అభినయదర్పణమ్/సభాలక్షణమ్

వికీసోర్స్ నుండి

వాద్యం చాభినయం గీతం రసాన్ సజ్గృహ్య పద్మభూః,
వ్యరీరచచ్ఛాస్త్రమిదం ధర్మకామాదిసిద్ధితమ్‌. 16
దుఃఖార్తిశోకనిర్వేదఖేదవిచ్ఛేదసాధనమ్‌,
అపి బ్రహ్మ పరానన్దాదిదమప్యధికం భవేత్. 17

తా. పూర్వకాలమునందు బ్రహ్మదేవుఁడు ఋగ్వేదమునుండి వాద్యమును, యజుర్వేదమునుండి యభినయమును, సామవేదమునుండి గానమును, అధర్వణవేదమునుండి రనములను సంగ్రహించి యీశాస్త్రమును రచించెను.ఇది ధర్మార్ధకామమోక్షముల నిచ్చునదియకాక దుంఖము, ఆర్తి,శోకము,నిర్వేదము, ఖేదము మొదలైనవానిని బోఁగొట్టునదియు నగును. మరియు నిది బ్రహ్మానందమునకంటె నధికమగు నానందమును గలుగఁజేయును. (కలహ వస్తునాళ ప్రయత్నభంగాదులచేతఁ గలుగునది దుంఖము. ఇతరులుచేయు హింసాదులచేతఁ గలుగునది ఆర్తి. బంధుమరణము మొదలగువానిచేత సంభవించునది శోకము. తనకిష్టవస్తుప్రాప్తి చేకూరనపుడును సారహీనత తోఁచినపుడును కలుగునది నిర్వేదము. గతశోకకృత్యములను తలఁచినపుడు పుట్టునది ఖేదము.)

తత్ర నృత్యం మహారాజసభాయాం కల్పయేత్సదా,

తా. ఈమీఁదఁజెప్పిన మూఁటియందును నృత్యము మహారాజసభలో నెల్లప్పుడును సంతోషముతో జరపుచుండవలయును.

సభా లక్షణమ్‌

సభాకల్పతరుర్భాతి వేదశాఖోపశోభితః,
శాస్త్రపుష్పసమాకీర్ణో విద్వద్భ్రమరసంయుతః. 18

తా. సభయనెడి కల్పవృక్షము, వేదములనెడి కొమ్మలచేత ప్రకా శించునదియు, శాస్త్రములనెడి పుష్పములచేత నిండుకొన్నదియును, విద్వాంసులనెడి తుమ్మెదలతోఁ గూడినదియునై వెలుఁగుచున్నది.

సత్యాచారసభా గుణోజ్జ్వలసభా సద్ధర్మకీర్తిస్సభా
వేదాలజ్కృతరాజపూజితసభా వేదాన్తవేద్యా సభా,
వీణావాణివిశేషలక్షితసభా విఖ్యాతవీరా సభా
రాజద్రాజకుమారశోభితసభా రాజత్ప్రకాన్తిస్సభా. 19

తా. సత్యముతప్పక నడపువారుగలదియును, సద్గుణములచే మెరయు నదియును, మంచిధర్మమును కీర్తియును గలిగినదియు, వేదముచదివిన రాజులచేత పూజింపఁబడునదియు, వేదాంతము నెఱిఁగినదియు, వీణాగానము, వాచికగానము మొదలగువానితోఁ గూడినదియు, ప్రసిద్ధ వీరులు గలదియు, తేజస్సుచేత వెలుఁగుచున్న రాజకుమారులచేత ప్రకాశించు నదియు నభ అనఁబడును. అనఁగా సభయనునది యిన్నిలక్షణములును గలదయి యుండవలయుననుట.

విద్వాంసః కవయో భట్టాః గాయకాః పరిహాసకాః,
ఇతిహాసపురాణజ్ఞా స్సభాసప్తాజ్గలక్షణమ్‌. 20

తా. వింద్వాసులు, కవులు, పెద్దలు, గాయకులు, పరిహాసకులు, ఇతిహాసములను తెలిసినవారు, పురాణములను తెలిసినవారు అని యిట్లు సభకేడంగములు.

సభా నాయక లక్షణమ్‌.

శ్రీమాన్ ధీమాన్ వివేకీ వితరననిపుణో
          గానవిద్యాప్రవీణః,
సర్వజ్ఞః కీర్తిశాలీ సరసగుణయుతో
          హావభావేష్యభిజ్ఞః,
మాత్సర్యాద్యైర్విహీనః ప్రకృతిహితసదా
          చారశీలో దయాళు,

ధీరోదాత్తః కలావాన్ నృపనయచతురో
          సౌ సభానాయకస్స్యాత్. 21

తా. సంపదగలవాఁడును, బుద్ధిమంతుఁడును, యుక్తాయుక్తవివేకము గలవాఁడును, దానశీలుఁడును, గానవిద్యయందు నేర్పుగలవాఁడును, సర్వజ్దుఁడును, కీర్తిశాలియు, సరనగుణములుగలవాఁడును, హావభావములఁ దెలిసిన వాఁడును, మాత్సర్యాది దుర్గుణములు లేనివాఁడును, ఆయాకాలమునకుఁదగిన, మంచినడవడికల నెఱిఁగినవాఁడును, దయగలవాఁడును, ధీరోదాత్తుఁడును, విద్వాంసుఁడును, రాజనీతియందు చతురుఁడును నగువాఁడు సభానాయకుఁడు కాఁదగును. (శ్లో. గ్రీవారేచకసంయుక్తో భ్రూనేత్రా దివిలాస కృత్, భావ ఈషత్ప్రకాశోయ స్సహావ ఇతి కధ్యతే.-- అనఁగా మనోగత భావమును సంజ్ఞలు మొదలగువానిచేఁ దెలుపుట హావము. శ్లో.నిర్వికారస్య చిత్తస్య భావస్స్యా దతివిక్రియా. వికారరహితమగు చిత్తమున కత్యంతవికారము కలుగుట భావము.

మన్త్రి లక్షణమ్‌.

నిత్యంచ స్థిరభాషిణో గుణపరా శ్శ్రీమద్యశోలమ్పటా;
భావజ్ఞా గుణదోషభేదనిపుణా శ్శృంగారలీలారతాః,
మధ్య స్థానయకోవిదాస్సహృదయాస్సత్పణ్డితా భాన్తితే
భూపాభేదవిచక్షణాస్సుకవయో యస్య ప్రభోర్మంత్రిణః. 22

తా. మాటనిలుకడగలవారును, సద్గుణములను గ్రహించువారును,