అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/బతుకు వెతుకులాట

వికీసోర్స్ నుండి

పుస్తక సమీక్క్ష

రాయలసీమ మాండలిక పద పరిమళం

బతుకు వెతుకులాట

రచన : సడ్లపల్లి చిదంబరరెడ్డి

వెల: 400/- పుటలు : 508 ప్రతులకు : సి. కళానిధి, 21-6-139 వెలుగు చిగురు టీచర్స్‌ కాలని హిందుపురం - 515211 సెల్‌ : 9440073636


ఇప్పుడొస్తున్న వివిధ సాహిత్య ప్రక్రియలలో స్వీయ చరిత్రలు గాని జీవిత చరిత్రలు కాని సంఖ్యాపరంగా తక్కువే. ఈ రెండిటిలో మాత్రం స్వీయ చరిత్ర (ఆత్మకథ)ల సంఖ్య కొంచెం ఎక్కువ. ఒక 'ప్రముఖుని గురించి వేరొకరు రాసే జీవిత చరిత్రకన్నా ఒక వ్యక్తి తన అనుభవాల్ని అనుభూతుల్నీ అంతరంగాన్నీ ఆవిష్కరిస్తూ, వాటికి అక్షరరూపం ఇవ్వడం ఆత్మకథల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర వంటివి, ప్రముఖులు, మహాను భావులు మాత్రమే రాసుకునే ఒక పరిమితమైన ప్రక్రియ, తన పరి మితులు దాటి పరిధులు విస్తరించుకుని ఇప్పుడు ఏ స్థాయికి, ఏ తరగతికి చెందిన వారైనా తమ అనుభవాలను అక్షరబద్ధం చేయవచ్చు అనే భావవైశాల్యాన్ని సంతరించుకుంది. వ్యక్తులు మాన్యులైనాా సామాన్యులైనా తాము జీవితంలో సాధించిన విజయాలు, అపజయాలు, నేర్చిన పాఠాలు, తమ బాధలని, వేదనలని, లోపాలని, బలహీనతల్నీ నిజాయితీగా నిష్కర్షగా చెప్పుకున్నప్పుడు అది ఒక మంచి ఆత్మకథ అవుతుంది. కేవలం తమ గతాన్ని తోడి చెప్పటమో, తన గతంలోకి సింహావలోకనమో చేసుకోవటానికో కాకుండా, ఆత్మకథలు ఒక వ్యక్తిలోని మంచిని, ప్రేరణగా తీసుకొని, జీవిత సత్యాలను తెలుసుకోటానికి కొంతమందికైనా స్ఫూర్తినిచ్చేవిగా ఉండాలి. అటువంటి ఆత్మకథల ద్వారా వివిధ ప్రాంతాల గురించీ, విభిన్న మనస్తత్వాలు గల మనుషుల గురించి, జీవన సరళిని జీవిత సారాన్ని గురించి తెలుసుకునే వీలు కలుగుతుంది. భిన్న సామాజిక నేపథ్యాలు, భిన్న వయసు గల వారి మధ్య చోటు చేసుకునే అంతరాల వ్యవధిని తగ్గించి పాత కొత్త తరాలవారి మధ్య నూత్న సుహృద్భావ సంబంధాలు ఏర్పడటానికి దోహదపడతాయి. దాదాపు పై లక్షణాలన్నీ నింపుకుని రాయలసీమ 'ప్రాంత మానవ జీవితం, అక్కడి ప్రజల జీవనయానానికి ఒక అనుభవ మంటపం అనిపించే పుస్తకం సడ్లపల్లె చిదంబరరెడ్డి రాసిన “బతుకు వెతుకులాట ' స్వీయచరిత్ర.

రాయలసీమలో కర్ణాటక సరిహద్దు హిందూపురం ప్రాంతం లోని గ్రామీణ రైతుల జీవితాలలోని సంక్షోభాలను విధ్వం సాలను, తన జీవితంలోని అనుభవాలను ఆత్మకథలాగా తనదైన వ్యక్తిత్వంతో, భాషతో అద్భుతంగా, నిజాయితీగా చిత్రించిన రచన ఇది. తాను పుట్టి పెరిగిన పల్లె బతుకు, అంతకు ముందు జనాలు చెప్పి ఉన్నవి, తాను కళ్లారా చూసినవి ఈ కాలం జనాలకి తెలియచేయటానికి “వెతుకులాటల బతుకు” పేరుతో రాసిన మొదటి అధ్యాయం "నా ఒగటో తరగతి సదువు” తో ప్రారంభించిన చిదంబరరెడ్డి ఆత్మ కథల ధారావాహిక 80 అధ్యాయాలకు విస్తరించింది. చిన్నపిల్లవాడుగా - ఒకటో తరగతి విద్యార్థిగా ఉన్నప్పటి నుండి దాదాపు ఐదున్నర దశా బ్ఞాలుగా తన ఆరాట పోరాటాలను బతుకు వెతుకులాటను 2016 లో తన కుమారుడు కళానిధి వివాహం జరిగిపోయి, తన బాధ్యత బరువూ తీరిపాయె-అనే వాక్యంతో ఆత్మకథ ముగుస్తుంది. ఈ ఆత్మకథ లో రెండు ప్రధాన అంశాలు మనకు ప్రముఖంగా అనిపిస్తాయి. ఒకటి -అంతర్జాల ముఖపుస్తకంలో (ఇంటర్‌ నెట్‌-ఫేస్‌బుక్‌)లో ధారావాహికంగా వచ్చిన మొదటి జీవన అక్షర చిత్రం ఈ ఆత్మకథ. 2014 నవంబరు 'సారంగ ' అనే అంతర్జాల పత్రికలో 'బతుకు వెతుకులాట ' పేరుతో ప్రారంభమై, ఆ తరువాత సం॥నికి బెంగుళూరు తెలుగు ప్రతిలిపి ఫేస్‌బుక్‌ పత్రికలోనూ (కవి సమ్మేళనం) వెలువడిన విశేషాన్ని దక్కించుకుంది. రెండవది-ఇందులో ఉపయోగించిన రాయలసీమ మాండలిక భాష (దీనినే రచయిత-మాండలికం అనేదాన్ని స్టానిక పదజాలం అంటారు)

చిదంబరరెడ్డి విద్యావంతుడు, సాహితీప్రియుడు, తెలుగు అయ్యవారుగా పనిచేసినవాడు కవి, రచయిత తన ఆత్మకథని పాత్రోచితంగా తన భాషలో రాసి ఉండవచ్చు కదా, తన అనుభవాల్ని చెప్పేటప్పుడు తన సహజమైన పదజాలంలోనే చెప్పి ఉండాల్సింది అని అనిపిస్తుంది. అయితే ఈ విమర్శకుకూడా రచయిత ముందుమాటలో (నామాట) తన స్థానికభాషను సమర్ధించుకుంటూ సమాధానం యిచ్చారు. "కొన్ని వందల పొత్రలు, వందల సం॥ల నిడివి, వాటి యాసలు, మరి నేను 5,6 సం॥ల వయసు నుండీ 65 సం॥లు వచ్చేదాకా ఏకరువు పెట్టిన ఘోష అని. అన్ని భాషలకు సంస్కృత భాషే మూలం అని బుకాయించే గుత్తాధిపత్యానికి, ఒకటి రెండు జిల్లాల అతి తక్కువ పదజాలమే ప్రామాణికమని తప్పెటకొట్టే వర్గానికీ వ్యతిరేకంగానే ఈ రాతను మొదలు పెట్టానని చెప్పటం రాయలసీమ స్టానిక పదజాలం మీద రచయితకు ఉన్న గాఢమైన అభిమానం వ్యక్తం అవుతుంది. అంతేకాదు. మనకు కూతవేటు దూరంలో పొరుగునే ఉన్న మన పేగుబంధాలతో ముడిపడి ఉన్న సజీవ స్థానిక పదాలు అర్ధంకావు అనడాన్ని ఎటువంటి హృదయ వైశాల్యానికి గీటు రాయో మరి? అని అధిక్షేపణ కూడా చేసారు. అంతిమంగా-ఒక అరశతాబ్దం కాలంలో అన్ని రంగాలకు సంబంధించిన నగ్న చరిత్రను రాబోయే తరాల వారు ఒకేచోట చదువుకోగలరని, ప్రతి ఒక్కరూ తమ ప్రాంతీయ జీవనాన్ని సహజ పదజాలాన్ని ప్రేమించగలరని కోరుకుంటున్నాను అని ఒక ఆశాభావం తెలియజేస్తారు. అయితే, రచయితకు రాయలసీమ మాండలికం (స్థానిక పదజాలం) పై ఉన్న గాఢాభిమానం ఇతర ప్రాంతాలవారికి కొంచెం అసౌకర్యం కలిగిస్తుందని చెప్పక తప్పదు. ఆ విధంగానే ఒకేబిగిన చదువుకుంటూ సాగవలసిన పరిస్థితిలో కొన్ని సంస్కృత పదాల దగ్గర ఇబ్బందులు

ఎదురవుతాయి. ఉదాహరణకు, 'పెజాసామ్మియం” (ప్రజాస్వామ్యం), 'నిరువచనం' (నిర్వచనం), 'కవిత్తువం ' (కవిత్వం), 'శబ్బుదం ' (శబ్దం), “అమిశం” (అంశం) వంటివి. ఏది ఏమైనా రచయితకు స్థానిక పదజాలంపై గల మక్కువని మెచ్చుకోకుండా ఉండలేము. అనంత అక్షర విజయంలో (అందరికీ చదువు చెప్పించే కార్యక్రమం) పాల్గొన్నప్పుడు అక్కడ గొల్ల సుద్దులు, పాటలు మొ॥వి అన్నీ తెలంగాణా యాసతో ఉండటం గమనించిన రచయిత, 'మా రాయలసీమ గూడా యీ రాష్టంలో ఒక బాగము, మాకీ వొగ బాష యాస వుండివి, వాట్లో సెప్పితేనే మా జనాలకి బాగా అర్తం అవుతుంది” అని మీటింగులలో వాదించినవాడు. 'తాను చెప్పేగతాలకో లేక ప్రాంతీయ పదజాల భాషా పరిమళాలో తెలియదుగానీ పాఠకుల నుంచి విపరీతమైన స్పందన రావడం మొదలైంది” అని అన్నారు రచయిత. రాయలసీమ - అనంతపురం జిల్లా తెలుగు భాషలోని సజీవత్వం ఈ పుస్తకంలో తొణికిసలాడుతుందని సాహితీ ప్రియులకు అనిపిస్తుంది.

“బతుకు వెతుకులాట” కేవలం చిదంబరరెడ్డి వ్యక్తిగత సమాచారం మాత్రమే అయితే దీని పరిమితి చాల చిన్నదిగా ఉండేది. కాని ఇందులో ఆయన జీవితం ప్రతిబింబిస్తూనే తన ప్రాంతంలో భూమి సంబంధాలు, మానవ సంబంధాలు ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో తెలుస్తుంది అని ఆచార్య రాచపాళెం చంద్రశేఖరెడ్డి వ్రాసిన పీఠిక (మట్టిమనిషి-మట్టిజీవితం) అక్షర సత్యం. ఇది రచయిత బకుకు కత మాత్రమే కాదు. సగటు మనిషి బతుకు వెతలు అనిపిస్తుంది. హిందూపురం దగ్గరి సడ్లపల్లె (సూగూరు సడ్లపల్లి - ఎస్‌. సడ్లపల్లి) లో ఒక రైతు కుటుంబంలో పుట్టి పొలం పనులు చేసుకుంటూ గడిపి, 'బతకల్ల అంటే ఎదకల్లేమో ' అన్నట్లుగా వాళ్ల వూరు విడిచి నీటిజాడ ఎదుర్శొని ఎగువసీమ (కల్యాకనపల్లి)కి వలస పోయి, 15 సం॥ వచ్చేదాకా అక్కడే వుండి కన్నడం చదివి తిరిగి సొంతూరు పక్కకే తిరిగి వచ్చిన బాల్యం ; కపిల (మోట) సేద్యం నాటి మనుషులు కరెంటు వచ్చేనాటికే ఏ విధంగా మారిపోయిందీ; వూర్లో రెడ్ది కరణాలు చేసే అన్యాయాల గురించీ తన చదువు, వ్యవసాయం, ఉపాధ్యాయ వృత్తి, వయోజన విద్యను నేర్పడం, కవిత్వం, కథలు రాయటం, పత్రికలకు పంపటం, ఆకాశవాణిలో ఏ ప్రసారం కావడం ; ఉపాధ్యాయుల్లో ఆదర్సవంతులు, బద్దకస్తులు, కొడుకు చదువు, అతనికి జరిగిన రోడ్డు ప్రమాదం, అతని పెళ్లి ఇల్లు కట్టటం (వెలుగు-చిగురు), స్నేహితులు చేనిన మోసాలు-వీటన్నిటి నుండీ తాను పొందిన అనుభవం, ఆనందం, దుఃఖం, మనోవేదన ఈ బతుకు వెతుకులాటలో కనిపిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే - సడ్లపల్లి చిదంబరరెడ్డి ఆరోగ్య సమస్య ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. చిన్నప్పటి నించీ అలర్జీ వలన-వాతావరణంలో మార్పు వలనగానీ, తిన్న ఆహారంలో తేడావల్లనో గాని-చాలసార్లు మృత్యువు అంచుల దాకా వెళ్లి. అందరూ ఆశలు వదిలేసిన సందర్భాలు, చేయించుకున్న వైద్యాలు, తిన్న మందులు, విసుగెత్తి భగవంతుణ్ని తనను రోగాల మారిగా పుట్టించినందుకు తిట్టుకుంటూ, 30 సం॥ల మించి బ్రతకటం కష్టం అన్న మనిషి ఇప్పటికీ (66 సం।॥। వరకు) జీవించ గలగడం దానికి కారణంగా- ఆ రోగం మీద, తినే ఆహారం మీద, వాతావరణం మీద శాప్త్రీయ అవగాహన పెంచుకొని కాలానుగుణమైన ఆధునిక మందులు వాడుతూ, అన్నిటినీ మించి ఆత్మ స్టెర్యంతో యిప్పటికీ బతకగలగటం చిదంబరరెడ్డిలోని ఒక పోరాట పటిమకు నిదర్శనం. అందరికీ ఆదర్శవంతం కూడా. 'అనారోగ్యాన్ని అరికాలికిందేసి మట్టిబతుకు పోరులో గెలువు సాధించిన ఒకానొక సామాన్యుడి అనుభవాల సంపుటి” అనీ, తన కథలో ఏదీ దాచుకున్నట్లుగాని, అతిశయోక్తులు చెప్పినట్లు గాని ఎక్కడా అనిపించక తన అనుభవాల్ని నిజాయితీగా రాసుకుని, తద్వారా అరవయ్యేళ్ల కాలంలో వచ్చిన మార్పుల్ని కళ్లకు కట్టించారు” అంటారు గంటేడ గౌరునాయుడు “వెతుకులాటలో ఎదురైన, అరుదైన మిత్రుడు ' చిదంబర రెడ్ది గురించి.

చిదంబరరెడ్డి శారీరకంగా (ఆరోగ్యపరంగా) మానసికంగా పడిన కష్టాలు, బాధలు, వాటిని ఆయన ఎదుర్మొన్న తీరు సంపూర్ణంగా మనకు ఈ కథలలో ప్రతిభింబిస్తుంది. అంతే కాకుండా విభిన్నము విశిష్టమూ అయిన ఆయన వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుంది. ఆయన నిరంతర శ్రమజీవి. గొప్ప ధైర్యవంతుడు. తెలుగు సాహిత్యం మీద మమకారం; తపన, భావుకత, ఆర్టత కలిగి స్పందించే హృదయం ఉన్నవాడు. సంస్కారం కలిగి తన ఉపాధ్యాయ వృత్తిలో చిత్తశుద్ధి, నిజాయితీగా విధులు నిర్వర్తించినవాడు. సంఘంలో జరుగుతున్న అన్వాయాలు, మనుషుల మధ్య ఏర్పడుతున్న అగాధాలు, 'జనాలు నీతి న్యాయాలు లేకుండా తయారవుతుండారంటే యీళ్ల నడుమ బతకలేను అనిపెచ్చె ' అని దిగులు పడే మనస్తత్వం. అర్థంలేని మూఢాచారాలను వాస్తు విషయాలను, ముహూర్తాలను, శకునాలను నిరసించడమే కాకుండా వీటన్నిటినీ తాను పాటించకపోవడం వలన చాలమంది తిరస్కారానికి కూడా గురయినవాడు. విద్యాబోధనలలో సంస్కరణలు రావాలని, ప్రాధమిక పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల్నే నియమించాలని, అదికూడా అంతో యింతో లలిత కళలలో ప్రవేశమున్నవారయితే పిల్లలకు బాగా విద్య నేర్చవచ్చుననీ భావిస్తాడు. 'ఇతర్లను మోసగించకపోవటం, ఆరు నూరైనా యిచ్చిన మాట మీద నిలబడ్డం '-ఈ రెండూ తన బలాలు అని చెప్పుకున్న ఆదర్శవ్యక్తి చిదంబరరెడ్డి.

తన జీవితంలో చూసిన, ఎదుర్కొన్న సంఘటనలు తనకీ ప్రత్యేకం అని భావిస్తాడు రచయిత. అయితే తన గతాల కప్టాల్నీ కడగంట్లనీ మనకు చూపి సానుభూతిని ఆశించాలనీ కాదు అంటాడు. మరి తన బతుకు వెతలను కతలుగా చెప్పదలచినందుకుగల ఆశయాల్ని 'గతాల గురుతులు ' అన్న అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పారు. పట్నానికి ఆనుకునే, బెంగుళూరు హైవేలో ఉన్న గ్రామంలో నివసిస్తూ, సామాజికంగా ఉన్నత వర్దానికి చెందిన కుటుంబంలో పుట్టి సొంతంగా వ్యవసాయం చేసి, బతక కలిగిన స్తోమత కలిగిన నా జీవితమే యింత భయంకరంగా ఉంటే!

అక్షరాలే చొారబడలేని, మారుమూల పల్లెల్లో సాటి జీవుల్లాగా దాహానికి బావినుండి నీటిని కూడా చేదుకోలేని, ఇతర మనుష్యులను తాకడానికి కూడా నోచుకోలేని, తమ హృదయవేదనలు వినిపించడానికి నోరులేని, వినీపించినా వినే చెవుల్లేని, ఎన్ని విలువైన మానవ