అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు
యాత్రాసాహిత్యం
'ఆమె లేఖలు'
(గత సంచిక తరువాయి...)
మూల రచన: జూలియా చార్లోటి
అనువాదం: కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ, డా. కాళిదాసు పురుషోత్తం 9000642079
12వ లేఖ
ఇదీ అసలైన భారతదేశం
రాజమండ్రి పరిసర ప్రాంతాలను గురించి చెబుతూ, “ఇక్కడ నిత్యం ఏదో కొత్తదనం కనబడుతుంది. రాజధాని కంటే నాకు ఈ 'పల్లెప్రాంత'మే బాగా నచ్చింది. ఇక్కడే ఎంతో హాయిగా ఉంద"ని అంటుంది. “మద్రాసును పాశ్చాత్యీకరించడానికి ప్రతివాక్కరూ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారనుకో, కానీ అవేం ఫలించలేదు. అక్కడ ఆసక్తికరమైన వాట్ని రూపుమాపడం తప్ప ఏం సాధించారని?” అని ఆమె విమర్శిస్తుంది.
ఈ ప్రాంతాన్ని ఆమె పాతరాజాల రాజ్యంగా వర్ణిస్తూ “వాళ్లు చాలా కలువుగోలుగా ఉంటారు. మా యిళ్లకి రావడానికి యిష్టపడతార”ని అంటుంది. వచ్చేటప్పుడు కానుకలేవీ లేకుండా ఉత్తచేతులతో రావడం అమర్యాదగా వాళ్లు భావిస్తారు. ఐతే విలువైన కానుకలు స్వీకరించడం చట్టవిరుద్దం గనక, ఏ నిమ్మకాయలో, బత్తాయిలో పట్టుకొస్తారు. మొన్నటి రోజు మాకు బుట్టెడు బత్తాయిలు, వాటితో ముక్కూ మొహం తెలియని ఓ రాజుగారు మా యింటికి వస్తున్నారన్న సమాచారం అందాయి.” మర్నాడు సరిగ్గా అనుకున్న నమయానికి రాజాగారు నపరివారంగా వేంచేశారు. ముందుగా ఈలల శబ్దం వినవచ్చింది. అది రాజుగారి పల్లకీ వస్తున్నట్లు తెలిపే వాద్యం. దాని తర్వాత, ఆయన పరివారం-మొదట ఈటెలు ధరించిన భటులు, వారి తర్వాత వెండి బెత్తాన్నీ చేతులో పట్టుకొని వున్న ఆయన ప్రధాన అధికార, ఆ తర్వాత రాజాగారికి కాలక్షేపం కలిగిస్తూ పల్లకివెంట పరుగులెత్తే ఆస్థాన పరివారం వచ్చారు. అందరూ చేరిన తర్వాత భటులు తమ ఆయుధాలను దించి “హాల్ట్! ప్రెజెంట్! ఫైర్” అని అరవటంతో ఎక్కడివాళ్లక్కడ ఆగిపోతారు. ఫైర్ అనీ అరుస్తాడే కానీ ఫైరింగ్ ఏమీ జరగదు, ఆ ముసలాయన పల్లకీ దిగి, ఇరువైపులా బారులు తీరిన తన వరివారం, జడ్జిగారి బంట్రోతులు అడుగడుక్కి సలాములు చేస్తుండగా లోపలికి వేంచేస్తారు. ఆయన నల్లని శరీరం తెల్లని దుస్తుల్లో నుంచి కనబడుతుంటుంది, చెవుల్లో కమ్మలు, చేతులకు బంగారు కడియాలు, మెడలో వజ్రాల హారం వుంటాయి. "నేను ఆయన్ను “Penny Whistle Raw" అని పిలుస్తాను అది ఆయన అసలు పేరు కాకపోయినా, అట్లానే వుంటుంది, అర్ధం కూడా అదే కావచ్చు”. ఆయన (డ్రాయింగ్ రూవబులోకి వస్తూ ద్వారం వద్ద (దానికి తలుపులు లేవు) నిలబడి సలాము చేశాడు. జడ్జిగారు, ఆమె కూడా తమ 'శక్తిమేరకు' సలాములు చేసిన తర్వాత వారికి ఆయన చెరొక బత్తాయి పండు బహువుతిచ్చాడు. దాంతో మళ్లీ రెండు వైపులా సలాములు! ఈ తతంగమంతా పూర్తయ్యాక ఆయన తీరిగ్గా కూర్చొని 'దొరగార్ని', 'దొరసాని'ని తెగ కీర్తించడం మొదలు పెట్టాడు. అది అందరూ చేసే పనే అయినా ఆ ముసలి రాజాగారు పొగడ్తలతో పాటు యూరోపియన్ల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నాడు. ఆయనకు తన దేశీయుల మీద కంటే యూరోపియన్ల పైనే శ్రద్ధాసక్తులు మెండుగా వున్నట్లుంది. ముఖ్యంగా మన చక్రవర్తి మరణించాడన్న మాట నిజమేనా, ఆయన వారసులిగా ఒక స్తీ రాజ్యానీకి వచ్చిందన్న మాట వాస్తవమేనా అని ఆయన విచారించాడు. ఒక స్త్రీ సింహాసనాన్ని అధిష్టించడం ఆయనకు అందని విషయం కావడంతో ఆమె పాలనను గురించి, ఆమె ఆజ్ఞలను ప్రముఖులు ఎలా శిరసావహిస్తున్నారని అడగడం కూడా మానుమన్నాడు. చక్రవర్తి మరణం వల్ల జడ్డిగారికి ప్రమోషన్ ఏదైనా వచ్చిందా అని ఆయన పరామర్శించాడు. చివరికు తన యింటికి వచ్చి వారం రోజులు తన ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. వాతావరణం అనుకూలిస్తే వెళ్లాలనే ఆమె అనుకొన్నది. అలా ఒక గంట సేవు గడిపిన తర్వాత, మళ్లీ ఎప్పటిలాగా సలాములు, బూరగ ఊదడం, మేళతాళాలు వాయించడం, భటులు ఆయుధాలు థరించి కవాతు చేయడం, 'Half Present Fire' అంటూ అరవడం వగైరా తతంగాలతో జమీందారు బయల్దేరాడు. బయల్దేరే ముందు తనకూ ఇంగ్లీషు సంప్రదాయాలు తెలుసునన్నట్లు కరచాలనం చేసి మళ్లీ వారం తర్వాత వచ్చి దర్శించుకొంటానని చెప్పి, ఆమె వద్ద శెలవు తీసుకున్నాడు. - My Lady. I now to your Excellency say farewell, I shall hope you to pay one visit, and on one week (meaning hence) I shall come again to see the face of your honour civilian." అంటూ ఆహ్వానించాడంటుంది.
రాజాలేకాదు, వారికంటే తక్కువ శ్రేణికి చెందిన చాలా మంది నేటివులు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో జడ్జిగారింటికి వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. కాంత మంది గేటు వద్దనే కాచుకొని వుండి సలాములు చేస్తారు. వాళ్లు నోటితో ఏమీ అడగరు, కానీ తాము కోరుకున్న ఉద్యోగాన్ని వేషధారణ ద్వారా సూచిస్తారు. కోర్టు గుమాస్తా కావాలనుకునేవాడు చేతిలో కలం పట్టుకొని నిలబడతాడు. బంట్రోతు పని కోరేవాడు మొలలో కత్తి దొవుకొని వస్తాడు. వీరికంటే కాస్త పై తరగతి వాళ్లు యింటికొచ్చి కనబడిపోతుంటారు. ఒకతను క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు వచ్చి ఎ - తో మాట్లాడిపోతుంటాడు. ప్రతిసారి అతను జడ్జిగార్ని “మీరేనా తల్లీతండ్రీ (Your excellency is my father and mother) అనీ, “తమ ముఖదర్భ్శనం కోసం వచ్చా”ననీ (Sir I came to held your honourable face) అంటాడు . “ఏమైనా చెప్పుకొనేది వుందా” అని జడ్జిగారడిగితే ఏమీ లేదంటాడు. (Nothing great Chief.) అప్పుడిక వెళ్లముంటే సలావపలు చేస్తూ వెళ్లిపోతాడు. “అలా చూడ్డానికి వచ్చేవాళ్లను మనమే వెళ్లమని చెప్పాలి. లేకుంటే తాము వెళ్లిపోవడం అమర్యాదగా భావిస్తారు. ఇటువంటి వాళ్లను రోజులో ఫలానా సమయంలో మాత్రమే రమ్మని నియమం పెట్టాల్సి వచ్చింది. లేకపోతే రోజూ వేధిస్తారాని ఆమె అంటుంది. అతిథుల రాకపోకల వల్ల ఉత్తరం రాయడానికి, మరేపని చేయడానికీ ఆమెకు ఆటకం కలుగుతుంది. ముందుగా తెలియజేయకుండా, వచ్చినా వాళ్లను ఆహ్వానించడం, మళ్లీ మళ్లీ వాళ్ళను ఆహ్వానించడం, తిరిగి వాళ్ల ఇళ్లకు వెళ్లిరావడం గొప్ప సంప్రదాయమనే అభిప్రాయం నేటివుల్లో వుంది. అది తనకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లు ఆమె అంటుంది. తనకు బొత్తిగా పరిచయం లేని వాళ్లు తన యింటికి రావడం, వాళ్ల యిళ్లకు తాను వెళ్లడం తనకు సుతరామూ యిష్టంలేదు. అయినా, అది యిక్కడ సంప్రదాయం. తన యింటికి వచ్చే వాళ్లలో మిసెస్ ఎస్ అంటే ఆవెకు చాలా యిష్టం. ఆమె త్వరలో ఇంగ్లండు వెళ్లిపోతుందని, రెండు రోజులు మాత్రమే తనతో గడిపిందని రాసింది. కొత్త రిజిస్ట్రార్ హామిల్టన్, ఆయన భార్య యిప్పుడు జడ్జిగారి యింట అతిథులుగా వున్నారు. మంచి బంగళా దొరికేదాకా వాళ్లు జడ్జిగారింట్లోనే వుంటారు.
రాజమండ్రిలో క్లర్జిమాన్ లేరు గనక, ఇంగ్లీషు చర్చితో జడ్జిగారే ప్రార్థన జరుపుతున్నారు. ఇది నంవ్రదాయం. ప్రార్థనకు ఇంగ్షీషువారంతా హాజరవుతారు, తక్కిన కులాలకు చెందిన ప్రొటెస్టెంట్లు కూడా వస్తారు. రాజమండ్రిలో చిన్న రోమన్ కేథలిక్ గుడి కూడా వుంది. దానికి పూజారి లేకపోయినా, సార్టెంట్ కీలర్ మావు రోజర్ మిశ్రజాతి (half cast) దాన్ని సంరక్షిస్తూంటాడు. అతను ఆగుడిని ఎల్లప్పుడు పరిశుభంగా వుంచి, కొవ్వొత్తులు వెలిగించి, పువ్వులతో అలంకరిస్తాడు. అతను డాక్టర్‌కి అసిస్టెంటు (డ్రెసర్)గా పని చేస్తూంటాడు. జడ్జిగారు గుడిలో ప్రార్థనలు జరుపుతారని తెలియగానే, తాను కూడా రావచ్చునా అని రోజర్ అడగ బంపించాడు. రావచ్చు నన్నారు కానీ, అతను రాలేదు. “ఏందుకు రాలేదో అని విచారిస్తే పాపం రావాలనీ అతను చాలా ఆశపడ్డాడు కానీ, దురప్రాంతం నుంచి ప్రీస్ట్ వస్తే ఏమంటారోనని, భయపడి రాలేదని, సార్జంట్ చెప్పారా ఆమె రాస్తుంది.
అక్టోబరు ౩వ తేదీ మొదలు పెట్టి, 15వ తారీకు కొంత రాసి, 27వ తేది పూర్తి చేసిన ఈ ఉత్తరంలో ఆమె రాజమండ్రిలో తన జీవన విధానం కొంత వివరిస్తుంది.
“ఇక్కడి జీవనసరళి, బంట్రోతులు, ఇళ్ల అద్దెలు వగైరా విషయాలు రాయమని నీ వుత్తరంలో కోరావు” అంటూ, ఆ వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతుంది. పెద్దయిల్లు, దానిచుట్టూ రెండెకరాలతోట, ఇంటి అద్దె సంవత్సరానికి 60 పౌనులు. వంట సరుకులు చౌకే, కానీ వేడివల్ల ఏదీ నిలవ వుండక చాలా దుబారా అవుతుందంటుంది. కసాయి వాడికి గిట్టుబాటు కోసం మాంసం అవనరమైన దానికంటే, ఎక్కువే తీసుకోవాల్సి వన్తుంది. బంగాళాదుంపలు రాజమండ్రిలో దొరకవు, మద్రాసు నుంచి తెప్పించుకోవాలి. మిగతా కాయగూరలు జడ్డిగారి తోటలో పండిస్తారు. వాళ్లకి కోళ్లఫారం కూడా వుంది.
నౌకర్లకు జీతబత్వాలు తక్కువే అయినా, వాళ్ల సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఖర్చు ఎక్కువగా వుంటుంది. ఎ - పొదుపుగా వుండాలని కొద్దిమంది నౌకర్లను పెట్టుకొన్నాడు. వాళ్ళ జాభీతా యిదీ -
బట్లరు ఒకరు, డ్రెస్ బోయ్ (వేలెట్) ఒకరు, పాత్రలు కడిగి దీపాలు వెలిగించేందుకొక మాటీ, ఇద్దరు ఆయాలు, ఒక “అమ్మ” (వైట్ నర్స్ - బిడ్డకు పాలు కుడి పేదాది) ఒక వంట మనిషి, ఒకటున్ని కచ్చి, (ఇంటి పని మనిషి), ఇద్దరు తోటమాలీలు, ఆరుగురు బేరర్లు, నీళ్లు తెచ్చేందుకు ఒకడు, ఇద్దరు - గొర్రెల కాపర్లు గడ్డికోసే వాళ్ళు ఇద్దరు, కుక్కను చూచుకొనే మనిషి (డ్రాగ్ బోయ్) ఒకడు, కోళ్లను సంరక్షించేందుకు ఒకడు, ఒక చాకలి, ఒక దర్జీ, ఒక వేటగాడు, అమ్మకొక వంటమనిషి మొత్తం 27 మంది. చాలా తక్కువ కింద లెక్క మంది ఎక్కువ పని తక్కువ. ఆ పనీ కూడా నచ్చుగా చేస్తారు. ఎవరైనా భోజనానికి వస్తే, వంటవాడు తనకొక మాటీలేనీ, నహాయకుడుకాని కావాలని ఏడుస్తాడు. అప్పుడు ఎవరినైనా కూలికి ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అందరికీ తిండి ఇక్కడే. “ఉన్నత కులాల'వారు మాత్రం ఆ భోజనం ముట్టుకోరు. కానీ, అస్పృశ్వ్యుల (Paraiah)యిన మాటీలు, చిన్ని చిన్ని నౌకర్లు మాత్రం ఏది దొరికినా సంతోషంగా తినేస్తారు. “ఆయా” అగ్రకులన్థురాలు, అందుకోసం ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెట్టాలి. ఇంత చేసినా, ఎప్పుడైనా పొరపాటున ఇతర కులాలవాళ్ళు దగ్గరకు వచ్చారంటే చాలు, ఆవిడ ఆ రోజంతా కడుపు మాడ్చుకొంటుంది. ఆవిడ వంటకుగాను ఆవరణంలో ప్రత్యేకంగా కొబ్బరాకులతో చిన్న యిల్లువేసి, బీడ్డకొక నర్ఫును ఏర్పాటు చేశారు. సాధారణంగా మా పనివాళ్లు తమ తమ బిడ్డల విషయం పట్టించుకోరు కానీ, వాళ్ళకేమ్టైనా జరిగితే మాత్రం, యజమానుల మీద నీిందమోపుతారు. అందువల్ల “ఆయా” బిడ్డ విషయంలో “ఆమె” కూడా అప్రమత్తంగా వుంటుంది.
అలాంటి 'ఆయా” ఒకసారి సారాయి, నల్లమందు సేవిస్తుండగా పట్టుబడ్డ్దదంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఆవిడ అప్పుడప్పుడు బయటకు వెళ్ళి పొలికేకలు పెట్టి నానా గొడవా చేస్తుంది. ఆ సమయంలో ఆమె దగ్గరకు వెళ్లేందుకే నౌకర్లు భయపడతారు. పిశాచిలాగా అరుస్తుందని వాళ్లు అంటారు. ఆ పిశాచి కేకలతో అందరూ బెదిరిపోయి, ఎక్కడివాళ్లక్క్మడ దాక్కున్న తర్వాత, ఆమె బంధువులు మెల్లగా బయటకొచ్చి ఆమెకు సారాయి, నల్లమందు యిచ్చి శాంతింపజేశారు.
ఇంటి సామాన్లు కొనడం గురించీ చెబుతూ, తమ బట్లరు రోజూ మార్కెట్లో వస్తువులుకొని, బిల్లులు తెస్తాడని, ఆ బిల్లుల్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసే కోర్టు గుమాస్తా వస్తువుల పేర్సు చిత్రాతిచిత్రంగా రాస్తాడనీ ఆమె అంటుంది. ఇద్దరూ కలిసి కొన్ని కల్పిస్తారు అంటూ కొన్నీ ఉదాహరించింది. one beef of rump for biled"- "one mutton of line beef for alamoor estoo" meaning a-la-mode stew; - "mutton for curry pups (puffs)," "durkey for stups" (stuffing for turkey); "egg's for saps, snobs, tips, and pups" (chops snipes tipsycake, ana puffs); - "mediation (medicine) for ducks"; - and at the end "ghirand totell" (grand total), and "howl balance".
(తరువాయి వచ్చే సంచికలో...)
సవరణ:
ఆగస్టు సంచిక 4వ పుటలో - పెద్దలు నెమ్మాని వేంకట రమణయ్యగారికి 'శద్ధాంజలి'లో ఆయన జూలై 1వ తేదీన కన్నుమూశారని ముద్రణలో వచ్చింది. ఇది తప్పు. ఆయన జులై 24న మరణించారు. ఈ తప్పు చోటు చేసుకొన్నందుకు మన్నించ గోరుతున్నాము.
- సంపాదకుడు, 'అమ్మనుడి'