర్థ దర్శన కాంక్షం జనుదెంచి మీకు దయ న మ్ముని చెప్పిన యట్ల శాప మోక్షము సేయున్.

1_8_163 వ. అనిన నన్నారదు వచనంబులు విని వచ్చి మహోగ్ర గ్రాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచ తీర్థంబుల నుండి నేఁడు నీ కారణంబునం గృతార్థుల మయితి మనిన నర్జునుండును గరుణాయత్త చిత్తుం డయి వంద చెప్పిన యన్నలువురకు శాప మోక్షంబు సేసిన నమర కన్యక లతి హర్షంబున నమరేంద్ర నందను దీవించి దేవ లోకంబున కరిగి రది మొదలుగా నిప్పంచ తీర్థంబులు నారీ తీర్థంబులు నాఁ బరగె నర్జునుండును గ్రమ్మఱి మణిపూర పురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగద యందు బభ్రు వాహమండను పుత్త్రుం బడసి చిత్రవారనునకు వంశకరుంగా నిచ్చి వాని వీడ్కొని గోకర్ణంబుఁ జూచుచుఁ బశ్చిమ సముద్ర పార్శ్వంబునఁ బ్రభాసం బను తీర్థంబునకుఁ జని యందులకు ద్వారవతి పురంబ కుఱంగని యని విని.

1_8_164 సీ. అందుల కేఁగి యే నిందీవర శ్యాము నరవింద నాభు నంబురుహ నేత్రు సన్మిత్రుఁ జూచి నా జన్మంబు సఫలంబు సేయుదు నఖములు వాయు పొంటె నదియునుం గాక మున్ గదుఁ డను వానిచే వింటిఁ దిలోత్తమ కంటె రూప వతి యట్టె సద్గుణాన్విత యట్టె నా కట్టి భద్రేభ గమన సుభద్రఁ జూచు

ఆ. వేడుకయును గలదు విష్ణు భట్టారకు దయ నభీష్ట సిద్ధి దనరు ననుచుఁ దద్ద సంతసిల్లి తద్ద్వారకా పురి కరుగ నిశ్చయించె నర్జునుండు.

1_8_165 వ. మఱియు నప్పురంబునం దన్నొరు లెఱుంగ కుండ వలయు ననియు యాదవులు యతుల కతి భక్తులనియును మనంబునం దలంచి కృతక యతి వేషధరుండై.

1_8_166 క. పరమ బ్రహ్మణ్యు జగ ద్గురు గరుడ ధ్వజు ననంతగుణు నేకాగ్ర స్థిరమతి యై నిజ హృదయాం తర సుస్థితుఁ జేసి భక్తిఁ దలఁచుచు నుండెన్.

1_8_167 క. నరునికి యెఱిఁగి కృష్ణుఁడు తిరముగ దయతోఁ బ్రభాస తీర్థమునకు నొ క్కరుఁడ చనుదెంచె సర్వే శ్వరుఁ డెప్పుడు భక్తులకుఁ బ్రసన్నుఁడ కాఁడే.

- అర్జునుండు ద్వారకా నగరంబునకుఁ జనుట – సం. 1-210-4

1_8_168 వ. ఇట్లు దనకడకు వచ్చిన యాది దేవునకు దేవకీ నందనునకు నతి సంభ్రమంబున నమస్కరించి పురందర నందనుం డానంద జల భరిత నయనుం డయి యిట్లనియె.

1_8_169 ఉ. ద్వాదశ మాసిక వ్రతము ధర్మ విధిం జలుపంగ నేఁగి గం గాది మహానదీ హిమవదాది మహా గిరి దర్శనంబు మీ పాద పయోజ దర్శనముఁ బన్నుగఁ జేయుటఁ జేసి పూర్వ సం పాదిత సర్వ పాపములుఁ బాసె భృశంబుగ నాకు నచ్యుతా.

1_8_170 వ. అనిన విని నగుచు నబ్జనాభుం డర్జును నతి స్నేహంబునం గౌఁగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి యాతని తీర్థాభి గమన నిమిత్తంబును సుభద్ర యందు బద్ధానురాగుం డగుటయు నుపలక్షించి ద్వారకా పురంబునకుఁ దోడ్కొని యరిగి.

1_8_171 ఉ. భ్రాజిత శాతకుం భగృహ పంక్తుల బుష్పిత వల్లి వేల్లి తో ర్వీజవనా వృతిన్ విమల విద్రుమ వజ్ర విచిత్ర వేదికా రాజిఁ గరంబు రమ్య మగు రైవత కాచల కందరబునన్ రాజ కులైక సుందరుఁ బురందర నందను నుంచి లీలతోన్.

1_8_172 క. శ్రీపతి గడు నెయ్యంబున నాపోవక పార్థునొద్ద నా రాత్రి ప్రియా లాపములఁ దగిలి యుండెను దీపమణుల్ వెలుఁగ భువన దీపుఁడు దానున్.

1_8_173 వ. ఇట్లు పరమ పురుషు లయిన నర నారాయణులు దమ పూర్వ జన్మ సహ వాసంబున యట్లప్పుడు పరమానందంబునఁ బరస్పర ప్రియ మధుర సంభాషణంబుల నొక్కట నుండి యా రాత్రి సలిపి రంతఁ బ్రభాతంబ వాసుదేవుండు వాసవ నందను నంద యుండం బంచి కాంచన రథారూరూఢుం డయి పురంబునకుం జని పౌరజన ప్రధాన సమక్షంబున రైవతక మహోత్సవంబు ఘోషింపం బంచిన.

1_8_174 చ. పొలుపుగఁ బూసికట్టి తొడి భూరి విభూతి ప్రకాశితంబుగాఁ గలయఁగఁ దత్పురీజనులు కాంస్య మృదంగ ముకుంద వేణు కా హళ పటహ ధ్వనుల్ చెలఁగ నాటలుఁ బాటలు నొప్ప నెల్ల వా రలుఁ జని చేసి రర్చనలు రైవత కాద్రికి నుత్సవంబు తోన్.

1_8_175 చ. గురు కుచ యుగ్మముల్ గదలఁ గ్రొమ్ముడులందుల పుష్పముల్ పయిం దొరఁగ నిదాఘ బిందు వితతుల్ చెదరన్ మదిరామదంబునం బరవశ లయ్యు నింపెసఁగఁ బాడుచుఁ దాళము గూడ మెట్టుచుం దరుణియ లొప్ప నాడిరి ముదంబునఁ దమ్ము జనాలి మెచ్చఁగన్.

1_8_176 సీ. సారణ సత్యకా క్రూర విదూరథ సాంబ సంకర్షణ శంబరారి భాను సుషేణోగ్ర సేన శైనేయానిరుద్ధ హార్దిక్య గదోద్ధవాది యాదవు లధిక ప్రమోదులై యొక్కటఁ దరుణులు దారును గరిక రేణు హయశిబికారూఢు లయి తదుత్సవమున కరిగిరి మఱి జగద్గురుఁడు గృష్ణుఁ

ఆ. డిందిరలీలతో నుపేంద్రుండు రుక్మిణీ దేవి మొదలుగాఁగ దేవులెల్ల నొప్పుతోడ రాఁగ నప్పర్వతమునకుఁ జనియె సకల జనులుఁ దనకు నెరఁగ.

1_8_177 వ. ఇట్లరిగి జనార్దనుండు ధనంజయుం దలంచి తత్సమీప గతుండయు తోడ్కొని యాతనికి నప్పర్వత రమణీయ ప్రదేశంబులం జూపుచు విహరించి యిద్దఱు నొక్క విమల మణి వేదిక యందభిమత సంభాషణంబుల నుండునంత.

1_8_178 చ. క్వణదణు కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్ రణ న్మణికలనూ పురంబులు సమధ్వని నొప్పఁగ భక్తిఁ బాదనా రిణి యయి కన్యకా జనపరీత సుభద్ర తదద్రి పూజన ప్రణతులు సేసె నింద్రసుతుఁ బార్థుం నిజేశ్వరుఁగాఁ దలంచునున్.

1_8_179 ఉ. దాని సుభద్రఁగా నెఱిఁగి తత్క్షణజాత మనోజ సంచన న్మానసుఁ డైన యవ్విజయు మానుగఁ జూచి మునీంద్ర నీకుఁ జ న్నే నలినాక్షులందు మది నిల్పఁగ నంచును మందహాస గ ర్భాననుఁ డై రథాంగ ధరుఁ డాతని కిట్లనియెం బ్రియంబునన్.