ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 మరియు సంబంధిత హామీల అమలుపై శ్వేత పత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం మరియు సంబంధిత హామీల అమలుపై శ్వేత పత్రం
సాధారణ పరిపాలన (ఎస్ఆర్) శాఖ 23, డిసెంబరు 2018
పరిచయం
[మార్చు]1. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని (2014 లో 6వ చట్టం) 2014 మార్చి, 1న నోటిఫై చేయడమయింది. 2014, జూన్ 2 న ఆవిర్భావ తేదీగా ప్రకటించి, ఆ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడమయింది.
2. ప్రభుత్వం 17-8-2014 తేదీన విడుదల చేసిన శ్వేత పత్రంలో “రాష్ట్ర పునర్ వ్యవస్థీరరణ ప్రభావాన్ని” 5 కోట్ల మంది ఆంధప్రదేశ్ ప్రజల సమక్షంలో ఉంచింది. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం పరస్పర విరుద్ధతలు, తప్పొప్పులు మరియు అసమగ్రతలు అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ యొక్క తీవ్ర ఆర్థిక, మౌలిక సదుపాయ, విద్యా మరియు ఉపాధికల్పనకు సంబంధించిన ప్రతికూలతను తెలియజేసింది. 4 ½ సంవత్సరాల చివరలో 20-2-2014 తేదీన రాజ్యసభలో గౌరవ ప్రధానమంత్రిగారు చేసిన హామీలు/ప్రకటనలతో పాటు 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చేసిన హామీల అమలు స్థితిని నమోదు చేయాలని ప్రస్తుత శ్వేత పత్రం ప్రయత్నిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం :
[మార్చు]3. బిల్లు మసాయిదా తయారీలో కీలకమైన భాగస్వాములతో తగినంత విస్తృతమైన సంప్రదింపులు లేకపోవడం కీలకమైన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, పారదర్శకత లోపించడం మరియు పైపై ముసుగు, కఠినమైన విధానం బిల్లు ముసాయిదా తయారీ ప్రక్రియను ప్రతిబింబిచాయి. ప్రజలు వరుసగా ఆందోళనలు చేపట్టినప్పటికీ, వారి యొక్క స్పందనలు/ఆకాంక్షలకు తగినంత దయచూపలేదు. పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ మొత్తంలో పారదర్శక లేకపోవడం అప్పటి యుపిఎ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆవేశపూరితమైన గమనం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో తీవ్రమైన భ్రమరాహిత్యానికి కారణమయింది.
4. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కేంద్రాన్ని మరియు సుమారు 7 దశాబ్ధాలు వరుస ప్రభుత్వాలు అభివృద్ధి చేసిన రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయింది. పెద్దతరహా పారిశ్రామిక పునాది లేకుండా పోయింది. కేంద్ర సంస్థలు లేవు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపగ్రస్తులయ్యారు. వారి మనసులు గాయపడ్డాయి. రాజధాని లేకుండా నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తీవ్ర వనరుల కొరత ఉంది. న్యాయం మరియు నిష్పాక్షికత విషయంలో నమ్మకాన్ని కోల్పోయారు.
2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం : ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం
[మార్చు]5.పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పరస్పర వైరుధ్యాలు, కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయానికి కారణమయ్యాయి అవి :
- ఉమ్మడి రాష్ట్రంలో అంచనా వేసిన ఆదాయంలో 58 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి కేవలం 46 శాతం అందింది. దీనిని 14వ ఆర్ధిక సంఘం కూడా ధృవీకరించింది.
- ఆస్తులను అవి ఉన్న ప్రాంతం ప్రాతిపదికన కేటాయించగా అప్పుల చెల్లింపు బాధ్యతలను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేశారు.
- విద్యుత్తు రంగంలో, విద్యుత్తు వినియోగాన్ని పంపిణీ ప్రాతిపదికగా స్వీకరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకమయింది.
- పన్నుల రాబడులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేయగా (58.32 : 41.68) నిలిపి వేసిన పన్ను వసూలును ప్రాంతం ప్రాతిపదికన కేటాయించడమయింది. దీని వలన దాదాపు రూ.3800 కోట్లు నష్టం వచ్చింది.
- అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరం లేదు.
- రూ. 33,478 కోట్లకు పైగా అవిభాజ్య రుణ చెల్లింపును ఆంధ్రప్రదేశ్ ఖాతా పుస్తకాలలో ఉంచారు. రుణం చెల్లింపు విభజన పెండింగులో ఉండటం వలన రాష్ట్రానికి భారమయింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
- సింగరేణి కాలరీస్ 9వ షెడ్యూలులో ఉన్నందున, స్థానిక ప్రాతిపదికపై తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలో 51 శాతం ఈక్విటీని కేటాయించింది.
6. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలు స్థితి
(ఎ) 2014, ఏపిఆర్ చట్టంలోని ప్రధాన నిబంధనలు : 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రధాన నిబంధనలలో 14 విభాగాలు ఉన్నాయి. (i) పూర్తిగా అమలు పరచినవి - 0 (ii) పాక్షికంగా అమలు చేసినవి - 5 (7 జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి, పోలవరం, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పన్ను ప్రోత్సాహకాలు, రాజధానికి మద్ధతు). (iii) అమలు చేయనవి - 9 (గ్రేహేండ్స్ : ఏపిఎల్ఎ సీట్లు, ఆంధ్రప్రదేశ్ భవన ఆస్తుల విభజన, పన్ను బకాయిలు, రుణాలు, రీఫండ్ ల కేటాయింపు, షెడ్యూలు-IX ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన; 66 వ విభాగం క్రింద కేంద్ర ప్రభుత్వ నిర్దేశం ; షెడ్యూలు – 10 సంస్థల విభజన ; రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు)
గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడం (విభాగం-9)
ప్రస్తుతమున్న గ్రేహౌండ్ మౌలిక సదుపాయాలు, శిక్షణ సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం కోసం రూ.858.37 కోట్ల వ్యయం కాగల సవివరమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపడమయింది. గ్రేహౌండ్ శిక్షణ కేంద్రం మొదలగునవి ఏర్పాటు చేయడం కోసం 2087.09 హెక్టార్ల భూమి మళ్లింపుకు సంబంధించిన 1వ దశ క్లియరెన్సుకు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మళ్లింపు భూమికి సంబంధించి పాటింపు నివేదికను కేంద్ర ప్రభుత్వ ఇఎఫ్ & సిసి మంత్రిత్వ శాఖకు పంపడమయింది. భూమిని స్వాధీనం చేసిన తరువాత మాత్రమే రూ.219.16 కోట్ల ఆమోదిత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడమవుతుందని పేర్కొంటున్నందున IIవ దశ కోసం ఆమోదాన్ని సత్వరమే ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో సీట్ల పెంపుదల (విభాగం-26)
2014, పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 26వ విభాగం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 సీట్ల నుండి 225 కు పెంచడానికి వీలుకల్పిస్తున్నది. ప్రతిపాదనలను 29-9-2016 తేదీన సమర్పించడమయింది. ఈ అంశం దీర్ఘకాలికంగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. రాజ్యంగ సవరణ ప్రాసెస్ లో ఉందనే తన విధానాన్ని మార్చుకొంటూ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 2026 సంవత్సరం వరకు పెంపుదలను చేయలేమని తెలియజేసింది.
రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాన్ని వర్తింపజేస్తూ రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు [46(2) (3), 94(2) విభాగం]
కె-బి-కె, బుందేల్‌ఖండ్ నమూనా అనుగుణంగా ఒక ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాలకు సమకూర్చడానికి 20-02-2014 తేదీన రాజ్యసభ సమక్షంలో ఇదివరకటి గౌరవ ప్రధానమంత్రిగారు హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల వరకు అమలయ్యేలా ఇదివరకటి ప్రణాళికా సంఘంతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2014, అక్టోబరులో కేంద్ర ప్రభుత్వానికి రూ.24,350 కోట్ల ప్రతిపాదనను సమర్పించడం జరిగింది. అయితే, 7 జిల్లాలలో ప్రతి జిల్లాకి రూ.50 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం రూ.350 కోట్లను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.1050 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. 09-02-2018 తేదీన కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లను విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా 15-02-2018 తేదీన ఏకపక్షంగా వెనుకకు తీసుకుంది. ఇదివరకే ప్రారంభమయిన పనుల వేగాన్ని కొనసాగించడానికి, 2017-18, 2018-19 సంవత్సరాల కోసం రూ.700 కోట్లను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ధిష్ట అభ్యర్ధన, సదరు మొత్తాన్ని విడుదల చేయాలని 08-11-2018 తేదీగల ఒఎం నెం. 014015/18/2015-ఎస్పి-ఎస్ ద్వారా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ తదుపరి, ఇప్పటివరకు 2017-18, 2018-19లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ క్రింద ఎటువంటి నిధులను విడుదల చేయలేదు.
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ క్రింద తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.450 కోట్లను విడుదల చేసింది. రూ.1641.50 కోట్ల మొత్తం వ్యయంతో 25,007 పనులను చేపట్టి 14,512 పనులను పూర్తి చేయడమయింది, 5364 పనులు జరుగుతున్నాయి, రూ.1049.34 కోట్ల మొత్తానికి వినియోగ ధృవపత్రాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినందున ఇదివరకే ప్రారంభించిన పనుల వేగాన్ని కొనసాగించడానికి 2017-18, 2018-19 సంవత్సరాల కోసం రూ.700 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమయింది.
పోలవరం ప్రాజెక్టు (90వ విభాగం)
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ పోలవరం. ఇప్పటివరకు 62.53 శాతం పనులు పూర్తయినాయి. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడమవుతున్నది. 2018, డిసెంబరు 15వ తేదీవరకు జాతీయ ప్రాజెక్టు క్రింద పోలవరం ప్రాజెక్టుపై అయిన మొత్తం వ్యయం రూ.10,069.66 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.6727.26 కోట్లను విడుదల చేయడమయింది. మిగిలిన రూ.3342.40 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఖర్చు చేసిన నిధుల రీయింబర్స్మెంట్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఎటువంటి నిధులను విడుదల చేయనందున రాష్ట్ర ఆర్ధిక వనరులపై ఒత్తిడి ఏర్పడింది. 30-09-2016 తేదీగల ఎఫ్.నెం. 1(2)/పిఎఫ్-1/2014 (పిటి) ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, 01-04-2014 తేదీనాటికి ధరల స్థాయిలో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని 16-08-2017 తేదీన కేంద్ర జల సంఘానికి (సిడబ్ల్యుసి) కి సమర్పించడమయింది. రాజ్యసభ ప్రశ్న నెం. 788 కి సమాధానంగా 17-12-2018 తేదీన కేంద్ర ప్రభుత్వం, “కేంద్ర జల సంఘం 2013-14 పిఎల్ వద్ద రూ.57940.86 కోట్ల మొత్తంగా పోలవరం సాగునీటి ప్రాజెక్టు (పిఐపి) రెండవ సవరించిన అంచనాను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని ప్రాజెక్టు సాగునీటి అంశంలో భూ సేకరణ, సహాయ, పునరావాసం (ఎల్ఏ, ఆర్&ఆర్) భాగంగా వున్నాయని తెలియజేసింది. 2013, భూ సేకరణ, సహాయ, పునరావాస చట్టంలో న్యాయపరమైన నష్టపరిహారం, పారదర్శకత హక్కు ఆధారంగా ప్రాజెక్టు సవరించిన అంచనాలో ఎల్ఏ, ఆర్&ఆర్ ఏర్పాటు ఉంది. ప్రాజెక్టు సవరించిన వ్యయ అంచనాల ఖరారు ఇదివరకు ఆమోదించిన వ్యయంపై ఎల్ఏ, ఆర్&ఆర్ కారణంగా వాస్తవ వ్యయ పెరుగుదల ఆధారపడి ఉంటుంది.” అని తెలియజేసింది. త్వరితగతిన రూ.57,940.86 కోట్ల సవరించిన వ్యయ అంచనాలను ఆమోదించి, వడ్డీ భారాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బును అంతరాయాలు లేకుండా రీయింబర్స్ అయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమయింది.
పన్ను ప్రోత్సాహకాలు (94(1), (2) విభాగం)
26-06-2014 తేదీన 2014, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(1) విభాగం క్రింద పారిశ్రామికీకరణ, ఆర్ధిక వృద్ధిని పెంపొందించే ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీని కోరే ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడమయింది. అయితే, ఇప్పటివరకు ఈ విషయమై ఎటువంటి చర్యను తీసుకోవడం జరగలేదు.
2016, సెప్టెంబరులో జారీ చేసిన సిబిడిటి ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం, 01-04-2015 నుండి 31-03-2020 వరకు ఏదేని తయారీ రంగానికి సంబంధించి, ఆదాయ పన్ను చట్టంలోని 32(1) (iiఎ), 32 ఎడి విభాగాల క్రింద సేకరించిన ప్లాంట్ అండ్ మెషినరీ వ్యయంపై 15 శాతం అధిక అదనపు తరుగుదల, 15 శాతం పెట్టుబడి భత్యం పన్ను ప్రోత్సాహకాలను వినియోగించడం కోసం ఏడు జిల్లాలను ప్రకటించింది. అయితే, ఈ ప్రోత్సాహకాలు 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(2) విభాగం క్రిందికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 7 వెనుకబడిన జిల్లాలకు లబ్ధిని చేకూర్చే ముందు తెలంగాణ (9 జిల్లాలు), పశ్చిమ బెంగాల్ (11 జిల్లాలు), బీహార్ (17 జిల్లాలు) వంటి వివిధ రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆదాయ పన్ను చట్టం క్రింద ఈ ప్రయోజనాన్ని విస్తరించడమయింది. అంతేకాకుండా, ఈ ప్రోత్సాహకాలు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించవన్నది అందరికి తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరువు, కంటి తుడుపు చర్యగా ఉన్నాయి.
వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి, ఆర్ధిక వ్యవస్థకు ఊతమివ్వడానికి వీలుగా 26-06-2014 తేదీన విడివిడిగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్రాసిన లేఖలలో పన్ను ప్రోత్సాహకాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ప్రతిపాదించడమయింది. ఈ ప్రోత్సాహకాలు ఈ క్రింది అంశాలు చేరివున్నాయి. 1. 5 సంవత్సరాల వరకు సిజిఎస్టి, ఐజిఎస్టిలో కేంద్ర ప్రభుత్వ వాటా మేరకు జిఎస్టి – రీయింబర్స్మెంట్. 2. మొదటి 5 సంవత్సరాల కోసం ఆదాయ పన్నులో కేంద్ర వాటా రీయింబర్స్మెంట్. 3. రూ.5 కోట్ల గరిష్ట పరిమితితో ప్లాంట్ & మెషినరీ పెట్టుబడిలో 30 శాతం. 4. ముందస్తుగా ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్‌పై 3 శాతం (నిర్వహణ మూలధన పరపతి) 5. 5 సంవత్సరాల కోసం బీమాపై 100 శాతం బీమా ప్రీమియం రీయింబర్స్మెంట్. 6. రవాణా, ఉపాధి సబ్సిడీ మున్నగునవి. 11 ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలన్నింటికి ఈ ప్రోత్సాహకాలను సమకూర్చడమవుతున్నది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన లేదు.
నూతన రాజధాని నగరం ఏర్పాటు కోసం కేంద్ర మద్ధతు [6, 94(3) & (4) విభాగం]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన వినూత్నమైన “భూ సేకరణ పథకం” క్రింద, గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.50,000 కోట్ల కంటే ఎక్కువ విలువ గల 33,000 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులు అప్పగించడం జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు, భూమి అభివృద్ధితోపాటుగా రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు, శాసనసభ, పరిషత్తును, గ్రీన్ ఫీల్డ్ అమరావతి నగరాన్ని నిర్మించడానికి దాదాపు రూ.1,09,023 కోట్లు అవసరం అవుతాయని తాత్కాలిక అంచనాలు తెలియజేస్తున్నాయి. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(3) విభాగం క్రింద నిధుల విడుదల కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.39,937 కోట్ల మొత్తంతో శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్, మంత్రుల కోసం నైవాసిక క్వార్టర్లు, సచివాలయం, ఉద్యోగులకు ప్రభుత్వ గృహనిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలతోపాటుగా అమరావతి ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాల కోసం సవివరమైన ప్రాజెక్టు నివేదికను సమర్పించడమయింది. ప్రస్తుతం, రూ.48,115 కోట్ల వ్యయంతో 56 ప్రాజెక్టులను రాజధాని నగర ప్రాంతంలో చేపట్టడమయింది, రూ.26,000 కోట్ల వ్యయంతో 32 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. రూ.10,167 కోట్ల వ్యయంతో 6 ప్రాజెక్టులు ప్రారంభ దశలో, రూ.11,352 కోట్ల వ్యయంతో 18 ప్రాజెక్టులు ముందస్తు ప్రారంభ దశలో వున్నాయి. 2014-17 సంవత్సరాలలో రూ.1500 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2017-18 లో ఎటువంటి నిధులను విడుదల చేయలేదు. రూ.1000 కోట్ల హామీ మొత్తం కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. రూ.1632.48 కోట్లకు వినియోగ ధృవపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(3) విభాగం క్రింద చట్టబద్దమైన పన్ను విధించినందున అమరావతి రాజధాని నగర అభివృద్ధి కోసం సరిపడ నిధులను సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమయింది.
14-06-2018 తేదీగల ఫైలు నెం. ఎం-13040/64/2017-ఎస్-ఎస్ ద్వారా నీతి ఆయోగ్ (ఏపి రాష్ట్ర) సంచాలకులు ఈ క్రింది అంశాలు తెలియజేశారు.
- 2018, జూన్ 5, 6 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీతి ఆయోగ్ (ఏపి రాష్ట్ర) సంచాలకులు సందర్శించారు, పనుల స్పాట్ మదింపు కోసం వర్క్ స్థలాలను సందర్శించారు. ప్రతి సైట్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని గుర్తించారు. మొత్తం రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంజినీర్లతోపాటుగా అమలు ఏజెన్సీ నుండి వేలాది మంది వర్కర్లు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. అమరావతిలోని మొత్తం నూతన రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం దాదాపు 25 అమలు ఏజెన్సీలు ఏకకాలంలో పనిచేస్తున్నాయి అని వారికి తెలియజేయడం జరిగింది. అమలు ఏజెన్సీలకు రూ.1632.48 కోట్ల మొత్తం గల బిల్లులను ఏపిసిఆర్‌డిఎ చెల్లించిందని రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల నుండి ఆయన గమనించడం జరిగింది.
- 2018-19 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు / అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌కు విడుదల కావాల్సిన రూ.1000 కోట్ల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2017-18, 2018-19 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం రూ.333 కోట్ల చొప్పున రూ.666 కోట్ల మొత్తాన్ని విడుదల కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగానికి సిఫారసు చేయడమయింది.
బి) XIII షెడ్యూల్ – విద్యా సంస్థలు
- 11 సంస్థల స్థితి
- 2015-16 నుండి 5 సంస్థలు (ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, ఐఐఎస్ఇఆర్, ఐఐఐటిడిఎం) తాత్కాలిక క్యాంపస్‌లలో నిర్వహించడమవుతున్నది.
- 2016-17 నుండి 2 సంస్థలు (ఐఐపిఇ, ఎన్ఐడిఎం) తాత్కాలిక క్యాంపస్‌లలో నిర్వహించడమవుతున్నది.
- 2018-19 నుండి 2 సంస్థలు (కేంద్ర విశ్వవిద్యాలయం, ఏఐఐఎంఎస్) తాత్కాలిక క్యాంపస్‌లలో నిర్వహించడమవుతున్నది.
- ఒక సంస్థ అంటే గిరిజన విశ్వవిద్యాలయం ఇంకా ఏర్పాటు చేయలేదు.
- 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబడాలి, కాని ఇది జరగలేదు. దీనికి బదులుగా ప్రస్తుతమున్న ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.135 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
- 11 సంస్థలకు ఆంధ్రప్రదేశ్ తోడ్పాటు
- 2909.17 ఎకరాల భూమి కేటాయింపు
- భూ సంరక్షణ, భూ సేకరణ కోసం రూ.131.33 కోట్లు మంజూరు చేసింది.
- ఈ సంస్థలను ఏర్పాటు చేయడంలో ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించడానికి నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
- 11 సంస్థలను ఏర్పాటు చేయడం కోసం అవసరమైన రూ.12,746.38 కోట్లకుగాను, 2014-19 కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.845.42 కోట్లను విడుదల చేసింది. (అవసరమైన నిధులలో 6.63 శాతం.) ఈ నిధుల కేటాయింపు శాతంలో పూర్తి స్థాయిలో 11 విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి 20 నుండి 30 సంవత్సరాలు పడుతుంది.
- ఈ 11 సంస్థలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, నిర్ధిష్ట సమయ విధానంలో రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకం చేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడమయింది.
సి) XIII షెడ్యూల్ – మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
- 93 విభాగంతోపాటుగా XIIIవ షెడ్యూల్లో ఎనిమిది (8) మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు హామీ ఇవ్వడమయింది.
- దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు, ఏకీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ముడి చమురు రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, నూతన రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖపట్నం మరియు విజయవాడ-గుంటూరు-తెనాలిలో మెట్రో రైలు సౌకర్యం.
మూడు (3) ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవి ప్రస్తుతమున్న విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు విస్తరింపచేయడం, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయడం మరియు కొత్త రాజధాని నుండి ర్యాపిడ్ రైల్ మరియు రోడ్డు అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం.
దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు :
భారత ప్రభుత్వ ఓడరేవుల మంత్రిత్వ శాఖ 16-09-2018 తేదీగల జిఎస్ఆర్ 641(ఐ) గెజిట్ ప్రకటన ద్వారా దుగరాజపట్నం వద్ద ఓడరేవును ఏర్పాటు చేయడానికై ప్రకటనను జారీ చేసింది. అంతేకాకుండా, 2018 చివరి నాటికి 1వ దశ పూర్తి చేయాలనే లక్ష్యంతో దుగరాజపట్నం వద్ద ఒక కొత్త ప్రధాన ఓడరేవును అభివృద్ధి చేయడానికిగాను, కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరి చేస్తూ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చాలా స్పష్టమైన నిబంధన ఉంది. చట్టంలో అటువంటి స్పష్టమైన, నొక్కి వక్కాణించే నిబంధన ఉన్నప్పటికీ దుగరాజపట్నం ప్రధాన ఓడరేవు సాధ్యం కాదని నీతి అయోగ్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. చట్టంలో ఇది ఆదేశికమైన హామీ అయినందున సదరు హామీని పూర్తిగా అమలయ్యేటట్లు కేంద్ర ప్రభుత్వం చూడాలి.
కడపలో ఏకీకృత ఉక్కు కర్మాగార ఏర్పాటు :
ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు మరియు ఇనుప ఖనిజం మొదలగువాటి లభ్యతకు సంబంధించి ఇటీవల చేసిన అభ్యంతరాలతో సహా భారత ప్రభుత్వం మరియు మెకాన్ లిమిటెడ్ వారు కోరిన సమాచారాన్నంతటినీ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అందించింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిత కర్మాగారానికి స్వంత ఇనుప ఖనిజ గనులు, విద్యుత్ సబ్సిడీ, సబ్సిడీ ఇచ్చిన భూమి వెలుపలి మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి అనేక ప్రోత్సాహకాలను అందించడానికి కూడా ఒప్పుకుంది. 2017, జులైలో మెకాన్ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం బాగా సాధ్యపడుతుందనే ఒక ఫ్రీ-టాక్స్ ఐఆర్ఆర్ 18.95 శాతం ఉందని తెలియజేస్తూ ఒక ప్రాధమిక సాధ్యాసాధ్య నివేదికను సమర్పించింది. మెకాన్ సాధ్యాసాధ్య నివేదికను తయారు చేయడానికి గల డేటాకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పాలుపంచుకుందని 22-10-2018 తేదీగల తమ లేఖలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కడపలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి గల 3 ఐచ్ఛికాలను సూచిస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 06-11-2018 తేదీన గౌరవ ప్రధానమంత్రికి లేఖ వ్రాశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం రావలసి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తనంతటతానుగా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కాకినాడలో క్రాకర్ మరియు పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటు :
2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసూచి XIII ప్రకారం కాకినాడ వద్ద గెయిల్-హెచ్‌పిసిఎల్ కన్సార్టియం వారు ఒక క్రాకర్ మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్సును నెలకొల్పడానికి ప్రతిపాదించడం జరిగింది. (i) ఇథేన్, నాఫ్తా మరియు ప్రొపేన్ ముడి పదార్ధంతో 1 ఎంఎంటిపిఏ కాంప్లెక్స్ వ్యయాన్ని రూ.32.900 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తరువాత గెయిల్-హెచ్‌పిసిఎల్ కన్సార్టియం తదుపరి 15 సంవత్సరాలలోగా చెల్లించదగు రాష్ట్ర ప్రభుత్వంచే సమకూర్చవలసి ఉన్నట్టి ‘0’ తేదీ నుండి 15 సంవత్సరాలకు సంవత్సరానికి రూ.1,238 కోట్ల నిధుల సహాయం ఒక స్వయంభరణ లోటును సూచించింది. నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికపై ఇది రూ.5615 కోట్ల ఒకే దఫా చెల్లింపు అవుతుంది. ఈ మొత్తాన్ని 14 శాతం ఐఆర్ఆర్గా పరిమాణాత్మకం చేయబడిందని సూచించడం యుక్తంగా ఉన్నది. కాగా, కేంద్ర ప్రభుత్వంచే సహాయం అందించబడిన ప్రభుత్వ రంగ యూనిట్ల ద్వారా చేపట్టిన కొన్ని ఇతర ప్రాజెక్టులలో 9 శాతం ఐఆర్ఆర్ ప్రమాణంగా ఉంది.
(ii) భారత ప్రభుత్వానికి స్థూల పన్ను రెవెన్యూ సంవత్సరానికి రూ.1750 కోట్లుగా ఉంటుందని అంచనా వేయడమయింది. ఇందులో రూ.350 కోట్ల సిజిఎస్టి మరియు రూ.1400 కోట్ల నిలిపివుంచిన ఐజిఎస్టి చేరి ఉన్నాయి.
(iii) ఈ కాంప్లెక్సులో ఉత్పత్తి చేయబడిన పెట్రో కెమికల్స్ ప్రత్యామ్నాయ దిగుమతి కారణంగా అంచనా వేయబడిన విదేశీ పొదుపులు యుఎస్డి-1 బిఎన్ లేదా రూ.6500 కోట్ల మేరకు ఉంటుంది.
(iv) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ (సంవత్సరానికి రూ.577 కోట్లు), నీరు (సంవత్సరానికి రూ.51 కోట్లు) మరియు అన్ని వెలుపలి మౌలిక సదుపాయాల కల్పనకు సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది.
2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలును సమీక్షించడానికై 12-03-2018 తేదీన కేంద్ర హోం కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖలో సముచిత స్థాయి వద్ద స్వయంభరణ లోటుకు నిధుల సహాయాన్ని అందించే విషయాన్ని చేపట్టాలని హోం కార్యదర్శి ఆదేశించారు. ఇది ఇంకా పెండింగుగా ఉంది.
అందుచేత, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వాగ్ధానం చేసినందున స్వయంభరణ లోటుకు నిధిని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది (షెడ్యూల్-XIII).
వైజాగ్- చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి) ఏర్పాటు.
విసిఐసిని అభివృద్ధి చేయడంలో ఏషియన్ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని కలిగివున్నది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి మరియు యాంత్రిక లాభానికి ట్రస్ట్ అమలు (ఎన్.ఐ.సి.డి.ఐ.టి) మరియు అనుభవం నుండి ప్రయోజనం మరియు ప్రణాళికా నైపుణ్యం మరియు భారతదేశంలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి మరియు కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయ వినియోగం క్రింద కూడా విసిఐసిని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ విషయం 2017, జూన్ నుండి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగుగా ఉన్నది. ఎన్ఐసిడిఐటి ద్వారా నూటికి నూరు శాతం ఆర్ధిక సహాయం మంజూరుతో డిఎంఐసి క్రమంలోనే విసిఐసిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది.
ప్రస్తుతమున్న విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు విస్తరింప చేయడం.
విమానాశ్రయాలను విస్తరింప చేయడానికై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ వద్ద 698 ఎకరాలు మరియు తిరుపతి వద్ద 723 ఎకరాల విస్తీర్ణాన్ని భారత విమానాశ్రయాల సంస్థకు అప్పగించింది. వినియోగాల పునఃస్థాపన కొరకు అవసరమైన నిధులను కూడా విడుదల చేయడమయింది. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల కొరకు క్రొత్త టెర్మినల్‌ను నిర్మించడం జరిగింది. రన్‌వేలను విస్తరింప చేయడం జరిగింది. అయితే, అంతర్జాతీయ కార్యకలాపాలు ఇంకనూ ప్రారంభించవలసి ఉంది.
విజయవాడ మరియు తిరుపతి నుండి అంతర్జాతీయ విమానాలను నడపడానికై రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఎయిర్లైన్లను సంప్రదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విజిఎఫ్ మోడల్ క్రింద విజయవాడ నుండి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన రాకపోకలు 2018, డిసెంబరు 4 నుండి ప్రారంభమయ్యాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ వారానికి రెండుసార్లు విమానాలను నడుపుతుంది. తిరుపతి విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కాలేదు.
ప్రస్తుతమున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వాటిని చేర్చడం ద్వారా విజయవాడ మరియు తిరుపతి విమానాశ్రయాలకు “ఫోర్ట్ ఆఫ్ కాల్” హోదాను ఇవ్వమని భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరడం జరిగింది.
కొత్త రైల్వే జోన్ ఏర్పాటు
తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రైల్వే బోర్డు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ విషయం రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగులో ఉంది. ఇది చాలాకాలంగా దశాబ్ధాలపాటు పెండింగులో ఉన్న పాత డిమాండ్. అందువల్ల, ఈ హామీని తక్షణమే నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
నూతన రాజధాని నుండి రైలు కనెక్టవిటి నుండి రాపిడ్ రోడ్డు మరియు రైలు కనెక్టివిటి ఏర్పాటు.
నూతన రాజధాని నుండి హైదరాబాదుకు మరియు తెలంగాణలోని ఇతర ముఖ్యమైన నగరాలకు రాపిడ్ రైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడం కోసం చర్యను చేపట్టవలసిందిగా 2014లో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని విషయాలను పరిశీలించడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడు (ఎన్ఎజి) అధికారులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూపొందించబడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగులో ఉంది. సవరించబడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను 9-7-2018 తేదిన దక్షిణ మధ్య రైల్వే సమర్పించింది.
రైల్వే బోర్డు 14-6-2018 తేదీగల లేఖ ద్వారా ఎర్రుపాలెం-నంబూరు వయా అమరావతి సింగిల్ లైన్ (56.53 కి.మీ) ను ఆమోదించిందని ఇతర లింకులను తర్వాత పరిశీలిస్తుందని చీఫ్ ఇంజనీరు, కనస్ట్రక్షన్స్-II, దక్షిణ మధ్య రైల్వే 25-10-2018 లేఖ ద్వారా తెలియజేశారు. అంతేగాక, ఆమోదం కోసం సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించవలసిందిగా రైల్వేను కోరడమయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన రూ. 1732.56 కోట్ల సమగ్ర అంచనాను 6-7-2018 తేదీన రైల్వే బోర్డుకు పంపడమయింది. మంజూరు అందాల్సివుంది.
2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలును సమీక్షించేందుకు 12-3-2018 తేదీన కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో రూ.40,000 కోట్ల విలువగల ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రైలు కనెక్టివిటీని మెరుగుపరిచే అనేక ప్రాజెక్టులు చేరివున్నాయి. చర్చల తర్వాత మెరుగైన కనెక్టవిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందుతుందని హోం శాఖ కార్యదర్శి తెలియజేశారు. రైల్వే మంత్రిత్వ శాఖచే నిర్ధిష్ట సమయంలోపల పనిని పూర్తి చేయాలని ఆదేశించారు.
రోడ్డు అనుసంధానం :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25-08-2014 తేదీన నూతన రాజధాని నుండి హైదరాబాద్ కు మరియు తెలంగాణలోని ఇతర నగరాలకు వేగవంతమైన రోడ్డు అనుసంధానతను ఏర్పాటుచేయడానికి చర్య తీసుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 ప్రాజెక్టులను ప్రతిపాదించింది. ఐదు ప్రాజెక్టులలో రెండు సవివర ప్రాజెక్టు నివేదిక దశలో ఉన్నాయి.
1. హైదరాబాద్ – సూర్యాపేట – కోదాడ – నందిగామ – విజయవాడ/అమరావతి (ఎన్.హెచ్-65) – 275 కి.మీ. 2. హైదరాబాద్ – నాగార్జున సాగర్ – మాచర్ల (ఎన్.హెచ్-565 ద్వారా వర్తింపు)-రెంట చింతల – దాచేపల్లి-పిడుగురాళ్ల-సత్తెనపల్లి-పేరేచర్ల-గుంటూరు-అమరావతి-290 కి.మీ. 3. అమరావతి/విజయవాడ – ఇబ్రహీంపట్నం – తిరువూరు – భద్రాచలం - జగదల్ పూర్ (ఎన్.హెచ్-30) – 171 కి.మీ. భద్రాచలం వరకు 4. అనంతపురం – అమరావతి ఎక్స్ ప్రెస్ వే (గ్రీన్ ఫీల్డు ఎక్స్ ప్రెస్ వే) 5. అమరావతి అవుటర్ రింగ్ రోడ్ – 180 కి.మీ.
రాజధాని అమరావతికి వేగవంతమైన రైలు మరియు రోడ్డు అనుసంధానతను సమకూరుస్తామనే హామిని శీఘ్రగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు సదుపాయం ఏర్పాటు :
విజయవాడ, విశాఖపట్నంల కోసం ఆంధ్రప్రదేశ్ సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదికలను 2015 లో సూత్రప్రాయ ఆమోదాన్ని ఇవ్వడమయింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 2017 కొత్త మెట్రో విధానం క్రింద నూతనంగా సవివర ప్రాజెక్టు నివేదికలను తిరిగి సమర్పించాలని కోరడమయింది. 2017 కొత్త మెట్రో విధానం క్రింద ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణ భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం మెట్రోప్రాజెక్టులకు వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను మరియు ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
డి. షెడ్యూలు IX – ప్రభుత్వ కంపెనీలు, సంస్థలు
- షెడ్యూలు IX లో 89 సంస్థలను జాబితాపర్చడమయింది.
- విభజనపై సిఫారసులను చేయడానికి శ్రీమతి షీలాబీడే అధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడమయింది.
- తెలంగాణా ప్రభుత్వం సమ్మతితో విభజన కోసం సిఫారసులను చేయడానికి షెడ్యూలుIX లో చేర్చని మరో రెండు రాష్ట్ర స్థాయి సంస్థలను నిపుణుల కమిటీకి అప్పగించడమయింది. శ్రీమతి షీలాబీడే కమీటీ కాలపరిమితిని 2018 డిసెంబరు 31 వరకు పొడిగించడమయింది.
- 85 సంస్థల ఆస్తుల, అప్పుల విభజన కోసం మరియు 60 సంస్థల ఉద్యోగుల విభజన కోసం నిపుణుల కమిటీ సిఫారసులను ఇచ్చింది. ఈ 60 లో నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ 41 సంస్థల విషయంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరువులను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని సమ్మతిని తెలియజేయవలసిందిగా కోరడమయింది. కొన్ని వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ 13 సంస్థల సిఫారసులను సవరించవలసిందిగా నిపుణుల కమిటీని కోరడమయింది. మిగిలిన 6 ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి.
- షెడ్యూలు IX సంస్థల ఆస్తుల విలువను తాత్కాలికంగా రూ.1,58,508 కోట్లుగా విలువ కట్టడమయింది.
- ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహాకారం లేకపోవడం వల్ల ఏ సంస్థను ఇప్పటి వరకు విభజించలేదు.
ఇ) షెడ్యూలు – x – రాష్ట్ర సంస్థలు
- షెడ్యూలు – x లో 142 సంస్థలు ఉన్నాయి.
- 2015 లోని ఎస్.ఎల్.పి (సి) నెం 14705-14706 ద్వారా ఉత్పన్నమయిన సివిలు అపీలు నెం.3019-3021 / 2016 లో 18.03.2016 తేదీన గౌరవ సుప్రీం కోర్టు జనాభా ప్రాతిపదికన షెడ్యూలు – x సంస్థల ఆస్తులను, అప్పులను విభజించాలని ఆదేశించింది.
- 18-04-2017 తేదీగల కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి (ఎల్.డబ్ల్యు.ఇ) ఇతర విషయాల తోపాటుగా భూమి, స్టోర్స్, వస్తువులు, ఇతర సరుకులు మొదలగు వాటి స్థిర, చరాస్తులన్నింటిని 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 48 (4) విభాగం తోపాటు 48 (1) విభాగంలోని నిబంధనల దృష్ట్యా ప్రాంతం ప్రాతిపదికన పంచాలని నిర్ణయించారు.
- పై ఉత్తరువు 18.03.2016 తేదీగల ఎస్.ఎల్.పి (సి) నెం.14705-14706 ద్వారా ఉత్పన్నమయిన సివిల్ అపీలు నెం.3019-3021/2016 లో గౌరవ భారత సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా లేనందున, దాని ఉత్తరువును ఉపసంహరించుకొని సుప్రీంకోర్టు ఉత్తరువులకు అనుగుణంగా తాజా ఉత్తరువును జారీచేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ వ్రాసింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది.
- కేంద్ర ప్రభుత్వం నుండి స్పందనలేనందున, కేంద్ర ప్రభుత్వ ఉత్తరువులను సవాలు చేస్తూ హైకోర్టులో ఏ.పి.ఎస్.సి.హెచ్.ఇ 2018లోని డబ్ల్యుపి నెం. 34949ను దాఖలు చేసింది.
- షెడ్యూలు X ఆస్తుల విలువను తాత్కాలికంగా రూ.38,772.85 కోట్లుగా లెక్కకట్టడమయింది.
- కేంద్ర ప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వ సహకారం లేక పోవడం వల్ల 142 రాష్ట్ర సంస్థల విభజన అంశం ఇప్పటికే పరిష్కారం కాకుండానే ఉంది.
(ఎఫ్) షెడ్యూలు –XI – నదీ యాజమాన్య మండళ్లు
- కృష్ణానది యాజమాన్య మండలి, గోదావరి నదీ యాజమాన్య మండలి అధికార పరిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటనను జారీ చేయలేదు.
- ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం నిబంధనలకనుగుణంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కృష్ణానదీ యాజమాన్య మండలి ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించాల్సివుంది.
- కృష్ణా నదీ యాజమాన్య మండలి మరియు గోదావరి నదీ యాజమాన్య మండలికి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం సహాయన్ని సమకూర్చలేదు.
జి) కొత్త ఢిల్లీలోని ఏపి భవన్ ఆస్తుల విభజన
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ కొత్త ఢిల్లీలోని ఏపి భవన్ ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశం 4 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని విభాగం – 66 క్రింద కొత్త ఢిల్లీలోని ఆస్తులు మరియు అప్పుల విభాగ నిర్ణయం అంశంతో సహా పెండింగు అంశాల పరిష్కారం కోసం 11-05-2017 తేదీగల డి.ఓ.లేఖ నెం. 4052/జిఎడి/ఎస్.ఆర్/2015 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. 22-09-2017 తేదీన రెండు రాష్ట్రాల ద్వారా ఒక సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేయడమయింది. ఆస్తుల విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సమక్షంలో రెండు ఐచ్చికాలను ఉంచింది. రెండు ఐచ్చికాలపై అభిప్రాయాలు తెలపవలసిందిగా 19-03-2018 మరియు 15-06-2018 తేదీలలో కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశం ఇంకా పరిష్కారం కాకుండానే ఉంది.
7. పన్ను విధింపు అంశాలలో వ్యత్యాసాన్ని తొలగించడం :
పన్ను విధింపు అంశాలకు సంబంధించి (ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని విభాగాలు 50, 51 మరియు 56) పూర్వపు పునర్ వ్యవస్థీకరణ చట్టాలలో కొత్త వ్యత్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 లో చేర్చారు. వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు సంబంధిత నిబంధనలను సవరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో చర్య ఇంకా పెండింగులోనే ఉంది. చట్టానికి సత్వరమే సవరణ చేయనట్లయితే, రాష్ట్రానికి రూ.3820 కోట్ల నష్టం ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తేవడమయింది. సూత్రం ఏకరూపతో స్పూర్తిని దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. చట్టాన్ని సవరించాలని లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నష్టాన్ని పూరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని నివేదించడమయింది.
8. విభాగం – 66 క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తావన :
9వ షెడ్యూలు సంస్థలు, 10 వ షెడ్యూలు సంస్థలు, చట్టంలో ఎక్కడా పేర్కొనని సంస్థల ఆస్తులు మరియు అప్పుల విభాగ నిర్ణయం, కొత్త ఢిల్లీలోని ఏపి భవన్ ఆస్తుల విభాగ నిర్ణయం మరియు విభాగం – 50, 51 మరియు 56 లలో పొందుపరచినట్లుగా పన్ను విధింపు అంశాలలో వ్యత్యాసాన్ని సరిదిద్దడం గురించి 11-05-2017 తేదీగల ప్రధాన కార్యదర్శి డి.ఓ. లేఖ నెం. 4052/జిఎడి/ఎస్.ఆర్/2015 ద్వారా ఒక ప్రస్తావన చేయడమయింది. తదుపరి సింగరేణి కాలరీలకు చెందిన ఆస్తుల విభాగ నిర్ణయం గురించి 30-5-2017 తేదీగల ప్రధాన కార్యదర్శి డి.ఓ లేఖ నెం. 4052/జిఎడి/ఎస్.ఆర్/2015 ద్వారా మరొక ప్రస్తావన చేయడమయింది. విభాగం-66 క్రింద చేసిన ప్రస్తావన గురించి సత్వర చర్య తీసుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమయింది.
9. ప్రధానమంత్రి హామీలు – ప్రత్యేక కేటగిరీ హోదాతో సహా అమలు స్థితి : అప్పటి ప్రధాన మంత్రి 20-2-2014 తేదీన రాజ్యసభలో ఆరు హామీలు ఇచ్చారు.
- పూర్తిగా అమలు పరచినవి - 0
- పాక్షికంగా అమలుపరచినవి - 5 (పన్ను ప్రోత్సాహకాలు ; ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ; పోలవరం ; సిబ్బంది, ఆస్తులు మరియు అప్పులు పంపిణీ ; వనరుల అంతరం).
- అమలు పరచనివి - 1 (ప్రత్యేక కేటగిరీ హోదా)
ప్రత్యేక కేటగిరీ హోదా (ఎస్.సి.ఎస్)
[మార్చు]“కేంద్ర సహాయం నిమిత్తం నాలుగు రాయలసీమ జిల్లాలు మరియు మూడు ఉత్తర కొస్తాంధ్ర జిల్లాలతో సహా 13 జిల్లాలతో కూడిన కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “ప్రత్యేక కేటగిరీ హోదా” అందించడమవుతుందని, ఇది రాష్ట్ర ఆర్థిక వనరులను పటిష్ట పునాదిపై ఉంచుతుందని” గౌరవ ప్రధాన మంత్రిగారు 20-2-2014 తేదీన రాజ్యసభలో హామీ ఇచ్చారు.
2014, మార్చిలో ప్రత్యేక కేటగిరీ హోదా కోసం కేంద్ర మంత్రిమండలి తీర్మానం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటగిరీ హోదా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఒత్తిడి చేసిన మీదట, కేంద్ర ప్రభుత్వం 8-9-2016 తేదీన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సహాయ చర్యను ప్రకటించింది. “ 14వ ఆర్థిక సంఘం సిఫారసులను అనుసరించి, ప్రత్యేక కేటగిరీ హోదా అమలులో లేదని అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక ఆర్థిక సహాయన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, 20-2-2014 తేదీన అప్పటి ప్రధాన మంత్రి ప్రకటనలో ఉద్దేశించినట్లుగా ఈ సంవత్సరాలలో అంటే, 2015-16 నుండి 2019-20 వరకు రాష్ట్రం పొంది ఉన్నట్టి సహాయానికి ఇది అదనపు కేంద్ర వాటాగా ఉంటుందని ” తెలియజేస్తూ 8-9-2016 తేదీన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనను జారీ చేసింది.
రాష్ట్రం, విభజన ఫలితంగా మరియు పారిశ్రామీకరణ విషయంలో కూడా రెవెన్యూ సంభావ్యతను కోల్పోయినందున ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించినంతవరకు చట్టంలోని చేసిన ప్రతి నిబద్ధతను నెరవేర్చుతుందని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు ఎన్.డి.ఎ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వం నిర్ణయించినట్లు 8-9-2016 తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ కూడా పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిమండలి 15-3-2017 తేదీన ప్రత్యేక ఆర్థిక సహాయ చర్యను ఆమోదించి, 15-3-2017 తేదీన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా ప్రకటనను విడుదల చేయడమయింది. అందులో “కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, కేంద్ర ప్రతిపాదిత పథకాల (సి.ఎస్.ఎస్) నిధుల సమీకరణ కేంద్రం మరియు రాష్ట్రం మధ్య 90 : 10 దామాషాలో పంచుకున్నట్లయితే 2015-16 నుండి 2019-20 వరకు గల సంవత్సరాలలో రాష్ట్రం అందుకుని ఉన్నట్టి సహాయానికి ఇది అదనపు కేంద్ర వాటాగా ఉంటుందని” తెలియజేయడమయింది.
అయితే, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ 8-9-2016 తేదీన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి 20-2-2014 తేదీన చేసిన ప్రకటనలో ఉద్దేశించినట్లుగా అంటే, కేంద్ర ప్రతిపాదిత పథకాలు (సి.ఎస్.ఎస్) మరియు విదేశీ సహాయ ప్రాజెక్టులు (ఇఎపిలు) రెండింటికీ 90 శాతం గ్రాంటు మరియు పారిశ్రామిక ప్రోత్సాహకాల చొప్పున ఆర్థిక సహాయాన్ని వర్తింపచేసింది. 15-3-2017 తేదీ నాటి మంత్రిమండలి తీర్మానం దానిని సి.ఎస్.ఎస్ కు మాత్రమే పరిమితం చేసింది. అందువల్ల కేంద్ర మంత్రిమండలి 8-9-2016 తేదీ నాటి పూర్వపు ప్రకటనను నిర్వీర్యం చేసింది.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల అవరోధాలను ఉదహరిస్తూ ఎస్.సి.ఎస్ లోని అన్ని అంశాలు ఎస్.ఎ.ఎంలో అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ ప్రత్యేక సహాయ చర్యను (ఎస్.ఎ.ఎం) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. జి.ఎస్.టి ప్రవేశ పెట్టిన తరువాత ఎస్.సి.ఎస్ రాష్ట్రాలకు ఇచ్చే సహాయం, ప్రోత్సాహకాలు మురిగి పోతాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఇతర కేటగిరీ రాష్ట్రాలతో (ఈశాన్య, కొండ రాష్ట్రాలు) సమానంగా కేంద్ర ప్రభుత్వం వాస్తవ స్ఫూర్తితో ఎస్.ఎ.ఎంను అమలుపర్చడమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశించింది.
ఏమైనప్పటికీ, 2017, ఆగష్టులో ప్రత్యేక కేటగిరీ హబ్ రాష్ట్రాలకు కేంద్ర సహాయ చర్యలు, ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం విస్తరింపచేసింది. 2018, మార్చిలో ఈశాన్య రాష్ట్రాలకు ఒక నూతన పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజిని ఇవ్వడమయింది. దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరింపచేయలేదు.
మంత్రిమండలి 2017, మార్చిలో ఆంధ్రప్రదేశ్ కు ఎస్ఏఎంను మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. మొదట్లో, ఎస్ఏఎంను అందివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇఏపి యంత్రాంగాన్ని సూచించింది. అయితే, ఎటువంటి ఉత్తరువులను జారీ చేయలేదు. కనీసం నాబార్డు/హడ్కో/బ్యాంకుల ద్వారా ఎస్ఏఎం సమకూర్చమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎస్.పి.వి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, అప్పు భారాన్ని రాష్ట్రంపై పెట్టింది. ఈ తేదీ వరకు ఎటువంటి వ్రాతపూర్వక సమాచారాన్ని ఇవ్వలేదు. ఎస్.సి.ఎస్ రాష్ట్రాలకు కేంద్ర సహాయాన్ని అందివ్వడానికి, ఎస్.పి.వి ఏర్పాటును కోరలేదు. కాగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎస్.పి.వి కోసం పట్టుబట్టడమవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణను ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు పూర్వపు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అందించిన ప్రత్యేక ప్రయోజనం మాదిరిగా ఎస్.జి.ఎస్.టి & ఐ.జి.ఎస్.టి ని రిఫండ్ చేయడం కోసం పరిహార యంత్రాంగం అలాగే పారిశ్రామికీకరణ కోసం అవసరమైన ఆర్థికపరమైన ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్ కు అందించవచ్చని కూడా గౌరవ ముఖ్యమంత్రిగారు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిని 28-02-2018 తేదీన అభ్యర్థించారు.
2020, మార్చి వరకు రూ.3,000 కోట్ల ఆర్థిక వ్యయంతో 2017 ఈశాన్య పారిశ్రామికాభివృద్ధి పథకాన్ని (ఎన్ఇఐడిఎస్) 21-03-2018 తేదీన కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎన్ఇఐడిఎస్ అనేది అత్యధిక వ్యయంతో మునుపటి రెండు పథకాల క్రింద వర్తింప చేసిన ప్రోత్సాహకాల సమ్మేళనం. ఈ పథకం క్రింద, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన కొత్త పారిశ్రామక యూనిట్లకు ఈ క్రింది ప్రోత్సాహకాలను అందించబడతాయి.
- పరపతి పొందడానికి కేంద్ర మూలధన పెట్టుబడి ప్రోత్సాహకం (సిసిఐఐఏసి)
- కేంద్ర వడ్డీ ప్రోత్సాహకం (సిఐఐ)
- కేంద్ర సమగ్ర బీమా ప్రోత్సాహకం (సిసిఐఐ)
- సరుకులు, సేవల పన్ను (జి.ఎస్.టి) రీయింబర్స్ మెంట్.
- ఆదాయపన్ను (ఐటి) రీయింబర్స్ మెంట్.
- రవాణా ప్రోత్సాహకం (టిఐ)
- ఉపాధి ప్రోత్సాహకం (ఇఐ)
ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదాను సిఫారసు చేయడంలో ఆర్థిక సంఘానికి ఎటువంటి పాత్ర లేదని 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అయిన శ్రీ వై.వి. రెడ్డి 8-1-2017 తేదీన తెలియజేశారు.
రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇవ్వకపోవడానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘాన్ని నిందించేందుకు అది తప్పుదారి పట్టిస్తున్నదని మరియు ప్రత్యేక కేటగిరీ హోదా అపేక్షణీయత అంశాన్ని గానీ, ప్రత్యేక కేటగిరీ హోదా గురించిగానీ ఎఫ్ఎఫ్ఎస్ తన నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు శ్రీ ఎం. గోవిందరావు 11-3-2018 తేదీన తెలియజేశారు.
11-10-2018 తేదీన ఆంధ్రప్రదేశ్ సచివాలయం, వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చలలో ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధి క్రిందకు రాదని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొనింది. కేంద్ర ప్రభుత్వం మాట్లడుతున్నట్లుగా స్పెషల్ పర్పస్ వెహికల్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం అందలేదు. ఈ విషయంలో నిర్వహణ మార్గదర్శకాలు ఏవీ జారీ కాలేదు.
ఈ నేపధ్యంలో మరియు ప్రస్తుతమున్న 11 ప్రత్యేక కేటగిరి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా క్రింద ప్రయోజనాలను కొనసాగించినందున 10 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
వనరుల వ్యత్యాసం [విభాగం-46(2)]
[మార్చు]మునుపటి ప్రధానమంత్రిగారు 20-2-2014 తేదీన రాజ్యసభ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంవత్సరం నుండి ప్రత్యేకించి ఆవిర్భావ తేదీ మరియు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం సిఫారసులను ఆమోదించిన తేది మధ్యగల కాలం నుండి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనరుల వ్యత్యాసాన్ని 2014-15 సంవత్సరపు రెగ్యులర్ కేంద్ర బడ్జెట్ లో సరిచేయాల్సివుంది.
రూ. 13,775.76 కోట్ల రెవెన్యూ లోటును సూచిస్తూ 2014-15 ఆర్థిక సంవత్సరానికి భారత కంప్ట్రోలరు మరియు ఆడిటర్ జనరలు (కాగ్) ఆడిట్ చేసిన ఆర్థిక లెక్కలను సమకూర్చారు. 2014-15 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుండి అందిన రూ. 2,303 కోట్ల గ్రాంటును మినహాయించిన తర్వాత మొత్తంఇది. అందువల్ల, మొత్తం రెవెన్యూ లోటు రూ. 16,078.76 కోట్లు అయింది.
వనరుల వ్యత్యాసం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 3979.50 కోట్లు విడుదల చేసింది (2014-15 లో రూ. 2303 కోట్లు, 2015-16లో రూ. 500 కోట్లు, 2016-17లో రూ. 1,176.50 కోట్లు). 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 2014-15 సంవత్సరానికి వనరుల వ్యత్యాసానికి సంబంధించిన నిబద్ధతలను ఆ సంవత్సరపు ప్రామాణీకృత వ్యయం ప్రాతిపదికన నెరవేరుస్తున్నట్లు 08-09-2016 తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని పింఛను పథకాలకు సంబంధించిన అంకెలను బట్టి తదుపరి సర్ధుబాటుకు లోబడి వనరుల వ్యత్యాసాన్ని తాత్కాలికంగా గణించడమయింది. అంతేగాక రూ.3,979.50 కోట్ల మొత్తం మేరకు వనరుల వ్యత్యాస పరిహారం కొంతభాగాన్ని చెల్లించడమయిందని మరియు మిగతా మొత్తాన్ని వార్షిక వాయిదాలతో చెల్లించడమవుతున్నదని తెలియజేయడమయింది.
రూ. 138.39 కోట్ల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేస్తామని వాటిని కొత్త పథకాలుగా పరిగణిస్తూ రాష్ట్ర చేసిన కొంత వ్యయాన్ని నిరాకరించిన తర్వాత ఈ మొత్తాన్ని లెక్కగట్టడమయిందని ముఖ్యమంత్రిగారికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగారు 04-5-2017 తేదీన తెలియజేశారు. అంతేగాక, పి.ఆర్.సి బకాయిలను పరిగణనలోకి తీసుకోలేమని కూడా తెలియజేశారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వ్యయం)తో 07-02-2018 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల బృందం చర్చలు జరిపి నిరాకరించిన వ్యయాన్ని పరిశీలించేందుకు కారణాలను వివరించి సి &ఎజి ధృవీకరించినట్లుగా రూ.16,078.76 కోట్ల క్లెయింను అనుమతించాలని కోరింది. 2014-15 లో పెద్ద సంఖ్యలో బిల్లులను చెల్లించలేదని మరియు నిధుల కొరత వల్ల పి.ఆర్.సి బకాయిలు చెల్లించలేదని పేర్కొనింది. 31-3-2015 నాటికి రూ.3194 కోట్ల రెవెన్యూ బిల్లులు పెండింగులో ఉన్నాయి. 02-06-2014 నుండి 31-03-2015 వరకు గల కాలానికి చెల్లించాల్సిన వేతన సవరణ సంఘం బకాయిలు రూ.3920 కోట్లు.
2015-16 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం సూచించిన లోటు ప్రాతిపదికన రెవెన్యూ లోటును లెక్కగట్టడమవుతుందని 06-03-2018 తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగారు పేర్కొన్నారు. సదరు లోటును 2014-15 సంవత్సరానికి దామాషాలో అనుమతించడమవుతుందని పేర్కొన్నారు.
2014-15 సంవత్సరానికి ప్రామాణీకరించిన వ్యయం ప్రాతిపదికన ఆ సంవత్సరపు వనరుల వ్యత్యాసాన్ని భరించడమవుతుందనే కేంద్ర ప్రభుత్వ నైవాసిక 46(2) విభాగంలోని నిబంధనకు మరియు 20-02-2014 తేదీన రాజ్యసభలో ప్రధామంత్రి ఇచ్చిన హామీకి విరుద్దంగా ఉంది.
అంతేగాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసిన రూ.3979.50 కోట్ల మొత్తాన్ని 2014-15, 2015-16 మరియు 2016-17 సంవత్సరాలలో విడుదల చేయడమయింది. కాగా హామీ ప్రకారం సదరు మొత్తాలను 2014-15 లో విడుదల చేయాల్సివుంది.
సి & ఎజి ధృవీకరించినట్లుగా ఆవిర్భావ రోజు మరియు 31-03-2015 మధ్యగల కాలానికి నూతన ఆంధ్రప్రదేశ్ యొక్క వనరుల వ్యత్యాసాన్నంతటిని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని 20-02-2014 తేదీన రాజ్యసభలో ప్రధాన మంత్రిగారు ఇచ్చిన హామీని చేర్చుతూ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
10. వినియోగ ధృవపత్రాలు :
2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ నిబంధనల క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రూ.14,259.32 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. రూ.13,620.79 కోట్ల మొత్తానికి వినియోగ ధృవపత్రాలను సమర్పించడమయింది.
11. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 అమలు కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చొరవలు
- గౌరవ ముఖ్యమంత్రిగారు 29 సార్లు న్యూఢిల్లీని సందర్శించి, గౌరవ ప్రధానమంత్రి మరియు ఇతర కేంద్ర మంత్రులకు స్వయంగా విజ్ఞప్తులను అందజేశారు.
- గౌరవ ముఖ్యమంత్రిగారు మరియు వివిధ అంశాలను త్వరితగతిన పరిష్కరించమని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ నిబంధనల అమలు గౌరవ ప్రధానమంత్రి మరియు ఇతర కేంద్ర మంత్రులకు అనేక విజ్ఞప్తులను చేశారు.
- పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు చేసిన వాగ్ధానాలను మరియు 2014, ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో ప్రధానమంత్రిగారు ఇచ్చిన హామీలను అమలుపర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 01-09-2015, 16-03-2016, 13-03-2018, 19-09-2018 తేదీలలో ఏకగ్రీవంగా తీర్మానాలను చేసింది.
- పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు చేసిన వాగ్ధానాలను మరియు 2014, ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో ప్రధానమంత్రిగారు ఇచ్చిన హామీలను అమలుపర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 03-09-2015, 16-03-2016, 16-03-2018 తేదీలలో ఏకగ్రీవంగా తీర్మానాలను చేసింది.
- ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం క్రింద వివిధ అంశాలను పరిష్కరించడం కోసం అనేక కమిటీలను ఏర్పాటు చేయడమయింది.
i) షెడ్యూలు – IX సంస్థల ఉద్యోగులు, ఆస్తుల విభజనను సిఫారసు చేయడానికి షీలా భిడే కమిటీ ii) కేటాయించదగు రాష్ట్ర స్థాయి ఉద్యోగులను విభజించడానికి కమలనాథన్ కమిటీ iii) గౌరవ గవర్నరు సమక్షంలో తెలంగాణా వారితో చర్చలు జరపడానికి శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ కె. అచ్చెన్నాయుడు, శ్రీ కాలవ శ్రీనివాసులు గారలతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడమయింది. iv) క్రమం తప్పకుండా విభజన అంశాలను నిశితంగా పర్యవేక్షించడానికి శ్రీ సి. కుటుంబరావు, విసి, ఏ.పి.ఎస్.పి.బి, శ్రీ ఎస్. బాల సుబ్రహ్మణ్యంను, ఐ.ఎ.ఎస్. (రిటైర్డు), కన్సల్టెంట్ ఎ.ఎఫ్.ఆర్.సి మరియు శ్రీ ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డి, ఐఎఎస్ (రిటైర్డు) పదవీరీత్యా జి.ఎ.డి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శు (ఎస్ఆర్)లతో కమిటీని ఏర్పాటు చేయడమయింది. v) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సమస్యల పరిష్కారం కొరకు క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారు.
- షెడ్యూలు X సంస్థల ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్థంభింపచేసినపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పిని దాఖలు చేసి, అనుకూల ఉత్తరువులు పొందింది.
- శ్రీమతి షీలాబిడే కమిటీ సిఫారుసుల ఆధారంగా ఇప్పటి వరకు షెడ్యూలు X సంస్థల ఆస్తులు, అప్పులు ఉద్యోగుల విభజన కోసం 41 జి.ఓ.లను జారీ చేయడమయింది.
- ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తులను సామరస్యంగా విభజించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అధికారులతో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయడమయింది.
- భూ సమీకరణ విధానం ద్వారా రాజధాని అభివృద్ధి కోసం 33000 ఎకరాల విస్తీర్ణాన్ని సమీకరించబడినది.
- కేంద్ర ప్రభుత్వం నుండి తగినంత సహాయం లేకుండానే రాజధాని నగరానికి ఆకృతులు, డ్రాయింగ్ లు అభివృద్ధి.
- రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.6610 కోట్ల మొత్తాన్ని సమీకరించింది. కాగా కేంద్ర ప్రభుత్వం 2014-17 కాలంలో రూ. 1500 కోట్లను మాత్రమే ఇచ్చింది.
- ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 66వ విభాగం ప్రకారం ఆస్తుల విభజనకు సంబంధించి అన్ని పెండింగు అంశాలను సత్వరమే పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది.
- ఏపి జెన్ కో చే సరఫరా చేయబడిన విద్యుత్ కోసం ఏపి జెన్ కోకు తెలంగాణా డిస్కంలు రూ.5732.40 కోట్ల మొత్తం బకాయిపడినపుడు, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంకు నివేదించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పరిష్కరించలేదు. ఈ విషయంలో ఏపి జెన్ కో హైదరాబాదులోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక కేసును దాఖలు చేసింది.
- రూ. 1,97,280 కోట్ల విలువగల IX షెడ్యూలు, X షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచలేదు. ఈ సంస్థల విభజన కోసం అభ్యర్ధనను 66వ విభాగం క్రింద కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇది పెండింగులో ఉంది.
- జిల్లా ప్రధాన కార్యస్థానంలో ప్రతి నెలా ధర్మ పోరాట దీక్షను నిర్వహించడమవుతున్నది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి ప్రజలందరూ పునరంకితం కావడానికి ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్షను నిర్వహించడమవుతున్నది.
- రాష్ట్ర ప్రభుత్వం సహనంతో వేచిచూస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 క్రింద వర్తింపు అయ్యే వివిధ హామీలు మరియు ప్రధానమంత్రిగారి హామీలు అమలుపర్చడం కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా సంప్రదింపులు జరుపుతున్నది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులు నిరంతరం సంప్రదిస్తున్నారు.
- ప్రస్తుత లోక్ సభ చివరి పూర్తి బడ్జెట్ అయిన 2018-19 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గాని, అమరావతిని గాని, వాటికి సంబంధించిన నిధుల గురించిగాని ప్రస్తావించలేదు.
- కడప జిల్లాలో ఏకీకృత స్టీలు ప్లాంట్ ను నెలకొల్పాలని కోరుతూ పార్లమెంటు సభ్యులు శ్రీ సి.ఎం. రమేష్ మరియు ఎం.ఎల్.సి శ్రీ రవి గారలు 11 రోజుల పాటు నిరవధిక దీక్షను చేపట్టారు.
- తెలుగుదేశం పార్టీ ఎంపిలు పార్లమెంటు యొక్క రెండు సభలలో అందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరివల్ల మొత్తం బడ్జెట్ సమావేశాల కాలమంతా తుడిచి పెట్టుకుపోయింది. కేంద్ర మంత్రిమండలిలోని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు వారి పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్.డి.ఏ తన మద్దతును ఉపసంహరించుకొంది. ఎన్.డి.ఏ ప్రభుత్వంపై 20-07-2018 తేదీన లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది.
- లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చల కాలంలో మరియు రాజ్యసభలో స్వల్పచర్చ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ మరియు తన 5 కోట్ల ప్రజలను ఎన్.డి.ఏ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా మరియు కావాలని ఉపేక్షిస్తున్న విషయాన్ని విస్తృత స్థాయిలో దేశానికి తెలియజేసేటట్లుగా చేయగలిగారు.
- ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజలకు నిహితమైవుంటుంది. ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల దృష్టికి తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. ప్రజల ఆవేదనను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలు తెలియజేస్తున్నాయి. వివిధ జిల్లాలలో ధర్మ పోరాట దీక్షలు, ర్యాలీలను నిర్వహించడం మరియు ఇతర పద్ధతులలో శాంతియుత నిరసనలను చేపట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పై వత్తిడిని తీసుకొనిరావడానికి ప్రజా అభిప్రాయాన్ని సమీకరించడమవుతున్నది.
12. ఎన్.డి.ఎ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ యంత్రాంగం/ప్రాధికార సంస్థల పట్ల అమర్యాదను కనబరచడం.
పార్లమెంటు దేశంలోనే అత్యంత రాజ్యాంగ పరమైన సంస్థ. అప్పటి ప్రధానమంత్రిగారు 20-02-2014 తేదీన రాజ్యసభ సమక్షంలో ఇచ్చిన హామీలలో ఇప్పటివరకు కనీసం ఏ ఒక్క హామీని పూర్తిగా అమలుపర్చలేదు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ప్రత్యేక కేటగిరీ హోదా కోసం పోరాటం చేస్తున్నాం.
మరొక రాజ్యాంగబద్ధ ప్రాధికార సంస్థగా ఉన్న గౌరవ భారత సుప్రీంకోర్టు ఏ.పి.ఎస్.సి.హెచ్.ఇ కేసులో షెడ్యూలు X సంస్థల అన్ని ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. అయితే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రాంతం ఆధారంగా ఆస్తులను కేటాయిస్తూ భిన్నమైన ఉత్తరువులను జారీ చేసింది. ఇది సుప్రీంకోర్టు పట్ల మోడి ప్రభుత్వం కనబరిచిన అమర్యాదను సూచిస్తున్నది.
మరొక రాజ్యాంగబద్ధ ప్రాధికార సంస్థ అయిన కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ 2014-15 సంవత్సరానికి రూ.16078.76 కోట్ల రెవెన్యూ లోటును స్పష్టంగా ధృవీకరించారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా, న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సరిఅయిన అధికారం లేకుండా లోటును తగ్గించారు.
ఇతర రాజ్యాంగబద్ద సంస్థలైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనపరిషత్తులు ప్రత్యేక కేటగిరీ హోదాను మరియు పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 లోని వివిధ నిబంధనల అమలును కోరుతూ తీర్మానాలను ఆమోదించాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాటికి సంబంధించి ఏ విధమైన చర్యను చేపట్టలేదు.
13. ఎన్.డి.ఎ నెరవేర్చని వాగ్ధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం సమయంలో, అప్పటి రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న శ్రీ అరుణ్ జైట్లీ 10 సంవత్సరాల కోసం ప్రత్యేక హోదా కోసం వాదించారు. అధికారంలోకి వచ్చాక, ఎన్.డి.ఎ ప్రభుత్వం 360 డిగ్రీల టర్న్ ను తీసుకొని, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదాను ఇవ్వలేదు.
బిజెపి 2014, సీమాంద్ర మేనిఫెస్టో లో యుపిఎ ప్రభుత్వంచే వాగ్ధానం చేయబడిన 5 సంవత్సరాలకు బదులుగా 10 సంవత్సరాలకు విస్తరింపచేయడమవుతుందని వాగ్ధానం చేసింది. ప్రస్తుతం అది ప్రత్యేక కేటగిరీ హోదాను ఇవ్వలేమని చెపుతున్నది.
రాష్ట్ర బిజెపి మేనిఫెస్టోలో హామీలు రెండు అంటే రెవెన్యూ లోటు తిరిగి చెల్లింపు మరియు కెబికె మరియు బుందేల్ ఖండ్ విధానంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీని చేర్చడమయింది. వాస్తవానికి, అప్పటి ప్రధానమంత్రిగారు రాజ్యసభలో రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలకు కెబికె మరియు బుందేల్ ఖండ్ ప్యాకేజీల మాదిరిగా సహాయాన్ని ఇవ్వడమవుతుందని ప్రకటించారు. బుందేల్ ఖండ్ ప్యాకేజి క్రింద, ఒక్కొక్కరికి వ్యయం విడుదల రూ.4115/-లు గా ఉండగా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రూ. 428/-లుగా ఉంది. అది మోది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపుతున్న వివక్షతను తెలియపరుస్తున్నది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడిగారు తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంతన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోను మరియు నెల్లూరులో జరిగిన సమావేశంలోను 10 సంవత్సరాలపాటు ప్రత్యేక కేటగిరీ హోదాకు వాగ్ధానం చేశారు. దానిని అమలుపర్చలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీ హోదా అంశాన్ని ప్రస్తావించినపుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల దృష్ట్యా, ఏదేని రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదాను ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి, ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించారు. అయితే, ఇటీవలి కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటగిరీ క్రింద ప్రయోజనాలను ఈశాన్య రాష్ట్రాలకు ఇవ్వడమయింది. తద్వారా మోడి ప్రభుత్వం తన స్వంత ప్రకటనను ఉల్లంఘిస్తున్నది.
2014-15 సంవత్సరానికి వనరుల అంతరాన్ని లెక్కకట్టడానికి కేంద్ర ప్రభుత్వంచే నిర్ణయించబడిన పింఛను రేట్ల ప్రకారం 10 నెలలకు పింఛను మొత్తం రూ.946.90 కోట్లుగా ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోజనాన్ని రూ.93.34 కోట్లుగా మాత్రమే లెక్కకట్టింది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం, మోడి ప్రభుత్వం 9-2-2018 తేదీన రూ.350 కోట్లను విడుదల చేసి, తక్షణమే ఒక వారం లోపే అంటే, 15-2-2018 తేదీన నిధులను ఏకపక్షంగా వెనకకు తీసుకొంది.
అనేకసార్లు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం క్రింద వివిధ పద్దుల కోసం ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల కోసం వినిమయ ధృవపత్రాలను సమర్పించలేదని ఆరోపించారు. ఈ ప్రకటనలు తప్పని నిరూపితమయినపుడు, ఇవి స్వీయ ధృవీకరణాలు అని చెపుతున్నారు. వాస్తవానికి, నీతి ఆయోగ్ వినిమయ ధృవపత్రాలను ధృవీకరించింది. అందుచేత ఈ ఆరోపణలు నిజమయినవికావు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల పట్ల అత్యంత నిర్లక్ష్యాన్ని చూపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఉత్పన్నమయ్యే అంశాలు/వివాదాలను పరిష్కరించడానికి చట్ట బద్దంగా కట్టుబడి ఉండాల్సిన మోడి ప్రభుత్వం ఒక అంశాన్ని లేదా ఒక వివాదాన్ని పరిష్కరించలేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనే ఒక చక్కటి ఉదాహరణ.
రాష్ట్రంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం 11 సంస్థలకు గాను 10 సంస్థలను నెలకొల్పినప్పటికీ, వారు మౌలిక సదుపాయాలను ఏర్పరచడానికి చాలా తక్కువ మొత్తాన్ని ఇవ్వడమయింది. దాదాపు రూ.12,746 కోట్ల మొత్తం అవసరత ఉండగా, వారు ఇప్పటి వరకు సుమారు రూ.845 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది మొత్తం వ్యయంలో 6.63 శాతంగా ఉంది. ఈ విధంగా చేసినట్లయితే ప్రాజెక్టుల కోసం మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి కనీసం 20 సంవత్సరాల సమయం పడుతుంది. మరొక వైపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలువైన 2909 ఎకరాల భూమిని సమకూర్చి, వాటిని పరిరక్షణ కోసం రూ.131 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది.
ఎ.పి. జెన్ కో సరఫరా చేసిన విద్యుత్తు కోసం ఏ.పి. జెన్ కో కు తెలంగాణ డిస్కంలు రూ.5732.40 కోట్ల మొత్తం బకాయి ఉన్న విషయాన్ని 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడమయింది. ఈ రోజు వరకు ఈ విషయాన్ని పరిష్కరించలేదు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మద్య రూ. 1,97,280 కోట్ల మొత్తం మేరకు IX వ షెడ్యూలు సంస్థలు మరియు Xవ షెడ్యూలు సంస్థలలోని ఆస్తులు మరియు అప్పులను విభజించలేదు.
అమరావతి నగరం కోసం రూ.1,500 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడమయింది. తదుపరి మొత్తాలను విడుదల చేయలేదు. సర్ధార్ పటేల్ మరియు శివాజీ విగ్రహాల కొరకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చుపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో 2019 జనవరిలో జరిగే మెగా అర్ధ్ కుంభ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.1200 కోట్లను విడుదల చేసింది. ఢిల్లీకి రెండు రెట్లు, షాంఘైకి ఆరు రెట్లు ఉండే విధంగా డొలేరాను అభివృద్ధిపర్చడమవుతున్నది. ప్రారంభ నిధులుగా రూ.3,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో ముంబాయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ ను చేపట్టడమవుతున్నది. ద్వారక వద్ద కన్వెన్షను సెంటరు కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.27,000 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది.
ఢిల్లీ-ముంబాయి ఇండ్ కారిడార్ అభివృద్ధి కోసం జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి మరియు అమలు పరిచే ట్రస్టు (ఎన్ఐసిడిఐటి) ద్వారా ఈక్విటిగా కేంద్ర ప్రభుత్వం రూ.17,500 కోట్ల మొత్తాన్ని ఈక్విటీగా ఇచ్చింది. అంతేగాక ప్రాజెక్టు అభివృద్ధి కార్యకలాపాలను కొనసాగించడానికి సహాయక గ్రాంట్ గా రూ.1000 కోట్ల అదనపు కార్పస్ ను ఆమోదించింది. కేంద్రం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఎస్.పి.విలకు నిధులను విడుదల చేయడమయింది. అయితే, ఆంధ్రప్రదేశ్ విసిఐసి పనులను త్వరితగతిన అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన చర్యలను తీసుకోలేదు. ఎన్.ఐ.సి.డి.ఐ.టి లో విసిఐసిని చేర్చడం కోసం చేసిన అభ్యర్ధన కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది.
ఎన్.డి.ఏ ప్రభుత్వం మరియు దాని ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం క్రింద భారీ నిధులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించామని చెబుతూ ఉంటారు. అయితే, ఆర్థిక సంఘం సిఫారసు ఆధారంగా మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల క్రింద విడుదలయినవి కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి అదనపు నిధులను కేటాయించలేదు.
14. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అనేక నిబంధనల ప్రకారం మరియు 20-2-2014 తేదీన రాజ్యసభలో గౌరవ ప్రధానమంత్రి చేసిన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు క్రింది నిధులను విడుదల చేయడానికి బాధ్యత వహించవలసినట్టి భారత ప్రభుత్వం రాష్ట్రానికి అట్టి నిధులను విడుదల చేయకుండా తీవ్రమైన అన్యాయం చేసింది.
వరుస సంఖ్య | విభాగం | అంశం | మొత్తం (రూ.కోట్లలో) |
---|---|---|---|
1 | 2 | 3 | 4 |
1 | ప్రధానమంత్రి హామీ | వనరులోటు (16078.76 – 3979.50) | 12099.26 |
2 | 94(3) (4) | కొత్త రాజధానికి ఆర్థిక సహాయం (39937-1500) 1వ దశ | 38437.00 |
3 | 46(2) (3) మరియు ప్రధానమంత్రి హామీ | ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి (24350-1050) | 23300-00 |
మొత్తం | 90,283.26 |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలకు గుర్తింపు
[మార్చు]15. పై ప్రతికూలతలు ఉన్నప్పటికీ, రాష్ట్రం నాయకులు, అధికారులు, ఉద్యోగుల కఠోర శ్రమ కారణంగానూ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు మరియు భాగస్వామ్య కారణంగానూ మంచి ప్రగతిని సాధించింది. ఎ) ప్రపంచ వ్యాప్త గుర్తింపు : డిఐపిపి, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ర్యాంకింగ్ లో 10-07-2018 తేదీన 2018 సంవత్సరానికి సులభతర వాణిజ్య నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో నెం.1 రాష్ట్రంగా నిర్ణయించడమయింది.
బి) 2018-19 లో 54 కీలక కేంద్ర ప్రతిపాదిత మరియు కేంద్ర రంగ పథకాలలో ఆంధ్రప్రదేశ్ పనితీరు (2018 నవంబరు వరకు).
2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు చేసిన హామీలను మరియు రాజ్యసభలో అప్పటి గౌరవ ప్రధాన మంత్రి చేసిన హామీలను అమలు చేయడంలో భారత ప్రభుత్వం కావాలని సహాయ నిరాకరణకు పాల్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషమ పరిస్థితులను అధిగమించడానికి ప్రతీ ప్రయత్నం చేసింది. 54 కీలక భారత ప్రభుత్వ పథకాలలో ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓర్పు మరియు సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ పనితీరు నిదర్శనంగా నిలుస్తుంది.
- 14 పథకాలలో మొదటి ర్యాంకులు (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ, జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం – డిడియుజికెవై, ఎఎంఏవై-యు, జాతీయ పట్టణ జీవోనోపాధి పథకం, అమృత్ ప్రధానమంత్రి క్రిషి సింఛాయి యోజన-చుక్క చుక్కకు మరింత పంట, భూసారం మరియు ఫలన సామర్ధ్యంపై రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన జాతీయ ప్రాజెక్టు, నూనె గింజలు మరియు ఆయిల్ ఫాంపై జాతీయ పథకం, వయో వృద్ధులకు సంబంధించిన కార్యక్రమాల కొరకు స్వచ్ఛంద సంస్థలకు సహాయం, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, పివిటిజిల అభివృద్ధి, ప్రసాద్ మరియు జాతీయ ఆరోగ్య పథకం).
- 28 పథకాలలో 2 నుండి 5 ర్యాంకులు (రాష్ట్రీయ గోకుల్ పథకం, ఒన్ స్టాప్ సెంటర్, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి హార్డ్ వేర్ తయారీలో ప్రోత్సాహం, స్వదేశ్ దర్శన్, మత్స్య పరిశ్రమ ఏకీకృత అభివృద్ధి , స్మార్ట్ నగరాల అభివృద్ధి, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, వ్యవసాయ మార్కెటింగ్, వర్షాధార ప్రాంతాభివృద్ధి మరియు వాతావరణ మార్పు, పరంపరగట్ క్రిషి వికాస్ యోజన, వ్యవసాయ యాంత్రీకరణపై ఉప పథకం జాతీయ పశువుల పథకం, కిశోరప్రాయ బాలికల పథకం, జాతీయ పోషకాహార పథకం, ఉద్యానవన జాతీయ పథకం, వ్యవసాయ జనాభా మరియు గణాంకాలపై ఏకీకృత పథకం, పాడిపరిశ్రామాభివృద్ధి జాతీయ కార్యక్రమం, జాతీయ ఆయుష్ పథకం, ఎస్.టి ఉప ప్రణాళికకు ప్రత్యేక కేంద్ర సహాయం, జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం, ఎస్.బి.ఎం పట్టణ, జాతీయ ఆహార భద్రతా పథకం, హార్ కేత్ కో పానీ, పశు ఆరోగ్య మరియు వ్యాధి నియంత్రణ, ఆర్.యు.ఎస్.ఏ, అజీవికా, అంగన్ వాడీ మరియు హెచ్.ఆర్.ఐ.డి.ఏ.వై).
- 4 పథకాలలో 6 నుండి 10 ర్యాంకులు (ఎస్.బి.ఎం గ్రామీణ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్భన్ పథకం, పశువుల జనాభా గణన మరియు ఏకీకృత నమూనా సర్వే మరియు ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (పిఎంజెవికె) (ఎంఎస్డిపి) )
ముందున్న మార్గం
[మార్చు]16. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు మరియు 20-02-2014 తేదీన అప్పటి గౌరవ ప్రధానమంత్రిగారు రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకుంటున్నది.
- 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు మరియు గౌరవ ప్రధానమంత్రిగారు ఇచ్చిన హామీలు సాధించేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించడం.
- ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయినట్టి పోలవరం సాగునీటి ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి అయ్యేటట్లు చూడటం.
- హరిత రాజధాని నగరం – అమరావతి పూర్తి అయేటట్లు చూడడం.
- కడప వద్ద ఏకీకృత స్టీలు ప్లాంట్ ను ఏర్పాటు చేయడం.
- విశాఖపట్నం వద్ద రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడం.
- దేశంలోని ఇతర రాజకీయ పార్టీల క్రియాశీల మద్ధతు మరియు సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు మరియు హామీలను సంపూర్ణంగా అమలుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.
17. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే నిర్ణయ కర్తలని ప్రభుత్వం విశ్వసిస్తున్నది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్ని వాగ్ధానాలు మరియు 20-02-2014 తేదీన రాజ్యసభలో గౌరవ ప్రధాన మంత్రి చేసిన హామీలు ఒక నిర్ధిష్ట సమయంలో అమలయ్యేలా చూడటంలో సమాజంలోని అన్ని వర్గాలు అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల నుండి నిర్మాణాత్మకమైన సూచనలను మరియు విలువైన సలహాను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. ఈ సాధకాలు ప్రభుత్వ వ్యూహాలను మందుకు తీసుకొని వెళ్లడంలో దోహదపడగలవు.
మూలం
[మార్చు]This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.