Jump to content

ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా

వికీసోర్స్ నుండి


            కల్యాణి - రూపక  రాగం            ఆది తాళం

ప: ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా

అదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా ఆ..|| ఆదరణ ||


చ1: పరమద్రోహివి నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనో

పరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా ఆ..|| ఆదరణ ||


చ2: ఆది పరబ్రహ్మమనుచు నిను పరమేష్ఠి ఏరీతి ప్రస్తుతి చేసెనో

వద్దు పరసతులనక స్త్రీల భంగపరచినవాని వరలక్ష్మి ఎటుమెచ్చెనో రామా ఆ..|| ఆదరణ||


చ3: ఎన్నగ శబరియెంగిలి భక్షించిన తిన్నని నడత లేనివాడవు

నిన్ను నమ్మరాదు నిన్నుదైవమనరాదు నిజము నామాట రామా ఆ.. ||ఆదరణ||


చ4: ఆదరణలేని రామమంత్రము ఆడితిని నినుదూరితిని

ముద్దుమాటలుగాని మూర్ఖవాదముగాదు మురహర ననుగావుమీ రామా ఆ..|| ఆదరణ||


చ5: ముద్దుమోముజూపి ముదమొప్ప రక్షించు భద్రశైల పరిపాలకా

వద్దురా కృపనేలు రామదాసునిమీద వైరమా వైదేహిసహిత శ్రీరామా ఆ..|| ఆదరణ||


This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.