అమ్మా మహలక్ష్మి దయచేయవమ్మా
Appearance
చిత్రం: గుణసుందరి కథ (1949)
రచన: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
ప. అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా | అమ్మా |
మమ్ము మా పల్లె పాలింపవమ్మా | మమ్ము | || అమ్మా ||
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
చ. ఎన్ని నోముల పంటవొ అమ్మా | ఎన్ని నోముల |
ఏమి పుణ్యాల ఫలమౌ అమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
నీవు పట్టింది బంగారమమ్మా
నీవు మెట్టింది స్వర్గమె అమ్మా | నీవు మెట్టింది |
నీవు పలికింది నిజ ధర్మమమ్మా | నీవు పలికింది |
నీవు మా భాగ్య దేవతవే అమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
చ. ఎరుకలు జీవజనులను మరువ వలదమ్మా
పరువున రాచవారిని తీసిపోమమ్మా | పరువున |
నిను కన్నబిడ్డగ చూచునే అమ్మా | నిను కన్న |
నిను కంటిపాపగ కాచునే అమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా