అశోకుడు/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

శ్రీరామచంద్ర.

అశోకుఁడు

మొదటి ప్రకరణము

దైవజ్ఞుఁడు

ఇప్పుడు 1919 వ క్రీస్తుశకవత్సరము నడుచుచున్నది. ఇప్పటి కించుమించుగ 2,150 సంవత్సరములకుఁ బూర్వపు చరిత్రమునుగూర్చి వ్రాయుచున్నారము. భాగల్ పురమునకు పశ్చిమభాగమున గంగాశాఖానది యొకటి ప్రవహించుచున్నది. ఆనదిపేరు చంపావతి-ఆనదియొడ్డుననే చంపకనగర ముండెను. చంపకనగరమునం దొక మహారాజు నివసించి యుండెను. ఆనగరమునం దనేకధనవంతులును వర్తకులును నివాసము చేయుచుండిరి. ఆపట్టణ మతిలోకసుందరమైనది. రాజప్రాసాదమును, ధనవంతుల సుందరసౌధములును, వారి

విలాసోద్యానములును, వణిగ్వరులయమూల్యవివిధవస్తు ప్రపూర్ణంబులగు విపణి! శ్రేణులును గలసి యానగర సౌభాగ్య

2

అ శో కుఁ డు

మహారాజ్ఞీ మణి యొక ప్రశ స్తసరోవరమును బ్రతిష్ఠించి యుండెను; ఆ సరోవరము నలువంకలను గల సమున్నత విశాల తీరములు ఫలపుష్పతరులతావిలసితములుగఁ జేయించెను. మహారాజును, రాణీయు, గొప్పగొప్ప రాజోద్యోగులును సంపన్న గృహస్థులును, ధనవంతులును, శ్రేష్ఠులగు వణిగ్జను లును, యశస్సుకొఱకును, బుణ్యముకొఱకును, సాధారణజనుల సౌఖ్యము కొఱకును, బ్రాహ్మణులు యతులు మొదలగు వారి ప్రీతికొఱకును, నగర మధ్యప్రదేశమునను బుర బాహ్య ప్రదేశములనుగూడ ననేక కూపములను, దటాకములను, జైత్యములను, మఠములను, మందిరములను బ్రతిష్ఠించి యుండిరి. అచ్చటి రాజు గుణవంతులనాదరించుచుండెను; పండితగణములకు భూములను వృత్తులను గల్పించి వారి గౌర వోత్సాహములను వర్ధిల్ల ఁ జేయుచుండెను. ఆమహారాజు దీనుల దుఃఖములను, బీడితుల కష్టములను దొలఁగించుట కనేక సౌకర్యములను గావించియుండెను. ఏనగరమున నిట్టిమహా

రాజు నివసించి యుండెనో యెచ్చట నింతటి దానశీలురగు నైశ్వర్యవంతులు వాసము చేయుచుండినో, యే స్థానమునందు, గృషి వాణిజ్యము లింతటి యున్నత స్థానము నలంకరించి, యుండెనో యట్టిపట్టణమున నానా విధంబులగు జనసంఘములు వచ్చుచుఁబోవుచుండె ననియు, ధనవంతులును, దరిద్రులును గూడఁ గలసి నివసించుచుండిరనియుఁ జెప్పుటకంటె నింకను నాశ్చర్యకర మగు విషయమేమున్నది !

ఆ చంపక నగరమునఁ జంపావతీనదీ తీరమునం గలవిష్ణు మందిర సామీప్యమునందుఁ గొంతమంది బ్రాహ్మణులు వాసము చేయుచుండిరి. అది వైశాఖమాసము—ఒక బ్రాహ్మణ కన్యక నదీజలముల స్నానము చేసి శుచియె భక్తి భావముతో మాధవుని బూజించుటకై దేవాలయమునకుఁ బోయెను. అచ్చట వలమల్లి కాకుసుమములతోడను, దులసీదూర్వాంకురములతోడను, శ్వేతచందనాదికముల తోడను మాధవుని బూజించి యా బాలిక మరల గృహాభీముఖయై వచ్చుచుండెను. ఆమె పచ్చని పట్టు చీరను ధరించియుండెను ఆమెకపోలములు శ్వేత చందన చర్చితములై యుండెను. ఆ బాలిక దక్షిణ కరంబునఁ జిన్ని జలకలశమును, వామకరంబునఁ బూలపళ్ళేరమును గలవు. ఆ బాలిక యతిత్వరితముగ వచ్చ చుఁ దమ యింటిగుమ్మముక డనొక యపరిచితుఁడు నిలువఁబడి యుండు టను జూచెను. ఆతఁడొక బ్రాహ్మణుఁడు-అతని హస్తమునందొక పుస్తక ముండెను; గృహ స్వామిని దర్శింప వలయునని యాతఁ డచ్చటనుండి నిరీక్షించుచుండెను. ఆ బాలిక నాతఁడు దూరమునుండియే చూచుచుండెను, ఆమె సమీపించిన తోడనే యాబ్రాహ్మణుఁడామెతో " నేనిచ్చట నిరీక్షించు చుంటినని నీ జనకునితోఁ జెప్పుము ” అనియెను.

బాలిక లోపలికిఁబోయి యాసంగతి తండ్రితోఁ జెప్పెను. గృహస్థుకు వెలుపలికి వచ్చిన తోడనే యా బ్రాహ్మణుఁడాతనితోఁ, దానొక దైవజ్జుఁ డనని చెప్పెను. అయుదు

4

అ శో కుఁ డు

వురకు నించుక సంభాషణ మైన తరువాత 'దైవజ్ఞుఁడు “అయ్యా! మీరు విచారముతో నున్నట్లగ పడుచున్నారేమి? " అని ప్రశ్నించెను.

గృహ:- అందుల కాశ్చర్యమేమున్నది? వయసు వచ్చినబిడ్డ యింకను బెండ్లి గాకుఁడ నింట నున్నప్పుడేజనకుఁడు నిశ్చింతుఁడై యుండఁగలుగును? నేను దరిద్రుఁడను—— నా కుమారైకుఁ దగిన యనుకూలవరుని నేనెట్లు తేఁగలుగుదును? రేయుంబవ లీవిషయమును గూర్చి యే యాలోచించుకొనుచు నిట్లుంటిని.

దైవ:-- అగునామాటనిజమే. రాజులును, మహారాజులును, ధనికులును, గొప్పవారందఱునుగూడఁ దమ కుమార్తెల ననుకూలవరులకుంగూర్చి కన్యాదాన ఫలము నందవలయు ననియే యపేక్షించుచుందురు. కాకేమి? మీరెఱింగియే యుందురు——జననమరణ వివాహములు మూడును దై వాధీనములు ! వివాహ విషయమునఁ గన్యకయదృష్టమే ప్రధాన మైనది.

గృహ:- అవును. అవి దైవాధీనములే. ఎఱుఁగుదును. కాని, ప్రయత్నముకూడ నావశ్యక మే కదా!

దైవ:-సర్వవిషయములయందును గూడ దైవ పురుష కారములు రెండు నావశ్యకములే. ఈమాట నెన్వఁడు కాదనఁగలఁడు? కాని యదృష్టముమాత్రము పేక్షుణీయము

కాదు. ఏమైన నేమి? మీకొక్కమాట చెప్పెదను—— మీరు కుమార్తె వివాహ విషయమున నెంత మాత్రమును జింతింప నక్కఱ లేదు.

ఇంతవఱకు వారిరువురును నిలిచియుండియే సంభాషించుచుండిరి. 'దైవజ్ఞుఁ డిట్లు చెప్పినతోడనే గృహస్థుఁ డానందించి యాతనిం దనతోఁ గూడ లోనికిందీసికొనిపోయి యొక చాఁపపైఁ కూర్చుండఁ జేసెను.

ఇరువురును గూరుచుండిరి. పిమ్మట దైవజ్ఞుఁడు “మీ బాలికను నొకసారి పిలువుఁడు” అనియెను.

గృహ:- అమ్మా సుభద్రాంగీ ! ఇటురమ్ము.

బాలిక యచ్చటకు వచ్చి తండ్రి యానతిచే దైవజ్ఞునకు నమస్కరించి యచ్చటఁ గూరుచుండెను.

దైవ:— అమ్మా ! నీచేయొక సారి చూపుము !

బాలిక యించుక సిగ్గుతోఁ దనవామహస్తమును జాఁచెను——చందనమలఁదిన చెక్కులును, దుమ్మెదలం గేరు పెన్నెఱులును, సిగ్గుమను దొంతరలం దరళంబులగు చెలు వంపుఁజూపులును నా బాలిక సౌందర్యమునకు మనోహరత్వము నాపాదించుచుండెను. కోమలారుణ పల్లవ సదృశంబులగు మృదుల హస్తములును, జంపక కోరక సన్నిభంబు లగురుచి రాంగుళులును నామె యదృష్టమును జెప్పకయె చెప్పుచున్నవి. ఇక ఫలా ఫలముల విశదీకరించుటకు దైవజ్ఞుఁడేల

6

కావలయును. ఆ బాలికను జూచినతోడనే పరమేశ్వరుఁ డేదియో విశేషోద్దేశముతో నీమెను సృష్టించి యుండునని బోధపడుచుండెను.

దైవజ్ఞుఁ డా బాలికహస్తమును బరీక్షించెను. ఆమె జన్మదినము, సమయము, లగ్నము మొదలగునవి తెలిసికొని గణనము చేసిచూసెను. పిమ్మట “అమ్మా! ఇఁక వెళ్లుము!" అనియెను.

ఒక్క గంతులో నా బాలిక తల్లి యొద్దకుఁ బోయెను.

దైవజ్ఞుఁ డా బాలిక శుభలక్షణము లంగూర్చి తండ్రికి విశదీకరించెను. మఱియునీ బాలిక గర్భమునం దిరువురు పుత్రులు జనియింతురనియు నఁదొకఁ డీవిశాలభూమండలమునకుఁ బ్రభుడగుననియు, రెండవ వాఁ డతిలోకప్రతి భానిధి యగు ధర్మమత బోధకుండగు ననియు గణించి చెప్పెను. ఆ బాలిక శుభలక్షణ ప్రశఁసయు, భవిష్యదైశ్వర్యప్రస్తావమును విని యామె తల్లిదండ్రులు మిగుల నానందించిరి. అప్పుడొక్కి ంచుక సేపా బ్రాహ్మణుడు తన పేద తనమును మఱచి పోయెను. అప్పుడాతని గృహిణి యా దైవజ్ఞునకు " ఈ దినమున మాయింటనే యాతిథ్యమును స్వీకరింపవలయును” అని తెలియ జేసెను.