అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/జగమునేలిన తెలుగు - 14
నవల
డి.పి. అనూరాధ 90100 16555
(జరిగిన కధ)
(శీలంకలో లచ్చిమిని కలుసుకోవడమే కాదు అమెను పెల్లిచేసుకుని ఇండియా వస్తాడు సూర్యవర్మ. తెలుగు జాతి ఘనకీర్తి చరిత్రకు సంబంధించి థీమ్ పార్క్ నిర్మాణానికి ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఆఖరుకి జగమునేలిన తెలుగు” నవలకు శ్రీకారం చుడతాడు. ఆ నవల ప్రకంవనలు సృష్టించి భారత రాష్ట్రపతితో సూర్యవర్మకి పరిచయం ఏర్పడేలా చేస్తుంది. థీమ్ పార్క్ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది?)
నా దిల్లీ యాత్ర గొప్ప విజయం సాధించింది. భారత రాష్ట్రపతి తల్లాప్రగడ సత్వనారాయణగారిని కలుసుకోవడంతో నా జీవితమే మారిపోయింది. తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర థీమ్ పార్క్ ప్రాజెక్టు వెంటనే పట్టాలెక్కింది. నాగార్జునకొండకే నా మకాంను మార్చాను. అమ్మానాన్నలతో పాటు లచ్చిమి, బాబు హైదరాబాద్‌లోనే ఉన్నారు. నేను అక్కడికీ ఇక్కడికీ తిరుగుతున్నాను. రెండు రాష్ట్రప్రభుత్వాలు “తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేబట్టాయి. జపాన్, కొరియా, అమెరికా సంస్థలు ఇందులో భాగస్వాములుగా చేరాయి. చరిత్ర, భాషాశాస్త్రం, పురాతత్వశాస్త్రం, వాస్తు శాస్త్రం, కృత్రిమ మేధ, శాస్త్ర సాంకేతికత శాఖలు సంయుక్తంగా పనిచేశాయి. ప్రాజెక్టు పూర్తవడానికి మొత్తం అయిదేళ్లు పట్టింది. వంద ఎకరాలలో తీర్చిదిద్దిన ప్రాజెక్టు ఇది. రెండు వేల ఏళ్ల కాలాన్ని వందేళ్లకు ఓ భాగంగా ఇరవై విభాగాలుగా విభజించారు. ఆయా శతాబ్దాల్లో జరిగిన ప్రధానఘట్టాలను 5డీ టెక్నాలజీతో ఆవిష్కరించారు. వర్చువల్ టెక్నాలజీ వినియోగించడం వల్ల ఆ సమయంలో మనమూ అక్కడున్నామన్న భావన కలుగుతుంది. విదేశాల్లోని ప్రాచీన తెలుగు రాజ్యాలు ఇందులో మరో భాగం. మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంకలోని తెలుగు రాజ్యాల చారిత్రక ఆనవాళ్ల ప్రతిరూపాలను ఇక్కడ నిర్మించారు. ఆయా ప్రభుత్వాలు దీనికి కావలసిన సహకారాన్ని అందించాయి. దీనికోసం ఆ దేశాలన్నీ నాలుగైదు సార్లు పర్యటించాను. మయన్మార్ ప్పీడగాన్ పగోడా, థాయిలాండ్ వాట్ చామదేవి, వియత్నాం మిసన్ సిటీ, ఇండోనేషియా బొరబొదూర్, శ్రీలంక క్యాండి కోట ప్రతీరూపాలను ఈ ప్రాజెక్టులో నిర్మించడం విశేషం. యాఖై అడుగుల ఎత్తులో 18వ శతాబ్లికి చెందిన మయన్నార్ రాజు “మగాడు” శిల్పాన్ని ధీమ్ పార్క్ ప్రవేశం వద్దనే ప్రతిష్టించారు. ఆ ఒక్క శిల్పం చాలు తెలుగు పౌరుషాన్నీ రగల్బదానికి. విదేశాల్లో మన తాత ముత్తాతల, జేజెమ్మల ఘనకార్వాలను అందరికీ తెలిసేలా చేయాలన్న నా ఉద్దేశం నెరవేరింది. 'తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర థీమ్ పార్క్‌లోని ఈ అద్భుతాల దగ్గర ఒక్క నిమిషమైనా ఆగితే మన పూర్వీకులకు నివాళులు అర్పించినట్టే
రాష్ట్రపతి చేతుల మీదుగా నేడు ప్రారంభొత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్నే ముహూర్తంగా పెట్టాం. ఏంతో గొప్పరోజిది. ఇన్నేళ్లూ ఎన్నో ఆటుపోట్లకు లోనైన గుండె నేడు స్థిమితపడింది. నాగార్జునకొండలో కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ మౌనంగా కూర్చున్నాను. లచ్చిమి, బాబు వచ్చారు.
“సూర్యా... పదేళ్ల నీ కల సాకారం అవుతోన్న రోజు. ప్రతి తెలుగువాడు గుండె మీద చేయి వేసుకుని గొప్పగా చెప్పుకునే ధీమ్ పార్ముని నిర్మించావు. ఇది నీ రోజు.” అంటున్న లచ్చిమి మాటలకు
నాకళ్లనుండి ఆనందబాష్పాలు జలాజలారాలు పొతున్నాయి. నన్ను హత్తుకొని నెమ్మదింపచేనింది. మనసు కాస్త కుదుటపడింది.
'అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు డాడీ ' అంటున్న శ్రీ విజయ్‌ని ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పాను. వాడు నవ్వుతుంటే నేనూ ఆనందంతో ఊగిపోయాను.
“అక్కడ రాష్ట్రపతి గారు వచ్చేసుంటారు.” గుర్తుచేసింది లచ్చిమి.
ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపర్వతానికి బయల్లేరాం. ముందుగా రాష్ట్రపతి బస చేసిన అతిథి గృహానికే వెళ్లాం.
ఎదురుగా సోఫాలో రాష్ట్రపతిగారు, ఆయన తమ్ముడు వీరనారాయణగారు కూర్చుని ఉన్నారు. ఎనభై వసంతాలు దాటిన వారి వదనాలు ప్రశాంతంగా కాంతులీనుతున్నాయి. లాల్చీ, పంచకట్టు, కండువా ధరించి తెలుగుదనానికి నిదర్శనంగా ఉన్నారు. సూర్యచంద్రులను పక్కపక్క్మనే చూసినట్టుగా అన్పిస్తోంది.
రాష్ట్రపతిగారు నన్ను చూడగానే.. రా సూర్యా ఎవరూ చేయని ఘనకార్యాన్ని నువ్వు సాధించావ్. చాలా గట్టివాడివని నీ గురించే మాట్లాడుకుంటున్నాం”...
'మీరు తలుచుకోకపోతే ఇదంతా జరిగేది కాదు, అంతా మీ ఆశీర్వాదమేనండీ ' ఆయన కాళ్లకి నమస్మరించబోయాను. ఆయన వారిస్తూ నన్ను ఆప్వాయంగా హత్తుకున్నారు.
“సూర్యా నువ్వు నా మనవడిలాంటివాడివి. నీ తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర థీమ్ పార్క్ చూడగలుగుతానా అనుకొన్నాను. తెలుగుతల్లి ఈ ఘనకార్యాన్ని నా చేతుల మీదుగా జరిగాలని తలపెట్టింది”
'సమయం మించిపోతోంది, వెళదాం పదండి ' వీరనారాయణగారు తొందరపెట్టారు.
మేం బయల్దెరాం. రాష్ట్రపతి కాన్వాయ్ ముందుగా సాగుతుంటే మా కారు వారిని అనుసరించింది.
సభాస్థలం దగ్గర జన సందోహం. విదేశాల నుంచి వచ్చిన వారు ఆయా దేశాల వారీగా కూర్చున్నారు. ముందు వరుసలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వారి మంత్రిగణం. అతిథుల వరుసలో మా కుర్చీలు ఏర్పాటుచేశారు. నేనూ, లచ్చిమి, శ్రీవిజయ్ కూర్చున్నాం.
వేదికమీద మాత్రం రెండే ఆసనాలు వేశారు. రెండే ఎందుకో అర్ధం కాలేదు.
భారత ర్యాష్ట్రపతిని సభావేదిక మీదకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు.
ఎంతో ఉత్సాహంగా వేదికకు చేరుకొని ఆశీనులయ్యారు సూర్యవర్మ, జగమునేలిన తెలుగు గ్రంథకర్త, తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర ధీమ్ పార్క్ రూపకర్త ను సభావేదికమీదకి ఆహ్వానిస్తున్నాం అని మైకులో పిలుపు వినిపించింది. కరతాళధ్వనుల మధ్య ఎంతో ఆనందంగా వేదికను చేరుకున్నా. రాష్ట్రపతిగారి దగ్గరకి వెళ్లి నిలుచున్నా ఆయన ఓ ఆసనం మీద నన్ను కూర్చోబెట్టి పోచంపల్లి ఇక్కత్ శాలువా కప్పారు. బొబ్బిలి వీణను అందించారు.
ఆయన నా మీద కురిపిస్తున్న అభిమానానికి కళ్లు చెమర్చుతున్నాయి.
రాష్ట్రపతి గారు సందేశం ఇవ్వడం మొదలు పెట్టారు.
“అందరికీ అభినందనలు. నా కళ్లెదురుగా ఉన్న జనసంద్రాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కాలేజీ రోజుల నాటి ఉత్సాహం ఉరకలేస్తోంది.
మిమ్మల్నందరినీ శ్రీపర్వత లోయలో చూడడం కన్నుల పండుగగా ఉంది. సరిగ్గా రెండు వేల ఏళ్ల నాడు శ్రీలంక, కాశ్మీరం, గాంధారం, చీనా చిలాట, తోసలి, అపరాంత, వంగ, వనవాస యవన తదితర దేశాల నుంచి పరివ్రాజకులు, ఖిక్కులు, విద్యార్థులు ఇక్కడికి వచ్చి బౌద్దజైనాలు, వైద్యం, రసాయనం, న్యాయం, అలితకళలు అధ్యయనం చేసేవారు. ఇక్కడ ఏకకాలంలో వెయ్యి మంది విద్యార్థులు బస చేసేలా భోజనం, వసతి ఉండేదట. రెండు వేల ఏళ్ల నాడు ఇక్కడి పరిస్థితి అది. ఇప్పుడు మిమ్మల్నంతా చూస్తుంటే ఆనాడు ఈ నేల మీదున్న వైభవాన్ని ప్రత్వక్షంగా చూసిన అనుభూతి కలుగుతోంది.
ఎన్ని యుగాలు గడిచినవో, ఎన్ని తరాలు నడిచినవో, ఎన్ని నాగరికతలు వర్దిల్లినవో, ఎన్ని తరాలు అవతరించినవో, ఎందరు రాజులు అంతరించిరో. ఎన్ని పతనోన్నతాలో, ఎంత జీవితమో.....ఇక్కడే మానవులు మనుగడ కోసం పోరాడింది... జంతువులతో, ప్రకృతితో సహజీవనం, సంఘర్షణ... నార వస్త్రాల నుంచి నాగరక వస్త్రాల దాకా మానవ సంస్కృతి ప్రయాణించిందీ ఈ నేలపైనే. ఇక్కడే మనుషులు ఆహారం కోసం అస్తిత్వం కోసం ఆయుధాలు సృష్టించింది. కొండ కోనల మద్య మహారణ్యాల మథ్య రాజులు రాజ్యాలు మహానగరాలు, మహొత్సాతాలు జరిగిపోయాయి. సకల విశ్వాసాలు, మతాలు, భావోద్వేగాలు జనించి గతించి తరించింది ఈ గడ్డపైనే. జాతి గుర్రాలు యద్దభూమిలో కదను తొక్కింది ఇక్కడే. మదపుటేనుగుల ఘీంకార ధ్వనుల్లో సైన్యాలు నలిగిపోయిందీ ఈ సీమలోనే. ఇక్కడే ఎన్నో పరాజయాలు. ఇక్కడే ఎన్నో జైత్రయాత్రలు...ఇక్కడి నుంచే ఎక్కడెక్కడికో దండయాత్రలు.
వింధ్యకు ఈవల ఇదే వైభవోజ్వల జీవన రంగస్థలం. ఇదే సుసంపన్న రాజ్యాలకు ఆలవాలం. ఇదే పసిడి రాసులకు ప్రసిద్దిచెందిన దక్షిణాపథం. పరాయిమూకలకు ఇదే యుద్ధభూమి. ఎన్ని జాతుల రక్తం ఏరులై పారిందో.... పరాజిత తెలుగు బిడ్డలు నౌకల్లో నదీలోయల్లో దూరదూర తీరాలకు సాగిపోయింది ఇక్కడి నుంచే. తెలుగుజాతి ముద్దు బిడ్డలు నదులు దాటి సముద్రాలు దాటి ఏ ఒడ్డుకు చేరితే అక్మడ ఒక నాగరికత వెలసింది. అక్కడ ఒక రాజ్యం అవతరించింది. అక్కడ మన సంస్కృతి విలసిల్లింది. బర్మా ఒక్కలప్ప, మగాడు, థాయి చామదేవి, వియత్నాం భద్రవర్మ ఇండోనేషియా సన్న రాజు, శ్రీలంకలో వెంకట రంగమ్మ అలనాటి వైభవానికి గట్టి చిహ్నాలుగా నేటికీ నిలిచిపోయారు.
తెలుగు నేలపై నాగరికత ఎప్పుడు పుట్టిందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ గర్భంలో ఎన్ని చరిత్ర సమాధులున్నాయో? ఈ నేల ఎంత విధ్వంసాన్ని చూసిందో? ప్రతి రాజూ గత రాజు చరిత్రను తుడిపేసే ప్రయత్నం చేశాడు. శత్రు శేషం శాసనాల్లో కూడా కనిపించకుండా చేశారు. హరోం హరా అంటూ శైవం, వీరశైవం తెలుగు నేల దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించిన కాలమూ ఉంది. జైనం వర్ధిల్లిన నేల కూడా మనదే. బుద్ధం శరణం గచ్చామి అని అడుగడుగునా శాంతి బోధ చేసిన కాలమూ ఉంది. ఎన్ని వాదాలు ఎన్ని తర్కాలు, ఎన్ని భావజాలాలు ఇక్కడ ఫలించి పుష్పించి మహా వృక్షాలుగా విస్తరించాయో....” ఓ క్షణం ఆగి కళ్లద్దాలు సరిచేసుకున్నారు.
“రెండు వేల ఏళ్ల నాడే తెలుగుజాతి ఎంతో కీర్తిని మూటకట్టుకుంది. రోమ్‌తో వ్యాపారం చేసింది. అందుకే ఎక్కడా దొరకనన్నీ రోమన్ బంగారు నాణేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బయటపడ్డాయి. భరతజాతి కీర్తిశౌర్యాలను అశోకుడితో ప్రారంభిస్తారు. కానీ కోటిలింగాల రాజులు అశోకుడే కాదు మరే ఇతర రాజూ చేయని సాహసం చేశారు. నాణేలపై తమ పేరును రాసుకుని నేటికీ చిరంజీవులుగా మిగిలారు. చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో శాతవావాన సామ్రాజ్యానికి ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన మైసూరు వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు సరిహద్దులుగా ఉండేవి. మా గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయని గర్వంగా చాటుకున్న చక్రవర్తులు శాతవాహనులు. గుంటుపల్లి గుహాలయాలు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గుహాలయాలు. తెలుగుజాతి విశిష్టసృష్టి అమరావతి శిల్చం. దేశవిదేశాలకు వ్యాప్తిచెందింది. అజంతా తొలినాటి గుహ చిత్రాలూ మనవే: రెండొ బుద్దుడిగా ప్రసిద్ది చెందినవాడు ఆచార్య నాగార్జునుడు ఈ నేల మీద పుట్టినవాడే. జెన్ బుద్దిజం సృష్టికర్త బోధిధర్ముడూ తెలుగు వాడే” అంటూ రాష్ట్రపతి కాసేపు ఆగారు. ఏదో ఆలోచిస్తున్నట్టు సుదూరంగా చూసి, మళ్లీ ప్రసంగించడం (ప్రారంభించారు.
“తెలుగు లిపి ప్రత్యేకత తలకట్టు. ఇళ్కడి వేంగి లిపే ఆగ్నేయాసియా దేశాలన్నిటికీ వ్యాప్తిచెంది ఆయా దేశాలలోని నుడులకు లిపిని అందించింది. కాకతీయుల కాలంలో తెలుగు లిపి, కన్నడ లిపి విడిపోయాయి. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ ఎలుగెత్తి చాటాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలంలో పాలనాభాషగా తెలుగు దక్షిణ భారతదేశం అంతా వ్యాపించింది. కర్నాటక సంగీతానికి తెలుగు వారి గొప్ప కానుక తెలుగు భాషే. తెలుగు వాగ్గేయకారులలో ఉన్నతోన్నతుడు అన్నమయ్య. పరిమాణంలోనే కాదు వైవిధ్యంలోనూ అన్నమయ్య రచనలు సాటిలేనివి. కర్నాటక సంగీతం అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు త్యాగయ్య. కర్ణాటక సంగీతానికి త్యాగయ్య రచనలు పర్యాయపదాలయ్యాయి. నాట్యానికే నడకలు నేర్పింది ఆంధ్రనాట్యం, కూచిపూడి, భరతనాట్యం. తమిళుల మహాకవి సుబ్రమణ్యభారతి తెలుగును ప్రశంసిస్తూ సింధూ నదిలో పడవలో ప్రయాణం చేస్తూ సుందర తెలుగు పాటపాడుకోవాలMటూ పద్యం రాశాడు. తెలుగోడి గొప్పతనానికి 16 వ శతాబ్దిలోనే సంస్కృత పండితుడు అప్పయ్య దీక్షితులు కీర్తిస్తూ వందల ఏళ్లు తపస్సు చేస్తే గానీ తెలుగు వాడిగా పుట్టడం సంభవించదు. అని లోకానికి చాటిచెప్పారు. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర తన నవలలో నాయికను అందమైన ఆంధ్ర చీరకట్టులో ఉందనీ అభివర్ణించారు. ఇలా ఎంతో మందిని తెలుగు భాష, సంస్కృతి ఆకట్టుకున్నాయి.” కాసేపు ఆగి పక్కనే ఉన్న గాజుగ్గాసులోని నీళ్లు తాగారు.
'కులం, మతం, భాషా, ప్రాంతం, వర్ణం, లింగ, వయోభేదాలతో నిమిత్తం లేకుండా నూటా యాఖై కోట్ల భారతీయుల నరనరాల్లో ఉద్వేగాన్నీ నింపే ఒకే ఒక్క బంధం... త్రివర్ణ పతాకం. భారతీయుడి అండా దండా అయిన ఈ జెండాను రూపొందించింది తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య....”
“ఈ కన్నుల ముందే భారతావని స్వాతంత్రయం పొందింది. ఆంధ్రరాష్రం ఏర్పడింది... తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది... కొన్నేళ్ల తరవాత పాలన అవసరాల దృష్ట్వా ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలుగా రెండు రాష్ట్రాలుగా విడిపడ్డాయి. ఈ రెండు రాష్త్రాలలోనే కాదు దేశమంతా ఇతర రాష్ట్రాలలోనూ విదేశాల్లోనూ అసంఖ్యాకంగా విస్తరించి ఉన్నారు తెలుగువారు. వీరంతా తమ ప్రతిభతో ముందుకు వెళుతున్నారు. ప్రపంచ జాతులతో కలిసి భరతజాతి కీర్తిని ఇనుమడింపచేస్తున్నారు.
అమ్మని, అమ్మనుడిని, అమ్మనాడుని, ఎప్పుడూ మీరు ఎక్కడున్నాా ఏ దేశంలో ఉన్నా మరవకండి. జాతి నిండు గౌరవాన్ని నిలపండి. పిల్లలకి తెలుగు నేర్పించండి. భావితరాలకు తెలుగు సిరులు అందించండి. తెలుగువాళ్లు ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే తమ జీవితంలో ఒకసారైనా ఈ 'తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర ధీమ్ పార్క్ ని దర్శించుకోండి. మీ పిల్లలనీ ఇక్కడికి తీనుకురండి. దేశవిదేశాల్లో మనం సాధించిన ఘనకార్యాలను వాళ్లకు అర్థం అయ్యేలా చేయండి. తెలుగునుడి ఔన్నత్యాన్ని తెలియజేయండి. గతం కాదు నాస్తి... అది అనుభవాల ఆస్తి. ప్రతి జాతీ ఇటువంటి ఓ థీమ్ పార్కు ను రూపొందించుకొని భావితరాలకు తమ చరిత్రను కళ్లారా తెలిపే ప్రయత్నం చేయాలి. ఇతర రాష్త్రాలు కూడా ఇలాంటివి త్వరలో చేబడతాయని ఆశిస్తున్నాను.
ఏదో కల కదా అని విడిచిపెట్టకుండా సూర్యవర్మ తను చూసిన ప్రదేశాలన్నిటి గురించి పరిశోధన చేసి జాతికి గర్వకారణమైన థీమ్ పార్కును రూపొందించాడు. అతడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
జాతీయ గీతాలావనతో గంభీరంగా ఆ చరిత్రాత్మకసభ ముగిసింది. (పూర్తి అయింది)
ఈ రచన పుస్తకంగా త్వరలో వెలువడనుంది. కావలసిన వారు
“అమ్మనుడి” ప్రచురణకర్తను సంప్రదించగోరుతున్నాము.
అక్షరాన్ని నేను
పల్లవి:
అమ్మ పాడిన - పాటయ్యాను ఆయ్య నేర్చిన - మాటయ్యాను నీ భావానికి - భాషనయ్యాను నీ భవితకు - బాటయ్యాను అక్షరాన్ని నేను - తెలుగు అక్షరాన్ని నేను యాఖై ఆరక్షరాల - వెలుగు రేఖను నేను
చరణం:
1. పలకరించే - మనసయ్యాను కలవరించే - (ప్రేమయ్యాను కలుసుకునే - బంధమయ్యాను తెలుసుకునే - తెలివినయ్యాను అక్షరయాత్రలో ఆశను నేను ఆశయసాథనలో ఆకృతి నేను అందర్నీ కలిపే - స్నేహం నేను కలకాలం కదిలే - కాంతిని నేను స్వాతంత్రసమర - నినాదమయ్యాను సాయుధ పోరాట - బావుటనయ్యాను 'ప్రజాకళల గుండె చప్పుడయ్య్వాను బహుజన హితంగా భాసిల్లాను
. తూర్పున ఎగిసే - సూర్చుణ్ని నేను పడమర చూసే - చంద్రుణ్ని న్ అవినీతికి - సింహస్వప్నమలయ్యాను అన్యాయ్యాన్నెదిరించే ఆ ఆయుధాన్నయ్యాను
11 “అమ్మ పొడిన”
పదాలతో పల్లవించే - భాష్యం నేను పద్య, గద్య, స్వర - భాగ్యం నేను భాషాఖేదం లేని - ఘన చరితను నేను అవధుల్లేని - విశ్చ విఖ్యాతినీ నేను
ఏ దేశమేగినా - ఎందు కాలిడినా అందునిలిచే - నవభారతినీ నేను
తెలుగువారి - జానపదాన్ని నేను జగమెరిగిన - జన తథాన్ని నేను “దేశభాషలందు” - లెస్సనయ్యాను మా తెలుగుతల్లికి - మెల్లెపూదండనయ్యాను 11 “అమ్మ పాడిన”
-బి. గోవర్థన రావు 9441968930
“క బిద్ధ మాత్చభావలో ఒక నంవత్సరంలో నేర్చుకునే విద్యను వరాయి భాషలో నేర్చుకోవడానికి నాలుగేళ్ళు పడుతుంది” -విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్