అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా

వికీసోర్స్ నుండి

పాండురంగ మహత్యం (1957) సినిమా కోసం సముద్రాల రామానుజాచార్య రచించిన లలితగీతం.


పల్లవి :

అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా

ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా || అమ్మా ||


చరణం 1 :

పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి

మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా

ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి

తలచకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా

అమ్మా ... అమ్మా ...


చరణం 2 :

దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి

ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని

కనుగానని కామమున ఇలువెడల నడిపితి

కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా

నాన్నా ... నాన్నా ...


చరణం 3 :

మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా

నీమాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా

మాతా పిత పాద సేవే

మాధవ సేవేయని మరువనమ్మా

నన్ను మన్నించగ రారమ్మా || మాతా పిత ||

అమ్మా ... అమ్మా ... ||| అమ్మా అని అరచినా |||