Jump to content

ఆంధ్ర శాసనసభ్యులు 1955/విశాఖ జిల్లా

వికీసోర్స్ నుండి

విశాఖ జిల్లా

ఈ టి నాగయ్య

కాంగ్రెస్ : పరవాడ నియోజకవర్గం జననం: 8-11-1907 విద్య: తెలుగు, ఇంగ్లీషు 20 సం|| లుగా కాంగ్రెస్ సభ్యుడు, 1932 విశాఖ తాలూకా బోర్డు అధ్యక్షుడు, జిల్లా బోర్డు మెంబరు, మున్సిపల్ కౌన్సిలర్, విశాఖ తాలూకా కాంగ్రెస్ ప్రెశిడెంటు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ప్రత్యేక అభిమానం: రైతు ఉద్యమము, అడ్రస్సు: 16/220 వార్డు, వడవీధి, విశాఖపట్నం.

బీసెట్టి అప్పారావు

కాంగ్రెస్ : అనకాపల్లి, నియోజకవర్గం, వయస్సు : 42 సం|| విద్య, మూడవ ఫారం కొంతకాలం జమ్‌షడ్‌పూర్ తాతా ఫాక్టరీలో ఉద్యోగం 7 సంవత్సరములు ట్రేడ్ యూనియన్ కార్యకర్త, గీత సత్యాగ్రహంలో జైలుశిక్ష, ప్రత్యేక అభిమానం : కార్మికసంఘాలు, అడ్రస్సు : గవరపాలెం, అనకాపల్లి.

మజ్జి పైడయ్య నాయుడు

కాంగ్రెస్ : కొండకర్ల, నియోజకవర్గం, వయస్సు : 45 సం|| విద్య, రెండవఫారం 1921 నుండి కాంగ్రెస్ సభ్యుడు, 16 సం||లు కాసింకోట ఆస్తాన రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా నౌకరి. ప్రత్యేక అభిమానం : భూ సంస్కరణలు, అడ్రస్సు : నరసింగపల్లి, అనకాపల్లి తాలూకా.

రాజా సాగి సూర్యనారాయణరావు

కాంగ్రెస్ : నర్సీపట్నం (జనరల్) నియోజకవర్గం, జననం : 1-11-1903 విద్య, 5 వ ఫారం, 1921 కాంగ్రెస్ లో ప్రవేశం, 1932 తాలూకా బోర్డు మెంబరు, 1942 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ మెంబరు, 1952 ఎన్నికలలో మద్రాసు
[[దస్త్రం:|425px|page=27]]


[[దస్త్రం:|425px|page=27]]
శాసనసభకు స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నిక, 1954 మేనెలలో ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి శ్రీకృష్ణ భాగవతము కృతిస్వీకరణ, ప్రత్యేక అభిమానం : దైవభక్తి, అడ్రస్సు : తంగేడు, ఉరట్ల పోష్టు.

ముత్యాల పోతురాజు

కాంగ్రెస్ : నర్సీపట్నం (రిజర్వుడు) నియోజకవర్గం, వయస్సు : 45 సం|| విద్య : 8వ తరగతి, 1921 కాంగ్రెస్ లో ప్రవేశించి, హరిజనుల విద్యాభివృద్ధి, అశ్పృస్యతా నివారణకు కృషి, తాలూకా హరిజన సంఘం ప్రెశిడెంటు, పట్టణ కాంగ్రెస్, ఎడ్యుకేషన్ కమిటీ, పంచాయితీ బోర్డు, మెంబరు, ప్రత్యేక అభిమానం : గాంధీగారి ఆశయ ఆదరణ, అడ్రస్సు : నర్సీపట్నం, గొలుగొండ తాలూకా.

గుజ్జల రామునాయుడు

ప్రజా సోషలిస్టు : శృంగవరపు కోట; రిజర్వుడు, నియోజకవర్గం జననం : 1901 అధ్యక్షుడు, అనంతగిరి కో ఆపరేటివ్ సొసైటీ, సభ్యుడు : ఏజన్సీ డెవలప్ మెంటు బోర్డు ప్రత్యేక అభిమానం : వ్యవసాయము, వేట. అడ్రస్సు : శృంగవరపుకోట పోస్టు.

బి. జి. యం. నరసింగరావు

చింతలపాటి వెంకట సూర్యనారాయణరాజు


రెడ్డి జగన్నాధం నాయుడు

స్వతంత్ర : చోడవరం, నియోజకవర్గం, వయస్సు, 49 సం|| విద్య, 4 వ ఫారం, వేచలము గ్రామాధికారిగా ఉంటూ ఎన్నికల ముందు రాజీనామా, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. ప్రత్యేక అభిమానం : వ్యవసాయము. అడ్రస్సు : వేచలము, చోడవరం, తాలూకా.

మచ్చరాస మచ్చరాజు


గంట్లాన సూర్యనారాయణ

ప్రజా సోషలిస్టు : గజపతినగరం, (రిజర్వుడు) నియోజకవర్గం, వయస్సు, 40 సంవత్సరములు విద్య, 8 వ తరగతి. కొన్నాళ్ళు షెడ్యూల్డు క్యాస్టు ఫెడరేషన్ లోను 1948 నుండి ప్రజా సోషలిస్టు పార్టీ లోను సభ్యుడు, 1952 ఎన్నికలలో మద్రాసు శాసనసభకు ఎన్నిక, పొట్టి శ్రీరాములుగారు చనిపోయినప్పుడు ప్రభుత్వమునకు నిరసనగా రాజీనామా యిచ్చి తిరిగి పోటీ లేకుండా ఎన్నిక, 1954 కరిబెన ఈనాం రైతు సత్యాగ్రహంలో జైలుశిక్ష. ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరణ. అడ్రస్సు, విజయనగరం.

పి. విజయరామ గజపతిరాజు

ప్రజాసోషలిస్టు; విజయనగరం నియోజకవర్గం, జననం, 1-5-1924. విద్య, మద్రాసు ప్రెశిడెన్సీ కాలేజీ లోను, కొలంబియా యూనివర్‌సిటీలోను ఉన్నత విద్యాభ్యాసం, మార్చి 1947 లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సభ్యుడుగా చేరిక. 18-8-54 కరివెన ఈనాంరైతు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష, ఆంధ్ర ప్రజాసోషలిస్టుపార్టీ కార్యదర్శి. ప్రత్యేక అభిమానం, స్పోర్ట్సు. అడ్రస్సు: విజయనగరం.

కుసుం గజపతిరాజు

ప్రజాసోషలిస్టు : గజపతినగరం (జనరల్) నియోజకవర్గం, జననం, 6-3-1925. విద్య, బొంబాయి ఎలిపెన్‌స్టన్ కాలేజీ, 48-49 కొలంబియా యూనివర్‌సిటీలోను ఉన్నత విద్యాభ్యాసం. 1951 నుండి ప్రజా సోషలిస్టు పార్టీ సభ్యురాలు. ప్రత్యేక అభిమానం: సంగీతం. అడ్రస్సు: విజయనగరం.


కె. వి. యస్. పద్మనాభరాజు


చాగంటి వెంకట సోమయాజులు

[[దస్త్రం:|425px|page=31]]


[[దస్త్రం:|425px|page=31]]

దొండా శ్రీరామమూర్తి


బొత్స ఆదినారాయణ

ప్రజాసోషలిస్టు : భోగాపురం నియోజకవర్గం, జననం: 1924, విద్య: యస్. యస్. యల్. సి., 1942 ఉద్యమములో 4 నెలలు జైలుశిక్ష. 1947 లో కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి ప్రజాపార్టీలో చేరిక. జిల్లా ప్రజా సోషలిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు. ప్రత్యేక అభిమానం: వైద్యం. అడ్రస్సు: దాసన్న పేట, విజయనగరం పోస్టు.

రుత్తల లత్సాపాత్రుడు


అంకితం వెంకట భానోజీరావు

కాంగ్రెస్ : విశాఖపట్టణం నియోజకవర్గం, అనేక సంవత్సరాలుగా విశాఖపట్టణం మునిసిపల్ ఛైర్మన్, విశాఖపట్టణం ఎ. వి. యన్. కాలేజీ, అనేక ప్రజాహిత సంస్థలలో సభ్యుడు. అడ్రస్సు : విశాఖపట్టణం.

గొట్టెముక్కల జగన్నాధరాజు

ప్రజా సోషలిస్టు : భీముని పట్టణం, నియోజకవర్గం, జననం, 1888. విద్య, బి. ఎ. బి. యల్. 27 సం|| లు జిల్లా బోర్డు అధ్యక్షుడు, 4 సం|| లు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు. 10 సం|| లు జిల్లా ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు, యుద్ధానంతర పునర్ నిర్మాణ సంఘం, సభ్యుడు. అడ్రస్సు : డాబా గార్డెన్సు, విశాఖపట్నం.
[[దస్త్రం:|425px|page=33]]