అవధరింపుమీ రామ - అవధరింపుమీ

వికీసోర్స్ నుండి


పల్లవి:
అవధరింపుమీ రామ - అవధరింపుమీ
అవలీలల చామరములు సేవక జను లేయుచున్నా ||అవధరింపుమీ||

చరణం1:
రజత దండధారు లిదె పరాకు దెల్పుచున్నవార
వీణ గానరవము సేయుచు విబుధు లెదుట నిలిచియున్నా ||అవధరింపుమీ||

చరణం2:
నిన్ను గొలుచు వేడ్క జనము లున్నవార లెదుట నిలిచి
భద్రనగ సుధామ రామభద్ర నీరదశ్యామ
ఆశతోడ నారసింహదాసు డెపుడు గొలుచుచున్నా ||అవధరింపుమీ||