ఆరగించవయ్య రాఘవ అతివతోడను
స్వరూపం
పల్లవి:
ఆరగించవయ్య రాఘవ అతివతోడను నేరములెంచక
ఆరగింపవయ్య మంచి అరటి పండులు చెఱకు పానక
చరణము(లు):
దోరమామిడి ఫలములు పనసతొనలు మంచి తేనెచెక్కెర
ఊరుగాయ పెరుగు చలిది తీరు పులియోగిరము తిరువీన
పాలు మీగడ కండ చక్కెర బంగరు గిన్నెలతోడ నే
దాసమానసాంబుజ వికాస శ్రీభద్రశైల నివాస నీ
భూసుతాధిప నారసింహ దాసపోషక దాశరథే