Jump to content

అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద

వికీసోర్స్ నుండి

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి,9848123655

పడమటి గాలితో

నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద (8)


పాశ్చాత్యులు భారతదేశంలో వర్తకం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. దానితోపాటు వాళ్ళ సిబ్బంది కూడా అనతికాలంలోనే పెరిగింది. కుంఫిణీ కాలువులో పనిచేసే తెల్లదొరలను సివిల్‌ సర్వెంట్బ్‌ అంటారు. భారత దేశంలోని గిడ్డంగుల్లో పనిచేసే సివిల్‌ సర్వెంట్లను క్రీ.శ. 1674లో నాలుగు వర్షాలుగా పరిగణించేవారు. ప్రాథమిక స్థాయి పనివాళ్ళను “అప్రెంటిస్” అనేవారు. వారికి అనుభవం వచ్చాక ఐదారేళ్ళలో చిన్నరైటర్‌గా ఉద్యోగోన్నతి పొందేవారు. ఆ తర్వాత కొన్నేళ్లకు పైగా అధికారుల మొప్పు పొంది పనితనం వచ్చాక జూనీయర్‌ ఫాక్టర్‌ గా ఆపై సీనియర్‌ ఫాక్టర్‌గా స్థిరపదేవారు. వీళ్ళని ఇంగ్లండ్‌ నుంచే తీసుకువచ్చేవారనీ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో వివరించాడు. ఈ నేపథ్యంలో వ్యాకరణాలు, నిఘంటువులు, వాచకాలు మొదలయిన వాటి అవసరం ఏర్పడింది. లాటిన్‌, ఫ్రెంచ్‌ పోర్చుగీస్‌ తదితర భాషలకు తెలుగు జోడించారు. దేశీయులైన వాళ్ళు ద్విభాషీలుగానో అనువాదకులుగానో వారి వద్ద చేరేవారు. నిఘంటు నిర్మాణం చేసిన పాశ్చాత్యుల రచనలు వరుసగా వివరించడం ఈ వ్యాస రచనలో ఒక భాగం.

బెంజిమిన్‌ బ్రాన్‌ఫిల్‌:

బెంజిమిన్‌ బ్రాన్‌ ఫిల్‌ 1791లో నెల్లూరు కలెక్టర్‌గా పనిచేశాడు. 1793 నాటికి నూజివీడు కమిటీలో సభ్యుడు కావడంతో తెలుగు ఎక్కువగా వినియోగించవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల తాను తెలుగు మాట్లాడటమే కాకుండా తనకింద పనిచేసే అప్రెంటిస్ లకి తెలుగు నేర్పించవలసిన అవసరం కలిగింది. అందువల్ల 1793 జూన్‌ 7వ తేదీన నిఘంటు రచన ప్రారంభించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. తెలుగు అక్షరమాల పూర్తిగా తెలియనివాడు తెలుగుభాషపై సాధికారికత లేనివాడు నిఘంటునిర్మాణం చేస్తే ఎలా ఉంటుందో బెంజమిన్‌ బ్రాన్‌ఫిల్‌ ఉదాహరణగా చెప్పొచ్చు. అంతకుముందే పేర్‌మోటల్‌ అనే ఫ్రెంచ్‌ పాదిరి కూర్చిన ఫ్రెంచ్‌ అక్షరాల క్రమంలోనే తెలుగు నిఘంటు నిర్మాణం చేశాడు. 'పైగా భాష కూడా ఆనాటి ప్రజల వాడుకభాష పండితుల వ్యావహారిక పదప్రయోగాలు మిళితం చేసి 823 పుటల నిఘంటువు తయారు చేశాడు. ఇతని నిఘంటువు అట్టమీద “చదివి చద్వుకొండా” అని ఉచిత ఉపదేశం చేశాడు. ఈ మాటను ఎడికాంబెల్, సి.పి. బ్రౌన్‌ తమ నిఘంటు పీఠికలో పేర్కొంటూ బెంజమిన్‌ రచనను అజ్ఞానపు రాతలని తేల్చి పారేశారు. ఐతే ఇక్కడో విషయం ప్రస్తావించాలి. తెలుగులో అసలు ఏ నిఘంటువు లేని రోజుల్లో ఈ సాహనం చేయడం, అదీ అచ్చువేయడం కొంత మెచ్చుకోదగిన విషయమే. అనంతరం 1794లో నూజివీడు జమిందారిపై నూపరింటెండేంట్‌గా, ఆ తర్వాత మచిలీపట్నం మూడవ డివిజన్‌ కలెక్టర్‌గా పనిచేసి 1804లో ఇంగ్లండ్‌ వెళ్ళాడు. అంతకుమించి బెంజిమిన్‌ బ్రాన్‌ఫిల్‌ విషయాలు తెలియవు.

విలియం హావెల్‌:

భారత దేశంలో 1706లో జన్మించాడు. బాల్యంలో చదువులు,ఆపై ఉన్నత చదువులు, కళాశాలవిద్య మొదలయిన వివరాలు తెలియవు. కానీ 1821 ప్రాంతంలో బళ్ళారిలో అసిస్టెంట్‌ గా చేరాడు. 1825 నాటికి కడపలో ఒక మిషన్‌ కేంద్రాన్ని ప్రారంభించి విద్యాలయాలు నెలకొల్పాడు. అనాథలకు, పేదలకు చదువునేర్పే పాఠశాలలు నామమాత్రంగా ప్రారంభించాడు. పేదలకు అవసరం మేర వైద్యం కూడా అందించాడు. 1842 వరకూ కడపలోనే పనిచేసి తెలుగు పుస్తకాలు తయారు చేశాడు. కొన్ని అనువాదాలు కూడా చేశాడు. 1834లో ఆంధ్ర వ్యాకరణము ముద్రించాడు. ఎ కాటికిజం ఆఫ్‌ తెలుగు గ్రామర్‌ (బళ్లారి 1834) అనే టైటిల్‌ తో ముద్రణ అయింది.

జాన్‌ కర్నక్‌ మారిస్‌:

జాన్‌ కర్షక్‌ మారిస్‌ 1798 అక్టోబర్‌ లో జన్మించాడు. తండ్రి జాన్‌ మారిస్‌ బొంబాయి సివిల్‌ సర్వీస్‌ కు చెందినవాడు. జాన్‌ కర్నక్‌ 1813-1815లో రాయల్‌ నేవీలో పనిచేశాడు. 1815-17 ప్రాంతంలో ఇంగ్లండ్‌లో ప్రాచ్య భాషలు బోధించే హెయిల్‌బరీ కళాశాలలో చదివాడు. 1818లో రైటరుగా చెన్నపట్టణానికి వచ్చాడు. కొంతకాలం సర్మారు వారి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.ఆ తర్వాత తెలుగు ట్రాన్స్‌లేటర్‌ గా, 1821లో మచిలీపట్టణంలో మెజస్టేటుగా, 1823లో ప్రభుత్వానికి అనువాదకుడిగా పనిచేశాడు. ఈ కాలంలోనే పాఠశాలల కోసం తెలుగు 'సెలక్షన్స్‌ సిద్దం చేశాడు. 1824లో సెయింట్‌ జార్డ్‌ కళాశాల బోర్డు సెక్రటరీగా, 1831లో బోగ్జ్‌ ఆఫ్‌ రెవెన్యూ సభ్యుడిగా, అనంతరం యాక్టింగ్‌ 'సెక్రటరిగా, 1832లో ప్రభుత్వానికి పూర్తికాలపు అనువాదకుడిగా పనిచేశాడు. ఈ కాలంలోనే తెల్లవాళ్ళకు తెలుగు నేర్పడం, తెలుగు వాళ్ళకు ఇంగ్లీషు నేర్పడం ప్రారంభించాడు. 1835 నాటికి మద్రాసు గవర్నమెంట్‌ బాంక్‌ సూపరింటెండెంట్‌ గా చేశాడు. ఈలోగా తాను తయారుచేసిన తెలుగు నిఘంటువు, వాచకాలు ముద్రించాడు. అనంతరం మద్రాను జర్నల్‌ ఆఫ్ లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌ కి సంపాదకుడిగా వ్యవహరించాడు. తర్వాత ప్రతిష్టాత్మకమైన రాయల్‌ సొసైటీ సభ్యుడుగా ఉన్నాడు. 1846లో ఉద్యోగ విరమణ అనంతరం 1558లో మరణించాడు.

అలెగ్జాండర్‌ డంకన్‌ కాంబెల్‌

తెలుగు త్రిలింగ శబ్దభవమని తొలిగా చెప్పినవాడు అలెగ్జాండర్‌ డంకన్‌ కాంబెల్‌. శ్రీశైల, దక్షారామ, ఖీమేశ్వరమనే త్రిలింగాల నడిమిభాగం తెలుగువారి ఆవాసస్థానమనీ తెలుగుకే తెనుగు, ఆంధ్రము, జంటూ, వరుగి అనే పర్యాయ పదాలున్నాయని వివరంగా విశ్లేషించాడు కాంబెల్‌ మహాశయుడు. మూడు లింగాలను గుర్తించడానికి విస్త్రత పరిశోధనలు చేశాడు. ప్రాచీన చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించినవన్నీ ఉదహరిస్తూ వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్ర ప్రసక్తి ఉన్న ఉదాహరణల్లో వివరంగా తన వ్యాకరణ పీఠికలో రాశాడు. మెకంజీ దొర సేకరించిన రాత ప్రతులను, శాసనాలను, ఇతర ఆధారాలను వివరంగా ఆధారాలతో సహా విజయనగరరాజుల జాబితాను కాలానుగుణంగా వివరించాడు.

1807లో రైటర్‌ గా చెన్నపట్టణానికి వచ్చిన కాంబెల్‌ అక్కడే పండితుడుగా ఉన్న ఉదయగిరి నారాయణయ్యవద్ద ఆంధ్ర శబ్ద చింతామణిని చదివాడు. నారాయణయ్య నేతృత్వంలో ఐదేళ్ళపాటు ఆంధ్రకౌముది, అహోబల పండితీయం మొదలయినవి చదివాడు. చదివితే క్షుణ్ణంగా చదవాలి ఆసాంతం నేర్చుకుని ఆకళింపు చేసుకోవాలనే మనన్తత్వం కాంబెల్‌ది. ప్రతినిత్యం గురు సాన్నిహిత్యంలో చదివేటప్పుడు ఒక నోట్సు తయారు చేసుకునేవాడు. తను నేర్చుకున్న నోట్సు ఇతరులకు ఉపయోగపడాలనీ ఆరు 'ప్రకరణాల్లో 519 సూత్రాలతో ఆంధ్ర వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రాశాడు. ఇది 1816లో అచ్చయింది. 19వ శతాబ్దంలో మద్రాసులో అచ్చయిన తొలిపుస్తకం యిది. “ఎ గ్రామర్‌ ఆఫ్‌ ది తెలుగు లాంగ్వేజ్‌ కామన్‌లీ టర్మ్‌డ్‌ జెంటూ, పెక్యూలియర్‌ టు ది హిందూన్‌ ఇన్‌ హాబిటింగ్‌ ది నార్త్‌ ఈస్టర్న్‌ ప్రావిన్సిస్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ పెనిన్సులా” అనే టైటిల్‌తో ముద్రించాడు. జెంటూ అనే పదం యూరోపియన్‌లు సృష్టించారని అందుకే ఈ వ్యాకరణానికి ఆభాషలో తయారు చేశానని చెప్పాడు. ఈ పుస్తకం ఫోర్ట్‌ సెయింట్‌ జార్డ్‌ ప్రభుత్వానికి సమర్పించాడు. కళాశాల పక్షాన కాపీరైటు కొని, వారి ప్రెస్ లొనే అచ్చువేసి, ఇండియా గవర్నర్‌ జనరల్‌కి అంకితం యిచ్చాడు. కాంబెల్‌ వ్యాకరణంలో రోమన్‌ లిపి వాడాడు. ఇందులో ఆరు అధ్యాయాలున్నాయి. 1. తెలుగు అక్షరాలు 2. ద్విత్వ సంయుక్తాక్షరాలు. 3.నామవాచకాలు, సర్వనామాలు, 4. విశేషణాలు 5. (క్రియలు 6. వాక్య నిర్మాణం. ఆంధ్ర శబ్ద చింతామణినే అనుసరించినా దేశ్యానికి ప్రథమ స్థానమిచ్చాడు.

తొలి ప్రకరణమయిన తెలుగు అక్షరాలను విస్మరించాడు. శుద్దాంధ్రానికి ముఫ్పై ఏడు వర్జాలన్నాడు. క్ష-ఱ, పూర్జానుస్వారాలను, విసర్గను, హల్లుల్ని వర్ణమాలగ తెలిపాడు. ఉచ్చారణ విషయంలో తెలుగులో పదాది యకార, వకారాలు దోషమన్నాడు. సంస్కృత పదాదిలో అయి-అవులు వాడకూడదనీ, బు, బూలను రు-రూలు రాయతం దోషమన్నాడు. రెండో ప్రకరణంలో సంధిలక్షణం (పూర్వ) పదాంత (పర) పదాది వర్ణాలకి కలిగే మార్పుల్ని పద మధ్యస్వరలోపాన్ని సంధి అని నిర్వచనం చేశాడు. కళాద్రుత ప్రకృతి కాలను నిర్వచనం చేసి వివరించాడు. కళలకు సంధి రాకపోతే యకారం, ద్రుత ప్రకృతిలకు సంధి జరగకపోతే నకారం వస్తుందని తెలిపాడు. అత్వ-ఇత్వ-ఉత్వ సంధుల్ని సోదాహరణంగా వివరించాడు. ఎడు-అంత-ఏసి అన్న పదాలు, ఆకు -అన్ని -అమ్మ-అక్క-అయ్య-అత్త అవ్వ అన్న పదాలు పరమైనమపుడు ఎట్టి హ్రస్వాచ్చుకయిన సంధి నిత్యమని సూత్రీకరించాడు. ఉదా. చేరెడు - పోకంత - ఏనిమిదేసి - సుబ్బమ్మ-తాటాకు. తృతీయ ప్రకరణం దేశ్య తద్భవ, గ్రామ్య లక్షణాల వివరణ. దేశ్వాన్ని అచ్చ దేశ్యంగా పరిగణించాడు. దేశ్వాల్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ దేశ్వాంగాలుగా విభజించాడు. డుమంతాలు ప్రథమ దేశ్యాలు. ము-ఎము-అము అంతమయ్యేవి ద్వితీయాలు. స్త్రీ సమములు తృతీయాలు. ఈ విభజననే గురుమూర్తి శాస్త్రి, ఉదయగిరి శేషయ్య, అబ్బయ్య నాయుడు వంటి దేశీయ వ్యాకర్తలు, సి.పి. బ్రౌన్‌, ఆద్దెన్‌ వంటి విదేశీయ వ్యాకర్తలు అనుసరించారు.

దేశ్వాలలోనే లింగ వచన విభక్తులతోపాటు జౌపవిభక్తికాల్ని వివరించాడు. తత్సమాలను నిర్దేశించి అజంత హలంతాలకయే కార్యాన్ని సూత్రీకరించాడు. హలంతాలలో ప్రతిహలంతానికి తత్సమరూపాన్ని ప్రదర్శించడమేకాక విశేష రూపాన్ని సహితం చూసి కొన్నింటికి గల ప్రధమాంత తుల్య, ద్వితీయాంత తుల్య ద్వైరూపాల్ని ఇచ్చాడు.

ఉదా: సంపద్‌ = సంపత్తు =సంపద

హానుమత్‌ -హనుమంతుడు =హానుమానుడు -హనుమ తత్సమాల తర్వాత తద్భవరూప ప్రక్రియ వివరణ ఉంది. కొన్ని అన్యదేశాల్ని ఉదాహరించి, సర్బనామాన్ని నిర్వచించాడు.

చతుర్ణ ప్రకరణంలో దేశ్య, తత్సమ, విశేషణాలను గూర్చిన వివరణ ఉంది. పంచమ ప్రక్రియలో క్రియారూప భేదాలున్నాయి. ఎద-ఎడి వీటిని భవిష్యదర్దక ప్రత్యయాలుగా గ్రహించాడు.

కర్తరి, కర్మణి - ప్రేరణార్జక - నపుంసకాలని (Neuter erb) క్రియలు నాలుగు విభాగాలు. భూత - వర్తమాన భవిష్యత్తధ ర్మార్ధ కాలని కాలాలు నాలుగు విధాలు. క్రియల్లో గ్రామ్యరూపాలు చూపాడు. కారకము - వాక్య నిర్మాణ విభాగం, కృత్తద్దితాలు ఆరవ ప్రకరణంలోని విషయాలు. ఈ విభాగంలోని వాక్యాలు నీతిబోధకాలు.

ఉదా: స్త్రీలకు అణకువ మంచిది.
మొగవాళ్ళకు థైర్యమే గత్యము
మాటకు ప్రాణము సత్యము
బోటికి ప్రాణము మానము.

ఆయా విభక్తులు ఏయే అర్ధాల్లో ప్రయుక్తాలో వివులీకరించాడు. రామాయణగాధల్ని అబ్యాసాలుగా చేశాడు. అనుబంధంలో సంఖ్యావాచకాలు, పరిమాణార్థకాలు, కొలమానాలు ఉన్నాయి.

ఈ వ్యాకరణంలో చెప్పుకోదగినవి ఆంగ్ల వ్యాకరణ పద్దతులు అనుసరించకుండా తెలుగు పద్దతులను, తెలుగు సంప్రదాయాలను వివరించడం అనంతర వ్యాకర్తలకు మార్దదర్శకమయింది.

కాంబెల్‌ వ్యాకరణ రచనకు సహాయపడిన నారాయణయ్యకు ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌ కళాశాలలో ఆంగ్ల విభాగాధిపతిగా ఉద్యోగ మిప్పించాడు. ఆ తర్వాత సుప్రీమ్‌ కోర్ట్‌ ఆఫ్‌ జూడికేచర్‌లో ఇంటర్‌ ప్రెటర్‌ అయ్యాడు. పాశ్చాత్యులకు విద్యావిషయకంగా తోడ్పడినవారిని, అనువాదాలకు సహాయపడినవారికి మంచి జీతంతో ఉన్నతమైన ఉద్యోగాలు యిప్పించి కృతజ్ఞత చాటుకున్నట్టు- ఆయా దొరల జీవిత చారిత్రక క్రమం తెలియజేస్తుంది.

కాంబెల్‌ 1812 నుండి దేశభాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. అదే తర్వాత కాలేజి బోర్డుగా మారింది. ఈ బోర్డుకు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా 1812 నుండి 1820 వరకు పనిచేశాడు. కాంబెల్‌ ప్రతిభను గుర్తించిన అధికారులు నిఘుంటువుకూడా తయారు చేయమని ఆదేశించారు. 1820లో బళ్ళారికి కలెక్టరుగా పనిచేస్తూనే నిఘంటు రచన ప్రారంభించి 1821కి పూర్తి చేశాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపికను ఆధారంగా చేసుకుని అదే క్రమంలో తయారుచేశాడు. మధ్యలో కొత్త పదాలను కలుపుతూ తెలుగు భాషకు ఇంగ్లీషు అర్జాలను వివరించాడు. 1848 నాటికి రెండు ముద్రణలను పొంది అత్యధిక ప్రతులు అమ్మకం జరిగినట్టు తెలుస్తుంది. 1849లో మూడవ ముద్రణ హిందూ ప్రెస్‌ మద్రాసు వారు వెలువరించారు.

1820లో బళ్ళారిలో కలెక్టరుగా ఉన్న సమయంలో తెలుగు విద్యావిధానంపై సమగ్రంగా నివేదిక తయారు చేశాడు. ప్రాధమిక దశలో మాతృభాష అవసరం గుర్తించి మాతృభాషలోనే విద్యా బోధనగావించాడు. అనంతరం ఇంగ్లీషువారికి అవసరమ్హైన చోటమాత్రమే ఇంగ్లీషు నేర్చించినట్టు Selections from educational Records 1840- 1853, E.d by JA Richey, Part II, 1922లో వివరాలు తెలుస్తాయి. జిల్లా కేంద్రాలలో పనిచేసిన అనంతరం 1827లో కాలేజి బోర్డు సభ్యుడయ్యాడు. ఈ కాలంలో మద్రాసు లిటరరీ సొసైటీ సభ్యుడుగా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ సర్మారువారి తెలుగు ట్రాన్స్‌లేటర్‌ గా పనిచేశాడు. ఈకాలంలోనే పాఠశాలలో తెలుగు పుస్తకాల తయారీ, ప్రచురణ బాధ్యతలు కూడా స్వీకరించాడు. ఏ పనిచేసినా సాధికారికంగా నిరూపించి నిగ్గు తేల్చాడు. 1814లో విలియం కేరీ వ్యాకరణం, 1816లో కాంబెల్‌ వ్యాకరణం, 1817లో విలియం బ్రౌన్‌ వ్యాకరణం వచ్చినా అన్నింటికన్నా మిన్నగా ఉత్తమంగా కాంబెల్‌ వ్యాకరణం నిలిచింది. అనంతర వ్వ్యాకర్తలకు కూడా ఆదర్శ ప్రాయమయింది. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతి పరిరక్షణకు కృషిచేసి ఆదర్శవంతంగా నిలిచిన కాంబెల్‌ నిత్యస్మరణీయుడు.

డాక్టర్‌ జాన్‌ లీడెన్‌ (1775-1811): చదువుకు పేదరికం అడ్డుకాదని యిష్టపడి పనిచేస్తే ఏదయినా సాధించవచ్చని అనుభవ పూర్వకంగా నిరూపించినవాడు దాక్టర్‌ జాన్‌ లీడేన్‌. గొర్రెల కాపరుల కుటుంబం నుంఛి వచ్చిన లీడెన్‌ ప్రాథమిక విద్యాబ్యాసంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. స్కాట్లాండ్‌ దేశానికి చెందిన లీడెన్‌ సమయం దొరికినప్పుడల్లా వివిధ భాషల అధ్యయనం చేసేవాడు. ఉన్నత విద్య చదివే క్రమంలోనే స్కాండినేవియన్‌ భాషలతోపాటు హిబ్రూ అరబిక్‌, పర్షియా భాషల్లో ప్రావీణ్యం పొందాడు. భాషల అధ్యయనంతోపాటు, శాస్త్ర విషయాలు చదివి నేర్చుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే వైద్యశాస్త్రం చదివి పట్టభద్రుడయ్యాడు. ఎడింబరో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. వైద్యశాస్త్రంతోపాటు తత్వశాస్త్రంలో కూడా కృషిచేశాడు. ఏది చదివినా అందులోని అనుపానులు చూసి, నిగ్గదీసి నికషోపలంపై నిలబడి వజ్రంలా మెరిసేవాడు. ప్రపంచంలోని ముఫ్పై భాషలను బాగా చదివాడు. మంచి వక్త-రచయిత. ఏ విషయాన్నైనా సాధికారికంగా మాట్లాడేవాడు. భారతదేశానికి 1803 ఆగష్టు 19వ తేదిన చెన్నపట్టణం కుంఫిణీ ఉద్యోగిగా వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు - తమిళ - కన్నడ భాషల్లో ఎన్నో గ్రంధాలను సేకరించాడు. అంతకుముందే మెకంజీ పదహారు భాషల్లో ఉన్న 1568 గ్రంథాలను 264 సంపుటాల్లోకి ఎక్కించి 2070 స్థానిక చరిత్రలను, 8076 శాసనాలను సేకరించాడు. మెకంజీ లాగే బ్రౌనుదొర 2440సంపుటాల్లో 1273 తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలు అన్ని సేకరించడం జూన్‌లీ డెన్‌ కి ప్రేరణ అని తానే చెప్పాడు. ఆ ప్రేరణతోనే దక్షిణాది భాషల్లో ఉన్న విలువైన లిఖిత సంపదను సేకరించాడు. తొలిగా మద్రాసు జనరల్‌ ఆస్పత్రిని నడిపే బాధ్యతను స్వీకరించాడు. వైద్యం చేయడంతోపాటు వైద్యశాస్త్ర పరిశోధనలు కూడా సమాంతరంగా కొనసాగించాడు. ఆ నేపథ్యంలో లీడెన్‌ ప్రకృతిలో లభించే ఖనిజాలు, లోహాలు, వృక్షజాతి మొక్కలు వాటి ఉపయోగం అవి రోగ నివారణకు ఎలా పనిచేస్తాయనేది పరిశోధించి, ప్రయోగించి సఫలీకృతుడయ్యాడు. అదే క్రమంలో దేశీయుల ఆచార వ్యవహారాలు, శరీర స్వభావాలు, స్థానిక పంటలు, అవి పండే కాలాలు, కార్తెలు ఏ పంట తర్వాత ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసుకున్నాడు. వాటి ద్వారా కాలానుగుణంగా వచ్చే వ్యాధులు వాటి నివారణ మార్దాలు అన్వేషించి వైద్యం చేశాడు. కాలానుగుణంగా దొరికే ఆహార పదార్థాల ద్వారా రోగ నిరోధక శక్తి పెంచే మార్దాలు వివరించాడు. ఈ అనుభవాలన్నీ నోట్సు తయారు చేశాడు. ఈ క్రమంలోనే లీడెన్‌ పలుమార్లు జబ్బుపడ్డా ఆ సమయంలో కూడా సంస్కృత అధ్యయనం చేసేవాడు. అనారోగ్యంగా ఉన్న సమయంలో పారశీకం, హిందూస్టానీ భాషల్లోని కథలను అనువాదం చేశాడు. ఆరోగ్యం కోసం స్థలమార్చిడి జరిగే సమయంలో కూడా లీడెన్‌ భారతీయుల చరిత్ర, ఆచారాలు, మతపద్దతులు, క్షుణ్ణంగా తెలుసుకొని మంచిగా నోట్సు తయారు చేశాడు.

ఆయన ఇండోచైనా దేశంలోని జాతులు-భాషలు వారి సాహిత్యం పై వ్యాసాలు రాశారు. అన్నీ ఏషియాటిక్‌ రిసర్చస్‌ వాల్యూముల్లో ప్రచురితమయ్యాయి. వాల్యూం నం. 10లో ప్రచురితమైన వ్యాసం విద్యాధికులనాకర్షించింది. కుంఫిణీ వారి మన్ననలను పొందింది. అందువల్ల ఆయన్ని ఏషియాటిక్‌ సొసైటీ సభ్యుడిగా చేర్చుకోవడంతోపాటు కలకత్తాలోని పోర్ట్‌ విలియం కళాశాలలో హిందుస్థానీ భాషకు ఆచార్యుడుగా నియమితుడయే అవకాశం లభించింది. దీనికి అదనంగా కలకత్తాలో జడ్జిగా కూడా విధులు నిర్వహించే అవకాశం కలిగింది.

ఈ నేపథ్యంలో జావా ద్వీపంపై దండయాత్ర జరిగింది. కుంఫిజీ సేనలు లార్జ్‌ మింటో నాయకత్వంలో వెళ్లాయి. మింటోకి ద్విభాషీగా


లీడెన్‌ నియమితుడయ్యాడు.

జావా జయించిన అనంతరం ఉద్యోగ నిర్వహణతోపాటు సాహిత్య పరిశోధనలు, గ్రంథ సేకరణ, స్థానిక జెషధాలకు పనికివచ్చే మొక్కలు సేకరించాడు. ఒకరోజు బటేవియా నగరంలో ప్రాచ్చదేశపు గ్రంథాలున్నాయని, అవి చాల ప్రాచీనమైనవని లీడెన్‌ విన్నాడు. అంతే వాటిని పరిశీలించడానికి ఎకాయకిని వెళ్ళాడు. ప్రాచీనమైన ఒక భవనంలో ఈ గ్రంథసంపద ఉందని గుర్తించాడు. ఆ గదినిండా డచ్‌ వారి సామాగ్రి, ఆ ద్వీపంలోని అపురూప వస్తు సంపద ఉందని గుర్తించాడు. కొన్నేళ్ళుగా మూతపడిన ఆ గది మూసి ఉన్నందువల్ల, గాలి, వెలుతురు చొరపడే అవకాశం లేనందువల్ల మగ్గిపోయింది. గది తలుపు ఒక్కటే ఉంది. కిటికీలు లేవు. తెరచీతెరవంగానే ఉత్సాహంగా లోనికి ప్రవేశించిన లీడెన్‌, లోపల ఏర్పడిన విషవాయువులు పీల్చాడు. అంతే అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా చలిజ్జ్బరం కమ్ముకుంది. మూడు రోజులలో చనిపోయాడు. 1811 ఆగష్టు 11వ తేదిన బటేవియాలో చనిపోయిన లీడెన్‌ మరణం సాహిత్యకారులను, చారిత్రక విశ్లేషకులను, భాషాఖిమానులను శోక సంద్రంలో ముంచేసింది.

లీడెన్‌ భారతదేశంలో అడుగుపెట్టిన నాటినుండి మరణించే వరకూ తొమ్మిదేళ్ళ ఉద్యోగ నిర్వహణలో 2106 సంపుటాల్లో విషయసేకరణ చేశాడు. తాను నేర్చిన భాషల పరస్పర సంబంధాలను విశ్లేషించాడు. ఆయన మరణానంతరం లాక్‌ హెర్ట్‌ రచించిన 'లైఫ్‌ ఆఫ్‌ స్కాట్ ' అనే గ్రంథంలో లీడెన్‌ వ్యక్తిత్వం, వైదుష్యం, కథలు, కథాగేయాలు, ఆయన రచనలు ప్రచురించారు. లీడెన్‌ సేకరించిన వాటిలో తెలుగు లిపిలో ఉన్నవి 272 అని లెక్క తేల్చారు. ఇన్ని వివరాలు సేకరించిన ఆరుద్రగారికి శతవందనాలు. ఈ వ్యాసానికి ఆకరువులయిన 'తెలుగుభాషకు విదేశీయుల సేవ ' రచయిత ఆచార్య జి.లలిత, “తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు” రచయిత డా.జోలిపాళెం మంగమ్మ గార్లకు కృతజ్ఞతలు.

“ఐజ్ఞానశా(స్తాన్న అమ్మభాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల చిన్నారుల్లో "సైన్స్‌ స్పజనాత్మకత” పెరుగుతుంది. వాఠ్వాంశాన్ని త్వరగా అర్థం చేసుకునే శక్తీ సమకూరుతుంది. నేను పదో తరగతి వరకూ మాతృభాషా మాధ్యమంలోనే చదువుకున్నా. తర్వాత ఆంగ్లం నేర్చుకున్నా. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూవించే నృజనాత్భుకతే వారి భవివ్వత్తుకు వునాది. ఆ నృజనాత్సకత అమ్మభాషలో చదువువల్లే సాద్యం.” _ ఎ.పి.జె. అబ్బుల్‌ కలామ్‌



కథలు, స్వప్పకావ్యము, వ్యాసములు

పానుగంటి లక్ష్మీనరసింహారావు


పుటలు:240 వెల:రు. 200/- రచన: పానుగంటి లక్ష్మీనరసింహారావు ప్రచురణ :వి.వి.ఐ. టి. విద్యాసంస్థ, పంపిణీ: క్రియేటివ్‌లింక్స్‌ పబ్లికేషన్స్‌ హైదరాబాద్‌-501 505 సెల్‌ 98480 65658

నవీనాంధ్ర సాహిత్య నిర్మాతలలో చిలకమర్తి, పానుగంటి, మొక్కపాటి గణుతికెక్కినవారు. వీరిలో పానుగంటి వ్యంగ్వాత్మక విమర్శకులు, నాటకరచయిత. సంఘోద్దరణ వారి ధ్యేయం. వావిళ్ల వారు ప్రచురించిన సాక్షి సంపుటాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు ప్రత్యేకంగా “కధలు, స్వప్నకావ్యము, వ్యాసములు పానుగంటి లక్ష్మ్మీనరసింహారావు”-పేరుతో మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వి.వి.ఐ.టి విద్యాసంస్థ ఈ గ్రంథాన్ని ప్రచురించడం ముదావహం. ఇందులో 11కథలు, 14వ్యాసాలు, ఒక కావ్యం చోటు చేసుకున్నాయి. పానుగంటివారి కాలంలో వర్ణిల్లిన వ్యావహారిక భాషోద్యమం, భావకవిత్వం, నవ్య కవిత్వాలను హేళన చేస్తూ వాసినది -స్వప్నకావ్యం. ఇందలి 14 వ్యాసాలు వావిళ్ళవారు ముద్రించిన సాక్షి సంపుటాలలో లేనివి. 11 కథలలో సామాజికాంశాలు ప్రతిబింభిస్తున్నాయి. భార్యగుణమే సౌందర్యంకాని, భార్య సౌందర్యంగుణం కాదనే సందేశంతో కూడినది చిన్నకథ. 'హిందూ గృహిణి- దాంపత్యాజీవితానికి అద్దం పట్టింది. నలుపు తెలుపు తగులాటాల తమాషా-వేరీ నారాయణీయం”. అతిథి పూజామర్యాదలతో నిండిన -కానుగుచెట్టు”, వేశ్యాలంపటత్వంతో చిద్రమ్హైన కుటుంబగాధ -"శ్రీరామా!” బైరాగి దీక్షకు నిదర్శనం -“'జయసీతారామ్‌”. జోస్యం ఫలితానికి అద్ధంపట్టింది-'రామరాజు. ఇష్టంలేనిదాన్ని వదిలించుకోవడం కనబడుతోంది-'రామరామ 'లో.ప్లీడరు మోసాలు దర్శనమిస్తాయి- “ప్లీడరు పట్టు 'లో. దొంగకు కూడ దైవభక్తి ఉందని తెలువుతుంది -'శివరామా '. పందెంకోనం నటించడం 'హస్యకధలో వెల్లడవుతుంది. వ్యాసరచయిత, నాటక రచయితగానే కాక, కథారచయితగా కూదా పానుగంటి వారిని పరిచయం చేస్తుంది ఈ గ్రంథం, సాహిత్యాభిమానులందరు చదవదగినది.

డా|| వెన్నిసెట్టి సింగారావు సెల్‌ : 9893015584