అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/భాషాపెత్తనం దిశగా కేంద్రప్రభుత్వ విధానాలు

వికీసోర్స్ నుండి

సంపుటి: 6 సంచిక: 8 అమ్మనుడి

జనవరి 2021

భాషాపెత్తనం దిశగా కేంద్రప్రభుత్వ విధానాలు

ఒక భాష తక్మిన భాషలపై పెత్తనం సాగించడం స్వరాజ్యం కాబోదన్న మాటను చెప్పింది గాందీగారు. హిందీని జాతీయభాషగా ప్రకటించాలనే చర్చ సందర్భంలో ఆయన ఈ మాట చెప్పాడు. అంతేకాదు, మొదటిభాష ఎల్లవేళలా మాతృభాషదేననీ, ఆ తర్వాతే హిందీగాని, మరేదైనా గానీ అని ఆయన స్పష్టం చేశాడు. “సరైన ఎదుగుదలను అమ్మనుడితోనే పొందగలుగుతామని, అమ్మభాషను పణంగా పెట్టి ఆంగ్లభాషను నేర్చుకోవలసివస్తే అసలు ఆంగ్లభాషను నేర్చుకోవలసిన అవసరం ఏ దేశానికీ లేదు” అని ఆయన వివరించి చెప్పాడు.

“పరపీడన పరాయణత్వం'తో నిండిన చరిత్ర నుండి బయటపడి స్వేచ్చాయుత సమాజాన్ని నిర్మించుకోవడం కోసమే మన స్వాతంత్రోద్యమం నడిచింది. విదేశీయుల పాలన నుండి రాజకీయ విముక్తిని పొందినా పాలకుల 'పెత్తనం నుండీ సమాజంలోని అన్ని విధాల ఆధిపత్యాల నుండీ మనం విముక్తిని సాధించవలసి వుంది. ఈ లక్ష్యంతోనే మనం రాజ్యాంగాన్ని నిర్మించుకొన్నాం. ఆ సందర్భంలోనే ఏ ఇతర అంశాల పైనా జరగనంత లోతుగా ఎంతో సమయం 'జాతీయభాష, దేశంలోని ప్రజల భాషల ప్రతిపత్తి అప్పటికి పాలకభాషగా ఉన్న అంగ్ల వినియోగం అనే అంశాల మీద మన రాజ్యాంగ నిర్మాతలు చర్చించారు. చివరకు - జాతీయభాషగా ఏ భాషనూ నిర్ణయించలేకపోయారు. ఆంగ్లాన్ని కొనసాగిస్తూ దానితోపాటు పాలనా అనుసంధాన (link) భాషగా హిందీని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అయితే పదిహేను ఏళ్లలో ఇంగ్లీషు స్థానంలో దేశీయ భాషను తేవాలనీ నిర్ణయించారు. కాని, పాలకుల అశ్రద్ధ వల్ల ఆ విషయం మరుగునపడిపోయి, నిరాటంకంగా ఆంగ్లం అన్నివిధాలా పాలనలో బలపడింది. పాలనారంగంలో హిందీని కూడా అన్నివిధాలా అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితం భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి పూర్తిబలంతో ముందుకు సాగుతున్నది. తాను అంకితమైన హిందుత్వ జాతీయవాద విధానాలను క్రమక్రమంగా అన్నిరంగాలలోను అమలులో 'పెడుతున్నది. పాకిస్తాన్‌, చైనాలతో సరిహద్దుల వంటి సమస్యలతోపాటు, ఉగ్రవాదం, తదితర సమస్యల పరిష్మారాన్నిైై కఠిన విధానాలను చేపట్టింది. దానితోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ నాయకత్వాలు, బలమైన జాతీయ విధానాలకు అడ్డంకిగా పరిణమించకుండా, కేంద్రాన్ని అత్యంత శక్తివంతమైన అధికార కేంద్రంగా చెయ్యడం కోసం దీర్ధకాలిక వ్యూహాలను అమలు చెయ్యడానికి పూనుకొంది. భారతీయ జనతాపార్టీ రాజకీయ ఎత్తుగడలతోపాటు పాలనావిభానాలను గమనించేవారికి ఇది స్పష్టంగా అర్ధమవుతుంది.

జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విధానాలను ఎక్కువమంది ప్రజలు అమోదించవచ్చు. దేశం భద్రంగా ఉండాలనే అందరూ కోరుకొంటారు. అందుకై ప్రభుత్వం అనుసరించే విధానాలలో కొద్దిపాటి భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాక. అయితే, రాష్ట్రాలు బలహీనపడాలని ఎవ్వరూ కోరుకోరు.

ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పన్నుల విధానం వగైరా నినాదాలు, లక్ష్యాలు బాగానే ఉండవచ్చు. అయితే దేశమంతా ఒకే భాష అంటే కుదరదు. దేశంలోని వివిధ ప్రాంతాల, రాష్ట్రాల మనుగడకు భాష, విద్య సంస్కృతి, చరిత్ర, సహజవనరులు, అభివృద్ధి వంటి అంశాల్లో కేంద్రం సహకారం అందిస్తూ వాటి అభివృద్ధికి తోడ్చడాలి. అంతేగాని, అందుకు విరుద్ధమైన విధానాలను చేపట్టకూడదు. అప్పుడు ప్రతిఘటన నెదుర్మోవలసివస్తుంది. అది ప్రజల మధ్య ఐక్యతకు, శాంతికి, అభివృద్ధికి భంగం కలిగిస్తుంది.

ఇప్పుడు కేంద్రపాలకులు అనుసరించదలచుకొన్న - ముఖ్యంగా పరిపాలన, విద్యారంగాల్లో భాషా విధానం పట్ల వారు చేపడుతున్న చర్యలు పూర్తిగా సందేహాస్పదంగా ఉన్నాయి. ఇవి రాష్ట్రాల - ముఖ్యంగా హిందియేతర భాషా రాష్ట్రాల మౌలికతకు, మనుగడకు గొడ్డలి పెట్టు కానున్నాయి. పూర్తిగా అమలులో కొచ్చినట్లయితే క్రమంగా ఇవి దేశైక్యతకు మాత్రమే కాదు, ఈ ప్రభుత్వం ఆశించే హిందూత్వ విధానాలకు కూడా ప్రతిబంధకం కానున్నాయనే అంశాన్ని పాలకులు తెలుసుకోవాలి.

ఇప్పుడు గత ఏడాదికి పైగా చర్చల్లో నలుగుతూ ఇటీవలే బయటకు వచ్చిన జాతీయ విద్యావిధానంలోనూ, అందులో పేర్ళొన్న భాషావిధానానికి సంబంధించిన అంశాల విషయంలోనూ ఈ పోకడ వుంది.

జాతీయ విద్యావిధానంలో ఉన్న ముఖ్యమైన లోపాలను ఆగస్టు, సెప్టెంబరు, డిసెంబరు “అమ్మనుడి సంపాదకీయాల్లో ప్రస్తావించాము. అంజేగాక, ఈ అంశంపై కొన్ని వ్యాసాలను కూడా ప్రచురించాము.

ఇప్పుడు తాజాగా ముందుకొచ్చిన మరొక అంశం - 'భారతీయ భాషలకు ఒక జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయం. దీనిపై భారతీయ భాషాశాస్రజ్ఞుల సంఘ అధ్యక్షుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు విశ్లేషణాత్మక వ్యాసాన్ని ఈ సంచికలో చదవండి. భారతీయ భాషల అభివృద్ధికి కృషిచేయడం కోసం ఇప్పటికే పనిచేస్తున్న సె ఐ.ఐ. ఎల్‌.(మైసూరు)ను శక్తిమంతం చేసే బదులు, దానిని జాతీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్బడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భాషలపై పరిశోధన, వాటి అభివృద్ధి జరిగేందుకు కృషి జరగాలి గాని, అందుకై వున్న సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి గాని, విశ్వవిద్యాలయ చట్రంలో దానిని బిగించకూడదనేది ఆయన వక్కాణింపు. నిజమే, భాషల కోసం ఇప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాలు ఎంత దీనమైన స్థితిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా తన అనుభవంతో వ్రాసిన మాటలతో ఎక్కువమంది ఏకీభవిస్తారు.


దేశభాషలన్నిటికీ మూలం సంస్కృతమనీ, సంస్కృతం నుండే అన్ని భాషలూ పుట్టాయనే విశ్వాసంతో ఉన్నవారు భారతీయ జనతాపార్టీ సైద్ధాంతిక భావజాలంపై పలుకుబడి కలిగివున్నారు. ఇది ఏనాడో తిరస్మరించబడిన ఆధిపత్యవాదం. ఇటువంటి వాదాలకు వర్తమానమూ భవిష్యత్తూ రెండూ ఉండవు. శాస్రీయ నిరూపణలకు సరిపడినవే నిలుస్తాయి. ఇప్పుడీ భారతీయ భాషల జాతీయ విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం నియమించబడిన మేధావుల్లో కాలం చెల్లిన నమ్మకాలను పట్టుకొని వెళ్లాడేవారిదే పెద్దపీట. భారతీయ భాషలన్నిటినీ సంస్కృతంతో సంస్మరించాలనీ ఆ విధంగా సువిశాల భారతదేశానికాక జాతీయభాషను నిర్మాణం చెయ్యాలనే పవిత్ర లక్ష్యంతో వీరి ఆలోచనలు సాగుతున్నాయన్నది నిజం కాదా?

ప్రభుత్వం గుర్తించిన విశిష్ట ప్రాచీన భాషలు ఆరు. అవి: తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, ఒరియా, మలయాళం. జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకై నియమించిన కమిటీలో వీటి ప్రాతినిధ్యం ఎంత? తెలుగుకు ప్రాతినిధ్యం ఎందుకు లేదు?

భాషారాష్ట్రాలెందుకు ఏర్చ్పడ్డట్లు! మనది యూనిటరీ వ్యవస్థ కాదని, ఫెడరల్‌ విదానాలను మనం అనుసరించాలని కేంద్రపాలకులకు తెలియదా? రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించని విధంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై వుంది. భాష చాలా సున్నితమైన అంశం. దీనితో రాజకీయాలాడడమే ప్రమాదం. ఇందుకు సంబంధించి స్వాతంత్రానికి పూర్వమూ, ముఖ్యంగా స్వాతంత్రానంతరం ఎన్నో చేదు సంఘటనలనూ చరిత్రనూ మనం చూశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రాజకీయ విస్ఫోటనాన్ని కలిగించే ప్రమాదం ఉన్నది.

చివరగా మరొకమాట : పాలకులు ఈ దేశ ఐక్యతా సాధకంగా హిందుత్వ అంశాన్ని చూస్తున్నారు. అయితే హిందూత్వ అనే మాటకు వీరు చెప్పే అర్థం వేరు. విశాల హైందవ భావనతో కూడుకున్న పరిభాష అది. అది మతాలకు అతీతం. ఈ పుణ్యభారతదేశంలోని అన్ని మతాల అవలంబకులూ హిందువులేనని అంటారు. కాని, హిందూ అనే మాట వినగానే చాలామంది దాన్నొక మతంగా అనుకొంటారు! నిజానికి ఈ పాలకపార్దీని బలపరచెవారిలో కూడా కొన్ని వర్ణాలు ఆవిధమైన ఆలోచనలతో ప్రభావితమైనవే. అదృష్టవశాత్తూ వీరి సంఖ్య పరిమితం. అయితే అన్నిరకాల హిందూభావజాలాల వారిలోనూ ఉన్న భావన సంస్కృతం దైవభాష అని. అందుకే దానిపట్ల ఆరాధనాభావం. దేవుడికి రూపమే లేనప్పుడు దైవభాష ఎక్కడనుండి వచ్చింది! సంస్కృతం కూడా మానవసమాజం నిర్మించుకొన్న భాషే అది కొన్ని ప్రయోజనాలకు అద్భుతంగా తన పాత్రను నిర్వహించి, చరిత్రలో నిలిచిపోయింది. దాన్ని మనం గౌరవించుకోవాలి. కావాలంటే నేర్చుకోవాలి. అంతేగాని, దాన్ని ఒక 'వేలుపుభాషగా చేసి, ప్రత్యేక పవిత్రతనాపాదించడమేగాక, ప్రజాభాషలనెత్తిన ఆధిపత్యం వహించే సాధనంగా వారి జీవితాల్లోకి చొారబడడాన్ని సహించకూడదు.

ఇప్పుడు భారతీయ భాషల జాతీయ విశ్వవిద్యాలయం ఆలోచన రెండు రకాలుగా తప్పు. 1. ఆచరణలో దేశీయభాషల అభివృద్ధికి ఉపయోగపడకపోగా, ఇప్పుడు అప్రతిష్టకు లోనవుతున్న అనేక విశ్వవిద్యాలయాల సరసన ఇదీ చేరుతుంది.

2 ఈ విశ్వవిద్యాలయ ఆశయాలు సందేహాస్పదం. వాటిని పైన వివరించాము. అదంతా నిజమే అయితే, ఇది దేశానికీ ప్రజలకూ విషాదాన్నే మిగిల్చుతుంది.

కేవలం పార్డీ రాజకీయాల కోణం నుంచిగాక, దేశంయొక్క ప్రజలయుక్క శ్రేయస్సునూ, భవిష్యత్తునూ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని పాలకవర్గాల నేతలకు, మేధావులకు, ప్రజానీకానికి మనవి చేస్తున్నాము!

తేదీ : ౩0-12-2020.