ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనుపల్లవి

అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే

అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే

పల్లవి

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

అర్ధాలే వేరులే అర్థాలే వేరులే.... అర్థాలే వేరులే అర్థాలే వేరులే


చరణం

అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె

అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె


చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె

చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె


ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే