Jump to content

అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/కొత్తమాటల పుట్టింపు

వికీసోర్స్ నుండి

కొత్తమాట

స.వెం.రమేశ్

కొత్తమాటల పుట్టింపు

అందరికీ చేమోడుపులు. ఒక నుడిని బాగా ఎదిగిన నుడి అని చెప్పడానికి ఆనవాలు ఏమిటి అంటే, పెరనుడి నుండి వచ్చిన ఏ మాటకైనా తన కుదురులతోనే కొత్తమాట పుట్టింపుకు వీలు కలిగించగలగడం. అటువంటి నుడులు, అంటే బాగా ఎదిగిన నుడులు, వేళ్లమీద లెక్క్మించగలిగినన్నే ఉన్నాయి. మన బారతనాడులో వేలేండ్ల కిందటనే పాళీ, సంసుక్రుతం ఎదిగిన నుడులు అయినాయి. ఇటీవల తమిళం కూడా ఈ మట్టుకు చేరుకొనింది.

ఇట్ల తన కుదురులతోనే మాటలపుట్టింపుకు వీలుకలిగించే చేవ తెలుగుకు ఉందా అంటే లేదు లేనేలేదు అంటున్నారు తెలుగు తెలివరు(మేదావు)లు. ఉంది అనేది నా అందింత(ప్రతిపాదన). తెలుగులో ఇదివరకు ఎన్నడూ కొత్తమాటలు రాలేదా, ఎవ్వరూ కొత్త మాటల్ని తేలేదా అంటే ఆ పని జరిగిందనే చెప్పాలి. ఎట్లా జరిగింది? అయిదు తీరులుగా జరిగింది.

1. ఉన్నదున్నట్లుగా పెరనుడి మాటలను తెచ్చుకొని వాడడం. స్వేచ్చ, చరిత్ర, బస్‌, కార్‌ వంటివి.

2. పెరనుడి మాటలకు 'డు, ము, వు, లు చేర్చి వాడడం. అద్యక్షుడు, వికలాంగుడు, శౌచాలయం, ముద్రణాలయం వంటివి.

3. పెరనుడి మాటలను తెలుగు చప్పుడుకు వీలుగా మార్చుకొని వాడడం. సంద్రం, కబురు, ఆసుపత్రి, బస్సు, కారు వంటివి.

4 “అచ్చతెలుగు పేరుతో చేంతాడంత మాటల్ని పుట్టించడం. అంచయేనుగుమావంతు, చదువుల ముదుకడు, గడుసుకైదువ జోడు, మినుకుటూర్పులవాడు, ఏనుగుతోలుదాల్సు, కప్పుగుత్తుకవాడు వంటివి. పై నాలుగు తెరగులూ చదువునేర్చినవారూ తెలివరులూ నుడివరు(బాషావేత్త)లూ చేసిన చేస్తున్న పని. మొదటి రెండుతీరులూ అయితే నన్నయనుండి లేదా ఇంకా ముందునుండి, ఇప్పటి “ఈనాడు” వరకూ సాగుతూ వస్తున్నాయి.

5. చదువుతో పొంతులేనివారు, పల్లెటూరి పాటరు (శ్రామికు)లు, అడుగుబడుకు బతుకులు పుట్టించే మాటలు. రామములక(టొమేటో), గబ్బుచమురు (కిరోసిన్‌) వానగూడ(రెయిన్‌ కోట్‌), పొద్దుమాను(గడియార స్తంబం), రెక్కమాను(రైల్వేసిగ్నల్‌ పోల్‌) చిచ్చుగోలు(గ్యాస్టవ్‌ లైటర్‌), చలిచట్ట(స్పెట్టర్‌) వంటివి. పైవాటికంటే ఈ తీరు మాటలే గొప్పవి. ఇవే అప్పటపు తెలుగుమాటలు. తెలివరుల కంటే పాటరులే మేలు అనిపిస్తుంది కదా. అయితే తమ కంటిముందుకు వచ్చిన కొత్త ఉరువులకు పేర్లు పెట్టగలరు కానీ ఆనిమి(సాంకేతిక) మాటలను పుట్టించలేరు, ఎసిది(శాస్త్ర) నెన్నొడి (పరిభాష)ని పొందించలేరు పాటరులు.

'అనిమిమాట ' అనడానికి దానికి రెండు అలుడు(లక్షణా)లు ఉండాలని నుడివరులు చెపుతుంటారు. 1) విడమరచి చెప్పినట్లుగా కాకుందా చిట్టిపొట్టి మాటగా ఉండాలి 2) తననుండి మరికాన్ని మాటల పుట్టుకకు తావునిన్వాలి. ఈ రెండు అలుడులు తెలుగుకు లేవు, కాబట్టీ తెలుగులో అనిమి మాటలను పొందించలేము అంటారు నుడివరులు. ఇదె పెద్ద తప్పుడుమాట. అక్కరలేమితో పట్టనితనమన్నా అయుండాలి, వెతకలేక సోమరితనమన్నా అయుండాలి, తెలుగును తొక్కేయాలనే కుట్రతలపన్నా అయుండాలి, అంతేకాని ఇది వాళ్ల తెలివితక్కువతనం మట్టుకు కానేకాదు.

తెలుగులో కుదురులూ చేర్పులూ కలసిన మాటలు చాలా చాలా ఉన్నాయి. కుదురుల నుండి చేర్చులను విడదీయాలి. ఎటువంటి కుదురుకు ఎటువంటి చేర్చు కలిస్తే కొత్తమాట వుడుతున్నదో చూడాలి. అ తీరులో కొత్తమాటలను పుట్టించాలి. కొన్ని పనిపలుకు (క్రియావాచకాా)లకు చేర్పులను చేర్చితే పేరుపలుకులు(నామవాచకాలు) పుడుతాయి : కోరు +ఇక=కోరిక. కొన్ని పేరుపలుకులకు చేర్పులను చేర్చితే కొత్త పేరుపలుకులు పుడుతాయి : ఎరుక+ఉవ =ఎరుకువ. కొన్ని పేరుపలుకులకు చేర్పులను చేర్చితే కొత్త పనిపలుకులు పుడుతాయి : పుష్పాడి(pollen) +ఇల్లు = పుప్పాడిల్లు(pollenise) పుష్పాడి+ఇంచు= పుప్పాడించు(pollinate). ఈ పుప్పొడించు అనే పనిపలుకును మరలా పేరుపలుకుగా మార్చవచ్చు. : పుష్పొడించు = పుష్పాడింత(pollination).

తెలుగులో మునుచేర్చులను వెనుచేర్చులను వెతకడం మొదలిడితే ఇప్పటికే నాకు నూటికి పైగా కనబడినాయి. నేను నుడివరిని కాను, నుదెసిదిని(బాషాశాస్త్రాన్ని చదవలేదు. నుడివరులు నడుము కట్టుకొని వెతికితే ఇంకా ఎన్నో దొరుకుతాయి.

నాది లేదా మనది అనే చెడ్డనుగు(దురబిమానం)తో చెప్పడం లేదు. నేనెరిగిన నాలుగయిదు నుడులలో ఎంతో చేవ కలిగినది తెలుగు. తెలుగులో ఎసిదానిమి(శాస్త్రసాంకేతిక) మాటలను పుట్టించడం చాలా తేలిక. అవి కూడా చిట్టి పొట్టి గా అలతి అలతిగా పలకడానికి తేలికగా ఉంటాయి. పెరమాటలతో కాకుండా తెలుగుమాటలతో పిల్లలకు చదువులు చెపితే పిల్లలూ ఎదుగుతారు తెలుగూ ఎదుగుతుంది. 'డు, ము, వు, లు, నిను, కి, కు, వల్ల, నుండి, ఇంచు/ఇంచి, కోసం, తో, కంటే, చేసి....” ఇటువంటి కూర్ప్చులనూ చేర్చులనూ మట్టుకే మిగిలించి, మిగిలినదంతా పెరమాటలతో నింపేసి, తెలుగు ఇక్కునం(మాద్యమం)లో చదువులు సాగాలని చాటడం సరికాదు. మన్నించండి, ఎవరినీ నొప్పించాలని ఈమాటను అనలేదు, తెలివరులూ నుడివరులూ ఇకనైనా తెలుగును తలకెత్తుకొంటారనే ఆబతో అన్నాను.

ఈ నోయి(గ్రందం)ని రాయాలనే కోరిక పదేళ్లనాటిది. చేర్చుల కోసం నా వెతుకులాట అప్పుడే మొదలయింది. నాలుగేళ్ల కిందటే నలబై పొరట(పేజీీ)లను రాసి, వేరే పనుల ఒత్తిడితో పక్మన పడేసినాను. మరలా ఇన్నేళ్లకు దుమ్ముదులిపినాను.

తెలుగు ఎంతో చేవకలిగిన నుడి. చేతనయిన నుడి. ఇంత గొప్ప నుడి ఒడమి(సంపద)ని పాతర వేసి పెట్టేసి, పొరుగిళ్ల దగ్గర అడుక్కొని తింటున్నాం. ఇకనైనా మన కలిమిని వెలికితీద్దాం.


“కాపటేళ లేసింది కాపుగువ్వ
కానలోకి పోయింది కాపుగువ్వ
కడుపు బరువు దించింది కాపుగువ్వ
కాళ్లు కడుక్కోనొచ్చింది కాపుగువ్వ
కుంపట్లో బొగ్గునెత్తి కాపుగువ్వ, పల్‌
కసబిసా తోమింది కాపుగువ్వ
కాడిమడక కట్టుకొని కాపుగువ్వ
కాన దున్నేకి కదిలింది కాపుగువ్వ 7”

మా పక్కింట్లో ఒక ముసలవ్వ ఉంది. కాపటేళకే (వేకువనే) లేచేస్తుంది. వక్కరోట్లో వక్కాకును పెట్టి టక్కుటిక్కుమని దంచతా పైపాటను అందుకొంటుంది. ఇక మనం కునకాలన్నా కునకలేము. ఏదో నాలుగు నుడుగులు అయితే పోనీలే అనుకోవచ్చు. కాపటేళ నుండి మాపటేళ వరకూ కాపుగువ్వ చేసే పనులన్నీ ఉంటాయి ఆ పాటలో. నారుచల్లడం నుండి పైరుకోత వరకూ వరిపంట కాపుదన మంతా ఉంటుంది అందులో. చేయగలిగింది ఏమీ లేదు మేలుకొని లేవడం తప్ప.

లేచి పడకను చుట్టిపెట్టి, నీళ్లర(బాత్‌రూం)లోకి వెళ్లినాను. మరుగుదొడ్డి మునకతొట్టీ(బాత్‌ టబ్‌) ఒకే అరలో ఉంటాయి మాయింట. కడుపుబరువునీ దించినాను. చేగడుగు(హేండ్ వాష్‌)తో చేతుల్ని రుద్దినాను. పలుదుం(టూత్‌ బ్రష్‌) మీద పడడు(పేస్ట్‌)ను వేసుకొనీ పళ్లు తోముకొన్నాను. మూతిముక్కూ కడుక్కొన్నాను. తుండడ(టవల్‌)తొ తుడుచుకొన్నాను. కాసేపు పసలిక(వ్యాయామం) చేసినాను. మరికాసేపు సోదాకిక(వార్తాపత్రిక)ను తిరగేసినాను. ఆకలివేస్తుంటే నలిదిండి(టిఫిన్‌) చేసుకొందామనీ లేచినాను. కొద్దిగా నూక ఉంటే, ఉప్పిండి చేసుకొని తినినాను. కానీరు(కాఫీ) కాచుకొని తాగినాను. ఇవ్వేళ రాతపనేమీ లేదు. తోటపని కూదా లేదు. తోచక చిన్నయ్యవాళ్ల ఇంటితట్టుకు అడుగులు వేసినాను.

నన్ను చూనిన చిన్నయ్య, “రా అన్నయ్యా రా, నీకోసమే ఎదురుచూస్తున్నాం” అనీ రాకేర్చి(స్వాగతించి)నాడు నన్ను

అప్పటికే అక్కడ నారాయణ, సెందిల్‌ కూడా కూర్చుని వున్నారు. ఏదో పెనగువ(వర్చ) గట్టిగా జరుగుతున్నట్లుంది వాళ్ల నధుమ.

“ఉసురువం(ప్రపంచం)లో ఏమూలనుండి కొంగొత్త ఆనిమిమాట(సాంకేతికపదం) వెలువడినా, దానికి ఈదైనమాటను అన్నినుడులలోనూ పుట్టించలేము. ఉసురువంలోని ఏడువేల పైచిలుకు నుడులలో కొంగొత్త అనిమిమాటల పొందికకు అనువుఅయినవి సంసుక్రుతం, గ్రీకు, లాటిన్‌ వంటివి అయిదారుమట్టుకే ఉన్నాయి. ద్రావిదనుడులకు ఆ చేవ లేనేలేదు” అన్నాడు నారాయణ.

“ద్రావిడనుడులు అని అన్నిటినీ ఒకే గాటన కట్టద్దు. ఆనిమిమాటల పుట్టింపుకు మా తమిళ్‌ చాలా అనువయినది. మీకు తెలియదేమో, మేము మరెసిది(ఇంజినీరింగ్‌), విరుగెసిది(మెడిసన్‌ )కి చెందిన ఆనిమిమాటలను అన్నిటినీ తమిళ్‌లో పుట్టించుకాన్నాం” అంటూ తగులుకొన్నాదు సెందిల్‌.

“నారాయణా, తెలుగంటే నీకు చిన్నచూపు. సంసుక్రుతం మట్టుకే గొప్పనుడి అనీ నీ అనిపింపు. అందుకనే ఇట్ల మాట్లాడుతున్నావు” అన్నాడు చిన్నయ్య.

“ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకు? నేను చెప్పింది నిక్కం. ఆనిమిమాటల్ని పుట్టించడంలో సంసుక్రుతానికి ఉన్న చేవలో ఒక్మవంతు కూడా తెలుగుకు లేదు” కుండబద్దలు కొట్టినట్లు అన్నాడు నారాయణ.

ఇక నేను కలిపించుకోక తప్పలేదు. “నువ్వు చెపుతున్నది తప్పు నారాయణా. నంనుక్రుతం ఒకప్పుడు మన బారతనాడులో పెన(అనుసందాన)నుడిగా ఉండేది. కాబట్టి రెండువేలేళ్ల నుండి వెయ్యేళ్ల కిందటివరకూ సంసుక్రుతంలోనే ఎసుదు(శాస్త్రా)లన్నీ వెలువడినాయి. ఆ తరిలోనే, ఆనిమిమాటలూ, వాటి పొందికకు కావలసిన పలు నుడిగంటు(నిగంటువు)లూ సంసుక్రుతంలో ఏర్పాటు అయినాయి. తెలుగులో ఆ పనిని ఇంతవరకూ మొదలు పెట్టలేదు. మొదలిడి చేసితే సంసుక్రుతం కంటే చిన్నమాటలతో తెలుగులో నెన్నాడి పుడుతుంది” అన్నాను.

“నువ్వు చెప్పేది నిక్కం అయితే, ఏదయినా ఒకమాటను పుట్టించి చూపించు. వెర్టిబ్రేట్‌ అనే ఇంగ్లీసు ఆనిమిమాటను, సంసుక్రుతం అనుగా తెలుగులో సకశేరుకం అనవచ్చు. దానికి ఎదురుమూట అకశేరుకం. వీటిని తెలుగుకుదురులతో ఎట్ల చెప్పగలం. వెన్నెముక తలవీ, వెన్నెముక లేనివీ అనీ విడమరవుగా చెప్పగలం కానీ ఆనిమిమాటలుగా చెప్పగలమా?” డీకొాంటూ అడిగినాడు నారాయణ.

“బాగా చెప్పగలం. చెప్పాలన్న కోరిక కలగాలి ముందు. తెలుగులో ఒక విడిత(ప్రత్యేకత) ఉంది. కొన్ని మాటలకు ఉమ్మడిగా ఒక్కొక్క చేర్పు కనబడుతుంటుంది. ఇట్లాంటి ఒక చేర్పు “ఏలు! ఇది విడిగా నుడిగంటులలో కనబడదు. ఇదివరకు చెప్పినట్లు, తెలుగులో ఇటువంటి పనులను మనం ఇంకా మొదలిడలేదు కాబట్టి, నిండైన నుడిగంటులు వెలువడలేదు. కుందేలు, తాబేలు, తోడేలు, పొట్టేలు, గొడ్డేలు, ఆడేలు అనే పేరులలో ఉమ్మడిగా “ఏలు” ఉంది. ఏలు అంటే 'జీవి అనే తెల్లం(అర్తం) తెలుస్తున్నది కదా. ఈ ఏలును చేర్చుగా చేసి కొత్త ఆనిమిమాటలను పుట్టించవచ్చు. నువ్వు అడిగింది అకశేరుకం, సకశేరుకం అనే రెండు మాటలకే. అకశేరుకాల్లోని తొమ్మిది వగలకు పేర్షను పెట్టలేక ఊరుకొన్నారు మీ సంసుక్రుతంవాళ్లు. అవి గ్రీకు, లాటిను మాటలుగా అట్లాగే ఉన్నాయి తెలుగు పొత్తాలలో. అన్నిటికీ తెలుగుపేర్లను పుట్టిద్దాం ఇప్పుడు” అంటూ మొదలు పెట్టినాను......

1. వెన్ను+ఇడి+ఏలు= వెన్నీడేలు అకశేరుకము వెన్ను అనేది కుదురుమమాట. ఆ మాటకు రెండు చేర్పులు చేరినాయి. “ఇడి” అనే చేర్పుకు 'లేని అని తెల్లము. “పామిడి తురగపుపాదములో అన్నమయ్య పామిడిని వాడినాడు. పాము + ఇడి, అంటే 'పాములు లేకుండా” అని. వెన్నిడేలు అంటే వెన్నులేని ఏలు అనీ.

2. తొలి+ఏలు = తొలేలు ప్రోటోజోవా ప్రోటో అంటే తొలి లేదా మొట్టమొదటి.

3. తూటు+ఏలు = తూటేలు పోరిఫెరా తూట్లుతూట్లుగా ఉండేది.

4. చదును+ఏలు = చదునేలు ప్లాటి హెల్మెంతిస్‌ చదునుగా ఉందేది.

5. పేలిక+ఏలు = పేలికేలు నిమాటి హెల్మెంతిస్‌ పేలికలాగా సన్నగా పొడవుగా ఉండేది.

6. బొజ్జ+ఏలు = బొజ్జేలు సీలెంటిరేటా బొజ్జను కలిగి ఉండేది.

7. చుట్టు+ఏలు = చుట్టేలు అనిలెడా తాకితే చుట్టచుట్టుకొనేది.

8. కీలు+ఏలు = కీలేలు ఆర్షోపొడా కీళ్లను కలిగి ఉండేది.

9. జిగట+ఏలు = జిగటేలు మొలస్కా తాకితే జిగటగా ఉండేది.

10. గరుకు+ఏలు = గరుకేలు ఇకైనొడెర్మేటా తాకితే గరుకుగా ఉండేది.

11. వెన్ను+ఏలు = వెన్నేలు సకశేరుకము వెన్ను కలిగినది.

12. నీరు+ఏలు = నీరేలు జలచరము నీటిలోనే ఉండేది.

18. ఇరు+ఏలు = ఇరేలు ఉబయచరము నీటిలోనూ నేలమీదా ఇరుతావులా ఉండేది.

14. పాకు+ఏలు = పాకేలు సరీసృపము నేలమీద పాకేది.

15. తుర్రు+ఏలు = తుర్రేలు పక్షి తుర్రు అంటే మిన్నులో ఎగరడం. తెన్నాటి తెలుగువారిలో తుర్రు అనేమాట వాడుకలో ఉంది. పక్షిని తురవ అంటారు. పొద్దుతుర్రే (పైకెగిరే) దిక్కును తెలుగులో తూరుపు అంటాము.

16. రొమ్ము+ఏలు = రొమ్మేలు క్షీరదము రొమ్ములు కలిగినది.

17. మెడ+ఏలు = మెడేలు జిరాఫీ మెడ పొడవుగా ఉండేది.

18. కత్తి + ఏలు = కత్తేలు కడ్గమృగం

19. జడ+ఏలు = జడేలు యాక్‌ ఒళ్లంతా జడలు ఉండేది.

20. గెంతు+ఏలు = గెంతేలు కంగారూ

“మచ్చుకు కౌన్నిమాటలే ఇవి. వేలమాటలను ఈ '“ఏలు'తో పొందించవచ్చు. నారాయణా నువ్వు గొప్ప తెలివరివి. నీ తెలివిని పెరనుడి కోసం కాకుండా అమ్మనుడి కోసం వాడు. పెరనుడి తగులా(వ్వామోహా)న్ని వదిలించికో” అంటూ ముగించినాను.

“ఇప్పుడిక ఇంటికెళ్లి ఏం వండుకొని తింటావులే అన్నయ్యా. ఇవ్వేళ మాయింట్లో నీరేలుకూర. ఇక్కడే తినేసి వెళ్లు” అన్నాడు చిన్నయ్య. నీరేలుకూర అనే మాటను విని అందరమూ హాయిగా నవ్వుకాన్నాం.

2

“అన్నయ్యా, మొన్న నువ్వు 'ఏలుతో కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది నారాయణకు. ఇక మన జోలికి రాడు” అంటూ వచ్చినాడు చిన్నయ్య.

నాకు ఒళ్లు మండింది. “చిన్నయ్యా నువ్వు మాట్లాడుతున్నది తప్పు నారాయణ కూడా మనలో ఒకడు. అతని అనిపింపును అతను చెప్పినాడు. అది సరికాదు అని దిద్దినాం మనం. ఇట్ల అందరినీ వద్దనుకొంటూ ఎడం చేసుకొంటూ పోతే చివరకు మనం ఇద్దరమే మిగులుతాం. నిక్కానికి నారాయణ నీకన్నా నాకన్నా తెలివయినవాడు. నుడెసిది(బాషాశాస్త్రం)ని చదివినవాడు. సంసుక్రుతం కూడా మనిసి నోటినుండి పుట్టిన నుడే అని మరచి, అదొక వేలుపునుడి అనే తలపుతో దానిమీద పేరనుగు(తీవ అబిమానం)ను ఏర్పరచుకొన్నాడు. ఆ

తలపును అతనినుండి తొలగించి తెలుగుదారిని పట్టించాలి కానీ ఇట్ల ఏవగించుకోకూడదు. వెళ్లు, వెళ్లి నారాయణను పిలుచుకొని రా” | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021 | అన్నాను.

కాసేపటికి చిన్నయ్యా నారాయణా కలిసి వచ్చినారు. నారాయణ మూతిని నల్లగా పెట్టుకొని ఉన్నాడు. నేనే పలకరించినాను.

“నారాయణా, ఎందుకట్లా ఉన్నావు? మొన్న మనం పోట్లాడుకోలేదు, మాట్లాడుకొన్నాం అంతే నీకు పెరనుడి మీదున్న అక్మరను అమ్మనుడి మీదకు మరల్చాలని అనుకొంటున్నవాళ్లమే కాని నీకు ఎదిరివాళ్లం కాము. మామీద కనలు(కొపం) పడవద్దు” అన్నాను అనుగుగా. ఆ మాటతో నారాయణ మూతి విప్పారింది.

“అన్నయ్యా, “ఏడు” అనే చేర్చు ఒకటుందని ఆనడుమ ఒకసారి అన్నావు. ఏడు అనేది ఒక అంకె కదా!” అన్నాడు చిన్నయ్య.

“ఏడు అంటే అంకె మట్టుకే కాదు, ఏడాది కూడా. అంతేకాదు చేర్చుగా కూడా ఈ ఏడు కనబడుతుంది. వెతికే ఓపికలేక పట్టించుకోవడం లేదు మనం” చెప్పినాను.

“అయితే ఆ చేర్చును గురించి విడమరచి చెప్పవా” అడిగినాడు చిన్నయ్య..

“తెలుగులో విడి ఎసలు(గుణం) ఒకటుంది. ఉసురులు అయినా ఉరువులు అయినా, ఒకే కూటువకు చెందిన కొన్నిటికి, ఉమ్మడి కడసడులు ఉంటాయి. వాటినీ మనం చేర్చులుగా వాడుకోవచ్చు. కుందేలు, తాబేలు, తోడేలు, పొట్టేలులలోని “ఏలుతో ఇదివరకు “ఏలెసిది(జంతుశాస్త్రం) ఆనిమి మాటలను పుట్టించినాం కదా. ఇటువంటిదే “ఏడు” కూడా. నేరేడు, మారేడు, తంగేడు, జిల్లేడు, బొంజేడు, ఈడేడు, నాగేడు, కోయేడు వంటి చెట్ల పేర్లలో కడసడిగా ఏడు ఉంది చూడండి. దీనిని వాడి కొత్త మాటలను పుట్టించవచ్చు” అంటూ విడమరచి చెప్పినాను.

“ఏదీ నాలుగయిదు మాటలను పుట్టించి చూపించు అన్నయ్యా” అన్నాడు చిన్నయ్య. .

“నేను మలేసియాకు వెళ్లినపుడు, అక్కడి తెలుగువాళ్లు నాకొక పండును చూపించినారు. దాని పేరు దూరియాన్‌. మన పనసపండును పోలి, దానికంటే చిన్నదిగా ఉంది. ఒళ్లంతా పెద్ద పెద్దవి కూచిగా ముళ్లు ఉన్నాయి. ఆ పండు తలమీద పడితే, ముళ్లు దిగబడి చనిపోతారట. డూరియాన్‌ అంటే 'మలే” నుడిలో ముళ్లుకలిగిన పండు

అని తెల్లమట. ఆ చెట్టును కూడా దూరియాన్‌ చెట్టు అనే అంటారు. ఆ పండుకు తెలుగుపేరును పెట్టుమనీ నన్ను కోరినారు వాళ్లు. నేను 'ముళ్లేడు” అని చెప్పినాను. అట్లాగే డ్రాగన్పండు అని మనకు దొరుకుతున్నది కదా, అది మన జెముడుపండు వంటిదే. దానికి జెముదేడు అని పెట్టుకోవచ్చు. వెన్నవంటి గుజ్జు కలిగిన పండు కాబట్టి అవకాడడొను వెన్నేడు అనవచ్చు. కలివిపందును పోలీన జెర్రీలను కలివేడు అనవచ్చు” అని మారాడినాను.

“నువ్వు చెప్పినదానిని ఒప్పుకొంటాను. అయినా ఇది కొత్తదేమీ కాదు. మన పెద్దవాళ్లు కూడా, రామములక, రామగుమ్మడి, సీమచింత, మొగలిపనస, సీమరేగు వంటి కొత్తపేర్లను చెట్లకు పెట్టుకొన్నవాళ్లే కదా” అన్నాడు చిన్నయ్య.

“అవును, నువ్వు చెప్పినవే కాదు, తక్కోలం, తక్కాళి(టొమేటో), బూదిపుచ్చ(బూదిదగుమ్మడి), పరంగిపుచ్చ(తియ్యగుమ్మడి,, సీమపొగడ(సపోటా), చీనీనిమ్మ(బత్తాయి), గడ్దిచేమంతి, లంజిగొంజి(లంటానా), తురకవేప, గబ్బుతులసి, ఒయ్యారిబామ (పార్తీనియం).... వంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఏబై అరవై ఏళ్ల లోపు తెలుగువాళ్లలో ఈ అలవాటు అణగారిపోయింది. అన్నిచోట్లా ఉన్న ఇటువంటి మాటలను కూడా పోగేసుకోవాలి మనం. మలేసియా తెలుగువాళ్లలో బుట్టకూర (కేబేజీ), పూబుట్టకూర (కేలీష్లవర్‌) అనే మాటలున్నాయి. వాళ్లు పుట్టించుకాన్న మాటలివి. అయితే ఇవేవీ ఆనిమిమాటలుగా ఒదగవు కాబట్టి ఎసిదివి(శాస్రీయం)గా ఆనిమిమాటల పుట్టింపుకోసం “ఏడును తీసుకొన్నాను" చెప్పినాను.

“సరిగ్గా దీనినే అడగాలనుకాంటున్నాను. ఆ పండుకీ ఈ కాయకీ మాటలను పుట్టించడం కాదు ఒక ఎసిదికి చెందిన ఆనిమిమాటలను పుట్టించగలగాలి. అందుకు ఈ “ఏడు” ఒదుగుతుందా?” అంటూ డీకొన్నాడు నారాయణ.

“పూనుకొంటే పుట్టించగలం. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పూనుకొందాం. ఏడెసిది(బోటనీ)కి చెందిన ఆనిమిమాటల గీకు, లాటిను కుదురులను తడుముదాం. ఆ కుదురులకు తెలుగు కుదురులను వెతుకుదాం. తెలుగుకుదుర్లకు 'ఏడు 'ను చేర్చుదాం. సరేనా నారాయణా” అంటూ మొదలిడినాను.

1. పూత+ఏడు = పూతేడు MAGNOLIOPHYTA పువ్వులు పూచేది.

2. పూత+ఆమి+ఏడు = పూతమేడు CRYPTOGAM పువ్వులు పూయనిది. “అమి” అనే తెలుగు చేర్పుకు 1698 అనీ తెల్లము.

3. నీరు+ఏడు = నీరేడు HYDROPHYTE నీటిలో ఉండేది.

4. తేలు+ఏడు = తేలేడు FLOATING PLANT నీటిలో తేలేది.

5. మునుగు+ఏడు = మునుగేడు SUBMERGED PLANT నీటిలోపల ఉండేది.

6. వరపు+ఏవడు = వరపేడు XEROPHYTE వరపు అంటే 4౧4 ఎడారిమొక్కలు.

7. ఇరు+ఏడు = ఇరేడు AMPHIPHYTE నేలనా నీటిలోనూ ఉండేది.

8 తీగ+ఏడు = తీగేడు CLIMBING PLANT

9. నేల+ఏడు = నేలేడు EMBRYOPHYTA| నేలమీద బతికేది.

10. పాచి+ఏడు = పాచేడు BRYOPHYTE

11. కాడ+ఏడు = కాడేడు HORNEOPHYTOPSIDA ఆకులు లేకుండా కాడలు మట్టుకే ఉండేది. 12. నలి+ఏడు = నల్లేడు MARCHANTIOPHYTA ఇది ఒక ఎసిదరి పేరుతో పొందించిన ఇంగ్లీసు పేరు. నల్లేరులాగా పలకలకాడ కలిగినది. అందుకే నల్లేడు అన్నాం. పలకేడు అని కూడా అనవచ్చు.

13. తూడు+ఏడు = తూడేడు TRACHEOPHYTE తూడు కలిగినది.

14. బిత్తలి+ఏడు = బిత్తలేడు RHYNIOPHYTA ఆకులు లేకుండా బిత్తలి(నగ్నము)గా ఉండేది.

15. డాబు+ ఏడు = డాబేడు ZOSTEROPHYLLOPHYTA డాబు అంటే girds డాబు వంటి ఆకులు గలది.

16. నక్క+అడుగు +ఏడు =నక్కడుగేడు LYCOPODIOPHYTA తోడేలు అడుగువంటి ఆకులు కలది అని తెల్లము. పొందించడానికి చిన్నదిగా ఉంటుందని తోడేలును నక్కను చేసినాం. తోడేలడుగేడు అని కూడా అనవచ్చు.

17. మూ+పాయ+ఏడు = ముప్పాయేడు TRIMEROPHYTOPHYTA మూడు పాయలుగా చీలిన ఆకులుకలది.

18. ఆకు+ఏడు = ఆకేడు PTERIDOPHYTA కాండం, కొమ్మలు లేకుందా ఆకులు మట్టుకే ఉండేది.

19. విత్తు+ఏడు = విత్తేడు SPERATOPHYTE విత్తులు కలిగి ఉండేది.

20. విత్తు+ఆకు+ఏడు = విత్తాకేడు PTERIDOSPERMATOPHYTA ఆకేడులోనే విత్తులు కలిగినది.

21. మొగలి+ఏడు = మొగలేడు PINOPHYTA మొగలి వంటిది.

22. ఈత+ఏడు = ఈతేడు CYCADOPHYTA ఈత వంటిది.

23. వెలివిత్తు+ఏడు = వెలివిత్తేడు GYMNOSPERMAE వివృతబీజ వృక్షం.

24. లోవిత్తు+ఏడు = లోవిత్తేడు ANGIOSPERMAE ఆవృతబీజ వృక్షం.

25. ఒకబద్ద+ఏడు = ఒకబద్దేడు MONOCOTYLEDON PLANT ఏకదళ బీజపు మొక్క

26. కవబద్ద+ఏడు = కవబద్దేడు DECOTYLEDON PLANT ద్విదళ బీపు మొక్క

27. బూజు+ఏడు = బూజేడు FUNGI శిలీంద్రం.

28. నాచు+ఏడు = నాచేడు ALGAE శైవలం.

“అంతా బాగుంది కానీ, ఇన్ని ఇంగ్లీసు మాటలకు తెలుగుమాటలను ఫొందింఛినామే, సంసుక్రుతము నుండి వచ్చినవాటికి తెలుగుపేర్లను పొందించగలమా? మచ్చుకు, ద్రాక్షకు తెలుగుపేరును చెప్పు చూద్దాం” అంటూ తగులుకొన్నాడు చిన్నయ్య.

“తప్పక చెప్పగలను కానీ ఆ సంసుక్రుతములోకి పోయిన తెలుగుమాటలెన్నో ఉన్నాయి. కసరు చవి కాకరకాయను కూడా సంసుక్రుతము నుండి దిగుమతిగా చెప్పుకొనే మనవాళ్లకు తెలుగు కుదుర్లను వెతికే కోరిక ఎక్కడిది చెప్పు. ద్రాక్ష అంటే దప్పిని తీర్చేది కాబట్టి దప్పేడు అని పెట్టుకోవాలి” అని ముగించినాను. (తరునాయి వచ్చే సంచికలో..)

తప్పక చదవవలసిన 4 పుస్తకాలు ప్రముఖ రచయిత, కవి, నాటకకర్త, హేతువాది డా॥ మలయశ్రీ, రచనలు తొలి తెలుగు చక్రవర్హులు 1,2 భాగాలు:

కాకతీయులే మన తెలుగు సమస్తాంధ్రసామ్రాట్టులు. తొలి దశలో తొమ్మిది పది దశాబ్దాలలో కాకతీయులు చాళుక్య రాష్టకూటులకు దండనాథులుగా, మలిదశ - 11వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్యులకు సామంతులు. 1158 నుంచి 1323 వరకు వీరు స్వతంత్ర చక్రవర్తులు. కాకతి చక్రవర్తులలో ప్రముఖులు నలుగురు. వీరి చరిత్రలు - జనజీవితాలను చిత్రిస్తూ డా॥ మలయశ్రీ నాలుగు చారిత్రక నాటకాలను రచించారు. ఒకటవ భాగంలో శ్రీ కాకతీయరుద్రదేవచక్రవర్తి(1158-1195), శ్రీ కాకతి గణమతిదేవ చక్రవర్తి(1199- 1262), రెండవ భాగంలో మహారాణి కాకతిరుద్రమదేవి(1262-1289) శ్రీ కాకతి రెండవప్రతాపరుద్ర చక్రవర్తి (1290-1328) మొదటిభాగం రు. 100లు, రెండవభాగం రు. 100లు. పరిష్కారం, మరి 15 కథలు - రు.100లు రచయిత : డా॥ మలయశ్రీ నిజమైన వేమన పద్యాలు - రు.100లుఎంపిక- కూర్చు-భావాలు : డా॥ మలయశ్రీ

పుస్తకాలకోసం డా|| మలయశ్రీ 1-113/7, ఆధిత్యభవన్‌, వేమననగర్‌, రేకుర్తి కరీంనగర్‌-505 451(తెలంగాణ) ఫోన్‌: 98665 46220