అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము
స్వరూపం
ముఖారి రాగం త్రిపుట తాళం
ప: అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము
నెయ్యడ గాననయ్య శ్రీరామయ్య || అయ్యయ్యో ||
అ.ప.: ఇయ్యెడ నేను కుయ్యాడిన ఆలకించ
వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర || అయ్యయ్యో ||
చ1: ఎంతని వేడుదు ఎంతని పాడుదు
ఎంతని దూరుదు ఏమిసేతు రామ
సుంతైనగాని నీ అంతరంగమదేమో
వింత కరుగదు ఎంతో నమ్మినందుకు || అయ్యయ్యో ||
చ2: శరణన్న జనముల బిర బిర బ్రోచేటి
బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ
మరుగు జొచ్చినందు కరమర జేయుట
పరువే కరుణింప బరువే హరి హరి || అయ్యయ్యో ||
చ3: కామిత మందార కలుష విదూర
తామసమేల తాళజాలనురా నీ
మోము జూపుము స్వామి భద్రాచల
రామదాసుని ప్రేమ రయమున నేలుము || అయ్యయ్యో ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.