ఆమె కన్నులలో ననం తాంబరంపు నీలి నీడలు కలవు
స్వరూపం
ఆమె కన్నులలో ననం తాంబరంపు
నీలి నీడలు కలవు;
వినిర్మలాంబు
పూర గంభీర శాంత కాసార చిత్ర
హృదయములలోని గాటంపు నిదురచాయ
లందు నెడనెడ గ్రమ్ము;
సంధ్యావసాన
సమయమున నీపపాదప శాఖి కాగ్ర
పత్ర కుటిల మార్గముల లోపల వసించు
ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు
వినబడుచు నుండు;
మరికొన్ని వేళ లందు
వానకారు మబ్బుల మెయివన్నె వెనుక
దాగు భాష్పమ్ము లామె నేత్రముల లోన
పొంచుచుండును;
ఎదియొ అపూర్వ మధుర
రక్తి స్ఫురియించుగాని అర్థమ్ము కాని
భావగీతమ్ము లవి ...