Jump to content

ఆముక్తమాల్యద/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఆముక్తమాల్యద

(విష్ణుచిత్తీయము)

ఉపోద్ఘాతము

కృతి : కృతికర్త

కృతి గుణవిశేషములకు కృతికర్త ప్రతిభాపాండిత్యాదులవలెనే తజ్జీవితవిధానమును అప్పటి దేశకాలపరిస్థితులును కొంత కారణ మని విమర్శకనిపుణులు చెప్పుదురు. 'Periclean age' 'Augustan age' 'Elizabethian age' 'Victorian age 'Gupta golden age' అని యిట్టిపేరులు వినంబడుచుండును. అవి దేశకాలపరిస్థితి జ్ఞాపకములె. అట్లే ఆష్టదిగ్గజములం బ్రఖ్యాతము అని కృష్ణదేవరాయలకాలమునకును గొప్పపేరుప్రసిద్ధులు గలపు. మఱియు దైవికముగను ఒక్కొక్కప్పుడు గొప్పకవులు పుట్టుదురు. నాఁటి చరిత్రచర్చ నేఁడు వలదు కాని, తేలినవిషయమును ఇట్లు ఉదాహరింపఁదగును.

వంశపరంపరగా విజయనగరమునకు నరసింహప్రభుని యనంతరము అతని పెద్దకొమారుఁడు వీరనరసింహుఁడు కొంతకాల మేలి చనిపోగా తదనంతరము చిన్నకొమారుఁడు కృష్ణదేవరాయఁడు ముప్పయైదేండ్లవాఁడు మంచియనుభవశాలి క్రీ. శ. 1509 లో రాజ్యపట్టాభిషిక్తుఁ డాయెను. టెంకణాదిత్యుఁడు నన్నెచోడుఁడును నెల్లూరిదొర మనుమసిద్ధియు తాము సూర్యవంశమువారు అను నభిమానము వహించినట్లు 'కలశపాథోరాశి గర్భవీచిమతల్లి కడుపార నెవ్వాని గన్నతల్లి' అని యాచంద్రునివంశమువాఁడు తాను అని కృష్ణదేవరాయఁడును అభిమానము వహించినవాఁడు. పటాభిషేకము కాఁగానే అతఁడు తొడంగి కడంగి దిగ్విజయము చేసి దక్షిణభారతమందు క్రీ శ.1620 నాఁటికి తనప్రభావమును సుప్రతిష్ఠితము గావించి, ఉత్తరభారతమున సైతము లోడీ సుల్తానులను తనకు అరిగాపులు గావించుకొని అభ్యుదయపరమోచ్ఛ్రితిం బొందెను. అట్టి యభ్యుదయకాలము దేశమున నిజముగా గొప్పకవులయు కావ్యములయు కాలముగా నుండును. కళలును శిల్పములును విశేషవికాసము పొందును. అన్నింటికిని విజయోత్సాహి యగు రాజు నాదరము పోషణ యుండును. అట్లే గదా, వీరుఁడును జేతయు నగు కృష్ణదేవరాయఁడు తాను గొప్పపండితుఁడును మహాప్రతిభాశాలియు మహాకవియు, వీణావాదనాదికళలందును ఆరితేఱినవాఁడు కవిపోషకుఁడు కాకుండునా? అన్నిభాషలకవులు కళాభిజ్ఞులను పోషించుటయు కాక, అష్టదిగ్గజములు అను ఎనమండుగురు ఆంధ్రమహాకవులను, వారికి తనయాస్థానమున పే ర్వేఱ స్థానాసనములు ఏర్పఱిచి నిత్యకవితాగోష్ఠులు సమకూర్చుచు ఆనందించుచుండెను. వీనిచేత రాయల లోకానుభవము లోకవిశాలమును సాగరగంభీరమును అగుననుటకు సందియ మేమి? ఎటు గన్నను ఆరాజ్యమున ఒక తృప్తి ఒకయుత్సాహము ఒకపొంగు మిన్నంది వెలుంగుచుండెను.

మఱియొక విషయము. కృష్ణదేవరాయుఁడు మతమున వీరవైష్ణవుఁ డాయెను. ఆయన ప్రియమిత్రులు ఆస్థానకవిచక్రవర్తియు నగు పెద్దనయు వీరవైష్ణవుఁ డాయెను. ఆమతావేశమును ఒకయసాధారణమహోత్సాహమును పెంపొందించును. అది యట్టిమతావేశకాల మని కృష్ణదేవరాయఁడు తన గ్రంథాంతమున ప్రస్తావము తెచ్చి ఒకశఠకోపయతిని వర్ణించుచు సూటిగాను విలక్షణముగాను సూచించినాఁడు (చూ VI-66). "అతంత యిటమీఁద యాదవగిరి టెంకణంబు పాషండసంకులంబు గావచ్చినఁ, దచ్చ్యుతికి శఠకోపసమాఖ్య సంభవించి నీరంధ్రవాదంబున నంధ్రాదివిషయవిద్వజ్జనంబుల నధోక్షజవిషయవాదభిక్ష వేఁడి దిగ్విజయంబు సేసి గరుడకుధరగుహాకుంఠనృకంఠీరవంబు కుహనాత్రిదండియై బ్రుసీకుసుంభాంబరాంభఃకుండిక లొసంగ నంగీకృతాంతిమాశ్రముండై, ఫణిప కణభుగక్షపాద బాదరాయణ కపిల జైమిని శాసనంబులు మఠమహాసనమహీసురులు మున్నుగా నెంతే వాసి నంతేవాసులకుఁ దెలివిపఱుపం బరమహంసానుష్ఠానపరకాష్టయై, పదయుగప్రసన్నభువనప్రపంచపంచజనహృదయభవనంబులం బద్మాపద్మాక్షులు వల్లేర్లు దుడిచి పాడెక్క భక్తి బోధించి భూతలంబుఁ బావనంబు సేయగలవాఁడు" అని. క్రీస్తు శకము 1200 నాటికే శ్రీరామానుజాచార్యుల మతదిగ్విజయము ముగిసి, వైష్ణవమతమునకు సకలాభ్యుదయములు గూడి దక్షిణభారతక్షేత్రములకు దేవళములకు జనులకు వ్యాపించి బలము గొనుచుండెను. తరువాతను అప్పుడప్పుడు గొప్పగొప్ప యాచార్యులు ప్రభవించుచు దాని బలమును వ్యాప్తిని పెంపొందించుచుండిరి. ఆమార్గమున రాయలికాలమున ఒకక్రొత్తయతీశ్వరుఁడు శఠకోపముని అహోబలమున మఠము స్థాపించి విశేషముగా 'నీరంధ్రవాదమున ఆంధ్రాదివిషయవిద్వజ్జనములను' తనమతమున కలుపుకొని రాజుల నందఱిని పుట:ఆముక్తమాల్యద.pdf/11 పుట:ఆముక్తమాల్యద.pdf/12 పుట:ఆముక్తమాల్యద.pdf/13 పుట:ఆముక్తమాల్యద.pdf/14 పుట:ఆముక్తమాల్యద.pdf/15 పుట:ఆముక్తమాల్యద.pdf/16 పుట:ఆముక్తమాల్యద.pdf/17 పుట:ఆముక్తమాల్యద.pdf/18 పుట:ఆముక్తమాల్యద.pdf/19 పుట:ఆముక్తమాల్యద.pdf/20 పుట:ఆముక్తమాల్యద.pdf/21 పుట:ఆముక్తమాల్యద.pdf/22 పుట:ఆముక్తమాల్యద.pdf/23 పుట:ఆముక్తమాల్యద.pdf/24 పుట:ఆముక్తమాల్యద.pdf/25 పుట:ఆముక్తమాల్యద.pdf/26 పుట:ఆముక్తమాల్యద.pdf/27 పుట:ఆముక్తమాల్యద.pdf/28 పుట:ఆముక్తమాల్యద.pdf/29 పుట:ఆముక్తమాల్యద.pdf/30 పుట:ఆముక్తమాల్యద.pdf/31 పుట:ఆముక్తమాల్యద.pdf/32 పుట:ఆముక్తమాల్యద.pdf/33 పుట:ఆముక్తమాల్యద.pdf/34 పుట:ఆముక్తమాల్యద.pdf/35 పుట:ఆముక్తమాల్యద.pdf/36 పుట:ఆముక్తమాల్యద.pdf/37 పుట:ఆముక్తమాల్యద.pdf/38 పుట:ఆముక్తమాల్యద.pdf/39 పుట:ఆముక్తమాల్యద.pdf/40 పుట:ఆముక్తమాల్యద.pdf/41 పుట:ఆముక్తమాల్యద.pdf/42 పుట:ఆముక్తమాల్యద.pdf/43 పుట:ఆముక్తమాల్యద.pdf/44 పుట:ఆముక్తమాల్యద.pdf/45 పుట:ఆముక్తమాల్యద.pdf/46 పుట:ఆముక్తమాల్యద.pdf/47 పుట:ఆముక్తమాల్యద.pdf/48 పుట:ఆముక్తమాల్యద.pdf/49 పుట:ఆముక్తమాల్యద.pdf/50 పుట:ఆముక్తమాల్యద.pdf/51 పుట:ఆముక్తమాల్యద.pdf/52 పుట:ఆముక్తమాల్యద.pdf/53 పుట:ఆముక్తమాల్యద.pdf/54

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.