Jump to content

ఆ భా 10 1 31 to 10 1 60

వికీసోర్స్ నుండి

10_1_31 ఆ.

కాఁపు లావు వెరవు గల్ల కర్శనము సే
యంగ వృష్టి దగినయట్లు గలుగ
ఫలము గల్గునట్లు పౌరుషంబునకు దై
వంబుటోడుపాటు వలయు నెందు.


10_1_32 వ.


అదియునుం గాక.


10_1_33 క.


తగుపని కుద్యోగించుచుఁ
దగవెఱిఁగెడుహితుల కనుమతంబుగఁ జేయ&
జగలీసురవర కార్యము
లగు వారికిఁ గలుగు విధిసహాయత్వంబున్.


10_1_34 --.


ధర్మము దప్పక నయగతిఁ
గర్మాచరణంబు నడపఁగా ఫలసిద్ధిన్
నిర్మలయశ మగుఁ దప్పినఁ
బేర్మి సెడదె నింద దా నభేద్యోత్సాహా.


10_1_35 ఉ.


నీతి దొఱంగి కార్యముల నెట్టన యాగ్రహవృత్తిఁ జేసినం
బ్రీతిగ సిద్దిఁ బొందినను భీతియుఁ గిత్సుయుఁ బుట్టు భూజను
ల్వేతురు చేటు సేఁతలు ఫలింపక తక్కిన మున్న వచ్చు న
త్యాతురతాస్పదంబు లగునాపద సిద్ధవివేకవైభవా.


10_1_36 ఉ.


క్రోధము లోభమున్ భయముఁ గూరినచిత్తముతోడ దుష్క్రియా
సాధనవృత్తి దుర్జనుఁడు సజ్జను లాఁగఁగఁ జేయుకార్యముల్
బాధలఁ బెట్టకున్నె సిరి పాయఁగ జేయక యున్నె వానిఁ దీ
వ్రాధినితాంతదుఃఖహృదయత్వము దేరక యున్నె వానికిన్.


10_1_37 చ.


వినుము కురుక్షితీశుఁడు వివేకవిదూరుఁడు క్రోధలోభముల్
మనమునఁ బేర్చినన్ దురభిమానమునన్ హితు లెంత చెప్పిన
న్వినక బహుప్రకారముల నిందకు నోర్చి పరాభవించె స
జ్జను లగుపాండుపుత్రుల నసత్పధవృత్తికిఁ జేటు దప్పునే.


10_1_38 వ.


అని పలికి యతండు మీమది గలఁగకయున్న దేని కర్తవ్యంబుఁ జెప్ప
వలయునని యడిగినమాట లుగ్గడించి.


10_1_39 క.


జగ మెఱుగఁగ దుశ్శీలుం
డగుభూనాధుండు వోయినట్టులె పోఁగాఁ
దెగుడుం జేటుఁ గలిగి వగ
మిగులను మది గలఁగదే యమిత్ర ద్వంసీ.


10_1_40 క.


అది యట్లుండె మనకిప్పుడది కర్తవ్యం బని నిశ్చయింప మన మేమి
నేర్తుము తగవుతెఱం గెఱింగించెద నాకర్ణింపుము.


10_1_41 క.


మన మందఱమును దృతరా
ష్ట్రునికడకుం బోయి కార్యసూత్ర మతనిచే
వినవలయు నాతఁ డెయ్యది
గని పలికిన నదియ మనకుఁ గర్తవ్య మగున్.


10_1_42 వ.


అమ్మహీకాంతుండు.


10_1_43 క.


తానును గాంధారియు నె
ద్దానిం గార్యంబు గాఁగ దలఁచి పనిచినన్
దానికిఁ గాదన వలవదు
పూని యనుష్ఠంత మదియు పొగ డొందించున్.


10_1_44 వ.


వారలకడ విదురుండు నుండు నమ్మువ్వురు విచారించి చెప్పినకార్యంబు
నకు నిందగలుగ దట్లుం గాక యెట్లు పొరలినను దైవోపహతంబు లగు
కార్యంబులు సిద్ధిం బొందునె యడిచిపడ వలవదు విచారించుకొంద
మనవుడు శోకదందహ్య మానమానసుం డగుచు నగ్గురుపుత్రుండు కృత
వర్మను నతని నాలోకించి.


అశ్వత్ధామ కృపాచార్యకృతవర్మ లతోఁ దనపూన్కి స్థిరీకరించుట


10_1_45 సీ.


వెర విట్టితెఱఁ గిది వెంగలితన మని యెల్ల వాఁడును దనియెఱిఁగినట్టి
తెఱఁగున నిజకార్యదృష్టియ కయికొను నొరులనేర్పులు పట్ట నొల్లఁడాత్మ
బుద్ధియ మేలని పొగడు నన్యులచిత్తవృత్తుల నిందించు వివిధగతులఁ
జెందెడునాత్మీయచేతః ప్రవర్తన మరయఁడు దాన బాల్యమునఁ దలఁచు


ఆ.


తలఁపు గీడు చేసి యెలప్రాయమున నొండు
--ఁపునందుఁ బట్టుకొలుపుఁ బ్రీతి
ముదిమ వచ్చినతఱి నదియును విడిచి య
న్యంబు లైననేర్పు లాచరించు.


10_1_46 క.


ఆపదఁ బడి యొక్కఁడు స
ద్వ్యాపారము గాఁగఁ జూచి దాని నడపు శ్రీ
ప్రాప్తించిన నరుఁ డొండొక
చూపున వర్తించునది విశుద్ధపదముగన్.


10_1_47 క.


తగు నని మరణాదులకై
తెగు దెసన్ మానవుండు దృఢనిశ్చయతం
---న ది పరమహితం
బుగ వదలక నడుపు నన్యబుద్ధులు గొనమిన్.


10_1_48 వ.


మీ రెఱుంగనియది లేదు నాకుం దోఁచినకర్జంబు మన కందఱకును శోక
నాశం బగునట్టిది దాని వినుండు చెప్పెదఁ బ్రజాపతి ప్రజల సృజించి
విప్రునకు దమంబును క్షత్రియునకుఁ దేజంబును వైశ్యునకు దక్షత్వంబును
శూద్రునకుఁ ద్రివర్ణానుకూలతయు వలయుగుణంబులుగా విధించెం గావున
శాంతుండు గాని విప్రుండును దేజస్వి గని రాజును దక్షుండుగాని
వైశ్యుండును ద్రివర్ణానుకూలుండు గానిశూద్రుండును నిందం బడదు రది
యట్లుండె నేనును విప్రకులంబునందు జనపూజితంబైన వంశంబునందు
జనియించి భాగ్యహీనతవలన రాజోచితధర్మం బనిష్ఠించితి నడుమ నానిష్ఠి
వదలి విప్రధర్మంబు మహనీయంబైన నది యాచరించువాఁడ నగుట
నామదికిం జూడ మేలైయుండ దదియుం గాక.


10_1_49 తే.


మేటివిల్లును దివ్యాస్త్రకోటియును ధ
రించి మెఱయంగ నాజి వధించెఁ దండ్రి
నొకఁడువాఁడును రూపుతోనుండునట్టె
యెట్లుతలయెత్తిమెలంగుదు నేను జెపుఁడ.


10_1_50 క.


వాఁడు మొదలుగాఁ బగతుర
వాఁడి గలుగుతూపుగములవలన మెఱసి యే
నేఁడు వధింతును నెవ్వగ
వేఁడిమిఁ బడజాల కొక్క వెరవు దలఁచితిన్.


10_1_51 క.


లే దింకం బగ యని ధను
రాదులదెస వాహనములయందును సంత్య
క్తాదరులై పగతురు నేఁ
డాదమఱచి నిద్రవోదు రది తఱి పొడునన్.


10_1_52 అ.


ఓడిపోయి డప్పి నూని గట్టును జెట్టుఁ
జేరి యొదిగి యున్న వారి గాఁగ
మనలఁ దలఁతు రరులు మనముల నావంత
శంక లేదు సంతసంబు ఘనము.


10_1_53 చ.


మనమునఁ దేలి యేమఱినమార్తుర దాడిగఁ బోయి బెట్టు ము
ట్టెద శరజాలసత్వరపటిష్ఠతఁ -ల్పురం ద్రుంతుఁ గొందఱం
జదుపుదు నుల్లసత్పరిఘసంహననంబునఁ గొన్ని కంఠముల్
చిదుముదు నేల రక్తపరిషిక్తము గాఁ గలవారలీలలన్.


10_1_54 తే.


గెలుపునూఱట నొదపునగ్గలపునిద్రఁ
బీనుఁగులుఁబోలె నున్న యాబిరుదుమగలఁ
జంపి పీనుంగుఁ బెంట గావింపవలయు
శిబిర మెల్లను భూతముల్ సెలఁగుచుండ


10_1_55 వ.


అని వెండియు.


10_1_56 క.


కరిహయనరశవముల భ
గ్న రధంబుల నెరసి ద్రుపదనందనగాత్రో
త్కరము పడి యుండఁ జూడక
పరిభవతాపోహశాంతి వడయఁగ నగునే


10_1_57 శా.


ధృష్టద్యుమ్నుని ముట్టి పట్టుదు మదోద్రేకం బడంగింతు ను
త్కృష్టాస్త్రంబులఁ జంప నల్క పశుభంగిం జంపినం గానిపో
దిష్టావాప్తియనంగ నా కిదియె భూయిష్టంబు గౌంతేయులన్
గష్టస్వైరవిధాభియోగమృతులం గావించు నుగ్రాకృతిన్.


10_1_58 క.


అలిగినపినాకిచందం
-ల-డ శిబిరంబుఁ జొచ్చి యందఱఁ బగఱం
--- శుద్ధుండఁ గా
వలదే జనకునకు నాదువల నేర్పడంగన్.


10_1_59 క.


పాండవులం బాంచాలురఁ
జండభుజావిభవ మెసఁగ సమయించి కృతా
ర్ధుండ నయి పెంపుఁ దేజము
గండును దక్కొండు లేదు కార్యము దలఁపన్.


10_1_60 వ.


అనవుఁడుఁ గృహాచార్యుండి ట్లనియె.