అభినయ దర్పణము/ఇష్టదేవతా ప్రార్థన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు.

నన్దికేశ్వరప్రోక్తం.

అభినయ దర్పణమ్‌.


ఇష్టదేవతాప్రార్థనా.

శ్లో. ఆజ్గికం భువనం యస్య వాచికం సర్వ వాఙ్మయమ్‌,
ఆహార్యం చన్ద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్‌. 1

తా. ఎవనికి భువనము అంగికాభినయమో, వాగ్రూపములైనవియెల్ల నెవనికి వాచికాభినయమో, చంద్రతారాదులు ఎవనికి ఆహార్యాభినయమో, అటువంటి సత్త్వప్రధానుఁడగు శివునికి నమస్కరించెదను.

ఇన్ద్ర ఉవాచ:-
కళ్యాణాచలవాసాయ కరుణారససింధవే,
నమోస్తు నందికేశాయ నాట్యశాస్త్రార్థదాయినే. 2

తా. ఇంద్రుఁడు:- కైలాసపర్వతనిలయుఁడును, దయాసముద్ర్రుడును, నాట్యశాస్త్రార్ధప్రభుఁడునైన నందికేశ్వరునికి నమస్కరించెదను.

నన్దికేశ్వర ఉవాచ:-
స్వాగతం తే సురాధీశ కుశలం త్రిదివౌకసామ్‌,
కిమర్థమాగతం బ్రూహి భవతా మమ సన్నిధౌ. 3

తా. నందికేశ్వరుఁడు:- ఓ యింద్రుఁడా! నీకు స్వాగతము. స్వర్గవాసులందరికిని క్షేమమా? నీరాకకు కారణమేమి?

ఇన్ద్ర ఉవాచ:-
త్వదీయ కృపయా పూర్వం నాట్యశాలామలఙ్కృతామ్‌,
త్వదీయ నర్తక స్సోయం త్వత్కృపామభివాఞ్ఛతి. 4

తా. ఇంద్రుడు:- ఓయి నందికేశ్వరుఁడా! తొల్లి నీ కృపారనముచే నలంకరింపఁబడిన నర్తనశాల కధిపతియైన ఈ నీ నర్తకుఁడు నీదయను గోరి వచ్చియున్నాఁడు.

నన్దికేశ్వర ఉవాచ:-
మయా విధేయం కిం తస్య వద వాసవ తత్త్వతః,

తా. నందికేశ్వరుఁడు:- ఓ యింద్రుఁడా! నీకు నాచేతఁ జేయఁదగినదేమి చెప్పుము.

ఇన్ద్ర ఉవాచ:-
దైతేయ నాట్యశాలాయాం నర్తకో నటశేఖరః. 5
తం విజేతుమయం నాట్యవినోదైః క్రమవేదిభిః,

భవద్విరచితం గ్రంథం భరతార్ణవమిచ్ఛతి. 6

తా. ఇంద్రుడు:- అసురనాట్యశాలయందు నటశేఖరుఁ డనెడు నటుఁడు గలఁడు. నాట్యక్రమములను దేటపరచు వినోదములచే వానిని జయించటకు మీచే రచింపఁబడిన భరతార్ణవ మనెడు గ్రంథమున పేక్షించుచున్నాను.

నన్దికేశ్వర ఉవాచ:-
చతుస్సహస్ర సంఖ్యాకైర్గ్రంథైశ్చ పరిపూరితమ్‌,
భరతార్ణవశాస్త్రస్తు సుమతే శృణు సాదరమ్‌. 7

తా. నందికేశ్వరుఁడు:- ఓ యింద్రుఁడా! నాలుగువేల గ్రంధములు గల భరతార్ణవమనెడు గ్రంధమును తెలియఁజెప్పెదను. నీవవహితుఁడవై వినుము.

ఇంద్ర ఉవాచ:-
నన్దికేశ దయామూర్తే విస్తరాత్సంవిహాయ మే,
సంక్షిప్య నాట్యశాస్త్రార్థం క్రమపూర్వముదాహర. 8

తా. ఇంద్రుడు:- దయామూర్తివైన నందికేశ్వరుఁడా! ఈగ్రంధమును సంగ్రహించి నాట్యశాస్త్రార్ధములను యధాక్రమముగా నాకుఁ జెప్పుము.

నన్దికేశ్వర ఉవాచ:-
వదామి సుమతే దేవ సంక్షిప్య భరతార్ణమ్‌,
దర్పణాఖ్యమిదం సూక్ష్మ మవధారయ సాదరమ్‌. 9

తా. నందికేశ్వరుఁడు:- ఓయింద్రుఁడా! భరతార్ణవమనెడు గ్రంధమునకు సంక్షేపమగు దర్పణమను నీగ్రంధమును జెప్పదను దీనిని శ్రద్ధాళువై వినుము.

నాట్యం నృత్తం నృత్యమితి మునిబిః పరికీర్తితమ్‌,

తా. ఓయింద్రుఁడా! ఋషులు నాట్యము,నృత్తము,నృత్యము నని మూఁడువిధములఁ జెప్పుచున్నారు.

నాట్యం తన్నా టకేష్వేవ యోజ్యంపూర్వకథాయుతమ్‌. 10

తా. నాట్యమనునది నాటకమునందు మాత్రము పూర్వకథతోడ వినియోగింపఁదగినది.

రసభావవిహీనం తు నృత్తమిత్యభిధీయతే,

తా. రసభావములు లేక తాళలయాశ్రయమై యుండునది నృత్తము.

రసభావవ్యంజకాదియుతం నృత్యమితీర్యతే. 11

తా. నృత్యమనఁగా రసము, భావము మొదలగువానితోఁ గూడియుండునది.

ఏతత్త్రయం ద్విథా భిన్నం లాస్యతాణ్డవసంజ్ఞకమ్‌,

తా. ఈనాట్య నృత్త నృత్యములు మూఁడును మరల లాస్యమనియు, తాండవమనియు రెండు విధములుగా విభజింపఁబడియున్నవి.

సుకుమారం తు తల్లాస్య ముద్ధతం తాణ్డవం విదుః 12

తా. సుకుమార మగునది లాస్యమును, ఉద్ధతమగునది తాండవమును నని చెప్పుదురు.

దృష్టవ్యే నాట్యనృత్యే చ పర్వకాలే విశేషతః,

తా. నాట్యనృత్యములు రెండును పర్వకాలములయందు ముఖ్యముగ చూడఁదగినవి.

నృత్యం తత్ర నరేన్ద్రాణా మభిషేకే మహోత్సవే. 13
యాత్రాయాం దేవయాత్రాయాం వివాహేప్రియసజ్గమే,
నగరాణా మగారాణాం ప్రవేశే పుత్త్రజన్మని. 14
శుభార్థిభిః ప్రయోక్తవ్యం మాజ్గళ్యం సర్వకర్మసు,

తా. మీదఁ జెప్పఁబడిన మూఁటిలో మూఁడవదియు మంగళప్రదమునగు నృత్యము రాజపట్టాభిషేకము, తిరునాళ్ళు, ఊరేగింపు, దేవుని యూరేగింపు, పెండ్లి, మిత్రసమాగమము, పురప్రవేశము, గృహప్రవేశము, పుత్త్రోత్సవము వీనియందు ప్రయోగించవలయును.

ఋగ్యజుస్సామవేదేభ్యోవేదాచ్చాథర్వణాత్కమాత్.

వాద్యం చాభినయం గీతం రసాన్ సజ్గృహ్య పద్మభూః,
వ్యరీరచచ్ఛాస్త్రమిదం ధర్మకామాదిసిద్ధితమ్‌. 16
దుఃఖార్తిశోకనిర్వేదఖేదవిచ్ఛేదసాధనమ్‌,
అపి బ్రహ్మ పరానన్దాదిదమప్యధికం భవేత్. 17

తా. పూర్వకాలమునందు బ్రహ్మదేవుఁడు ఋగ్వేదమునుండి వాద్యమును, యజుర్వేదమునుండి యభినయమును, సామవేదమునుండి గానమును, అధర్వణవేదమునుండి రనములను సంగ్రహించి యీశాస్త్రమును రచించెను.ఇది ధర్మార్ధకామమోక్షముల నిచ్చునదియకాక దుంఖము, ఆర్తి,శోకము,నిర్వేదము, ఖేదము మొదలైనవానిని బోఁగొట్టునదియు నగును. మరియు నిది బ్రహ్మానందమునకంటె నధికమగు నానందమును గలుగఁజేయును. (కలహ వస్తునాళ ప్రయత్నభంగాదులచేతఁ గలుగునది దుంఖము. ఇతరులుచేయు హింసాదులచేతఁ గలుగునది ఆర్తి. బంధుమరణము మొదలగువానిచేత సంభవించునది శోకము. తనకిష్టవస్తుప్రాప్తి చేకూరనపుడును సారహీనత తోఁచినపుడును కలుగునది నిర్వేదము. గతశోకకృత్యములను తలఁచినపుడు పుట్టునది ఖేదము.)

తత్ర నృత్యం మహారాజసభాయాం కల్పయేత్సదా,

తా. ఈమీఁదఁజెప్పిన మూఁటియందును నృత్యము మహారాజసభలో నెల్లప్పుడును సంతోషముతో జరపుచుండవలయును.

సభా లక్షణమ్‌

సభాకల్పతరుర్భాతి వేదశాఖోపశోభితః,
శాస్త్రపుష్పసమాకీర్ణో విద్వద్భ్రమరసంయుతః. 18

తా. సభయనెడి కల్పవృక్షము, వేదములనెడి కొమ్మలచేత ప్రకా