ఆహార కల్తీ నివారణ చట్టము, 1954

వికీసోర్స్ నుండి

భారత ప్రభుత్వము

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వశాఖ

(శాసన నిర్మాణ విభాగము)



ఆహార కల్తీ నివారణ చట్టము, 1954

(1954 లోని 37 వ చట్టము)

[1 జూన్, 1991 న ఉన్నట్లుగా]


The Prevention of Food Adulteration Act, 1954

(Act No. 37 of 1954)

[As on 1st June, 1991]


భారత ప్రభుత్వము తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్రణాలయ కమీషనరుగారిచే ప్రభుత్వ కేంద్ర ముద్రణాలయము, హైదరాబాదునందు ముద్రించి ప్రచురింపబడినది.

1991

మూల్యము: రూ. 8-00

అవతారిక

ఈ ముద్రణలో 1 జూన్, 1991న ఉన్నట్లు ది ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్‌రేషన్ యాక్ట్, 1954 (1954 లో 37వ చట్టము) యొక్క ప్రాధికృత తెలుగు పాఠము కలదు. ఈ పాఠమును 4 జూలై, 1991 తేదీ గల భారత రాజపత్రము, అసాధారణ భాగము XVI అనుభాగము 1, సంఖ్య 2, సంపుటము 6లో 89 నుండి 114 వరకు గల పుటలలో ప్రచురించడమైనది.

ఈ తెలుగు పాఠమును, రాష్ట్రపతి ప్రాధికారము ననుసరించి ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఎ) క్రింద ప్రచురించడమైనది. అట్లు ప్రచురించినమీదట, ఈ అనువాదము ఆ చట్టమునకు ప్రాధికృత తెలుగు పాఠమైనది.

న్యూఢిల్లీ,

తేదీ: 6 జూలై, 1991.

వి. యస్. రమాదేవి,

కార్యదర్శి, భారత ప్రభుత్వము.


PREFACE

This edition of The Prevention of Food Adulteration Act, 1954 (Act 37 of 1954) as on 1st June, 1991 contains the authoritative Text of that Act in Telugu which was published in the Gazette of India, Extraordinary Part XVI, Section 1, No. 2, Vol. 6, dated 4th July, 1991 on pages from 89 to 114

This Telugu text was published under the authority of the President under clause (a) of Section 2 of the Authoritative Texts (Central Laws) Act, 1973, and on such publication it became the authoritative text of that Act in Telugu.

New Delhi,

Dated: 6th July, 1991.

V. S. RAMA DEVI,

Secretary to Govt. of India .

పుట:ఆహార కల్తీ నివారణ చట్టము, 1954.pdf/3 పుట:ఆహార కల్తీ నివారణ చట్టము, 1954.pdf/4

ఆహార కల్తీ నివారణ చట్టము, 1954.

(1954 లోని 37వ చట్టము)

(29 సెప్టెంబరు, 1954)

ఆహార కల్తీ నివారణ కొరకు నిబంధనలు చేయుటకైన చట్టము.

భారత గణరాజ్యము యొక్క ఐదవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది: --

ప్రారంభిక

1. (1) ఈ చట్టమును ఆహార కల్తీ నివారణ, చట్టము, 1954 అని పేర్కొన వచ్చును.

(2) ఇది యావత్ భారతదేశమునకు విస్తరించును.

(3) ఇది కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచనద్వారా నియతము చేయు నట్టి తేదీన అమలులోనికి వచ్చును.

2. ఈ చట్టములో సందర్భమును బట్టి అర్భము వేరుగా ఉన్ననే తప్ప. --

(i) "కల్తీకి ఉపయోగించునది" అనగా కల్తీ చేయుటకై ఉపయోగింపబడు లేక ఉపయోగింపబడగల ఏదేని పదార్ధము అని అర్ధము;

(ii) "కల్తీ చేయబడిన" ఈ క్రింది సందర్భములలో, అనగా--

(ఏ) విక్రయదారు. విక్రయించిన ఆహారపదార్యము కొనుగోలుదారు కోరిన నైజగుణముగలది గాని, పదార్ధముగలది గాని, నాణ్యత గలది గాని కానిదై అతనికిహానికలిగించు నదైనచో, లేక ఆ పదార్ధము ఎట్టిదని విదితమగుచున్నదో, లేక అదిఎట్టిదని ఎరుకపరచినారో ఆ నైజగుణము గలది గాని, ఆ పదార్ధముగలది గాని, ఆనాణ్యత గలది గాని కానిదైనచో;

(బి) ఆ పదార్ధపు నైజగుణమునకు గాని, అందలి పదార్ధమునకు గాని, దాని నాణ్యతకు గాని చెరుపు కలిగించునట్టి ఏదేని ఇతర పదార్ధము దానిలో ఉన్నచో, లేక అట్టి చెరుపు కలిగించునట్లు ఆ పదార్ధమును ప్రాసెస్ చేసినచో;

((సి) ఆ పదార్ధపు నైజగుణమునకు గాని, అందలి పదార్ధమునకు గాని, దాని నాణ్యతకు గాని చెరువు కలిగించునట్లు ఆ పదార్ధమునకు బదులు నాసిరకపు, లేక చౌక రకపు ఏదేని పదార్ధమును పూర్తిగా గాని కొంతభాగము గాని ఉంచినచో;

(డీ) ఆ పదార్ధపు నైజగుణమునకు గాని, అందలి పదార్ధమునకు గాని, దాని నాణ్యతకు గాని, చెరుపు కలిగించునతట్లు, దానిలో ఉన్న ఏ పదారమున్నెనను పూర్తిగా గాని, కొంతభాగము గాని దానినుండి తీసివేసినచో;

(ఈ) ఆ పదార్ధము కలుషితమగునట్లు, లేక ఆరోగ్యమునకు హాని కలిగించునట్లు అపరిశుభ్రమైన స్థితులలో దానిని తయారు చేసినచో, లేక ప్యాక్ చేసినచో, లేక ఉంచినచో;

( యఫ్) ఆ పదార్ధము పూర్తిగా గాని కొంతభాగముగాని ఏదేని మురికియైన, మురిగిపోయిన,

చెడిపోయిన కుళ్లిన పదార్ధముతోగాని రోగగ్రస్తమైన

2

జంతుసంబంధ లేక శాకీయ పదార్ధముతో గానీ కూడినదై నచో, లేక పురుగు పట్టినదైనచో, లేక అన్యథా మసుష్యులు సేవించుటకు పనికిరానిదైనచో;

(జీ) ఆ పదార్ధము రోగగ్రస్తమైన జంతువు నుండి పొందినదైనచో;

(హెచ్) ఆ పదార్ధమునందు ఆరోగ్యమునకు హానికలిగించు విషపూరితమై నట్టి, లేక ఇతరమై నట్టి , దినుసు ఏదేని ఉన్నచో;

(ఐ) ఆ పదార్ధము గల పాత్ర ఏ పదార్ధముతో పూర్తిగా గాని, కొంతభాగము గాని తయారు చేయబడినదో ఆ పదార్ధము ఆ పాత్రలోని వాటిని ఆరోగ్యమునకు హానికలిగించు నట్టివిగా చేయు ఏదేని విషపూరితమైనట్టిది లేక కీడు కలిగించునట్టిది అయినచో:

(జే) ఆ పదార్ధములో తద్విషయమున విహితపరచబడినది కానట్టిది ఏదేని రంగు పదార్ధము ఉన్నచో, లేక పదార్ధములో ఉన్నట్టి విహితపరచబడిన రంగు పదార్ధముల మోతాదులు విహితపరచబడిన వ్యత్యాస పరిమితులలో లేనిచో;

(కె) ఆ పదార్ధములో ఏదేని నిషిద్ద- పరిరక్షకము గాని, అనుమతించబడిన పరిరక్షకము విహితపరచబడిన పరిమితులకు మించి గాని ఉన్నచో;

(యల్) ఆ పదార్ధము యొక్క నాణ్యత గాని, స్వచ్ఛత గాని, విహితపరచబడిన ప్రమాణముకన్న తక్కువగా ఉన్నచో, లేక దానిలో ఉన్న పదార్ధములు విహితపరచబడిన వ్యత్యాస పరిమితులలో లేనివై ఆరోగ్యమునకు హానికలిగించునట్టి పరిమాణములలో ఉన్నచో;

(ఎమ్) ఆ పదార్ధము యొక్క నాణ్యత గాని, స్వచ్ఛతగాని విహితపరచబడిన ప్రమాణముకన్న తక్కువగా ఉన్నచో, లేక దానిలో ఉన్న పదార్ధ పరిమాణములు ఆరోగ్యమునకు హానికలిగించునవి కాకపోయినను విహితపరచబడిన వ్యత్యాస పరిమితులలో లేనిచో:

ఆ ఆహార పదార్యము కల్తీ చేయబడినదై నట్లు భావింపబడును;

అయితే, సహజసిద్ధ ఆహారపదార్ధము యొక్క నాణ్యతగాని, స్వచ్ఛతగాని విహితపరచబడిన ప్రమాణములకన్న తక్కువై యుండుట, లేక దానిలో ఉన్న పదార్ధములు విహితపరచబడిన వ్యత్యాస పరిమితులలో లేనట్టి పరిమాణములలో ఉండుట, - ఈ రెంటిలో ఏదైనను కేవలము ప్రకృతిసిద్ద కారణముల వలననే జరిగియుండి మనుష్యుల ప్రమేయముతో నియంత్రించుటకు అలవికాని కారణముల వలన తటస్థించియుండిన యెడల, అట్టి పదార్ధము ఈ ఉపఖండము యొక్క భావములో కల్తీ చేయబడినదైనట్లు భావింపబడదు.

విశదీకరణము: - (i) రెండు, లేక అంతకెక్కువ సహజసిద్ధ ఆహారపదార్ధములు ఒకటిగ మిశ్రితమైన ఫలితముగ ఏర్పడిన ఆహార పదారము-

(ఏ) దానిలోగల దినుసులను సూచించు పేరుతో నిలవ చేయబడిన యెడల, లేక విక్రయింపబడిన యెడల, లేక పంపిణీ చేయబడిన యెడల; మరియు

(బీ) ఆరోగ్యమునకు హానికరమై నది కాని యెడల;

అట్టి పదార్ధము ఈ ఖండము యొక్క భావములో కల్తీ చేయబడినదై నట్లు భావింపబడదు;

(ii) "కేంద్ర ఆహార ప్రయోగశాల" అనగా 4వ పరిచ్ఛేదము క్రింద స్థాపించబడినట్టి, లేక నిర్దిషపరచబడినట్టి ఏదేని ప్రయోగశాల, లేక సంస్థ అని అర్ధము;

(iii) "కమిటీ" అనగా 3వ పరిచ్ఛేదము క్రింద ఏర్పాటు చేయబడిన కేంద్ర ఆహార ప్రమాణముల కమిటీ అని అర్ధము;

3

(iv) "కేంద్ర ఆహార ప్రయోగశాల డైరెక్టరు " అనగా కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచనద్వారా, కేంద) ఆహార ప్రయోగశాల డైరెక్టరుగ నియమించిన వ్యక్తి అని అర్థము. మరియు ఈ చట్టము క్రింద డైరెక్టరు కృత్యము లన్నింటిని గాని, వాటిలో వేటినైనను గాని నిర్వర్తించుటకై, అదేరీతిలో కేంద్ర ప్రభుత్వము నియమించిన ఏ వ్యక్తియై నను ఈ పదబంధపరిధిలో చేరియుండును:

అయితే, ఆహార పదార్ధమును దేనిన్నెనను తయారు చేయుటలో గాని, దిగుమతి చేసికొనుటలో గాని, విక్రయించుటలో గాని ఏదేని ఆర్ధికపరమైన హితముగల ఏ వ్యక్తినైనను ఈ ఖండము క్రింద డైరెక్టరు గా నియమించరాదు;

(v) "ఆహారము" అనగా ఔషధములు, నీరు మినహా, ఆహారముగ గాని, పానీయముగ గాని మనుష్యులు సేవించుటకై, ఉపయోగింపబడు ఏదేని పదార్ధము అని అర్ధము; ఈ పదపరిధిలో---

(ఏ) సాధారణముగ మనుష్యుల ఆహారములో చేరియుండు, లేక దానిని సంమిశ్రితమొనర్చుటలో గాని, తయారు చేయుటలో గాని ఉపయోగింపబడు ఏదేని పదార్ధము:

(బీ) సువాసనను కలిగించు లేక రుచికలిగించు ఏదేని పదార్ధము, మరియు

(సీ) పదార్ధము యొక్క ఉపయోగమును, నైజగుణమును, అందలి పదార్ధమును లేక నాణ్యతను దృష్టియందుంచుకొని కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచనద్వారా ఈ చట్టము నిమిత్తమై ఆహారముగా ప్రఖ్యానించునట్టి ఏదేని ఇతర పదార్ధము.

చేరియుండును.

(vi) "ఆహార (ఆరోగ్య) ప్రాధికారి" అనగా వైద్య ఆరోగ్య సేవల డైరెక్టరు అనిగాని ఏ పదవీ నామముతో పిలువబడుచున్నను, రాజ్యములోని ఆరోగ్య పరిపాలన బాధ్యతను వహించు ముఖ్య అధికారి అనిగాని అర్ధము , ఈ పదబంధ పరిధిలో రాజపత్రములో అధిసూచన ద్వారా నిర్ధిష్టపరచబడు స్థానిక ప్రాంతమునకు సంబంధించి, ఈ చట్టము క్రింద ఆహార (ఆరోగ్య) ప్రాధికారి యొక్క అధికారములను వినియోగించుటకును, కర్తవ్యములను నిర్వర్తించుటకును కేంద్ర ప్రభుత్వము గాని, రాజ్యప్రభుత్వము గాని ఆ అధిసూచన ద్వారా అధికారము నొసగునట్టి ఏ అధికారియై నను చేరియుండును;

(vii) "స్థానిక ప్రాంతము" అనగా, పట్టణ ప్రాంతమై నను , గ్రామీణ ప్రాంతమై నను, కేంద్ర ప్రభుత్వము గాని, రాజ్య ప్రభుత్వముగాని, ఈ చట్టము నిమిత్తము రాజపత్రములో అధిసూచనద్వారా స్థానిక ప్రాంతముగ ప్రఖ్యానించునట్టి ఏదేని ప్రాంతము అని అర్ధము;

(viii) "స్థానిక ప్రాధికార సంస్థ " అనగా,

(1) (ఏ) పురపాలిక అయినట్టి స్థానిక ప్రాంతమగు సందర్భములో పురపాలక మండలి, లేక పురపాలక కార్పొరేషను అని అర్ధము;

(బి) కంటోన్మెంటు అయినట్టి స్థానిక ప్రాంతమగు సందర్భములో కంటోన్మెంటు ప్రాధికార సంస్థ అని అర్ధము;

(సి) అధిసూచిత ప్రాంతము అయినట్టి స్థానిక ప్రాంతమగు సందర్భములో అధి సూచిత ప్రాంత కమిటీ అని అర్ధము:

4

(2) ఏదేని ఇతర స్థానిక ప్రాంతమగు సందర్భములో, కేంద్ర ప్రభుత్వము గాని, రాజ్య ప్రభుత్వము గాని ఈ చట్టము క్రింద విహిత పరచు నట్టి ప్రాధికార సంస్థ అని అర్ధము;

(viiiఏ) స్థానిక ప్రాంతమునకు సంబంధించి "స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి" అనగా రాజపత్రములో అధిసూచనద్వారా నిర్ధిష్ట పరచబడు నట్టి పదవీ నామముతో అట్టి ప్రాంతములో ఆరోగ్య పరిపాలన బాధ్యతను వహించుటకై కేంద్ర ప్రభుత్వము గాని, రాజ్య ప్రభుత్వము గాని ఆ అధిసూచన ద్వారా నియమించునట్టి అధికారి అని అర్ధము;

(viiiబి) "తయారీ" అను పదపరిధిలో ఆహార పదార్ధమును తయారు చేయుటకు ఆనుషంగికమైన, లేక సహాయకమై నట్టి ఏ ప్రాసెస్ యైనను చేరియుండును;

(ix) "తప్పుడు బ్రాండు వేయబడిన" - ఆహార పదార్ధము ఈ క్రింది సందర్భములలో, అనగా---

(ఏ) అది ఏ ఇతర ఆహార పదార్ధము పేరున విక్రయింపబడుచున్నదో ఆ ఇతర ఆహార పదార్ధమునకు అనుకరణ అయియుండి దానికి బదులుగా ఉపయోగించునదై యుండి, లేక మోసగించుటకు అనుకూలమగు రీతిలో దానిని పోలియుండి దాని అసలు రూపమును సూచించునట్లు సులభముగా, స్పష్టముగా కనిపించు రీతిలో లేబిలు వేయబడనిచో;

(బీ) అది ఫలాని స్థలములోని లేక దేశములోని ఉత్పత్తి, అని తప్పుడుగా తెలియజేయబడినచో;

(సీ) మరొక ఆహార పదార్ధమునకు చెందిన పేరుతో అది విక్రయించబడు చున్నచో;

(డీ) పదార్ధము చెడిపోయినదను సంగతిని కప్పిపుచ్చునటు దానికి రంగు వేసినచో, సువాసనను కలిగించినచో, లేక పూత పూసినచో, దానిని పొడి చేసినచో లేక పాలిష్ చేసినచో, లేక వాస్తవముగ పదార్ధము ఎట్లున్నదో అంతకన్న శ్రేష్టమైనదానిగ లేక దాని వాస్తవ విలువకన్న మించిన విలువకలదిగ దానిని కనుపింపజేసినచో,

(ఈ) లేబిలుపైన గాని, అన్యధాగాని దానిని గురించి తప్పుడు ప్రకటనలు చేయబడినచో;

(యఫ్) తయారీదారుచే, లేక ఉత్పత్తి దారుచేగాని, అతని కోరికపై గాని సీలువేయబడియుండి, లేక తయారు చేయబడియుండి, అతని పేరు, చిరునామా ఉన్న ప్యాకేజీలో విక్రయించునప్పుడు, ప్రతి ప్యాకేజీ వెలుపలివైపు ఆ ప్యాకేజీలో ఏమి ఉన్నదో ఈ చట్టము క్రింద విహితపరచిన వ్యత్యాస పరిమితులలో స్పష్టముగాను, కచ్చితము గాను, తెలియచేయబడనిచో;

(జి) అది ఉన్న ప్యాకేజీపై గాని, ఆ ప్యాకేజీ మీది లేబిలుపై, గాని, అందలి దినుసులను, లేక పదార్ధములను గూర్చి ఏదేని ముఖ్య వివరమునకు సంబంధించి తప్పుడు దై నట్టి , లేక తప్పుదారి పట్టించునదై నట్టి వివరణము, చిత్రణము , లేక ఆకృతి ఉన్నచో, లేక ఆ ప్యాకేజీ అందలి పదార్ధమునకు సంబంధించి ఇతర విధముగా మోసమునకు గురిచేయునదైనచో;

(హెచ్) అది ఉన్న ప్యాకేజీపై గాని, ఆ ప్యాకేజీ మీది లేబిలుపై గాని ఆ పదార్ధము యొక్క తయారీదారుగ, లేక ఉత్పత్తిదారుగ ఒక కల్పిత వ్యక్తి పేరుగాని కల్పిత కంపెనీ పేరుగాని ఉన్నచో;

5

(ఐ) అది ప్రత్యేక ఆహారముగా ఉపయోగించుటకని విదితమగుచున్నచో, లేక అట్లు ఉపయోగించుటకని దానిని గురించి ఎరుకపరచుచున్నచో, అటు ఉపయోగించు విషయమున దాని విలువను గూర్చి కొనుగోలుదారుకు చాలినంత సమాచారము నిచ్చుటకు గాను దానియందు ఉండు విటమినుల, ఖనిజముల, లేక ఇతర ఆహార పదార్ధముల గుణములకు సంబంధించి విహితపరచబడినట్టి సమాచారమును దానిలేబిలుపై తెలియజేసిననే తప్ప;

(జే) లేబిలు మీద తెలియ జేయకుండనైనను , ఈ చట్టము యొక్క లేక ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల యొక్క అపేక్షితములను ఉల్లంఘించి యైనను ఏదేని కృతిమ సువాసన, కృత్రిమ రంగు, లేక రసాయనిక పరీరక్షకము అందు ఉన్నచో;

(కే) ఈ చట్టము యొక్క లేక ఈ చట్టము కింద చేయబడిన నియమముల యొక్క అపేక్షితములననుసరించి దానికి లేబిలు వేయనిచో,

తప్పుడు బ్రాండు వేయబడినదని భావింపబడును;

( x ) "ప్యాకేజీ" అనగా ఆహార పదార్ధము ఎందులో ఉంచబడినదో, లేక ఎందులో ప్యాక్ చేయబడినదో ఆ పెట్టె, సీసా, డబ్బీ, టిన్ను, పీపా, కేసు, పాత్ర, గోనెసంచి, సంచీ, తొడుగు లేక ఇతర వస్తువు అని అర్ధము;

(xi) "ఆవరణ" అనుపదపరిధి లో ఏదేని ఆహార పదార్ధము విక్రయింపబడు, లేక విక్రయము కొరకు తయారీ చేయబడు, లేక నిలవ చేయబడు దుకాణము, కొట్టు:లేక స్థలము చేరియుండును;

(xii)"విహిత" అనగా ఈ చట్టము కింద చేయబడిన నియమముల ద్వారా విపాతపరచబడిన అని అర్ధము;

(xiiఏ) "సహజసిద్ద ఆహరము" అనగా ప్రకృతిసిద్ద రూపములో ఉన్న వ్యావసాయిక ఫలసాయముగాని తోటల ఫలసాయము గాని అయినట్టి ఏదేని ఆహార పదార్ధము అని అర్ధము;

{xiii) వ్యాకరణ రూపాంతరములతోను , సజాతీయ పదములతోను "విక్రయము" అనగా మనుష్యులు సేవించుటకు లేక ఉపయోగించుటకు గాని, విశ్లేషణము కొరకు గాని నగదుకు లేదా అరువుకు, లేదా వినిమయ పద్దతిలో టోకుగానైనను, చిల్లరగానైనను ఏదేని ఆహార పదార్శమును విక్రయించుట అని అర్ధము, ఈ పదపరిధిలో అట్టి ఏదేని పదార్ధమును గురించిన విక్రయ కరారు, ఆ పదార్ధమును విక్రయింపజూపుట, విక్రయమునకై పెట్టుట లేక విక్రయమునకై స్వాధీనము నందుంచుకొనుట చేరియుండును మరియు అట్టి ఏదేని పదార్ధమును విక్రయించుటకు చేయు ప్రయత్నము కూడ చేరియుండును;

(xiv) "మచ్చు" అనగా ఏదేని ఆహార పదార్ధము నుండి ఈ చట్టము యొక్క, లేక ఈ చట్టము క్రింద చేయబడిన ఏవేని నియమముల యొక్క నిబంధనల క్రింద తీసికొనబడిన మచ్చు అని అర్ధము:

(xv) "అనారోగ్యకరమైన", "హానికరమైన" అను పదములు ఆహార పదార్ధమునకు సంబంధించి ఉపయోగింపబడినప్పుడు అవి క్రమముగా ఆరోగ్యమునకు హానికరమైన అనియు మనుష్యులు ఉపయోగించుటకు పనికిరాని అనియు అర్ధముల నిచ్చును.

6

2-ఏ. జమ్మూకాశ్మీరు రాజ్యములో అమలులోలేని శాసనమునకు ఈ చట్టములో గల ఏదేని నిర్దేశమును, ఈ రాజ్యమునకు సంబంధించి, ఆ రాజ్యములో తత్సమాన శాసనమేదేవి అమలులో ఉన్నచో, దానిని గూర్చి చేసిన నిర్దేశముగ అన్వయించవలెను .

కేంద్ర ఆహార ప్రమాణముల కమిటీ మరియు కేంద్ర

ఆహార ప్రయోగశాల


3. (1) కేంద్ర ప్రభుత్వము. ఈ చట్టము ప్రారంభమైన తరువాత వీలైనంత త్వరగ, ఈ చట్టమును అమలు పరచుటలో ఉత్పన్నమగు విషయములపై కేంద్ర

ప్రభుత్వమునకు, రాజ్య ప్రభుత్వములకు సలహా నొసంగుటకును, ఈ చట్టము క్రింద దానికి అప్పగింపబడిన ఇతర కృత్యములను నెరవేర్చుటకును కేంద్ర ఆహార ప్రమాణముల కమిటీ అని పిలువబడు కమిటీ నొకదానిని ఏర్పరచవలెను.

ఆ కమిటీలో ఈ క్రింద తెలుపబడిన సభ్యులు ఉందురు: --

(ఏ) పదవి రీత్యా ఆరోగ్య సేవల డైరెక్టరు జనరలు--ఇతడు అధ్యక్షుడుగ ఉండవలెను:

(బి) పదవీ రీత్యా కేంద్ర ఆహార ప్రయోగశాల డైరెక్టరు లేక ఒకటి కంటే ఎక్కున కేంద్ర ఆహార ప్రయోగశాలలు స్థాపింపబడిన యెడల పదవిరీత్యా అట్టి ప్రయోగశాలల డెరెక్టర్లు,

(సీ) కేంద్ర ప్రభుత్వము నామనిర్దేశము చేయు నట్టి, నిపుణులు ఇద్దరు,

(డి) కేంద్ర ప్రభుత్వము నామనిర్వేశము చేయునట్టి వారగు కేంద్ర ఆహార మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ విభాగమునకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతినిధి, మరియు కేంద్ర వాణిజ్య, రక్షణ, పరిశ్రమలు-సరఫరా మరియు రైల్వే మంత్రిత్వ శాఖలతో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతినిధి;

(ఈ) ఒక్కొక్క రాజ్యమునుండి ఆ రాజ్య ప్రభుత్వము నామనిర్దేశము చేయునట్టి ఒక్కొక్క ప్రతినిధి:

(యఫ్) సంఘ రాజ్య క్షేత్రములకు ప్రాతినిద్యము వహించుటకై కేంద్ర ప్రభుత్వము నామనిర్దేశము చేయు నట్టి ప్రతినిధులు ఇద్దరు:

(జి) వ్యావసాయిక, వాణిజ్య, పారిశ్రామిక పరమైన హితములకు ప్రాతినిధ్యము వహించుటకై ఒక్కొక్క దానినుండి కేంద్ర ప్రభుత్వము: నామనిర్దేశము చేయు నట్టి ఒక్కొక్క ప్రతినిధి;

(జీజీ) వినిమయదార్ల హితములకు ప్రాతినిధ్యము వహించుటకై కేంద్ర ప్రభుత్వము నామనిర్దేశము చేయునట్టి ప్రతినిదులు ఐదుగురు వీరిలో ఒకరు హోటలు పరిశ్రమకు చెందిన వారై యుండవలెను;

(హెచ్) వైద్య వృత్తి నుండి భారత వైద్య పరిశోధనా పరిషతు, నామనిర్దేశము చేయునట్టి ప్రతినిధి ఒకరు:

(ఐ) భారత ప్రమాణముల సంస్థ (ద్రువీకరణ చిహ్నముల) చట్టము, 1952 యొక్క 2వ పరిచ్ఛేదపు ఖండము (ఈ) లో నిర్దేశింపబడిన భారత ప్రమాణముల సంస్థ నామనిర్ధేశము చేయు నట్టి ప్రతినిధి ఒకరు

7

(3) ఉపపరిచ్ఛేదము (2) నందలి (సీ), (డీ). (ఈ), (యఫ్). (జి). (జీజీ).(హెచ్) మరియు (ఐ) ఖండములలో నిర్దేశింపబడిన కమిటీ సభ్యులకు, రాజీనామా వలన గాని, మరణము వలన గాని, అన్యథా గాని వారి స్థానములు ఖాళీ అయిననే తప్ప, మూడు సంవత్సరముల వరకు, పదవి యందుండుటకు హక్కు ఉండును. మరియు వారు తిరిగి నామనిర్దేశము చేయబడుటకు అర్హులై. యుందురు.

(4) కమిటీలో ఏదేని ఖాళీ ఏర్పడి ఉన్నప్పటికినీ కమిటీ తన కృత్యములను నిర్వర్తించవచ్చును.

(5) కమిటీ తాను సబబని తలచునట్టి మరియు సబబని తలచునన్ని సబ్--కమిటీలను నియమించవచ్చును. కమిటీ సభ్యులు కానట్టి వ్యక్తులను అట్టి సబ్--కమిటీలలో సభ్యులుగా నియమించవచ్చును. కమిటి విధించునట్టి షరతు లేవేని ఉన్నచో వాటికి లోబడి వారు తమకు కమిటీ ప్రత్యాయోజనచేయు నట్టి అధికారములను వినియోగించవలెను, అట్టి కర్తవ్యములను నిర్వర్తించవలెను.

(6) కేంద్ర ప్రభుత్వము యొక్క పూర్వామోదమునకు లోబడి, కమిటీ, తన ప్రక్రియను క్రమబద్ద పరచుటకును, తన కార్యకలాపమును జరుపుకొనుటకును ఉపవిధులు చేయవచ్చును.

3-ఏ. (1) కేంద్ర ప్రభుత్వము కమిటీకి ఒక కార్యదర్శిని నియమించవలెను అతడు విహితపరచబడునట్టి లేక కమిటీ తనకు ప్రత్యాయోజనచేయు నట్టి అధికారములను, కమిటీ యొక్క నియంత్రణ, ఆదేశముల క్రింద వినియోగించవలెను. మరియు అట్టి కర్తవ్యములను నిర్వర్తించవలెను.

(2) కేంద్ర ప్రభుత్వము, తాను ఆవశ్యకమని తలచునట్టి గుమాస్తాలను, ఇతర సిబ్బందిని, కమిటీకి ఏర్పాటు చేయవలెను;

4. (1) ఈ చట్టము ద్వారా గాని, ఈ చట్టము క్రింద చేయబడిన ఏవేని నియమముల ద్వారా గాని కేంద్ర ఆహార ప్రయోగశాలకు అప్పగింపబడిన కృత్యములను అది నెరవేర్చుటకై కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధి సూచన ద్వారా ఒక కేంద్ర ఆహర ప్రయోగశాలను గాని అంతకంటే ఎక్కువ అట్టి ప్రయోగశాలలను గాని స్థాపించవలెను.

అయితే, కేంద్ర ప్రభుత్వము, రాజపత్రములో అధి సూచన ద్వారా ఈ చట్టము నిమిత్తము ఏదేని ప్రయోగశాలనై నను సంస్థనై నను కేంద్ర ఆహార ప్రయోగశాలగ నిర్ధిష్టపరచవచ్చును.

(2) కేంద్ర ప్రభుత్వము కమిటీని సంప్రదించిన తరువాత--

(ఏ) కేంద్ర ఆహార ప్రయాగశాల యొక్క కృత్యములను, అట్టి కృత్యములను ఏ స్థానిక ప్రాంతము, లేక ప్రాంతములలో నెరవేర్చవలెనో ఆ స్థావర ప్రాంతమును, లేక ప్రాంతములను;

(బీ) విశ్లేషణము కొరకు గాని, పరీక్షల కొరకు గాని ఆహార పదార్ధముల మచ్చులను సదరు ప్రయోగశాలకు సమర్పించుట కొరకైన ప్రక్రియను, వాటిపై ప్రయోగశాల ఇచ్చు రిపోర్టుల పరూపములను, అట్టి రిపోర్టుల విషయమున చెల్లించవలసిన ఫీజును;

(సీ) సదరు ప్రయోగశాల తన కృత్యములను నెరవేర్చుటలో దానికి, వీలు కలిగించుటకై ఆవశ్యకమగునట్టి లేక ఉపయుక్తమగు నట్టి ఇతర విషయములను

విహితపరచుచు నియమములను చేయవచ్చును.

ఆహారమును గూర్చిన సాధారణ నిబంధనలు

5. ఏ వ్యక్తి యు ---

(i) కల్తీ చేయబడిన ఆహారమును దేనినై నను;

(ii) తప్పుడు బ్రాండు వేయబడిన ఆహారమును దేనినై నను;

(iii) దిగుమతి చేసికొనుటకు లైసెన్సు విహితపరచబడిన ఆహార పదార్ధమును, దేనినైనను ఆ లైసెన్సు షరతుల ననుసరించి తప్ప; మరియు

(iv) ఈ చట్టము యొక్క, లేక ఈ చట్టము క్రింద చేయబడిన ఏదేని నియమము యొక్క ఏ ఇతర నిబంధననై నను ఉల్లంఘించి ఆహార పదార్ధమును దేనినైనను--

భారతదేశములోనికి దిగుమతి చేయరాదు.

6. (1) సముద్ర కస్టమ్సుకును, సముద్ర కస్టమ్సు చట్టము, 1878 యొక్క 18వ పరిచ్ఛేదము ద్వారా ఏ సరుకుల దిగుమతి నిషేధింపబడినదో ఆ సరుకులకును సంబంధించి తత్సమయమున అమలు నందున్న శాసనము, ఈ చట్టము యొక్క 5వ పరిచ్ఛేదము క్రింద ఏ ఆహార పదార్ధముల దిగుమతి నిషేధింపబడినదో ఆ ఆహార పదార్ధముల విషయమున ఈ చట్టము యొక్క 16వ పరిచ్ఛేదపు నిబంధనలకు లోబడి వర్తించును, మరియు కస్టమ్సు అధికారులకును ఆ చట్టము ద్వారా కస్టమ్సు కలెక్టరుకు, ఇతర కస్టమ్సు అధికారులకు అప్పగించబడిన కర్తవ్యములను నిర్వర్తించుటకు ఆ చట్టము కింద అధికారము ఈయబడిన అధికారులకును, పైన చెప్పబడినట్టి సరుకుల విషయమున వారికి తత్సమయమున ఉన్నట్టి అధికారములే అట్టి ఆహార పదార్ధముల విషయమున ఉండును.

(2) ఉపపరిచ్ఛేదము (1) యొక్క నిబంధనలకు భంగము కలుగకుండ కస్టమ్సు కలెక్టరు గాని, కేంద్ర ప్రభుత్వము ఈ విషయమున ప్రాధికార మొసగినట్టి ఎవరేని ప్రభుత్వ అధికారి గాని, ఈ చట్టము యొక్క 5వ పరిచ్ఛేదము క్రింద దిగుమతి చేసికొనుట నిషేధింపబడినట్టి ఏదేని ఆహార పదార్ధము ఉన్నటు తాను అనుమానించు నట్టి దిగుమతియైన ఏదేని ప్యాకేజీని నిరోధించి ఉంచవచ్చును. అట్లు నిరోధించుటను గూర్చి వెంటనే కేంద్ర ఆహార ప్రయోగశాల డెరెక్టరుకు రిపోర్చు చేయవలెను. అతడు కోరినచో, ఆ ప్యాకేజీనై నను. అందు కనుగొనబడిన ఏదేని అనుమానాస్పద ఆహార పదార్ధపు మచ్చులనై నను సదరు ప్రయోగశాలకు పంపవలెను.

7. ఏ వ్యక్తి యెనను తాను స్వయముగా గాని, తన తరఫున ఎవరేని వ్యక్తి ద్వారా గాని---

(i) కల్తీ చేయబడిన ఆహారమును దేనినై నను;

(ii) తప్పుడు బ్రాండు వేయబడిన ఆహారమును దేనినై నను;

(iii) విక్రయమునకు లైసెన్సు విహిత పరచబడిన ఆహార పదార్ధమును దేనినైనను, ఆ లైసెన్సు యొక్క షరతుల ననుసరించి తప్ప,

(iv) ప్రజారోగ్య హితము దృష్టా ఆహార (ఆరోగ్య) ప్రాధికారిచే తత్సమయమున విక్రయము నిషేధింపబడినట్టి ఆహార పదార్ధమును దేనినైనను;

(v) ఈ చట్టము యొక్క, లేక ఈ చట్టము క్రింద చేయబడిన ఏదేని నియమము యొక్క ఏ ఇతర నిబంధననై నను ఉల్లంఘించి, ఆహార పదార్ధమును దేనినైనను; లేక

9

iv) కల్తీకి ఉపయోగపడు దానిని దేనినైనను--

విక్రయించుటకై తయారు చేయరాదు, లేక నిలవ చేయరాదు, విక్రయించరాదు, లేక పంపిణీ చేయరాదు.

విశదీకరణము:- ఈ పరిచ్ఛేదము నిమిత్తము, ఒక వ్యక్తి, ఏదేని కల్తీ చేయబడిన ఆహారమును గాని, తప్పుడు బ్రాండు వేయబడిన ఆహారమును గాని, ఖండము (iii)లేక ఖండము (iv), లేక ఖండము (v) లో నిర్దేశింపబడిన ఏదేని ఆహార పదార్ధమును గాని దానినుండి విక్రయమునకై ఏదేని ఆహార పదార్ధమును తయారు చేయుటకుగాను, నిలవచేసినచో అతడు అట్టి ఆహారమును నిలవ చేసినట్లు భావించవలెను.

ఆహార విశ్హ్లేషణము

8. కేంద్ర ప్రభుత్వము, లేక రాజ్య ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా, విహితపరచబడునట్టి అర్హతలు కలిగియుండి యోగ్యులని తాము తలచు నట్టి వ్యక్తులను, కేంద్ర ప్రభుత్వమై నను, లేక సందర్భానుసారముగ రాజ్య ప్రభుత్వ మైనను, వారికి ప్రత్యేకించు నట్టి స్థానిక ప్రాంతములలో పబ్లికు విశ్లేషకులుగా నియమించవచ్చును;

అయితే, ఏదేని ఆహార పదార్ధ ము యొక్క తయారీ, దిగుమతి లేక విక్రయములో ఏదైన ఆర్థికపరమైన హితముగల ఏ వ్యక్సినైనను ఈ పరిచ్ఛేదము క్రింద పబ్లికు విశ్లేషకునిగా నియమించరాదు:

అంతేకాక, వేరువేరు రకముల ఆహార పదార్ధముల విషయమున వేరు వేరు పబ్లికు విశ్లేషకులను నియమించవచ్చును.

9. (1) కేంద్ర ప్రభుత్వము, లేక రాజ్య ప్రభుత్వము రాజపత్రములో అధి సూచనద్వారా, విహితపరచబడినట్టి అర్హతలు కలిగియుండి యోగ్యులని తాము తలచు నట్టి వ్యక్తులను, కేంద్ర ప్రభుత్వమైనను, లేక సందర్భానుసారముగ రాజ్య ప్రభుత్వమ్మెనను వారికి ప్రత్యేకించునట్టి స్ఠానిక ప్రాంతములలో ఆహార ఇన్ స్పెక్టర్లుగా నియమించవచ్చును:

అయితే, ఏదేని ఆహార పదార్ధము యొక్క తయారీ, దిగుమతి, లేక విక్రయములో ఏదైన ఆర్ధికపరమైన హితము గల ఏ వ్యక్తినైనను ఈ పరిచ్ఛేదము క్రింద ఆహార ఇన్ స్పెక్టర్లుగా నియమించరాదు.

(2) ప్రతి యొక ఆహార ఇన్ స్పెక్టరు, భారత శిక్షా స్మృతి యొక్క 21వ పరిచ్ఛేద భావములో పబ్లికు సేవకుడుగ భావింపబడి, తనను నియమించునట్టి ప్రభుత్వము ఈ విషయమున నిర్ధిష్టపరచినట్టి ప్రాధికారికి అధికారరీత్యా ఆధీనస్థుడై యుండును.

10. (1) ఆహార ఇన్ స్పెక్టరుకు --

(ఏ) ఏదేని ఆహార పదార్ధపు మచ్చులను --

(i) అట్టి పదార్ధమును విక్రయించు ఏ వ్యక్తి నుండియై నను;

(ii) అట్టి పదార్ధమును కొనుగోలుదారుకు గాని, గ్రాహకునకు గానీ రవాణాచేయు, అందజేయు, లేక అందజేయుటకు సిద్ధపడుచున్న ఏ వ్యక్తి నుండి యైనను;

10

(iii) అట్టి ఏ పదార్ధమునై నను గ్రాహకునకు అందజేసిన తరువాత అతని నుండి

తీసికొనుటకు; మరియు (బీ) ఆ మచ్చు తీసికొనబడిన స్థానిక ప్రాంతపు పబ్లికు విశ్లేషకునకు అట్టి మచ్చును విశ్లేషణము కొరకు పంపుటకు;

(సి) సంబంధిత స్థానిక ప్రాంతములలో అధికారిత కలిగిన స్ఠానిక (ఆరోగ్య )ప్రాధికారి పూర్వామోదముతోగాని, ఆహార (ఆరోగ్య) ప్రాధికారి పూర్వామోదముతోగాని ప్రజారోగ్య హితము దృష్ట్యా ఏ ఆహార పదార్ధపు విక్రయమునై నను నిషేధించుటకు,

అధికారము ఉండును.

విశదీకరణము:- ఖండము (ఏ) యొక్క ఉపఖండము (iii) నిమిత్తము, "గ్రాహకుడు" అను పదపరిధి లో తానే సేవించుటకు ఏ ఆహార పదార్ధమునైనను కొనుగోలు చేయు, లేక స్వీకరించు వ్యక్తి, చేరియుండడు.

(2) ఏ ఆహార ఇన్ స్పెక్టరైనను, ఏదేని ఆహార పదార్ధమును తయారీచేయు, లేక విక్రయము కొరకు నిలవచేయు, లేక విక్రయించుటకై మరేదేని ఇతర ఆహార పదార్ధపు తయారీ కొరకు నిలవచేయు లేక విక్రయము కొరకు పెట్టు, లేక ప్రదర్శించు, లేక కల్తీకి ఉపయోగపడు దానిని తయారుచేయు, లేక ఉంచు ఏ స్థలమునందైనను ప్రవేశించి తనిఖీ చేయవచ్చును. అట్టి ఆహార పదార్ధపు మచ్చులను లేక కల్తీకి ఉపయోగపడు దాని యొక్క మచ్చులను విశ్లేషణము కొరకు తీసికొనవచ్చును:

అయితే, సహజసిద్ధ ఆహారమై నట్టి ఏ ఆహార పదార్ధపు మచ్చునై నను, అది అట్టి ఆహారముగ విక్రయించుటకు ఉద్దేశించబడనిచో, ఈ పరిచ్ఛేదము క్రింద తీసికొనరాదు.

(3) ఉపపరిచ్ఛేదము (1) యొక్క ఖండము (ఏ) కింద గాని, ఉపపరిచ్ఛేదము (2) కింద గాని ఏదేని మచ్చును తీసికొనిన యెడల, ఆ పదార్ధము సాధారణముగ ప్రజలకు ఏ రేటున విక్రయింపబడుచున్నదో ఆ రేటున దాని ఖరీదును లెక్క కట్టి, దానిని ఏ వ్యక్తి నుండి తీసికొనినారో అతనికి చెల్లించ వలెను.

(4) ఆహారము కొరకు ఉద్దేశింపబడిన ఏదేని పదార్ధము కల్తీ చేయబడినట్లు, లేక తప్పుడు బ్రాండు వేయబడినట్లు ఏ ఆహార ఇన్ స్పెక్టరుకై నను తోచినచో, అతడు ఇందు ఇటు తరువాత గల నిబంధనల ప్రకారము దాని విషయమున చర్య గైకొనుటకు గాను ఆ పదార్ధమును అభిగ్రహించి, తీసికొని పోవచ్చును , లేక దానిని విక్రయదారు యెద్ద సురక్షితమైన అభిరక్షలో ఉంచవచ్చును. ఈ రెండు సందర్భములలో దేనియందైనను అతడు అట్టి పదార్ధపు మచ్చును తీసికొని దానిని విశ్లేషణము కొరకు పబ్లికు విశ్లేషకునకు సమర్పించవలెను:

అయితే, ఆహార ఇన్ స్పెక్టరు అట్టి పదార్ధ మును విక్రయదారు యొద్ద సురక్షితమైన అభిరక్షలో ఉంచిన యెడల, ఇన్ స్పెక్టరు తాను సబబని తలచునట్లు ఒక జామీను దారుతో గాని, అంతకెక్కువ మంది జామీనుదార్లతో గాని అట్టి పదార్ధపు విలువకు సమానమైన డబ్బు మొత్తమునకు బాండును నిష్పాదించవలెనని విక్రయదారును కోరవచ్చును. విక్రయదారు తదనుసారముగా బాండును నిష్పాదించవలెను.

(4-ఏ) ఉపపరిచ్ఛేదము (4) క్రింద అభిగ్రహింపబడిన ఏదేని ఆహార పదార్ధము పాడైపోవు స్వభావము కలదై యుండి అట్టి ఆహార పదార్ధము మనుష్యులు సేవించుటకు

11

పనికిరానంతగా చెడిపోయినదని స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి అభిప్రాయపడిన యెడల, సదరు ప్రాధికారి విక్రయదారుకు వ్రాతమూలక నోటీసు నిచ్చిన తరువాత దానిని నాశము చేయించవచ్చును.

(5) ఈ పరిచ్ఛేదము ద్వారా ఒసగబడిన అధికారములో ఏదేని ఆహార పదార్ధము ఉన్న ప్యాకేజీని పగులగొట్టి తెరచు అధికారము, లేక ఏ ఆహార పదార్ధమునైనను విక్రయము కొరకు ఉంచబడినట్టి ఏదేని ఆవరణ తలుపును పగులగొట్టి తెరచు అధికారము చేరియుండును:

అయితే, ప్యాకేజీని గానీ, తలుపును గాని పగులగొట్టి తెరచునట్టి అధికారమును, ప్యాకేజీ సొంతదారు, లేక దాని బాధ్యతగల లేక సందర్భానుసారముగ ఆవరణమును తన ఆక్రమణము నందుంచుకున్న ఎవరేని ఇతర వ్యక్తి, అచట హాజరు నందున్నచో ప్యాకేజిని, లేక తలుపును తెరవవలెనని అతనిని ఆదేశించిన మీదట అతడు అట్లు చేయుటకు నిరాకరించిన తరువాత, ఈ రెంటిలో ఏ సందర్భములోనైనను అట్లు చేయుటకు గల కారణములను వ్రాసియుంచిన తరువాత మాత్రమే, వినియోగించవలెను:

అంతేకాక, ఆహార ఇన్ స్పెక్టరు ఈ పరిచ్ఛేదము క్రింద ఏ స్థలములోనైనను ప్రవేశించి తనిఖీ చేయు అధికారములను వినియోగించుటలో, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 కింద జారీ చేయబడిన సోదా వారంటును అమలు పరచుటలో ఒక పోలీసు అధికారి ఏదేని స్థలమును సోదాచేయుటకు, లేక తనిఖీ చేయుటకు సంబంధించి ఆ స్మృతిలో గల నిబంధనలను వీలైనంత మేరకు అనుసరించవలెను.

(6) ఏదేని ఆహార పదార్ధ ము యొక్క తయారీదారు, లేక పంపిణీదారు, లేక వ్యాపారస్థుని స్వాధీనమునందుగాని, అందుకై అతని ఆక్రమణమునందున్న ఏదేని ఆవరణయందు గాని దొరికినదై దానిని స్వాధీనము నందుంచుకొనినందుకు అతడు ఆహార ఇన్ స్పెక్టరుకు తృప్తిగా సమాధానము చెప్పజాలనట్టి కల్తీకి ఉపయోగపడు దానిని దేనినైనను మరియు అతని స్వాధీనము నందు గాని, నియంత్రణ యందు గాని ఉన్నట్లు, కనుగొనబడి, ఈ చట్టము క్రింది ఏదేని దర్యాప్తు కైనను, లేక చర్యకైనను ఉపయోగకరమగు లేక సంబద్దమైనవగు ఏవేని ఖాతా పుస్తకములను, లేక ఇతర దస్తావేజులను ఆహార ఇన్ స్పెక్టరు అభిగ్రహించ వచ్చును. అట్లు, కల్తీకి ఉపయోగపడు దాని యొక్క మచ్చును విశ్లేషణము కొరకు పబ్లికు విశ్లేషకునకు సమర్పించవచ్చును.

అయితే, ఆహార ఇన్ స్పెక్టరు అధికార రీత్యా ఏ ప్రాధికారికి అధీనస్థుడో ఆ ప్రాధికారి పూర్వామోదముతో తప్ప, అట్టి ఖాతా పుస్తకములను గాని, ఇతర దస్తావేజులను గాని అభిగ్రహించరాదు.

(7) ఆహార ఇన్ స్పెక్టరు ఉపపరిచ్ఛేదము (1) యొక్క ఖండము (ఏ) క్రింద, ఉపపరిచ్ఛేదము (2) , ఉపపరిచ్ఛేదము (4), లేక ఉపపరిచ్ఛేదము (6) క్రింద ఏదేని చర్యను తీసికొనిన యెడల, అతడు అట్టి చర్యను తీసికొనునప్పుడు ఒకరిని, లేక అంతకెక్కువ మందిని హాజరు కావలసినదిగ పిలిచి అతని సంతకమును లేక వారి సంతకములను తీసికొనవలెను.

(7-ఏ) ఆహార ఇన్ స్పెక్టరు ఉపపరిచ్ఛేదము (6) కింద ఏవేని ఖాతా పుస్తకములను గాని, ఇతర దస్తావేజులను గాని అభిగ్రహించిన యెడల, వాటిని ఏ వ్యక్తి నుండి అభిగ్రహించినాడో ఆ వ్యక్తి, ధ్రువీకరించినట్లుగా వాటి నకళ్లను గాని, వాటినుండి ఉదాహృతులను గాని విహిత పరచబడినట్టి రీతిలో తీసికొనిన తరువాత వాటిని అభిగ్రహించిన తేదీనుండి ముప్పది దినములకు మించని' కాలావధిలోపల ఆ వ్యక్తికి వాపసు చేయవలెను:

అయితే, అట్టి వ్యక్తి, అట్లు ధ్రువీకరించుటకు నిరాకరించియుండి ఈ చట్టము క్రింద, అతనిపై అభియోగము తేబడియుండిన యెడల, న్యాయస్థానము ధ్రువీకరించినట్లు అట్టి ఖాతా పుస్తకములను మరియు ఇతర దస్తావేజుల నకళ్లను, లేక వాటి నుండి ఉదాహృతులను తీసికొనిన తరువాతనే వాటిని అతనికి వాపసు చేయవలెను.

12

(7-బీ) ఉపపరిచ్ఛేదము (6) కింద కల్తీకి ఉపయోగపుడు దానిని దేనినైనను అభిగ్రహించినప్పుడు, అధి కల్తీ, చేయుటకు ఉద్దేశింపబడినది కాదని రుజువు చేయు భారము అట్టి కల్తీకి ఉపయోగపడునది ఎవరి స్వాదీనమునుండి అభిగ్రహించబడినదో ఆ వ్యక్తి పై, ఉండును.

(8) ఆహార ఇన్ స్పెక్టరు ఎవరైనను తాను ఎవరి నుండి మచ్చు తీసికొనెనో, లేక ఆహార పదార్ధమును అభిగ్రహించెనో ఆ వ్యక్తి యొక్క వాస్తవమైన పేరును, నివాసమును కనుగొను నిమితమై పోలీసు అధికారికి క్రిమినలు ప్రకియా స్మృతి, 1973 యొక్క 42వ పరిచ్ఛేదము క్రింద ఉన్న అధికారములను వినియోగించ వచ్చును.

(9) ఈ చట్టము క్రింద గాని, ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల క్రింద గాని అధికారములను వినియోగించుచు--

(ఏ) వేసరించుటకును, సహేతుకమైన అనుమానాధారములు లేకుండను, ఏదేని ఆహార పదార్ధమును, లేక కల్తీకి ఉపయోగపడు దానిని అభిగ్రహించు; లేక

(బి) తన కర్తవ్యమును నిర్వహించుటకై ఏదేనీ ఇతర కార్యమును చేయుట ఆవశ్యకమని విశ్వసించుటకు కారణము లేకుండ, ఏ వ్యక్తి కైనను హానికలిగించునట్లు అట్టి కార్యమును చేయు,

ఆహార ఇన్ స్పెక్టరెవర్నెనను, ఈ చట్టము క్రింద అపరాధము చేసినవాడై, అట్టి అపరాధము కొరకు ఐదువందల రూపాయలకు తక్కువ కాకుండ, అయితే వేయి రూపాయల దాకా ఉండగల జుర్మానాతో శిక్షింపబడదగియుండును.

11. (1) ఆహార ఇన్ స్పెక్టరు విశ్లేషణము కొరకు ఆహారపు మచ్చును తీసికొనినప్పుడు, అతడు--

(ఎ) ఆ మచ్చును ఎవరి నుండి తీసికొనినాడో ఆ వ్యక్తి కిని, పరిచ్ఛేదము 14-ఎ క్రింద ఎవరి పేరు, చిరునామా, ఇతర వివరములు వెల్లడి అయినచో ఆ వ్యక్తి, ఎవరేని ఉన్నటి ఆ వ్యక్తి కిని, ఆ మచ్చును విశ్లేషణ చేయించు ఉద్దేశము తనకు గలదని అప్పటికప్పుడే అక్కడే వ్రాత మూలకముగ నోటీసు నీయవలెను.

(బీ) ఈ చట్టము క్రింది నియమములద్వారా నిబంధనలు చేయబడిన ప్రత్యేక సందర్భములలో తప్ప, ఆ మచ్చును అప్పటికప్పుడే అక్కడే మూడు భాగములుగ విభజించి ప్రతియొక భాగమునకు గుర్తు పెట్టి సీలు వేసి లేక దాని స్వభావమును బట్టి అనువైన రీతిలో గట్టిగా బిగించి కట్టి మచ్చును ఎవరినుండి తీసికొనెనో ఆ వ్యక్తి, సంతకమును, లేక వేలి ముద్రను విహిత పరచబడినట్టి స్థానములో మరియు ఆ రీతిలో తీసికొనవలెను:

అయితే, అట్టి వ్యక్తి, సంతకము చేయుటకు గాని, వ్రేలి ముద్ర వేయుటకు గాని నిరాకరించిన యెడల, ఆహార ఇన్ స్పెక్టరు ఒకరు, లేక అంతకెక్కువ మంది సాక్షులను పిలిపించి సందర్భానుసారముగ అతని సంతకమునుగాని, వారి సంతకములను గాని, వ్రేలిముద్రలను గాని అట్టి వ్యక్తి, సంతకమునకు, లేక వ్రేలిముద్రకు బదులుగా తీసికొన వలెను:

(సీ) (i) ఆ భాగములలో ఒక దానిని విశ్లేషణము కొరకు పబ్లికు విశ్లేషకునకు పంపించి ఆ విషయమును స్థానిక (ఆరోగ్య) ప్రాధికారికి తెలియజేయవలెను; మరియు

(ii) మిగిలిన రెండు భాగములను ఈ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (2) మరియు 13వ. పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదములు (2-ఏ) మరియు (2-ఈ)ల నిమిత్తము స్థానిక (ఆరోగ్య) ప్రాధికారికి పంపవలెను.

13

(2) ఉపపరిచ్ఛేదము (1) యొక్క ఖండము (సీ) లోని ఉపఖండము (i) క్రింద పబ్లికు విశ్లేషకునకు పంపబడిన మచ్చుయొక్క భాగము పోయినచో, లేక చెడిపోయినచో, పబ్లికు విశ్లేషకుడుగాని, ఆహార ఇన్ స్పెక్టరుగాని స్థానిక (ఆరోగ్య) ప్రాధికారిని కోరిన మీదట, అతడు సదరు ఖండము (సీ) యొక్క ఉపఖండము (ii) క్రింద తనకు పంపబడిన మచ్చు యొక్క భాగములలో ఒక దానిని విశ్లేషణము కొరకు పబ్లికు విశ్లేషకునకు పంపవలెను.

(3) 10వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1), లేక ఉపపరిచ్ఛేదము (2) క్రింద ఏదేని ఆహార పదార్ధము యొక్క, లేక కల్తీకి ఉపయోగపడు దాని యొక్క మచ్చును తీసికొనినప్పుడు, ఆహార ఇన్ స్పెక్టరు ఆ వెనువెంటనే వచ్చు పనిదినమున సందర్భానుసారముగ ఆహార పదార్ధము యొక్క మచ్చును గాని కల్తీకి ఉపయోగపడు దాని, యొక్క, మచ్చును గాని ఆ రెంటి మచ్చులను గాని మచ్చుల విషయములో విహితపరచబడిన నియమముల ననుసరించి సంబంధిత స్థానిక ప్రాంతపు పబ్లికు విశ్లేషకునకు పంపవలెను.

(4) 10వ పరచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (4-ఏ) క్రింద నాశనమొనర్చబడిననే తప్ప ఆ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (4) కింద అభిగ్రహించబడిన ఆహార పదార్ధమును. మరియు ఆ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (6) క్రింద అభిగ్రహించబడినట్టి కల్తీకి ఉపయోగపడు దానిని దేనినై నను వీలైనంత త్వరగా మరియు ఎట్టి సందర్భములోను పబ్లికు విశ్లేషకుని రిపోర్టు అందిన తరువాత ఏడు దినములకు మించి ఆలస్యము కాకుండ, మేజీస్ట్రేటు సమక్షమున పెట్టవలెను:

అయితే, ఏదేని ఆహార పదార్ధము ఎవరినుండి అభిగ్రహించబడినదో ఆ వ్యక్తి, ఈ విషయమున మేజిస్ట్రేటుకు దరఖాస్తు పెట్టినచో, మేజిస్ట్రేటు వ్రాత మూలకమైన ఉత్తరువు ద్వారా ఆ ఉత్తరువులో నిర్ధిష్టపరచబడిన గడువు లోపల అట్టి పదార్ధమును తన సమక్షమున పెట్టవలెనని ఆహార ఇన్ స్పెక్టరును ఆదేశించవలెను.

(5) మేజిస్ట్రేటు ఆవశ్యకమని తాను భావించునట్టి సాక్ష్యమును తీసికొనిన మీదట-

(ఏ) ఉపపరిచ్ఛేదము (4) క్రింద తన సమక్షమున పెట్టబడిన ఆహార పదార్ధము కల్తీ చేయబడినదై నట్లు, లేక తప్పుడు బ్రాండు వేయబడినదై నట్లు, అతనికి తోచినచో, అతడు, ఆ ఆహార పదార్ధము-

(i) సమపహరణము చేయబడి సందర్భానుసారముగ కేంద్ర ప్రభుత్వమునకు గాని, రాజ్య ప్రభుత్వమునకు గాని స్థానిక ప్రాధికార సంస్థకు గాని, చెందవలెననని; లేక

(ii) మనుష్య ఆహారముగ దానిని ఉపయోగించుటను నివారించునట్లు సొంతదారు యొక్క లేక దానిని ఎవరినుండి అభిగ్రహించినారో ఆ వ్యక్తి యొక్క ఖర్చుపై నాశనమొనర్చబడవలెనని; లేక

(iii) మోసపు పేరుతో దానిని మరల విక్రయమునకు పెట్టుటను, లేక ఆహారముగ ఉపయోగించుటను నివారించునట్లు వ్యయనము చేయబడవలెనని; లేక

(iv) సొంతదారు జామీను దార్లతో గాని, జామీనుదార్లు లేకుండ గాని బాండును నిష్పాదించిన మీదట, దాని సరియైన పేరుతో విక్రయించుటకు, లేక ఆ ఆహార పదార్ధమును తిరిగి ప్రాసెస్ చేసిన తరువాత మనుష్యులు సేవించుటకు విహితపరచబడిన ప్రమాణముల కనుగుణమైన దానిగ చేయగలుగ వచ్చునని మెజిస్ట్రేటు అభిప్రాయపడిన యెడల, ఉత్తరువులో నిర్ధిష్ట పరచబడినట్టి, అధికారి యొక్క పర్యవేక్షణ క్రింద తిరిగి ప్రాసెస్ చేసిన తరువాత విక్రయించుకొనుటకై. అతనికి వాపసు చేయబడవలెనని --

14

ఉత్తరువు చేయవచ్చును;

(టీ) 10వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (6) కింద అభిగ్రహించి తన సమక్షమున పెట్టబడినట్టి కల్తీకి ఉపయోగపడునది ఏదైనను, - కల్తీ చేయు నిమిత్తమె వినియోగించు రకపుదని స్పష్టముగ కనపడుచున్నటు అతనికి తోచినచో, దానిని స్వాధీనము నందుంచుకొని నందుకు సందర్భానుసారముగ తయారీదారు, పంపిణీదారు, లేక వ్యాపారస్థుడు తృప్తికరమైన సమాధానమును చెప్పజాలనిచో, అది సమపహరణము చేయబడి సందర్భానుసారముగ కేంద్ర ప్రభుత్వమునకు గాని, రాజ్య ప్రభుత్వమునకు గాని, స్థానిక ప్రాధికార సంస్థకు గాని చెందవలెనని అతడు ఉత్తరువు చేయవచ్చును.

(6) (ఏ) ఏదేని అట్టి ఆహార పదార్ధము కల్తీ, చేయబడలేదని, లేక

(బీ) కల్తీ కి ఉపయోగపడుదానిగ విదితమగునట్టిది అట్లు ఉపయోగపడునది కాదని, మెజిస్ట్రేటుకు తోచినచో, ఎవరి స్వాధీనమునుండి ఆ ఆహార పదార్ధము, లేక కల్తీకి ఉపయోగపడునది తీసికొనబడినదో ఆ వ్యక్తి, దానిని తిరిగి పొందుటకు హక్కు ఉండును, అట్టి, వ్యక్తికి కలిగిన వాస్తవమైన నష్టమునకు మించకుండ మెజిస్ట్రేటు సముచితమని తలచినట్టి నష్టపరిహారమును, ఈ విషయమున రాజ్య ప్రభుత్వము ఆదేశించునట్టి నిధినుండి అతనికి ఇప్పించుట మెజిస్ట్రేటు విచక్షణాధీనమై యుండును.

12. ఏదేని ఆహార పదార్ధమును కొనిన కొనుగోలుదారు తాను ఆహార ఇన్ స్పెక్టరు కాకున్నను, లేక గుర్తింపుపొందిన వినియోగదార్ల సంఘము, ఆ సంఘములో కొనుగోలుదారు సభ్యుడైనను కాకున్నను విహిత పరచినట్టి ఫీజును చెల్లించినమీదట అట్టి పదార్ధమును. పబ్లికు విశ్లేషకునిచే విశ్లేషణ చేయించుటను, పబ్లికు విశ్లేషకుని నుండి విశ్లేషణ రిపోర్టును పొందుటను ఈ చట్టములోనున్న దేదియు నివారించదు:

అయితే, అట్టి కొనుగోలుదారు లేక గుర్తింపు పొందిన వినియోగదార్ల సంఘము ఆ పదార్ధమును విశ్లేషణచేయించు ఉద్దేశము తనకు గలదని కొనుగోలుచేయు సమయమున విక్రయదారుకు తెలియజేయవలెను:

అంతేకాక, 11వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1), ఉపపరిచ్ఛేదము(2) మరియు ఉపపరిచ్ఛేదము (3) యొక్క నిబంధనలు విశ్లేషణము కొరకు ఆహారపు మచ్చును తీసికొను ఆహార ఇన్ స్పెక్టరుకు వర్తించునట్లే, అవి ఆహార పదార్ధమును అట్లు, విశ్లేషణ చేయించవలెనని ఉద్దేశించిన ఆహార పదార్ధపు కొనుగోలుదారుకు, లేక గుర్తింపు పొందిన వినియోగదార్ల సంఘమునకు వీల్కెనంతవరకు వర్తించును:

అయితే ఇంకను, ఆహార పదార్ధము కల్తీ చేయబడినదై నట్లు పబ్లికు విశ్లేషకుని రిపోర్టు తెలుపుచో, ఈ పరిచ్ఛేదము క్రింద కొనుగోలుదారు, లేక గుర్తింపుపొందిన వినియోగదార్ల సంఘము చెల్లించిన ఫీజును వాపసు పొందుటకు అతనికి లేక దానికి హక్కు ఉండును.

విశదీకరణము:- ఈ పరిచ్ఛేదము మరియు 20వ పరిచ్ఛేదము నిమిత్తము "గుర్తింపుపొందిన వినియోగదార్ల సంఘము" అనగా కంపెనీల చట్టము, 1956 లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద రిజిస్టరయిన స్వచ్ఛంద వినియోగదార్ల సంఘము అని అర్ధము.

13. (1) పబ్లికు విశ్లేషకుడు, విశ్లేషణము కొరకు తనకు సమర్పింపబడిన ఏదేని ఆహార పదార్ధము యొక్క విశ్లేషణ ఫలితమును విహిత, పరచబడినట్టి ప్రరూపములో స్థానిక (ఆరోగ్య) ప్రాధికారికి అందజేయవలెను.

15

(2) ఆహార పదార్యము కల్తీ, చేయబడినదై నట్లు, ఉపపరిచ్ఛేదము (1) క్రింద విశ్లేషణ ఫలితమును గూర్చిన రిపోర్టు అందిన మీదట, స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి, ఎవరి నుండి ఆహార పదార్ధపు మచ్చు తీసికొనబడినదో ఆ వ్యక్తి పై మరియు 14-ఎ పరిచ్ఛేదము క్రింద ఎవరి పేరు, చిరునామా మరియు ఇతర వివరములు వెల్లడి అయినవో ఆ వ్యక్తి ఎవరేని ఉన్నచో ఆ వ్యక్తి పై అభియోగమును తెచ్చిన తరువాత, విశ్లేషణ ఫలితమును గూర్చిన రిపోర్టు యొక్క నకలును, సందర్భానుసారముగ, అట్టి వ్యక్తి, లేక వ్యక్తులకు విహితపరచబడిన రీతిగ పంపవలెను. అట్లు పంపునపుడు, అట్టి వ్యక్తులలో ఎవరైనను లేక ఇరువురైనను స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి వద్దగల ఆహార పదార్ధపు మచ్చును కేంద్ర ఆహార ప్రయోగశాలచే విశ్లేషణ చేయించవలెనని వాంఛించుచో అట్లు విశ్లేషణ చేయించుటకై, రిపోర్టు యొక్క నకలు అందిన తేదీ నుండి పది దినములలోపల, న్యాయస్థానమునకు దరఖాస్తు పెట్టుకొనవచ్చునని అట్టి వ్యక్తి, లేక వ్యక్తులకు తెలియజేయవలెను.

(2-ఏ) ఉపపరిచ్ఛేదము (2) క్రింద న్యాయస్థానమునకు దరఖాస్తు, పెట్టబడినప్పుడు, స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి వద్దగల మచ్చు యొక్క భాగము, లేక భాగములను పంపవలెనని న్యాయస్థానము అట్టి ప్రాధికారిని కోరవలెను. అట్లు కొరబడిన మీదట సదరు ప్రాధికారి అది అందిన తేదీనుండి ఐదు దినముల కాలావధిలోపల మచ్చు యొక్క భాగము, లేక భాగములను న్యాయస్థానమునకు పంపవలెను.

(2-బీ) ఉపపరిచ్ఛేదము (2-ఏ), క్రింది స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి నుండి మచ్చు యొక్క భాగము, లేక భాగములు అందిన మీదట, 11వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1) లోని ఖండము (బీ) లో నిబంధించబడినట్లు గుర్తు, మరియు సీలు, లేక కట్టు సరిగా ఉన్నవనియు, సందర్భానుసారముగ సంతకము గాని, వేలిముద్రగాని దిద్దబడలేదనియు న్యాయస్థానము మొట్ట మొదట నిర్దారించుకోని, సందర్భానుసారముగ మచ్చు యొక్క భాగమును, లేక భాగములలో ఒకదానిని తన స్వంత సీలుతో కేంద్ర ఆహార ప్రయోగశాల డెరెక్టరుకు పంపవలెను, ఆ మీదట ఆ డెరెక్టరు మచ్చు యొక్క భాగము అందిన ఒక మాసములోపల విశ్లేషణ ఫలితమును నిర్ధిష్ట పరచుచు విహిత పరచబడిన ప్రరూపములో న్యాయస్థానమునకు ఒక సర్టిఫికెట్టును పంపవలెను.

(2-సీ) మచ్చు యొక్క రెండు భాగములు న్యాయస్థానమునకు పంపబడి యుండి, మచ్చు యొక్క ఒక భాగమును మాత్రమే న్యాయస్థానము ఉపపరిచ్ఛేదము (2-బీ) క్రింద కేంద్ర ఆహార ప్రయోగశాల డెరెక్టరుకు పంపిన యెడల, న్యాయస్థానము ఆచరణ సాధ్యమైనంత త్వరగా మిగిలిన భాగమును స్థానిక (ఆరోగ్య )ప్రాధికారికి వాపసు చేయవలెను: ఆ ప్రాధికారి, కేంద్ర ఆహార ప్రయోగశాల డెరెక్టరు నుండి న్యాయస్థానమునకు సర్టిఫికెటు అందిన తరువాత ఆ భాగమును నాశము చేయవలెను:

అయితే, న్యాయస్థానము కేంద్ర, ఆహార ప్రయోగశాల డైరెక్టరుకు పంపిన మచ్చు యొక్క భాగము పోయినయెడల, లేక చెడిపోయినయెడల, స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి వద్ద మచ్చు యొక్క భాగమేదేని ఉన్నచో దానిని న్యాయస్థానమునకు పంపవలెనని న్యాయస్థానము ఆ ప్రాధికారిని కోరవలెను, అది అందినమీదట న్యాయస్థానము ఉపపరిచ్ఛేదము (2-బీ) లో నిబంధన చేయబడిన రీతిలో చర్య తీసికొనవలెను:

(2-డీ) కేంద్ర ఆహార ప్రయోగశాల డెరెక్టరు నుండి విశ్లేషణ ఫలితమును గూర్చిన సర్టిఫికెటు అందునంతవరకు, న్యాయస్థానము అభియోగమునకు సంబంధించి తన సమక్షమున నడుచుచున్న చర్యలను కొనసాగించరాదు.

(2-ఈ) ఆహార ఇన్ స్పెక్టరు యొక్క రిపోర్టు ఏదేని ఉన్నచో దానిని పర్యాలోచించిన తరువాత గాని, అన్యథా గాని స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి,

16

ఉపపరిచ్ఛేదము (1) క్రింద పబ్లికు విశ్లేషకుడు అందజేసిన రిపోర్టు తప్పుగానున్నదని అభిప్రాయపడుచో, సదరు ప్రాధికారి తన వద్ద నున్న మచ్చు యొక్క భాగములలో ఒక దానిని విశ్లేషణము కొరకై మరొక పబ్లికు విశ్లేషకుని కెవరికై నను పంపవలెను, ఆ మరొక పబ్లికు విశ్లేషకుడు మచ్చు యొక్క ఆ భాగపు విశ్లేషణ ఫలితమును గూర్చి ఇచ్చిన రిపోర్టులో ఆహార పదార్ధము కల్తీ చేయబడినదని తెలియజేసినచో, (2) నుండి (2-డీ) వరకు గల ఉపపరిచ్ఛేదముల నిబంధనలు వీలైనంతమేరకు వర్తించును.

(3) ఉపపరిచ్ఛేదము (2-బీ) క్రింద కేంద్ర ఆహార ప్రయోగశాల డైరెక్టరు జారీచేసిన సర్టిఫికెటు, ఉపపరిచ్ఛేదము (1) క్రింద పబ్లికు విశ్లేషకుడు ఇచ్చిన రిపోర్టును రద్దు చేయును.

(4) ఉపపరిచ్ఛేదము (2-బీ) క్రింద కేంద్ర ఆహార ప్రయోగశాల డెరెక్టరు నుండి పొందిన సర్టిఫికెటును ఈ చట్టము క్రింది, లేక భారత శికా స్మృతి యొక్క 272 నుండి 276 వరకు గల పరిచ్ఛేదముల క్రింద ఏదేని చర్యలో దాఖలు చేసిన యెడల, విశ్లేషణము కొరకు తీసికొనబడిన ఆహారపు మచ్చు యొక్క భాగమును దేనినైనను అట్టి చర్యలో దాఖలు చేయనవసరము లేదు.

(5) పబ్లికు విశ్లేషకుని సంతకముగల రిపోర్టుగ తాత్పర్యమునిచ్చు ఏదేని దస్తావేజు ఉపపరిచ్ఛేదము (3) క్రింద రద్దయిననే తప్ప ఆ దస్తావేజునుగాని కేంద్ర ఆహార ప్రయోగశాల డైరెక్టరు సంతకముగల సరిఫికెటుగ తాత్పర్యమునిచ్చు ఏదేని దస్తావేజును గాని, అందులో తెలుపబడిన సంగతులకు సాక్ష్యముగ. ఈ చట్టము క్రింది, లేక భారత శిక్షా స్మృతి యొక్క 272 నుండి 276 వరకు గల పరిచ్ఛేదముల క్రింది ఏ చర్యలోనై నను ఉపయోగించవచ్చును:

అయితే, (16వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1-ఏ) కి గల వినాయింపులో నిర్దేశింపబడినట్టి ఏదేని ఆహార పదార్ధపు మచ్చు యొక్క భాగమునకు సంబంధించిన విశ్లేషణమును గూర్చిన సరిఫికెటు కానిదై) కేంద్ర, ఆహార ప్రయోగశాల డెరెక్టరుచే సంతకము చేయబడిన సరిఫికేటుగ తాత్పర్యమునిచ్చునట్టి ఏదేని దస్తావేజు అంతిమమైనదై అందులో తెలియపరచబడిన సంగతులకు నిశ్చాయక సాక్ష్యమగును.

విశదీకరణము:- ఈ పరిచ్ఛేదములోను, 16వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1) యొక్క ఖండము (యఫ్) లోను "కేంద్ర ఆహార ప్రయోగశాల డైరెక్టరు "అను పదబంధ పరిధిలో ఈ పరిచ్ఛేదము నిమితమై కేంద్ర ప్రభుత్వముచే గుర్తింపబడిన ఏదేని ఆహార ప్రయోగశాల బాధ్యతను తత్సమయమున వహించు అధికారి (అతడు ఏ పదవీ నామముతో పిలువబడుచున్నను) చేరియుండును.

వివిధ విషయములు

14. ఏదేని ఆహార పదార్ధము యొక్క తయారీదారు, లేక పంపిణీదారు, లేక వ్యాపారస్థుడెవర్నెనను అట్టి పదార్ధపు నైజగుణమును, నాణ్యతను గూర్చి విక్రయదారుకు విహిత ప్రరూపములో వ్రాతమూలకముగ వారంటీని కూడ ఇచ్చిననే తప్ప, అట్టి పదార్ధమును అతనికి విక్రయించరాదు:

అయితే, ఏదేని ఆహార పదార్ధము యొక్క విక్రయము విషయములో, అట్టి పదార్ధము 'యొక్క తయారీదారు, లేక పంపణీదారు, లేక వ్యాపారస్థుడు దాని విక్రయదారుకు ఇచ్చిన బిల్లు, నగదుచీటి, లేక ధరల పట్టిక ఈ పరిచ్ఛేదము క్రింద అట్టి తయారీదారు, పంపిణీదారు, లేక వ్యాపారస్థుడు ఇచ్చిన వారంటీగ భావింపబడును.

17

విశదీకరణము:- ఈ పరిచ్ఛేదములోను, 19వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2) లోను, 20-ఏ పరిచ్ఛేదము లోను . “పంపిణీదారు" అను పదపరిధిలో కమిషను ఏజెంటు చేరియుండును.

14-ఏ. ఆహార పదార్ధమును విక్రయించు ప్రతి విక్రయదారు, తాను ఆ ఆహార పదార్ధమును ఏ వ్యక్తి, వద్ద కొనెనో అతని పేరును, చిరునామాను, తదితర విపరములను, తనను కోరినపుడు ఆహార ఇన్ స్పెక్టరుకు వెల్లడించవలెను.

15. కేంద్ర ప్రభుత్వము గాని, రాజ్య ప్రభుత్వము గాని రాజపత్రములో అధి సూచనద్వారా ఆ అధిసూచనలో నిర్ధిష్టపరచబడిన ఏదేని స్థానిక ప్రాంతములో వైద్య వృత్తి చేయుచున్న డాక్టర్లను, ఆహారము విషపూరితమయినట్లు వారికి తెలియవచ్చినట్టి సంఘటనలనన్నింటిని ఆ అధిసూచనలో నిర్ధిష్ట పరచబడినట్టి అధికారికి రిపోర్టు చేయవలెనని కోరవచ్చును.

16. (1) ఉపపరిచ్ఛేదము (1-ఏ) యొక్క నిబంధనలకు లోబడి, --

(ఏ) ఏ వ్యక్తియైనను స్వయముగాగాని, తన తరఫున ఎవరేని ఇతర వ్యక్తి, ద్వారా గాని-

(i) 2వ పరిచ్ఛేదము యొక్క ఖండము (i-ఏ) లోని ఉపఖండము (యమ్ )యొక్క భావములో కల్తీ, చేయబడినదైన, లేక ఆ పరిచ్ఛేదము యొక్క ఖండము (ix) భావములో తప్పుడు బ్రాండు వేయబడినదైన, లేక ఈ చట్టము యొక్క, లేక దీని క్రింద చేయబడిన ఏదేని నియమము యొక్క ఏ నిబంధన కిందనైనను, లేక ఆహార (ఆరోగ్య) ప్రాధికారి యొక్క ఉత్తరువు ద్వారా నైనను విక్రయము నిషేధించబడినదైన ఏదేని ఆహార పదార్ధమును:

(ii) ఉపఖండము (i) లో నిర్దేశింపబడినది కానట్టి ఏదేని ఆహార పదార్ధమును ఈ చట్టము యొక్క, లేక దీని క్రింద చేయబడిన ఏదేని నియమము యొక్క నిబంధనలలో దేనినైనను ఉల్లంఘించి;

భారతదేశములోనికి దిగుమతి చేయుచో, లేక విక్రయము కొరకు తయారుచేయుచో లేక నిలవ చేయుచో, విక్రయించుచో, లేక పంపిణీచేయుచో, లేక

(బీ) స్వయముగాగాని, తన తరఫున ఎవరేని ఇతర వ్యక్తి ద్వారా గానీ, ఆరోగ్యమునకు హానికరము కానిదై కల్తీకి ఉపయోగపడునట్టి దానిని దేనినైనను భారతదేశములోనికి దిగుమతిచేయుచో, లేక విక్రయము కొరకు తయారుచేయుచో, లేక నిలవచేయుచో, విక్రయించుచో, లేక పంపిణీచేయుచో, లేక

(సీ) ఈ చట్టము ద్వారా ప్రాధికారమొసగబడినట్లు మచ్చును తీసికొనుటనుండి ఆహార ఇన్ స్పెక్టరును నివారించుచో, లేక

(డీ) ఈ చట్టము ద్వారా గాని, దీని క్రింద గాని ఆహార ఇన్ స్పెక్టరుకు ఒసగబడిన ఏదేని ఇతర అధికారమును వినియోగించుట నుండి అతనిని నివారించుచో; లేక

(ఈ) ఆహార పదార్ధము యొక్క తయారీదారై యుండి తన స్వాధీనము నందు గానీ, తన ఆక్రమణమునందున్న ఆవరణలలో దేనియందై నను గాని ఆరోగ్యమునకు" హానికరము కానిదై కల్తీకి ఉపయోగపడునట్టి దానిని దేనినైనను ఉంచుకొనుచో, లేక

(యఫ్) పరీక్షను లేక విశ్లేషణమును గూర్చి కేంద్ర ఆహార ప్రయోగశాల డెరెక్టరు గాని, పబ్లికు విశ్లేషకుడు గాని ఇచ్చిన ఏదేని రిపోర్టునైనను, లేక

18

సర్టిఫికెటునైనను, లేక దాని యొక్క ఏదేని ఉదాహృతినైనను, ఏదేని పదార్ధమును గూర్చి ప్రచార ప్రకటన చేయు నిమిత్తమై ఉపయోగించుచో;

(జీ) తాను వికయించిన ఏదేని ఆహార పదార్ధమును గూర్చి వ్రాతమూలకమైన తప్పుడు వారంటీని స్వయముగా గాని, తన తరఫున ఎవరేని ఇతర వ్యక్తి ద్వారాగాని విక్రయదారుకు ఇచ్చుచో

అతడు 6వ పరిచ్ఛేదము యొక్క నిబంధనల క్రింద తాను పాత్రుడైయుండు నట్టి శాస్తికి అదనముగ ఆరుమాసములకు తక్కువ కాకుండునట్టి, కాని మూడు సంవత్సరముల దాక ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు వేయి రూపాయలకు తక్కువ కాకుండునట్టి, జుర్మానాతో శిక్షింపబడదగియుండును:

అయితే

(i) అపరాధము ఖండము (ఏ) యొక్క ఉపఖండము (i) క్రిందిదై యుండి, మనుష్యుల ప్రమేయమువలన కల్తీ చేయబడినదగు సహజసిద్ధ ఆహారమై నట్టి ఆహారపదార్ధమును గూర్చినదైనచో, లేక 2వ పరిచ్ఛేదము యొక్క ఖండము (ix) లోని ఉపఖండము (కే) యొక్క భావములో తప్పుడు బ్రాండు వేయబడిన ఆహారపదార్ధమును గూర్చినదైనచో, లేక

(ii) అపరాధము ఖండము (ఏ) యొక్క ఉపఖండము (ii) క్రిందిదై యుండి 23వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము ( 1-ఏ) లో గల ఖండము (ఏ), లేక ఖండము (బీ) క్రింద గాని, 24వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (2) లోని ఖండము (బీ) క్రింద గాని చేయబడిన ఏదేని నియమమును ఉల్లంఘించుటను గూర్చిన అపరాధము కానిదైనచో,--- న్యాయస్థానము, తీర్పులో పేర్కొనవలసినట్టి వై సరిపోవునంతటివి మరియు ప్రత్యేకమైనవి అయినట్టి కారణములను బట్టి మూడు మాసములకు తక్కువ కాకుండునట్టి, కాని రెండు సంవత్సరములదాక ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు ఐదువందల రూపాయలకు తక్కువ కాకుండునట్టి జుర్మానాతో శిక్ష విధించవచ్చును:

అంతేకాక, అపరాధము ఖండము (ఏ) యొక్క ఉపఖండము (ii) క్రిందిదై యుండి 23వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1-ఏ) లోని ఖండము (ఏ), లేక ఖండము (బీ) క్రింద గాని, 24వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (2) లోని ఖండము (బీ) క్రింద గాని చేయబడిన ఏదేని నియమమును ఉల్లంఘించుటను గూర్చినదైనచో, న్యాయస్థానము, తీర్పులో పేర్కొనవలసినట్టివై సరిపోవునంతటివి మరియు ప్రత్యేకమైనవి అయినట్టి కారణములను బట్టి మూడు మాసములదాక ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు ఐదువందల రూపాయలదాక ఉండగలట్టి జుర్మానాతో శిక్ష విధించవచ్చును.

(1-ఏ) ఏ వ్యక్తి యెనను స్వయముగా గాని, తన తరఫున ఎవరేని ఇతర వ్యక్తి, ద్వారా గాని——

(1) 2వ పరిచ్ఛేదము యొక్క ఖండము (1-ఏ) లో (ఈ) నుండి (యల్) వరకు గల (రెండింటితో సహా) ఉపఖండములలో ఏదేని భావములోనై నను కల్తీ, చేయబడినదైన ఏదేని ఆహార పదార్ధమును;

(ii) ఆరోగ్యమునకు హానికరమగునట్టిదై కల్తీకి ఉపయోగపడు దానిని దేనినైనను;

19

భారతదేశములోకి దిగుమతి చేయుచో, లేక విక్రయము కొరకు తయారు చేయుచో, లేక నిలవజేయుచో, విక్రయించుచో, లేక పంపిణీచేయుచో, అతడు 6వ పరిచ్ఛేదము యొక్క నిబంధనల క్రింద తాను పాత్రుడై యుండునట్టి శాస్తికి అదనముగ ఒక సంవత్సరమునకు తక్కువ కాకుండునట్టి, కాని ఆరు సంవత్సరముల దాక ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు రెండు వేల రూపాయలకు తక్కువ కాకుండునట్టి జుర్మానాతో శిక్షింపబడదగియుండును:

అయితే, ఏ వ్యక్తి యైనను అట్టి ఆహార పదార్ధమును లేక కల్తీకి ఉపయోగపడు దానిని దేనినైనను సేవించినపుడు, అది అతనికి మరణము కలిగించగలదైనచో, భారత శిక్షా స్మృతి యొక్క 320వ పరిచ్ఛేదము యొక్క భావములో దారుణఘాత క్రిందికి వచ్చునట్టి హానిని అతని శరీరమునకు కలిగించగలదైనచో, అతడు మూడు సంవత్సరములకు తక్కువకాకుండు నట్టి కాని జీవిత పర్యంతము ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు ఐదువేల రూపాయలకు తక్కువ కాకుండునట్టి జుర్మానాతో శిక్షింపబడదగియుండును.

(1-ఏఏ) 10వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (4) క్రింద తన సురక్షి తాభిరక్షలో ఏదేని ఆహార పదార్ధము ఉన్నట్టి, ఏ వ్యక్తి యైనను, అట్టి పదార్ధమును పాడు చేయుచో, లేక ఏ విధముగన్నెనను దానితో జోక్యము కలిగించుకొనుచో. అతడు ఆరు మాసములకు తక్కువ కాకుండునట్టి, కాని రెండు సంవత్సరముల ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు వేయి రూపాయలకు తక్కువ కాకుండునట్టి జుర్మానాతో శిక్షింపబడదగియుండును.

(1-బీ) మెజిస్ట్రేటు సమక్షమున పెట్టబడి, అతడు 2వ పరిచ్ఛేదము యొక్క ఖండము (1-ఏ) లో గల ఉపఖండము (హెచ్) యొక్క భావములో కల్తీ చేయబడిన పదార్ధముగా నిశ్చయించినట్టి, మరియు ఏ వ్యక్తి,యైనను సేవించినప్పుడు అతనికి మరణము కలిగించగలట్టి, లేక భారత శిక్షా స్మృతి యొక్క 320వ పరిచ్ఛేదము యొక్క భావములో, దారుణఘాత క్రిందికి వచ్చునట్టి హానిని అతని శరీరమునకు కలిగించగలట్టి ఏ ఆహార పదార్ధమునైనను, 10వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (4) క్రింద తన సురక్షి తాభిరక్ష లో ఉంచబడినట్టి ఏ వ్యక్తి,యైనను, ఆ పదార్ధమును విక్రయించుచో లేక పంపిణీ చేయుచో, ఉపపరిచ్ఛేదము (1-ఏఏ) లో ఏమియున్నప్పటికిని అతడు మూడు సంవత్సరములకు తక్కువ కాకుండు నట్టి, కాని జీవిత పర్యంతము ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు ఐదువేల రూపాయలకు తక్కువ కాకుండునట్టి జుర్మానాతో శిక్షింపబడదగియుండును.

(1-సీ) ఏ వ్యక్తి యైనను 14వ పరిచ్ఛేదము యొక్క, లేక 14-ఏ పరిచ్ఛేదము యొక్క నిబంధనలను ఉల్లంఘించినచో, అతడు ఆరు మాసముల దాక ఉండగలట్టి కాలావధిక కారావాసముతో మరియు ఐదు వందల రూపాయలకు తక్కువ కాకండునట్టి జుర్మానాతో శిక్షింపబడదగియుండును.

(1-డీ) ఈ చట్టము క్రింద ఒక అపరాధమునకు దోషస్థాపితుడైన ఏ వ్యక్తి,యైనను ఆ తరువాత అటువంటి అపరాధమునే చేసినచో, అప్పుడు, రెండవ లేక ఆ తరువాతి దోషస్థాపన ఏ న్యాయస్థాన సమక్షమున జరిగినదో ఆ న్యాయస్థానము, ఈ చట్టము క్రింద అతనికి మంజూరు కాబడిన లెసెన్సు ఏదేని ఉన్నచో దానిని ఉప పరిచ్ఛేదము (2) యొక్క నిబంధనలకు భంగము కలుగకుండ రద్దు చేయుటకు ఉత్వరువు చేయవచ్చును; ఆ మీదట, ఈ చట్టములో గాని, దీని క్రింద చేయబడిన నియమములలో గాని ఏమి ఉన్నప్పటికీ, అట్టి లెసెన్సు రద్దు అయినదగును.

(2) ఈ చట్టము క్రింద ఒక అపరాధమునకు దోష స్థాపితుడైన ఏ వ్యక్తి,యైనను ఆ తరువాత అటువంటి, అపరాధమునే చేసినచో-, రెండవ, లేక ఆ తరువాతి

20

దోష స్థాపన ఏ న్యాయస్థాన సమక్షమున జరిగినదో ఆ న్యాయస్థానము అపరాధి పేరును, నివాసస్థలమును, అపరాధమును మరియు విధించబడిన శాస్త్రిని న్యాయస్థానము ఆదేశించునట్టి వార్తాపత్రికలలో గాని ఆదేశించునట్టి ఇతర రీతిలోగాని అపరాధి ఖర్చుపె ప్రచురణ చేయించుట న్యాయసమ్మతమగును. అట్టి ప్రచురణకైన వ్యయములు దోషస్థాపన విషయమున అయిన ఖర్చులోని భాగముగ భావింపబడి జుర్మానాను రాబట్టు రీతిలోనే దానిని రాబట్టవలెను.

16-ఏ. క్రిమినలు ప్రకియా స్మృతి, 1973 లో ఏమి ఉన్నప్పటికిని, 16వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1) క్రింది అపరాధములనన్నింటిని ఈ విషయమున రాజ్య ప్రభుత్వము ప్రత్యేకముగ అధికారమొసగునట్టి మొదటి తరగతి న్యాయిక మెజిస్ట్రేటు గాని, మహా నగర మెజిస్ట్రేటు గాని సంక్షిప్తముగ విచారణ చేయవలెను. మరియు సదరు స్మృతి యొక్క 262 నుండి 265 వరకు గల (రెండింటితో సహా) పరిచ్ఛేదముల నిబంధనలు వీలైనంతవరకు సదరు విచారణకు వర్తించును:

అయితే, ఈ పరిచ్ఛేదము క్రింది సంక్షిప్త విచారణలో ఏదేని దోషస్థాపన జరిగిన సందర్భములో ఒక సంవత్సరమునకు మించని కాలావధిక కారావాస శిక్ష విధించుట మెజిస్ట్రేటుకు న్యాయసమ్మతమగును:

అంతేకాక, ఈ పరిచ్ఛేదము క్రింద సంక్షిప్త విచారణ ప్రారంభించినప్పుడు గాని, అది జరుగుచున్నప్పుడు గాని కేసు స్వభావమునుబట్టి ఒక సంవత్సరమునకు మించిన కాలావధిక కారావాస శిక్ష విధించవలసిరావచ్చునని యైనను, లేక ఏదేని ఇతర కారణమును బట్టి కేసును సంక్షిప్తముగ విచారించుట అవాంఛనీయమనియై నను మెజిస్ట్రేటుకు తోచినచో, అతడు పక్ష కారులను ఆకర్షించిన తరువాత ఆ మేరకు ఉత్తరువును వ్రాసియుంచి, ఆ తదుపరి పరిక్షింపబడిన ఏ సాక్షినైనను తిరిగి పిలువనంపి సదరు స్మృతిలో నిబంధించబడిన రీతిలో కేసును ఆకర్ణించుటకైనను లేక పునరాకర్ణించుటకైనను ఉపక్రమించవలెను.

17. (1) ఈ చట్టము క్రింది అపరాధమును కంపెనీ చేసినయెడల—

ఏ.(i) కంపెనీ కార్యకలాపమును నిర్వహించుటకు గాను కంపెనీ బాధ్యత వహించి దానికి బాధ్యుడగుటకై (ఈ పరిచ్ఛేదములో ఇటు పిమ్మట బాధ్యుడగు వ్యక్తి, అని నిర్దేశింపబడు) ఉపపరిచ్ఛేదము (2) క్రింద నామనిర్ధేశము చేయబడిన వ్యక్తి, ఎవరేని ఉన్నచో ఆ వ్యక్తి, లేక

(ii) ఏ వ్యక్తియు అటు నామనిర్ధేశము చేయబడనియెడల అపరాధము చేయబడిన సమయమున కంపెనీ కార్యకలాపమును నిర్వహించుటకై కంపెనీ బాధ్యత వహించుచు దానికి బాధ్యుడగు ప్రతియొక వ్యక్తి; మరియు

(బీ) కంపెనీ,

అపరాధమును చేసినట్లు భావింపబడి, చర్య జరుపబడుటకు పాత్రుడై తదనుసారముగ శిక్షింపబడవలెను;

అయితే ఈ ఉపపరిచ్ఛేదములోనున్నదేదియు, అట్టి ఏ వ్యక్తి,యై నను తనకు తెలియకుండ, ఆ అవధాధము చేయబడినదనియు, అట్టి అపరాధము చేయబడుటను నివారించుటకై తాను తగిన జాగ్రత్త వహించితిననియు రుజువుచేసినచో, అతనిని ఈ చట్టములో నిబంధించబడిన ఏ శిక్ష కైనను పాత్రుని చేయదు.

(2) ఏ కంపెనీ అయినను, ఈ చట్టము క్రింద ఆ కంపెనీచే ఏ అపరాధమైనను చేయబడుటను నివారించుటకు ఆవశ్యకమై నట్టి, లేక ఉపయుక్తమై నట్టి అధికారములనన్నింటిని వినియోగించుటకును, అట్టి చర్యలనన్నింటిని తీసికొనుటకును తన యొక్క డైరెక్టర్లలో ఏ డైరెక్టరుకైనను, లేక మేనేజర్లలో (ప్రధానముగా

21

నిర్వహణాత్మక, లేక పర్యవేక్షక హోదాలో నియమించబడియున్న ఏ మేనేజరుకై నను) వ్రాతమూలక ఉత్తరుపు ద్వారా ప్రాధికారమునొసగవచ్చును; మరియు అట్టి డైరెక్టరును, లేక మేనేజరును బాధ్యుడగు వ్యక్తిగ తాను నామనిర్ధేశము చేసినట్లు అట్లు, నామనిర్ధేశము చేయబడుటకు అట్టి డైరెక్టరు, లేక మేనేజరు ఇచ్చిన వ్రాతమూలక సమ్మతితో సహా, స్థానిక (ఆరోగ్య ) ప్రాథికారీకి విహితపరచబడిన ప్రరూపములోను, రీతిలోను నోటీసును ఈయవచ్చును.

విశదీకరణము:- కంపెనీ వివిధ సంస్థలనైనను, లేక శాఖలనై నను లేక ఏదేని సంస్థలో లేక శాఖలో వివిధ యూనిట్లనైనను కలిగియున్నదైన యెడల, వివిధ సంస్థలకు, లేక శాఖలకు, లేక యూనిట్లకు సంబంధించి ఈ ఉపపరిచ్ఛేదము క్రింద వివిధ వ్యక్తులను నామనిర్ధేశము చేయవచ్చును, మరియు ఏదేని సంస్థకు, శాఖకు, లేక యూనిట్టుకు సంబంధించి నామనిర్ధేశము చేయబడిన వ్యక్తి, అట్టి సంస్థ, శాఖ, లేక యూనిట్టు విషయమున, బాధ్యుడగు వ్యక్తి గ భావింపబడును.

{3} ఉపపరిచ్ఛేదము (2) కింద నామనిర్ధేశము చేయబడిన వ్యక్తి,—

(i) అట్టి నామనిర్ధేశము రద్దు అయినదని కంపెనీ నుండి మరొక నోటీసు స్థానిక (ఆరోగ్య) ప్రాధికారికి అందునంత వరకు, లేక

(ii) అతడు సందర్భానుసారముగ కంపెనీ డైరెక్టరుగ గాని, మేనేజరుగ గాని ఉండుట విరమించుకొనునంత వరకు; లేక

(iii) కంపెనీకి తెలియపరచి, అతడు, నామనిర్ధేశమును రద్దు పరచవలెనని స్థానిక (ఆరోగ్య) ప్రాధికారిని వ్రాతమూలకముగా కోరునంతవరకు, (అట్టి కోరికను స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి మన్నించవలెను)

ఇందులో ఏది ముందు జరుగునో అంతవరకు, బాధ్యుడగు వ్యక్తి గ కొనసాగును:

అయితే, అట్టి వ్యక్తి, సందర్భానుసారముగ కంపెనీ డైరెక్టరుగ గాని, మేనేజరుగ గాని ఉండుట విరమించిన యెడల, అతడు అట్లు విరమించుకొనుటను గూర్చి స్థానిక (ఆరోగ్య) ప్రాధికారికి తెలియజేయవలెను.

అంతేకాక, అట్టి వ్యక్తి, ఖండము (iii) క్రింద, నామనిర్ధేశమును రద్దు పరచవలెనని కోరినయెడల, అట్లు, కోరిన తేదీకి పూర్వపు తేదీ నుండి అట్టి నామ నిర్ధేశమును స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి రద్దు చేయరాదు.

(4) పై, ఉపపరిచ్ఛేదములలో ఏమి యున్నప్పటికిని, ఈ చట్టము క్రింద కంపెనీ ఒక అపరాధమును చేసియుండి, ఉపపరిచ్ఛేదము (2) క్రింద నామనిర్ధేశము చేయబడిన వ్యక్తి కానివాడై నట్టి కంపెనీ యొక్క ఎవరేని డైరెక్టరు, మేనేజరు, కార్యదర్శి, లేక ఇతర అధికారి యొక్క సమ్మతితోగాని, మౌనాంగీకారముతో గాని ఆ అపరాధము చేయబడినట్లు అయినను, లేక అతని వలన జరిగిన ఏదేని నిర్లక్ష్యమునకు దానిని ఆపాదించవచ్చుననియైనను రుజువు పరచబడిన యెడల, అట్టి డైరెక్టరు, మేనేజరు, కార్యదర్శి, లేక ఇతర అధికారి కూడ ఆ అపరాధమును చేసినట్లు భావింపబడి, చర్య జరుపబడుటకు పాత్రుడై తదనుసారముగ శిక్షింపబడవలెను.

విశదీకరణము :- ఈ పరిచ్ఛేదముల నిమిత్తము——

(1) "కంపెనీ", అనగా విదేశీ నిగమ నికాయము అని అర్ధము, ఇందులో ఒక ఫర్ము లేక వ్యక్తుల యొక్క ఇతర అసోసియేషను చేరియుండును;

22

(బి) ఫర్ముకు సంబంధించి "డైరెక్టరు" అనగా ఫర్ములోని ఒక భాగస్వామి అని అర్ధము,

(సీ) హోటలు పరిశ్రమ నడుపుచున్న కంపెనీకి సంబంధించి "మేనేజరు " అనుపదపరిధిలో, దానిచే నిర్వహింపబడు, లేక నడుపబడు ఏదేని హోటలులో కేటరింగ్ విభాగపు బాధ్యత వహించు వ్యక్తి చేరియుండును.

18. ఈ చట్టము యొక్క లేక దీని క్రింది ఏదేని నియమము యొక్క ఏవేని నిబంధనలను ఉల్లంఘించినందుకై ఏ వ్యక్తి,యైనను ఈ చట్టము క్రింద దోష స్థాపితుడైన యెడల, ఏ ఆహార పదార్ధము విషయమున ఉల్లంఘన జరిగినదో ఆ ఆహార పదార్ధము సమపహరణము చేయబడి ప్రభుత్వమునకు చెందునట్లు చేయవచ్చును:

అయితే, ఆ ఆహార పదార్ధమును తిరిగి ప్రాసెస్ చేసి మనుష్యులు సేవించుటకు గాను విహితపరచబడిన ప్రమాణముల కనుగుణముగ నుండునట్లు చేయగలుగ వచ్చునని న్యాయస్థానము అభిప్రాయపడినయెడల, న్యాయస్థానము ఉత్తరువు ద్వారా, ఆ ఉత్తరువులో నిర్ధిష్టపరచబడినట్టి అధికారి యొక్క పర్యవేక్షణ క్రింద ఆ ఆహార పదార్ధమును తిరిగి ప్రాసెస్ చేసిన తరువాత ఈ చట్టము నందలి ఇతర నిబంధనలకు లోబడి విక్రయింపబడుటకై, దాని సొంతదారు, జామీనుదార్లతో గాని, జామీనుదార్లు, లేకుండ గాని బాండును నిష్పాదించిన మీదట దానిని అతనికి వాపసు చేయవలెనని ఆదేశించవచ్చును.

19. (1) కల్తీ చేయబడిన లేక తప్పుడు బ్రాండు వేయబడిన ఆహార పదార్ధమును దేనినైనను విక్రయించుటకు సంబంధించిన అపరాధమునకైన అభియోగములో విక్రయింపబడిన ఆహార పదార్ధము యొక్క నైజగుణమును, పదార్ధమును, లేక నాణ్యతను గూర్చి విక్రయదారు ఎరుగడని మాత్రమే లేక ఏ పదార్ధమునైనను విశ్లేషణము కొరకు కొనుగోలు చేసిన కొనుగోలుదారు ఆ విక్రయము వలన ఎట్టి విపరీత ఫలితమునకు గురికాలేదని మాత్రమే చెప్పుట సరియైన ఉత్యర్థ వాదము కాదు.

(2) విక్రయదారు -

(ఏ) తాను, ఆహార పదార్ధమును

(i) ఆ పదార్ధమును విక్రయంచుటకు లెసెన్సు ఉండవలెనని విహితపరచబడిన సందర్భములో, తగురీతిని లైసెన్సు పొందిన తయారీదారు, పంపిణీదారు , లేక వ్యాపారస్ఠుని నుండి,

(ii) ఏదేని ఇతర సందర్భములో, ఎవరేని తయారీదారు, పంపిణీదారు, లేక వ్యాపారస్ఠుని నుండి,

విహితపరచబడిన ప్రరూపములో వ్రాతమూలకమ్మెన వారంటిని పొంది, కొనుగోలు చేసినట్లును,

(బి) ఆ ఆహార పదార్యము తన స్వాధీనములో ఉన్నప్పుడు దానిని సరిగా నిలవ చేసినట్లును, దానిని కొనినపుడు అది ఏ స్థితిలో ఉండెనో ఆ స్థితిలోనే దానిని తాను విక్రయించినట్లును,

రుజువు చేసినచో, అతడు కల్తీ చేయబడిన లేక తప్పుడు బ్రాండు వేయబడిన ఆహార పదార్ధమును దేనినైనను విక్రయించుటకు సంబంధించిన అపరాధమును చేసినట్లు భావింపబడదు.

(3) 14వ పరిచ్ఛేదములో నిర్ధేశింపబడినట్టి వారంటీ నిచ్చినటు చెప్పబడిన ఏ వ్యక్తి క్నెనను, ఆకరన సమయమున హాజరై, సాక్ష్యము నిచ్చుటకు హక్కు ఉండును.

23

20. (1) 14వ పరిచ్ఛేదము, లేక 14-ఏ పరిచ్ఛేదము క్రింది అపరాధము కానిదై, ఈ చట్టము క్రింది అపరాధము కొరకు, కేంద్ర ప్రభుత్వము యొక్క, రాజ్యప్రభుత్వము యొక్క, లేక కేంద్ర ప్రభుత్వముచే గాని, రాజ్య ప్రభుత్వముచే గాని సాధారణ లేక ప్రత్యేక ఉత్తరువు ద్వారా ఈ విషయమున "ప్రాధికార మొసగబడినట్టి వ్యక్తి యొక్క వ్రాతమూలకమైన సమ్మతి ద్వారా, లేక సమ్మతితో తప్ప అభియోగ మేదియు తేబడరాదు:

అయితే, 12వ పరిచ్ఛేదములో నిర్ధేశించబడిన కొనుగోలుదారు లేక గుర్తింపు పొందిన వినియోగదార్ల సంఘము పబ్లికు విశ్లేషకుని రిపోర్టు యొక్క నకలును, ఫిర్యాదుతో కలిపి న్యాయస్థానము నందు దాఖలు చేసినచో, ఈ చట్టము క్రింది అపరాధము కొరకు అతడు లేక ఆ సంఘము అభియోగము తేవచ్చును.

(2) మహానగర మెజిస్ట్రేటు యొక్క న్యాయస్థానము కంటే లేక మొదటి తరగతి న్యాయిక మెజిస్ట్రేటు యొక్క న్యాయస్థానము కంటే తక్కువస్థాయిగల న్యాయస్థాన మేదియు ఈ చట్టము క్రింది ఏ అపరాధమును గురించియైనను విచారణ జరుపరాదు.

(3) క్రిమినలు ప్రకియా స్మృతి, 1973 లో ఏమియున్నప్పటికిని, 16వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1- ఏఏ) క్రింద శిక్షింపబడదగు అపరాధము సంజేయమ్మెనట్టి జామీనుకు ఆయోగ్యమై యుండును.

20-ఏ. ఏదేని ఆహార పదార్ధము యొక్క తయారీదారుగాని, పంపిణీదారుగాని, వ్యాపారస్థుడుగాని కానట్టి ఏ వ్యక్తి యైనను చేసినట్లు చెప్పబడిన ఏదేని అపరాధమును గురించి ఈ చట్టము క్రింద విచారణ జరుగుచున్నప్పుడు ఎప్పుడెనను న్యాయస్థానము, తన సమక్షమున ఉంచబడిన సాక్ష్యమును బట్టి అట్టి తయారీదారుకు, పంపిణీదారుకు, లేక వ్యాపారస్థునికి కూడ ఆ అపరాధముతో సంబంధము కలదని అభిప్రాయపడిన యెడల, క్రిమినలు ప్రకియా స్మృతి, 1973 యొక్క 319వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (3) లోగాని, 20వ పరిచ్ఛేదములో గాని ఏమి యున్నప్పటికిని, 20 పరిచ్ఛేదము క్రింద అతనిపై అభియోగము తేబడియుండిన ఎట్లో అట్లొ, న్యాయస్థానము అతనిపై చర్య తీసికొనవచ్చును.

20-ఏఏ. అపరాధుల పరివీక్షణ చట్టము, 1958 (1958 లో 20వ చట్టము)లో గాని, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 (1974 లో 2వ చట్టము) యొక్క 360వ పరిచ్ఛేదములో గాని ఉన్నదేదియు, ఈ చట్టము క్రింది అపరాధమునకు దోష స్థాపితుడైన వ్యక్తి, పదునెనిమిది సంవత్సరముల వయస్సుకు లోపువాడైననే తప్ప, అతనికి వర్తించదు.

21. క్రిమినలు ప్రకియా స్మృతి, 1973 యొక్క 29వ పరిచ్ఛేదములో ఏమియున్నప్పటికిని, ఏ మహానగర మెజిస్ట్రేటు అయినను, లేక ఏ మొదటి తరగతి న్యాయిక మెజిస్ట్రేటు అయినను, యావజ్జీవ కారావాస, లేక ఆరు సంవత్సరములకు మించిన కాలావధిక కారావాస దండన తప్ప, సదరు పరిచ్ఛేదము క్రింద తనకు గల అధికారములను మించి ఈ చట్టము ప్రాధికార మొసగిన ఏ దండననై నను విధించుట శాసన సమ్మతమగును.

22. ఈ చట్టము క్రింద సద్భావముతో దేనినైనను చేసినందుకు, లేక చేయుటకు ఉద్దేశించినందుకు ఏ వ్యకి పైనైనను దావా, అభియోగము, లేక ఇతర శాసనిక చర్య ఏదియు ఉండదు.

22-ఏ. ఈ చట్టము యొక్క నిబంధనల నన్నింటినై నను, లేక వాటిలో వేటినైనను అమలు పరచుటను గూర్చి కేంద్ర ప్రభుత్వము తాను ఆవశ్యకమని భావించునట్టి ఆదేశములను రాజ్య ప్రభుత్వమునకు ఈ యవచ్చును. రాజ్య ప్రభుత్వము అట్టి ఆదేశములను పాటించవలెను,

24

23. (1) కేంద్ర ప్రభుత్వము, కమిటీతో సంప్రదించిన మీదటను, రాజపత్రములో అధిసూచన ద్వారా ముందుగా ప్రచురించిన మీదటను ఈ చట్టపు నిబంధనలను అమలు పరచుటకు నియమములను చేయవచ్చును:

అయితే, కమిటీని సంప్రదించకుండ నియమములను చేయవలసిన పరిస్థితులు ఉత్పన్నమైనవని కేంద్ర ప్రభుత్వము అభిప్రాయపడినచో, అట్లు సంప్రదించకుండగనే నియమములను చేయవచ్చును; కాని, అట్టి సందర్భములో, నియమములను చేసినప్పటి నుండి ఆరు మాసములలోపల కమిటీని సంప్రదించవలెను. సదరు నియమముల సవరణకు సంబంధించి కమిటీ చేయునట్టి ఏవేని సూచనలను కేంద్ర ప్రభుత్వము పర్యాలోచించవలెను.

(1-ఏ) ప్రత్యేకించియు, పైన చెప్పిన అధికార వ్యాపకతకు భంగము లేకుండను, అట్టి నియమములలో ఈ క్రింది విషయములలో అన్నింటి కొరకైనను, లేక వాటిలో వేటికొరకైనను నిబంధనచేయవచ్చును. అవేవనగా ---

(ఏ) ఏ ఆహార పదార్ధములను లేక ఏ రకముల ఆహార పదార్ధములను దిగుమతి చేయుటకు లైసెన్సు కావలసియుండునో ఆ ఆహార పదార్ధములను లేక ఆ రకముల ఆహర పదార్ధములను నిర్ధిష్టపరచుట, మరియు అట్టి లైసెన్సు యొక్క ప్రరూపమును, షరతులను, దానిని జారీ చేయుటకు అధికారము పొందిన ప్రాధికారిని, దానికి చెల్లించవలసిన ఫీజును, లైసెన్సు షరతులను నిర్వర్తించుటకు హామీగా డిపాజిట్ చేయవలసిన ఏదేని మొత్తమును మరియు అట్టి లైసెన్సును, లేక హామీని రద్దు చేయదగు, లేక సమపహరణము చేయదగు పరిస్థితులను విహితపరచుట;

(బి) ఏదేని ఆహార పదార్ధపు నాణ్యతా ప్రమాణములను నిశ్చయించుట. ఆ విషయమున అనుమతించదగు వ్యత్యాస పరిమితులను నియతము చేయుట,

(సీ) కేంద్ర ప్రభుత్వము ఈ విషయమున రాజపత్రములో అధిసూచనద్వారా నిర్ధిష్ట పరచునట్టి ఏదేని ఆహార పదార్ధము, లేక ఏ రకమునకు చెందిన ఆహార పదార్ధములైనను తయారు చేయబడు ఆవరణ యొక్క రిజిస్క్రీకరణ, ఆ ఆవరణను పరిశుభ్రమైన స్థితిలో ఉంచుట, మరియు అట్టి ఆహారపదార్ధము, లేక అట్టి రకమునకు చెందిన ఆహార పదార్ధముల యొక్క ఉత్పత్తి, పంపిణీ మరియు విక్రయముతో సంబంధముగల మనుష్యుల ఆరోగ్య స్థితిని కాపాడుటతో సహా, వాటి ఉత్పత్తి, పంపిణీ మరియు విక్రయముపై గట్టి నియంత్రణను విధించుటకై ప్రత్యేక నిబంధనలను చేయుట:

(డీ) ఆహార పదార్ధము యొక్క లక్షణములను, నాణ్యతను,లేక పరిమాణమును గూర్చి ప్రజలు గాని కొనుగోలుదారు గాని మోసపోకుండజేయు, లేక బ్రమ పడకుండజేయు లేక కల్తీచేయుటను నివారించు ఉద్దేశముతో ఏదేని ఆహార పదార్ధమును 'ప్యాక్ చేయుటను, దానికి వేయు లేబిలును, అట్టి ఏదేని ప్యాకేజ్ లేదా లేజీలు యొక్క ఆకృతిని పరిమిత పరచుట;

(ఈ) ఆహార ఇన్ స్పెక్టర్ల, మరియు పబ్లికు విశ్లేషకుల విద్యార్హతలను, అధికారములను, కర్తవ్యములను నిశ్చయించుట:

(ఈఈ) ఈ చట్టము క్రింద పబ్లికు విశ్లేషకులు ఆహార పదార్ధముల యొక్క లేక కల్తీకి ఉపయోగపడుదాని యొక్క మచ్చులను ఎచ్చట విశ్లేషణ చేయవలెనో ఆ ప్రయోగశాలలను నిశ్చయించుట,

(యఫ్) ఆహారముగ ఉపయోగించునప్పుడు ఆరోగ్యమునకు హానికలిగించు ఏదేని పదార్ధమును విక్రయించుటను నిషేధించుట, లేక దాని యొక్క విక్రయషరతులను నిశ్చయించుట, లేక ఏదేని ఆహార పదార్ధము యొక్క తయారీలో ఒక దినుసుగా దాని

25

ఉపయోగమును ఏరీతిలోనై నను పరిమితపరచుట, లేక లైసెన్సులను జారీచేయుట ద్వారా ఏదేని ఆహార పదార్ధము యొక్క తయారీని, లేక విక్రయమును క్రమబద్దము చేయుట;

(జీ) ప్రజారోగ్య హితము దృష్ట్యా ఏదేని ఆహార పదార్ధము యొక్క విక్రయ షరతులను గాని, దాని విక్రయమును గూర్చిన లైసెన్సు షరతులను గాని నిశ్చయించుట;

(హెచ్) విశ్లేషణము కొరకు కొనుగోలు చేయబడిన ఆహారపు మచ్చులను ఉంచు పాత్రలకు సీలు వేసి లేక బిగించి కట్టు రీతిని నిర్ధిష్టపరచుట;

(హెచ్ హెచ్) విశ్లేషణ పద్దతులను నిశ్చయించుట,

(ఐ) నిలవచేయబడు పండ్లలో, కూరగాయలలో, లేక వాటి ఉత్పత్తులలో లేక ఏదేని ఇతర ఆహార పదార్ధములో ఉప్పు, పంచదారకాకుండ, ఏ పరిరక్షకములను మాత్రమే ఉపయోగించవలెనో అట్టి పరిరక్షకములను జాబితాను, మరియు అట్టి ఒక్కొక్క పరిరక్షకము యొక్క గరిష్ట మోతాదులను నిర్ధిష్ట పరచుట;

(జే) ఏ ఆహార పదార్ధములోనై నను ఉపయోగించదగు రంగు పదార్ధమును, దాని యొక్క గరిష్ట పరిమాణమును నిర్ధిష్ట పరచుట;

(కే) నిర్ధిష్ట పరచునట్టి షరతులేవేని ఉన్నచో వాటికిలోబడి, ఈ చట్టము నుండి గాని, అందుగల ఏవేని అపేక్షితముల నుండి గాని ఏ ఆహార పదార్ధమునైనను లేక ఏ రకపు ఆహార పదార్ధములనైనను మినహాయించుటకై నిబంధనలు చేయుట;

(యల్) ఆహార పదార్ధము కల్తీకి ఉపయోగపడు నదిగ పేరు పడిన ఏదేని పదార్ధము యొక్క తయారీని, రవాణాను, లేదా విక్రయమును నిషేధించుట, లేక క్రమ బద్దము చేయుట;

(యమ్) (i) ఏదేని ఆహార పదార్ధములో నీటినైనను, లేక పలుచనచేయు ఏదేని ఇతర పదార్ధమునైనను, లేక కల్తీకి ఉపయోగపడు దానిని దేనినైనను కలుపుటను;

(ii) ఏదేని ఆహార పదార్ధము నుండి దినుసును దేనినైనను తీసివేయుటను;

(iii) ఏ ఆహార పదార్ధములో అట్లు కలుపబడినదో, లేక దేనినుండి అట్లు తీసివేయబడినదో, లేక ఏది అన్యధా కృత్రిమ క్రియకు గురియై నదో ఆ ఆహార పదార్ధము యొక్క విక్రయమును;

(iv) నైజగుణమునందు గాని, రూపమునందుగాని, పోలికగల రెండు, లేక అంత కెక్కువ ఆహార పదార్ధములను మిశ్రమము చేయుటను;

నిషేధించుట, లేక క్రమబద్దము చేయుట,

(యన్) చట్టము యొక్క, లేక ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల యొక్క నిబంధనలను అనుసరించిలేనట్టి ఆహార పదార్ధములను నాశమొనర్చుటకై నిబంధనలు చేయుట;

(2) ఈ చట్టము క్రింద కేంద్ర ప్రభుత్వముచే చేయబడిన ప్రతి నియమమును అది చేయబడిన పిమ్మట వీలయినంత త్వరితముగ, పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున, మొత్తము ముప్పది దినముల కాలావధి పాటు దాని ప్రతియొక సదనము సమక్షమున ఉంచవలెను. ఆ ముప్పది దినములు, ఒకే అధివేశనములోగాని, రెండు లేక అంతకు ఎక్కువ వెనువెంటనేవచ్చు అధివేశనములలోగాని చేరియుండవచ్చును. మరియు పైన చెప్పబడిన అధివేశనమునకు లేక వరుసగావచ్చు అధివేశనములకు వెనువెంటనే వచ్చు అధివేశనము ముగియుటకు పూర్వమే ఆ నియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు అంగీకరించినచో లేక ఆ నియమము చేయబడరాదని

26

ఉభయ సదనములు అంగీకరించినచో, అటుపిమ్మట, ఆ నియమము అట్లు మార్పు చేయబడిన రూపములో మాత్రమే ప్రభావము కలిగి యుండును, లేక సందర్భాను సారముగా, ప్రభావరహితమై యుండును; అయినప్పటికినీ, ఆ నియమమునందలి ఏదేని అట్టి మార్పుగాని, ఆ నియమపు రద్దుగాని అంతకు పూర్వము ఆ నియమము క్రింద చేయబడిన దేనియొక్క శాసనమాన్యతకై నను భంగము కలిగించదు.

24.(1) 23వ పరిచ్ఛేదము యొక్క పరిధి క్రిందికి రాని విషయములను గూర్చి ఈ చట్టము యొక్క నిబంధనలను అమలుపరచు నిమితమై రాజ్య ప్రభుత్వము కమిటీతో సంప్రదించినమీదటను, ముందుగా ప్రచురించవలెనను షరతుకు లోబడియు, నియమములను చేయవచ్చును.

(2) ప్రత్యేకించియు, పైన చెప్పిన అధికార వ్యాపకతకు భంగము లేకుండను, అట్టి నియమములు——

(ఏ) ఈ చట్టము క్రింద ఆహార (ఆరోగ్య) ప్రాధికారి యొక్కయు, స్థానిక ప్రాధికార సంస్థ యొక్కయు, స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి, యొక్కయు అధికారములను మరియు కర్తవ్యములను నిశ్చయించవచ్చును;

(బి) ఆహార పదార్ధములను, లేక ఏదేని నిర్ధిష్ట ఆహార పదార్ధమును, లేక నిర్ధిష్ట రకపు ఆహార పదార్ధములను, విక్రయించుటకై తయారు చేయుటను, నిలవచేయటను, విక్రయించుటను మరియు పంపిణీ చేయుటను గూర్చిన లైసెన్సుల ప్రరూపములను, అట్టి లైసెన్సుల కొరకు పెట్టుకొనబడు దరఖాస్తుల ప్రరూపమును, ఏ షరతులకు లోబడి అట్టి లైసెన్సులను జారీ చేయవలెనో ఆ షరతులను, వాటిని జారీచేయుటకు అధికారము పొందిన ప్రాధికారిని, వాటి కొరకు చెల్లించవలసిన ఫీజును, లైసెన్సుల షరతులను నిర్వర్తించుటకు హామీగా డిపాజిటు చేయవలసిన ఏదేని మొత్తమును మరియు అట్టి లెసెన్సులను, లేక హామీని నిలుపుదల చేయదగు, రద్దు చేయదగు, లేక సమపహరణము చేయదగు పరిస్థితులను విహితపరచవచ్చును;

(సీ) ఏ ఆహార పదార్ధమునైనను విశ్లేషణ చేయుట కొరకు గాని ఈ చట్టము క్రింద ఫీజు విహితపరచదగిన ఏ విషయము కొరకైన గాని ఫీజును చెల్లించవలెనని ఆదేశించవచ్చును;

(డీ) ఈ చట్టము క్రింద విధింపబడిన జుర్మానాలమొత్తముగాని, అందలి ఏదేని భాగము గాని వసూలైన మీదట స్థానిక ప్రాధికార సంస్థకు చెల్లింపబడవలెనని ఆదేశించ వచ్చును;

(ఈ) ఈ చట్టము ద్వారా రాజ్య ప్రభుత్వమునకు గాని, ఆహార (ఆరోగ్య )ప్రాధికారికి గాని ఒసగబడిన అధికారములను, కృత్యములను అధీనస్థ అధికారులకైనను, స్థానిక ప్రాధికార సంస్థలకైనను ప్రత్యయోజనము చేయుటకు నిబంధనలు చేయవచ్చును.

(3) ఈ చట్టము క్రింద రాజ్య ప్రభుత్వములు చేసిన నియమముల నన్నింటిని అవి చేయబడిన తరువాత వీలైనంత త్వరగా ఆయా రాజ్య శాసన మండలుల సమక్షమున ఉంచవలెను.

25. (1) ఈ చట్టము ప్రారంభమగుటకు అవ్యవహిత పూర్వము, ఈ చట్టము వర్తించు ఏ రాజ్యములోనైనను ఈ చట్టమునకు సమానమైన ఏదేని శాసనము అమలు నందున్నచో, అట్టి ప్రారంభము తరువాత ఆ శాసనము రద్దు అయినదగును.

(2) ఈ చట్టమునకు సమానమైన శాసనము ఈ చట్టము ద్వారా రద్దు అయినప్పటికిని, ఆహార కల్తీ, నివారణకు సంబంధించి ఆ శాసనము క్రింద చేయబడి ఈ చట్టము ప్రారంభముగుటకు అవ్యహిత పూర్వము అములునందున్న నియమములు, వినియమములు మరియు ఉపవిధులన్నియు, అవి ఈ చట్టము యొక్క నిబంధనలకు అసంగతముగ లేక ప్రతికూలముగ నున్నంతమేరకు తప్ప, ఈ చట్టము క్రింద చేయబడిన నియమములు ద్వారా మార్చబడునంత వరకు, సవరించబడునంతవరకు లేక రద్దు చేయబడునంతవరకు అమలునందు కొనసాగును .