అమ్మనుడి/సంపుటి 5/ఫిబ్రవరి 2020/ఓరుగల్లు యోధులు ముసునూరి నాయకులు

వికీసోర్స్ నుండి

చరిత్ర

యడ్లపల్లి అమర్‌నాథ్‌

9398245804

ఓరుగల్లు యోధులు ముసునూరి నాయకులు.


క్రీస్తు శకం 1149 నుండి క్రీస్తు శకం 1369 వరకు రెండు వందల సంవత్సరాలకు పైగా తెలుగువారి ప్రధాన రాజధాని అయిన ఓరుగల్లు కోటలో నివసించి, ఓరుగల్లు ప్రభువులైన కాకతీయుల రాజులకు యుద్ధాల్లో విజయాలను అందించిన వీరవంశం ముసునూరి నాయక వంశం. దోసపాళ్ళ గోత్రం ప్రధానంగా గల ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లు ప్రభువుల వద్ద మంత్రులుగా, సేనాధిపతులుగా, కటక పాలకులుగా, అంగరక్షకులుగా, దళపతులుగా మరియు కోట పరిరక్షకులుగా వివిధ హోదాల్లో పని చేసినట్టు చరిత్ర తెలుపుతోంది. ముసునూరి ప్రోలయ నాయకుడు తాను వేయించిన విలస శాసనంలో కాకతీయ ప్రతాప రుద్రునికి మరియు ధిల్లీ సుల్తానులకు మధ్య జరిగిన 8 యుద్ధాల్లో 7 సార్లు విజయాన్ని అందించినట్టు చెప్పుకున్నాడు.

కాకతీయ ప్రతాపరుద్రుని సైన్యాధ్యక్షుడు ముసునూరి ప్రోలయ నాయకుడు. ప్రోలయ సైనిక దళంలో అతని విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహావీరులు సూర్యదేవర నాయకులు. ప్రోలయకు ముఖ్య అనుచరులుగా ఉంటూ తమ నైపుణ్యంతో ఎంతో కీర్తిని సంపాదించిన యోధులు సూర్యదేవర నాయకులు. ఢిల్లీ సుల్తానుల ధాటికి కాకతీయ రాజ్యం క్రీస్తు శకం 1323లో కూలిపోయింది. తెలుగు ప్రాంతం అంతా ఢిల్లీ పాలకులైన తుగ్లక్‌ వంశం హస్తగతం అయింది. అయితే ఆనాటి తెలుగు పాలకులు వేయించిన శాసనాలు ఢిల్లీ సుల్తానులు తెలుగు నేల మీద అరాచక పాలన సాగించినట్టు తెలియజేస్తున్నాయి. తెలుగు ప్రజలంతా ఆ భయంకర పాలన నుండి స్వాతంత్రాన్ని కోరుకుంటున్న సమయం అది. అలాంటి వివత్మర పరిస్థితుల్లో భద్రాచలం అటవీ ప్రాంతం అయిన రేఖపల్లిలో ముసునూరి ప్రోలయ నాయకుడు ఢిల్లీ సుల్తానుల మీద విప్లవ పోరాటం మొదలు పెట్టాడు.

12వ శతాబ్దంనాటి మునునూరి గుండయ్య శాసనం ముసునూరి రాజ్యాన్ని కమ్మనాడుకు చెందిన కమ్మ రైతు కుటుంబాల వారు అని తెలియజేస్తోంది.

కాకతీయ సామంత నాయకులు ప్రోలయ నాయకునితో చేతులు కలిపారు. తెలుగు జాతి స్వాతంత్ర్యం కోసం ముసునూరి యోధులు తను ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అత్యంత శక్తిమంతులైన ఢిల్లీ సుల్తానులను ఎదిరించి విజయాలను సాధించారు. క్రీస్తు శకం 1334లో ప్రోలయ తమ్ముడైన ముసునూరి కాపయ నాయకుడు ఓరుగల్లు మీదకు దండయాత్ర చేసి విజయం సాధించాడు. ఈ రకంగా తెలుగు ప్రాంతం అంతా క్రీస్తు శకం 1335 కల్లా ఢిల్లీ సుల్తానుల పాలన నుండి విముక్తి అయ్యింది. ముసునూరి ప్రోలయ నాయకుడు మరియు ముసునూరి కాపయ నాయకుడు సాధించిన ఈ విజయాల్లో కమ్మనాటి నాయకులు కీలక పాత్ర పోషించి తెలుగు జాతికి స్వతంత్రం తీసుకువచ్చారు. కమ్మనాటి నాయకులు ఓరుగల్లు (ప్రభువులైన మునునూరి కమ్మ నాయక రాజులతో వివాహ సంబంధాలు కూడా ఏర్పరుచుకుని ఓరుగల్లు రాజ్యంలో ఎంతో పలుకుబడిని సంపాదించారు. ఓరుగల్లు ప్రభువులైన ముసునూరి నాయక రాజుల బంధువులుగా ఓరుగల్లు కోట నిర్మాణంలోనూ కోట గోడల అఖివృద్ధిలోనూ ఓరుగల్లు నగర నిర్మాణంలోనూ కమ్మనాటి నాయకులు ప్రధాన పాత్ర పోషించారు. క్రీస్తు శకం 1369లో ముసునూరి కాపయ నాయకుడు రాచకొండ రాజుల చేతిలో మరణించడంతో ఓరుగల్లు రాజ్యం పతనం అయింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో కమ్మనాటి నాయకుల పాలన అంతం అయ్యింది. కమ్మనాటి నాయకులు కాపయ మరణించాక హంపి చేరుకొని విజయనగర బుక్కరాయల సైనికులుగా సేవలందించారు.

విజయనగర చక్రవర్తి (శ్రీకృష్ణదేవరాయల కాలంలో ముసునూరి నాయకులు దక్షిణ భారతదేశ యుద్ధాల్లో కీలకపాత్ర పోషించారు. కృష్ణదేవరాయల సేనాధిపతులుగా ప్రస్తుత గుంటూరు జిల్లాలో కాన్ని నాయకరాజులు పాలించారు. ఓరుగల్లు యోధులైన ముసునూరి నాయకుల చరిత్ర చాలా వరకు వెలుగులోకి రాలేదు. త్రిలింగ దేశం అంటే ఒకప్పటి తెలుగునేలకు సరిహద్దులు. త్రిలింగ దేశం మూడు శివలింగాల మధ్య ఉన్న ప్రాంతం. ఆ మూడు లింగాలు

1. కాళేశ్వరం, 2. ద్రాక్షారామం, & శ్రీశైలం

కాళేశ్వరం ఉత్తర తెలంగాణాలోని భూపాలవల్లి జిల్లాలో ఉంది. ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది.

ముసునూరి ప్రోలయ్య నాయకుడు, ముసునూరి కాపయ్య నాయకుడు, మునునూరి అనపోతా నాయకుడు, ముసునూరి వినాయక దేవుడు శేఖవల్సి, ఓరుగల్లు, తాయ్యేరు, రాజమహేంద్రవరం రాజధానులుగా రాజ్యం ఏర్పాటు చేసి స్వతంత్ర త్రిలింగ దేశాన్ని 14వ శతాబ్దంలో పరిపాలించారు. మిగిలిన కమ్మవంశాల వారు కూడా ముసునూరి సైన్యంలో చేరి, ముసునూరి

రాజులకి అండదండలు అందించేవారు.

ముసునూరి రాజులు తమిళనాడు, కేరళ కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా దండయాత్రలు చేసి విజయాలు సాధించినట్టు పురాతన చరిత్రకారులు తెలిపారు. మిగిలిన కమ్మ వంశాల వీరులు కూడా ఈ దండయాత్రలలో పాల్గొని రాజ్యాన్ని విస్తరించారు. భారతావని యోధుడు సామ్రాట్‌ ముసునూరి ప్రోలయ నాయకుడు వరిపాలించిన “రేఖపల్లి"ని సందర్భించటం జరిగింది. ఈ ప్రాంతం తెలుగు ప్రజలకు ఒక్క మక్కా అయోధ్య, జెరూసలేం లాంటిది. ఇక్కడి నుందే ప్రోలయ నాయకుడు స్వాతంత్ర్య సంగ్రామం నడిపించాడు.

శేఖపల్లి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు, గోదావరి జిల్లాలో ఉంది. ఇది అటవీ ప్రాంతం. టర్కీ దేశానికి చెందిన ఢిల్లీ సుల్తానులయిన తుగ్లక్‌ను ఓడించటం కోసం ప్రోలయ నాయకుడు ఈ ప్రాంతం ఎంచుకోడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాంతం మునిగేది లేనిది ఇక్కడి అధికారులు స్పష్టంగా ఇప్పుదే చెప్పలేమంటున్నారు. ఇతర భారతదేశ హిందూ రాజులు ప్రజలను కాపాడలేక అడవుల్లోకి పారిపోయిన సమయంలో ముసునూరి ప్రోలయ నాయకుడు ఒక్కడే ఢిల్లీ సుల్తానులకు ఎదురు నిలబడి పోరాడాడు. రేఖపల్లి, ప్రజలతో, అధికారులతో చాలా గంటలపాటు చర్చించటం జరిగింది. రేఖపల్లి చరిత్రను వారికి వివరించడం జరిగింది. వారి ప్రాంత చరిత్ర విన్నాక వారు గర్వముతో పొంగిపోయారు. ఈ గ్రామంలో పలు దేవాలయాలను నేను సందర్శించటం జరిగింది. ఇక్కడ ఒక పురాతన మట్టికోట ఆనవాళ్లు ఉన్నాయి. ఈ మట్టికోట ప్రాంతంలో ఒక పురాతన చెట్టు కింద కోటమైసమ్మ అనే ఒక దేవత విగ్రహం ఉంది. అసలు విగ్రహం భూమిలోనే ఉంది అంట. ఆ ప్రాంతంలో ఆరేళ్ళ క్రితం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేవతను ఆనాటి రాజులు కులదేవతగా పూజించేవారు అంట. ఈ విషయాల మీద పరిశోధనలు మొదలు పెట్టాను. ఓరుగల్లులో మరియు రేఖపల్లిలో ఆనాటి మహా వీరులైన ముసునూరి నాయకుల చరిత్రను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే స్వాతంత్ర సమరయోధులు నాయకులు