Jump to content

ఆంధ్ర శాసనసభ్యులు 1955/మీకొకమాట

వికీసోర్స్ నుండి

మీకొకమాట

ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే ఆంధ్రప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకొనే అవకాశం కలిగి ఈ సంవత్స రారంభంలో జరిగిన ఎన్నికలలో అమితోత్సాహంతో పాల్గొని వారి ప్రతినిధులను శాసనసభకు పంపారు. కానీ ఏ ఒక్కరూ అందరు సభ్యులను గురించి తెలుసుకొని ఉండటం అసంభవం. అందరూ, అందరు శాసనసభ్యులను గురించి తెలుసుకొనే లాగుచేసి, రానున్న ఎన్నికలలో యిందలి సభ్యులకన్నా మెరుగైన అభ్యర్ధులు ఉంటె ఎన్నుకొనే అవకాశం ఈ పుస్తకం కలిగిస్తుందని ఆశిస్తూ మీ కందజేస్తున్నాను.

మరోమాట నా ఈ ప్రయత్నంలో సహకరించిన శ్రీ నందమూరు కామరాజు, యం. కాం., ఏటుకూరు ప్రసాదరావు, దావులూరు సత్యనారాయణగార్లకు, అందముగా ముద్రించిన శాన్తిశ్రీ ముద్రణాలయంవారలకు, స్వతంత్ర కన్‌సర్‌న్సు (బ్లాకు మేకర్సు) కు నా కృతజ్ఞత. దీనిని మీకు ఇంత తక్కువధరలో అందచేయుటకు తోడ్పడిన ప్రకటనదారులకు, నేను అడిగిన వెంటనే వివరములు యిచ్చిన శాసనసభ్యులకు ధన్యవాదములు. ఇందులో కొందరి సభ్యుల చరిత్రలు విశేషంగా యివ్వలేకపోవటం, ఫోటోలు లేకపోవటం, వారి సహకారలోపమే కారణం. --- ప్రచురణకర్త.